
బార్సిలోనాలో జాతీయ పతాకాన్ని చూపుతున్న నయనతార, విఘ్నేష్ శివన్
‘ఏ దేశమేగినా ఎందుకాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని నిలపరా నీ జాతి నిండు గౌరవం’ను నిజం చేస్తూ నయనతార, విఘ్నేష్ శివన్ జంట విదేశాల్లో భారత జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ప్రేమ, పెళ్లి అంటూ సినీ పరిశ్రమలో సమ్‌థింగ్ స్పెషల్‌గా నిలిచిన జంట వీరిది. పెళ్లికి ముందు షూటింగ్‌లో విరామం దొరికినప్పుడల్లా విదేశాలకు వెళ్లి ఎంజాయ్ చేసేవారు. వివాహం తరువాత కూడా ఈ జంట అలాగే ఎంజాయ్ చేస్తోంది.
చదవండి: సుమారు నాలుగేళ్ల తర్వాత అలా శ్రావణ భార్గవి!
ప్రస్తుతం స్పెయిన్‌లో సేద తీరుతున్నారు. తరచూ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తూ సందడి చేస్తున్నారు. తాజాగా స్పెయిన్ దేశం, బార్సిలోనా నగరంలోని ప్రసిద్ధి గాంచిన దేవాలయాన్ని దర్శించి ఆ ఫొటోలను ట్విటర్‌లో పోస్టు చేశారు. అలాగే 75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా నయనతార, విఘ్నేష్ శివన్ జంట బార్శిలోనా నగర వీధుల్లో భారత మువ్వన్నెల జెండాను రెపరెపలాడించి దేశ గొప్పతనాన్ని చాటారు.
Comments
Please login to add a commentAdd a comment