Vignesh Shiva
-
స్పెయిన్‌లో జెండా ఎగురవేసిన నయనతార దంపతులు
‘ఏ దేశమేగినా ఎందుకాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని నిలపరా నీ జాతి నిండు గౌరవం’ను నిజం చేస్తూ నయనతార, విఘ్నేష్ శివన్ జంట విదేశాల్లో భారత జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ప్రేమ, పెళ్లి అంటూ సినీ పరిశ్రమలో సమ్‌థింగ్ స్పెషల్‌గా నిలిచిన జంట వీరిది. పెళ్లికి ముందు షూటింగ్లో విరామం దొరికినప్పుడల్లా విదేశాలకు వెళ్లి ఎంజాయ్ చేసేవారు. వివాహం తరువాత కూడా ఈ జంట అలాగే ఎంజాయ్ చేస్తోంది. చదవండి: సుమారు నాలుగేళ్ల తర్వాత అలా శ్రావణ భార్గవి! ప్రస్తుతం స్పెయిన్‌లో సేద తీరుతున్నారు. తరచూ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తూ సందడి చేస్తున్నారు. తాజాగా స్పెయిన్ దేశం, బార్సిలోనా నగరంలోని ప్రసిద్ధి గాంచిన దేవాలయాన్ని దర్శించి ఆ ఫొటోలను ట్విటర్లో పోస్టు చేశారు. అలాగే 75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా నయనతార, విఘ్నేష్ శివన్ జంట బార్శిలోనా నగర వీధుల్లో భారత మువ్వన్నెల జెండాను రెపరెపలాడించి దేశ గొప్పతనాన్ని చాటారు. -
హ్యాపీ బర్త్‌డే బంగారం
సినిమా: బంగారమే (తంగమే) హ్యాపీ బర్త్‌డే అంటూ ఎవరు ఎవరికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారో అందరికీ అర్థమయ్యే ఉంటుంది. ఎస్. సంచలన నటి, అగ్రనటి, లేడీ సూపర్‌స్టార్ నయనతారకు ఆమె ప్రియుడు, యువ దర్శకుడు విఘ్నేశ్‌శివ తెలిపారు. అవును ఆదివారం మరియా కురియన్ ( నయనతార అసలు పేరు) పుట్టిన రోజు. అయ్యా చిత్రంతో కోలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన ఈ కేరళా కుట్టి ఆ తరువాత అంచెలంచెలుగా ఎదిగి ఇప్పుడు హీరోలకు దీటుగా లేడీ సూపర్‌స్టార్‌గా రాణిస్తున్నారు. వ్యక్తిగత జీవితంలో పలు ఒడిదుడుకులను ఎదురొడ్డి గెలిచిన నటి నయనతార. నటుడు శింబు, ప్రభుదేవాతో ప్రేమ వ్యవహారం చేదు అనుభవాన్నే అందించినా, మనోధైర్యంతో ఆ అపజయాల నుంచి బయట పడి నటిగా తన విజయ పరంపరను కొనసాగిస్తున్నారు. తాజాగా దర్శకుడు విఘ్నేశ్‌శివతో ప్రేమ, సహజీవనం అంటూ చాలా కాలంగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. వీరిద్దరి ప్రేమ గురించి బయటకు చెప్పకపోయినా, బాహాటంగానే బాహ్య ప్రపంచంలో భార్యాభర్తలా తిరిగేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఒకరి పుట్టినరోజన మరోకరు శుభాకాంక్షలు తెలుపుకుంటూ, దేశ, విదేశాల్లో విహాంగ ప్రేమ పక్షుల్లా చుట్టేయడంతో పాటు ఆ దృశ్యాలను సోషల్‌మీడియాల్లో విడుదల చేస్తూ వార్తల్లో కెక్కుతున్నారు. తాజాగా ఆదివారం నయనతార 34వ జన్మదినం. దీంతో ఆమె పుట్టిన రోజును పురస్కరించుకుని ప్రియుడు, పెళ్లి కాని భర్త భారీ ఎత్తున ఏర్పాట్లు చేశాడు. ఒక భారీ కేక్‌పై నయనతార ఫొటోను ఏర్పాటు చేసి, కింద భాగాన హ్యాపీ బర్త్‌డే, విత్ లాంగ్స్ ఆఫ్ లవ్ అని అందమైన అక్షరాలను పొందుపరిచాడు. ఇప్పుడీ కేక్ ఫొటోతో పాటు విఘ్నేశ్‌శివ, నయనతారల అలింగన దృశ్యం సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తున్నాయి. అంతే కాదు బంగారం హ్యాపీ బర్త్‌డే అంటూ విఘ్నేశ్‌శివ తన ఇన్‌స్ట్రాగామ్‌తో శుభాకాంక్షలను పోస్ట్ చేశాడు. ఇక పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు నయనతారకు ఫోన్ల ద్వారా, ట్విట్టర్లలో శుభాకాంక్షల వర్షం కురిపిస్తున్నారు. -
ప్రియుడి కోసం ఒక చిత్రం
తమిళసినిమా: భర్తను హీరోగా పరిచయం చేయడం కోసమో, సోదరులను నిర్మాతలుగానో, నటులు గానో పరిచయం చేయడం కోసమో హీరోయిన్లు చిత్ర నిర్మాణం చేపట్టడం అన్నది సాధారణంగా జరుగుతున్నదే. కాగా అగ్రనటి నయనతార కూడా ఇప్పుడు అదే బాట పట్టనున్నారనే ప్రచారం సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. లేడీ సూపర్‌స్టార్‌గా వెలుగొందుతున్న నయనతార హీరోయిన్ ఓరియంటెడ్ కథా చిత్రాలతో పాటు స్టార్ హీరోలతోనూ నటిస్తూ బిజీగా ఉంది. ఆ మధ్య అరమ్ చిత్రంలో నటించింది. ఆ చిత్రం ఆమెకు చాలా మంచి పేరును తెచ్చి పెట్టింది. ఆ చిత్రానికి నిర్మాత ఆమె మేనేజర్ అని చెప్పినా, తరువాత పెట్డుబడి అంతా నయనతారదేననే ప్రచారం జరిగింది. దీన్ని ఎవరూ ఖండించలేదు కూడా. ఇప్పుడు ఈ సంచలన నటి నేరుగానే చిత్ర నిర్మాణంలోకి దిగుతోందన్నది తాజా సమాచారం. తన ప్రియుడుగా ప్రచారంలో ఉన్నదర్శకుడు విఘ్నేశ్‌శివ కోసం నయనతార ఒక చిత్రాన్ని నిర్మించడానికి సిద్ధం అయినట్లు టాక్. విఘ్నేశ్‌శివ సూర్య హీరోగా చేసిన తానాసేర్నద కూటం చిత్రం తరువాత మరో చిత్రం కమిట్ కాలేదు. తాజాగా నయనతార నిర్మించనున్న చిత్రానికి దర్శకత్వం వహించడానికి రెడీ అవుతున్నారట. ఇందులో యువ నటుడు అధర్వ హీరోగా నటించనున్నారని, దీనికి ఇదయం మురళి అనే టైటిల్‌ను నిర్ణయించినట్లు సమాచారం. మరో విషయం ఏమిటంటే నయనతార, అధర్వ కలిసి ఇమైకా నోడిగళ్ అనే చిత్రంలో నటించారు. ఈ చిత్రం త్వరలో తెరపైకి రానుంది. కాగా తన ప్రియుడి కోసం తాను నిర్మించే చిత్రంలో ఆమె నటిస్తుందా? లేదా? అన్నది వేచి చూడాలి. అసలు ఈ ప్రచారంలో నిజమెంత అన్నది తెలియాల్సి ఉంది. -
ప్రేయసి కోసం పాట
తమిళసినిమా: ప్రేయసి కోసం ప్రియుడు పాట రాస్తే ఆ పాటలో నిజంగా మజా ఉంటుందని చెప్పవచ్చు. అదీ అగ్రనటి నయనతార కోసం ఆమె ప్రియుడు, యువదర్శకుడు విఘ్నేశ్‌శివ పాట రాస్తే దానికి ప్రేక్షకుల నుంచి వచ్చే క్రేజే వేరు. అలాంటి ఒక పాట కోలమావు కోకిల చిత్రంలో చోటుచేసుకుంది. లేడీ సూపర్‌స్టార్‌గా రాణిస్తున్న నయనతార నటించిన ఇమైకా నోడిగళ్, కొలైయుధీర్ కాలం, కొలమావు కోకిల వంటి లేడీ ఓరియెంటెడ్ కథా చిత్రాలు షూటింగ్ పూర్తి చేసుకుని నిర్మాణాంతర కార్యక్రమాల దశలో ఉండగా, అజిత్‌కు జంటగా నటిస్తున్న విశ్వాసం, తెలుగులో చిరంజీవికి జంటగా సైరా నరసింహారెడ్డి చిత్రాలు నిర్మాణంలో ఉన్నాయి. ఇకపోతే నయనతార నటించిన కొలమావు కోకిల చిత్రం త్వరలో తెరపైకి రావడానికి రెడీ అవుతోంది. ఈ చిత్రానికి సంచలన సంగీత దర్శకుడు అనిరుద్ సంగీత బాణీలను అందించారు. ఇప్పటికే అనిరుద్ పాటలను మెచ్చుకున్న నయనతార కోసం ఆమె ప్రియుడిగా ప్రచారంలో ఉన్న దర్శకుడు విఘ్నేశ్‌శివ ఈ చిత్రంలో ఒక పాట రాశారు. ఒరే ఒరు..అంటూ సాగే ఈ పాటను సంగీత దర్శకుడు అనిరుద్ శుక్రవారం సాయంత్రం విడుదల చేయనున్నారు. ఆరు పాటలున్న ఈ చిత్రంలో ఒక పాటను నటుడు శివకార్తికేయన్ రాయడం విశేషం. ఎదువరై అనే పాటను ఆ మధ్య విడుదల చేయగా సంగీత ప్రియుల నుంచి మంచి ఆదరణను పొందిందట. అదే విధంగా శివకార్తికేయన్ రాసిన కల్యాణ వయసు అనే పాట విడుదలై మంచి స్పందనను పొందింది. తాజాగా విఘ్నేశ్‌శివ పాటకు మరింత ప్రేక్షకాదరణ వస్తుందని చిత్ర వర్గాలు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. నెల్సన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంపై అంచనాలు భారీగానే నెలకొన్నాయి. ఇందులో నయనతార డ్రగ్ స్మగ్లర్‌గా నటిస్తున్నారు. ఆమెకు పెయిర్ ఉండరట. అయితే హాస్య నటుడు యోగిబాబు ఆమెను విపరీతంగా ప్రేమించే ఒన్‌సైడ్ లవ్ ట్రాక్ ప్రేక్షకులకు మంచి ఎంటర్టైనింగ్ ఇస్తుందని చిత్ర వర్గాలు పేర్కొన్నారు. -
నువ్వే నా బంగారం!
నయనతార.. నువ్వే నా బంగారం అంటున్నాడు ప్రముఖ దర్శకుడు విఘ్నేశ్ శివ. వీరిద్దరూ ప్రేమలో మునిగితేలుతున్నట్టు ప్రచారం సాగుతున్న సంగతి తెలిసిందే. ’నాను రౌడీదాన్’ చిత్ర షూటింగ్ సమయంలో వీరిద్దరి మధ్య పరిచయం ప్రేమగా మారిందని, వీరిద్దరు సహజీవనం చేస్తున్నారని కోలీవుడ్ వర్గాలు చెప్తున్నాయి. అసలు రహస్యంగా పెళ్లి చేసేసుకున్నారనే వారూ లేకపోలేదు. ఈ ప్రచారాన్ని ధ్రువీకరించేవిధంగా ఈ మధ్య విఘ్నేశ్‌శివ పుట్టిన రోజు సందర్భంగా నయనతార అతనితో న్యూయార్క్ వెళ్లి.. ఘనంగా సెలబ్రేషన్స్ జరిపింది. ఈ ఫొటోలను ఇంటర్నెట్లో పోస్ట్ చేసింది. ఇక, తాజాగా నయనతార శనివారం పుట్టినరోజు జరుపుకుంది. చిత్ర ప్రముఖులు, అభిమానులు ఆమెను శుభాకాంక్షలతో ముంచెత్తారు. ఆమె ప్రియుడు విఘ్నేశ్‌శివ కూడా ఒక ట్వీట్ చేశాడు. ’నేను చూసిన నిజమైన మంచి అమ్మాయి నువ్వు. నీ ధైర్యాన్ని ఎప్పటికీ సడలనివ్వకు. నయనతార అంటే ఏమిటో నలుగురికి చాటేలా నీ విజయగాథ కొనసాగించు. నీ మీద నాకు ఎప్పుడూ ప్రేమ, గౌరవం ఉంటాయి. నువ్వే నా బంగారం’ అని పేర్కొంటూ తను నయనతారతో కలిసి ఉన్న ఫొటోను పోస్ట్ చేశాడు. తను తాజా చిత్రం ’అరమ్’ మంచివిజయాన్ని సాధించడంతో ఆనందంలో తేలిపోతున్న నయనతార ప్రస్తుతం చేతినిండా చిత్రాలతో బిజీగా ఉంది. నయన్- శివకార్తికేయన్ జంటగా తెరకెక్కిన ’వేలైక్కారన్’ చిత్రం త్వరలో విడుదలకు ముస్తాబవుతోంది. ఇక తెలుగులోనూ చిరంజీవికి జంటగా సైరా, బాలకృష్ట సరసన జయసింహా చిత్రాల్లో నటిస్తోంది. Happy Birthday to a woman I really look upto 😇😇 Stay Bold😍stay beautiful😘 jus keep creating that stunning story of what is #Nayanthara ❤️😘 Proud of u as always!! Loads of Love & respect to u my Thangameyyy💕💕😍😘😘#HBDLadySuperStarNayanthara pic.twitter.com/i052dzFuya — Vignesh ShivN (@VigneshShivN) November 18, 2017 -
సంక్రాంతి సందడిలో...
టాలీవుడ్, కోలీవుడ్... ఇలా భాష ఏదైనా సంక్రాంతికి సినిమాల సందడి జోరుగా ఉంటుంది. ఎన్ని సినిమాలు విడుదలైనా పండక్కి బోలెడన్ని టిక్కెట్లు తెగాల్సిందే... సినిమాలకు కలెక్షన్ల పంట పండాల్సిందే. వచ్చే సంక్రాంతి బరిలో ‘నేనుంటా’ అంటున్నారు సూర్య. విఘ్నేష్ శివన్ దర్శత్వంలో ఆయన హీరోగా నటిస్తున్న చిత్రం ‘థానా సేంద కూట్టమ్’. ఇందులో కీర్తి సురేశ్ కథానాయిక. ఈ చిత్రాన్ని సంక్రాంతికి రిలీజ్ చేయాలనుకుంటున్నారన్నది కోలీవుడ్ ఖబర్. ఇటీవలే మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ బర్త్‌డే సందర్భంగా ఈ సినిమాలోని ‘సొడక్కు...’ సాంగ్ టీజర్‌ను రిలీజ్ చేశారు. డిసెంబర్లో థియేట్రికల్ ట్రైలర్‌ను రిలీజ్ చేయాలనుకుంటు న్నారటని కోలీవుడ్ టాక్. హిందీ హిట్ ‘స్పెషల్ ఛబ్బీస్’ స్ఫూర్తితో ఈ సినిమా రూపొందుతోందని సమాచారం. -
అవును... అది నిజమే!
... అని చదవగానే విఘ్నేష్ శివన్, నయనతారల లవ్ లైఫ్ గురించి ఏదో చెప్పబోతున్నాం అనుకుంటున్నారా? విషయం దాని గురించి కాదు. అయినా ఈ మధ్య విఘ్నేశ్ శివన్ బర్త్‌డే సందర్భంగా నయన, బర్త్‌డే బాయ్ కలసి దిగిన ఫొటోలు చూస్తే, ఎవరూ చెప్పకుండానే ఈ ఇద్దరి బాండింగ్ స్ట్రాంగ్‌గా ఉందని ఊహించేయవచ్చు. ఆ సంగతి పక్కన పెడితే.. ఓ సైకో థ్రిల్లర్ మూవీలో నయనతార నటించనున్నారనే వార్త ఆ మధ్య వచ్చిన విషయం తెలిసిందే. ‘అవును... అది నిజమే’ అని అధికారికంగా ప్రకటించారు. ‘ఈరమ్’, ‘వల్లినమ్’ వంటి హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించిన అరివళగన్ ఈ చిత్రానికి దర్శకుడు. ‘మాయ’, ‘అనామిక’, ‘డోర’ వంటి లేడీ ఓరియంటెడ్ చిత్రాలు చేశారు నయనతార. ప్రస్తుతం చేస్తున్న వాటిలో ‘ఇమైక్క నొడిగళ్’. ‘కొలైయుదిర్ కాలమ్’ కూడా ఆ తరహా చిత్రాలే. ఇప్పుడు అరివళగన్ డైరెక్షన్లో చేయనున్నది కూడా హీరోయిన్ ఓరియంటెడ్ మూవీయే. చూడబోతుంటే నయనతార కథానాయిక ప్రాధాన్యంగా సాగే చిత్రాలపై ఇంట్రస్ట్ చూపిస్తున్నట్లు అనిపిస్తోంది కదూ. -
ప్రియుడికి ప్రేమతో..
తమిళసినిమా: ప్రేమ ఎంత మధురం.. ప్రియురాలు అంత కఠినం అన్నది పాత పాట. ప్రేమ ఎంత మధురం..ప్రియురాలు అంత మురిపం అన్నది నేటి మాట అనాలనిపిస్తోంది నటి నయనతారను చూస్తుంటే. నయనతార ఇప్పుడీ ఒక్క పేరు చాలు నిర్మాతలకు లాభాలు తెచ్చిపెట్డడానికి. కొందరు స్టార్ నటుల మాదిరి జయాపజయాలకు అతీతంగా మారిపోయింది నయనతార మార్కెట్. ప్రేమకు, పాటలకు పరిమితమైన పాత్రలను అధిగమించి కథానాయకి పాత్రలకు ప్రాముఖ్యత కలిగిన కథా చిత్రాల్లో నటించే స్థాయికి ఎదిగిన టాప్ హీరోయిన్ నయనతార. ఈమె నటించిన హీరోయిన్ ఓరియెంటెడ్ కథా చిత్రం మాయ అనూహ్య విజయాన్ని సాధించింది.అయితే ఆ తరువాత నటించిన డోరా నిరాశపరచింది. అయినా ఈ స్టార్ నటి మార్కెట్ ఏమాత్రం తగ్గలేదు. ప్రస్తుతం అదే తరహా చిత్రాలు అరమ్, ఇమైకా నోడిగళ్, కొలైయుదీర్ కాలం, నేర్‌వళి చిత్రాలతో పాటు తాజాగా అంగీకరించిన ఖోఖో అంటూ చేతి నిండా చిత్రాలతో బిజీగా ఉన్నారు. అదేవిధంగా శివకార్తికేయన్‌కు జంటగా నటించిన వేలైక్కారన్ చిత్రం త్వరలో విడుదలకు ముస్తాబవుతోంది. కాగా నయనతార వ్యక్తిగత జీవితాన్ని తీసుకుంటే చాలా ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు. ముఖ్యంగా ప్రేమలో రెండుసార్లు ఘోరంగా ఓటమిని చవి చూశారు. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి ప్రేమలో మునిగి తేలుతున్నట్లు ప్రచారం చాలా కాలంగా జోరుగా సాగుతున్న విషయం తెలిసిందే. యువ దర్శకుడు విఘ్నేశ్‌శివతో నయనతార ప్రేమ ఆయనతో సహజీవనం సాగించే స్థాయికి తీసుకెళ్లిందంటున్నారు. ఈ విషయం గురించి ఇద్దరూ మౌనం వహిస్తున్నా, వీరి మధ్య ప్రేమ కొనసాగుతోందనడానికి చాలా కారణాలు వెలుగు చూస్తున్నాయి. తాజాగా ఈ బ్యూటీ తన ప్రియుడికి అతి ఖరీదైన బీఎండబ్ల్యూ కారును గిఫ్ట్‌గా కొనిచ్చారట. ఇప్పుడీ విషయమే సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది.నయనా మజాకా!