ప్రేయసి కోసం పాట | Vignesh Shiva Lyrics For Nayantara Movie | Sakshi
Sakshi News home page

ప్రేయసి కోసం పాట

Published Fri, Jun 15 2018 9:21 AM | Last Updated on Fri, Jun 15 2018 9:21 AM

Vignesh Shiva Lyrics For Nayantara Movie - Sakshi

నయనతార, విఘ్నేశ్‌శివ

తమిళసినిమా: ప్రేయసి కోసం ప్రియుడు పాట రాస్తే ఆ పాటలో నిజంగా మజా ఉంటుందని చెప్పవచ్చు. అదీ అగ్రనటి నయనతార కోసం ఆమె ప్రియుడు, యువదర్శకుడు విఘ్నేశ్‌శివ పాట రాస్తే దానికి ప్రేక్షకుల నుంచి వచ్చే క్రేజే వేరు. అలాంటి ఒక పాట కోలమావు కోకిల చిత్రంలో చోటుచేసుకుంది. లేడీ సూపర్‌స్టార్‌గా రాణిస్తున్న నయనతార నటించిన ఇమైకా నోడిగళ్, కొలైయుధీర్‌ కాలం, కొలమావు కోకిల వంటి లేడీ ఓరియెంటెడ్‌ కథా చిత్రాలు షూటింగ్‌ పూర్తి చేసుకుని నిర్మాణాంతర కార్యక్రమాల దశలో ఉండగా, అజిత్‌కు జంటగా నటిస్తున్న విశ్వాసం, తెలుగులో చిరంజీవికి జంటగా సైరా నరసింహారెడ్డి చిత్రాలు నిర్మాణంలో ఉన్నాయి. ఇకపోతే నయనతార నటించిన కొలమావు కోకిల చిత్రం త్వరలో తెరపైకి రావడానికి రెడీ అవుతోంది.

ఈ చిత్రానికి సంచలన సంగీత దర్శకుడు అనిరుద్‌ సంగీత బాణీలను అందించారు. ఇప్పటికే అనిరుద్‌ పాటలను మెచ్చుకున్న నయనతార కోసం ఆమె ప్రియుడిగా ప్రచారంలో ఉన్న దర్శకుడు విఘ్నేశ్‌శివ ఈ చిత్రంలో ఒక పాట రాశారు. ఒరే ఒరు..అంటూ సాగే ఈ పాటను సంగీత దర్శకుడు అనిరుద్‌ శుక్రవారం సాయంత్రం విడుదల చేయనున్నారు. ఆరు పాటలున్న ఈ చిత్రంలో ఒక పాటను నటుడు శివకార్తికేయన్‌ రాయడం విశేషం. ఎదువరై అనే పాటను ఆ మధ్య విడుదల చేయగా సంగీత ప్రియుల నుంచి మంచి ఆదరణను పొందిందట. అదే విధంగా శివకార్తికేయన్‌ రాసిన కల్యాణ వయసు అనే పాట విడుదలై మంచి స్పందనను పొందింది. తాజాగా విఘ్నేశ్‌శివ పాటకు మరింత ప్రేక్షకాదరణ వస్తుందని చిత్ర వర్గాలు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. నెల్సన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంపై అంచనాలు భారీగానే నెలకొన్నాయి. ఇందులో నయనతార డ్రగ్‌ స్మగ్లర్‌గా నటిస్తున్నారు. ఆమెకు పెయిర్‌ ఉండరట. అయితే హాస్య నటుడు యోగిబాబు ఆమెను విపరీతంగా ప్రేమించే ఒన్‌సైడ్‌ లవ్‌ ట్రాక్‌ ప్రేక్షకులకు మంచి ఎంటర్‌టైనింగ్‌ ఇస్తుందని చిత్ర వర్గాలు పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement