నయన కోసం అనిరుద్‌ పాట | Anirudh song for nayanatara | Sakshi
Sakshi News home page

నయన కోసం అనిరుద్‌ పాట

Published Fri, Jan 27 2017 3:24 AM | Last Updated on Tue, Sep 5 2017 2:11 AM

నయన కోసం అనిరుద్‌ పాట

నయన కోసం అనిరుద్‌ పాట

లేడీ సూపర్‌స్టార్‌ నయనతార నటిస్తున్న తాజా చిత్రాల్లో ఒకటి దోరా. హారర్‌ కథా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని దాస్‌ రామస్వామి దర్శకత్వంలో నేమిచంద్‌ జపక్‌ పతాకంపై హిందేశ్‌ జపక్‌ నిర్మిస్తున్నారు.ఈ చిత్రానికి వివేక్‌–మెర్విన్ ల ద్వయం సంగీతాన్ని అందిస్తున్నారు.ఇందులోని ఎంగే పోరా దోరా, వాళ విడు పాటలు ఇప్పటికే విడుదలై సంగీత ప్రియుల మధ్య మంచి స్పందనను పొందుతున్నాయి.

తాజాగా చిత్ర నాయకి నయనతార అతీంద్రియ శక్తులతో పోరాడి గెలిచే ఇతి వృత్తంగా సాగే  రా రా రా అనే ఆక్రోశంగా సాగే పాటను ఇటీవల యువ సంగీత తరంగం, గాయకుడు అనిరుద్‌ పాడగా రికార్డ్‌ చేసినట్లు చిత్ర వర్గాలు వెల్లడించారు. ఈ పాట మధ్యమధ్యలో నయనతార సంభాషణలు చోటు చేసుకుంటాయని చెప్పారు. ఇలా మంచి జనరంజకమైన పాటలతో కూడిన ఈ చిత్ర ఆడియో హక్కుల్ని సోనీ మ్యూజిక్‌ సంస్థ పొందిందని, త్వరలోనే చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement