హ్యాపీ బర్త్‌డే బంగారం | Vignesh Shivan Birthday Wishes To Nayanthara | Sakshi
Sakshi News home page

హ్యాపీ బర్త్‌డే బంగారం

Published Mon, Nov 19 2018 1:27 PM | Last Updated on Mon, Nov 19 2018 1:27 PM

Vignesh Shivan Birthday Wishes To Nayanthara - Sakshi

ప్రియుడితో నయనతార

సినిమా: బంగారమే (తంగమే) హ్యాపీ బర్త్‌డే అంటూ ఎవరు ఎవరికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారో అందరికీ అర్థమయ్యే ఉంటుంది. ఎస్‌. సంచలన నటి, అగ్రనటి, లేడీ సూపర్‌స్టార్‌ నయనతారకు ఆమె ప్రియుడు, యువ దర్శకుడు విఘ్నేశ్‌శివ తెలిపారు. అవును ఆదివారం మరియా కురియన్‌ ( నయనతార అసలు పేరు) పుట్టిన రోజు. అయ్యా చిత్రంతో కోలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన ఈ కేరళా కుట్టి ఆ తరువాత అంచెలంచెలుగా ఎదిగి ఇప్పుడు హీరోలకు దీటుగా లేడీ సూపర్‌స్టార్‌గా రాణిస్తున్నారు. వ్యక్తిగత జీవితంలో పలు ఒడిదుడుకులను ఎదురొడ్డి గెలిచిన నటి నయనతార. నటుడు శింబు, ప్రభుదేవాతో ప్రేమ వ్యవహారం చేదు అనుభవాన్నే అందించినా, మనోధైర్యంతో ఆ అపజయాల నుంచి బయట పడి నటిగా తన విజయ పరంపరను కొనసాగిస్తున్నారు.

తాజాగా దర్శకుడు విఘ్నేశ్‌శివతో ప్రేమ, సహజీవనం అంటూ చాలా కాలంగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. వీరిద్దరి ప్రేమ గురించి బయటకు చెప్పకపోయినా, బాహాటంగానే బాహ్య ప్రపంచంలో భార్యాభర్తలా తిరిగేస్తూ ఎంజాయ్‌ చేస్తున్నారు. ఒకరి పుట్టినరోజన మరోకరు శుభాకాంక్షలు తెలుపుకుంటూ, దేశ, విదేశాల్లో విహాంగ ప్రేమ పక్షుల్లా చుట్టేయడంతో పాటు ఆ దృశ్యాలను సోషల్‌మీడియాల్లో విడుదల చేస్తూ వార్తల్లో కెక్కుతున్నారు. తాజాగా ఆదివారం నయనతార 34వ జన్మదినం. దీంతో ఆమె పుట్టిన రోజును పురస్కరించుకుని ప్రియుడు, పెళ్లి కాని భర్త భారీ ఎత్తున ఏర్పాట్లు చేశాడు. ఒక భారీ కేక్‌పై నయనతార ఫొటోను ఏర్పాటు చేసి, కింద భాగాన హ్యాపీ బర్త్‌డే, విత్‌ లాంగ్స్‌ ఆఫ్‌ లవ్‌ అని అందమైన అక్షరాలను పొందుపరిచాడు. ఇప్పుడీ కేక్‌ ఫొటోతో పాటు విఘ్నేశ్‌శివ, నయనతారల అలింగన దృశ్యం సామాజిక మాధ్యమాల్లో హల్‌ చల్‌ చేస్తున్నాయి. అంతే కాదు బంగారం హ్యాపీ బర్త్‌డే అంటూ విఘ్నేశ్‌శివ తన ఇన్‌స్ట్రాగామ్‌తో శుభాకాంక్షలను పోస్ట్‌ చేశాడు. ఇక పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు నయనతారకు ఫోన్ల ద్వారా, ట్విట్టర్లలో శుభాకాంక్షల వర్షం కురిపిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement