dora
-
నయన్ ఫ్యూచర్ ప్లాన్ ఏమిటో?
నయనతార ఈ పేరు ఇప్పుడు దక్షిణాదిలో ఒక క్రేజ్. దర్శక నిర్మాతలకు ముఖ్యంగా నవతరం దర్శకులకు ఆశాజ్యోతి. ఇక నిర్మాత గల్లాపెట్టెలు నింపే లక్ష్మీదేవి అని కూడా చెప్పొచ్చు. ఇటీవల ఆమె నటించిన డోరా చిత్రం నిజానికి ఏమంత వైవిధ్యం ఉన్న కథా చిత్రం కానేకాదు. ఇంకా చెప్పాలంటే నయనతార నటించాల్సిన చిత్రం కూడా కాదని సినీ విమర్శకుల భావన. అయినా ఆ చిత్రం నిర్మాతకు, బయ్యర్లకు కాసుల వర్షం కురిపించింది. అందుకు కారణం కేవలం నయనతారకున్న క్రేజేనని చెప్పకతప్పదు. ఈ కథ అలా ఉంచితే ఈ టాప్ నాయకి నటిస్తున్న తాజా చిత్రాల్లో అరమ్ చిత్రం ఒకటి. షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలో విడుదలకు ముస్తాబవుతోంది. నవ దర్శకుడు మింజూర్ గోపి మెగాఫోన్ పట్టిన ఈ చిత్రంపైనా మంచి అంచనాలే నెలకొన్నాయి. ఈ సందర్భంగా అరమ్ చిత్రం గురించి దర్శకుడు తెలుపుతూ ఇందులో నయనతార జిల్లా కలెక్టర్‌గా నటిస్తున్నారని తెలిపారు. ఈ చిత్రాన్ని నయన్ కేవలం 25 రోజుల్లో పూర్తి చేశారని చెప్పారు. మరో విశేషం ఏమిటంటే ఈ చిత్రానికి ఆమె సహాయదర్శకురాలిగా పనిచేశారని చెప్పారు. తనకు సంబంధించిన సన్నివేశాలు పూర్తి అయినా సెట్లోనే ఉండి ఇతర నటీనటుల నటనను గమనించేవారని తెలిపారు. అరమ్ ఒక ముఖ్యమైన అంతర్జాతీయ సమస్యను ఆవిష్కరించే కథా చిత్రం అని పేర్కొన్నారు. ఇంకా నీటి సమస్యను చర్చించే కథా చిత్రంగా ఉంటుందన్నారు. ఈ విషయం అటుంచితే నయనతార సహాయదర్శకురాలిగా పనిచేయడమన్నదే చర్చనీయాంశంగా మారింది. దర్శకత్వంలో మెళకువలు తెలుసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారా? మెగాఫోన్ పట్టే ఆలోచనగానీ పుట్టిందా? ఒక పక్క దర్శకుడు విఘ్నేశ్‌శివతో సహజీవనం సాగిస్తున్నారనే ప్రచారం సంచలనంగా మరిన పరిస్థితుల్లో నయనతార సహాయదర్శకురాలి బాధ్యతపై ఆసక్తి చూపడంలో ఆంతర్యం ఏమిటి? అసలు ఈ అమ్మడి భవిష్యత్ ప్లాన్ ఏమిటి? లాంటి పలు ప్రశ్నలకు నయనతార తాజాగా తావిచ్చారనే చెప్పవచ్చు. ఏమో గుర్రం ఎగరావచ్చు నన్న నానుడి గుర్తుకొస్తోంది కదూ. -
నయన్‌ను అలా అంగీకరించడం లేదా?
నయనతారను ప్రేక్షకులు అలా అంగీకరించలేకపోతున్నారా? కోలీవుడ్‌లో హాట్ టాపిక్ ఇదే. ‘సూపర్‌స్టార్’ కోలీవుడ్‌లో రజనీకాంత్‌కు మాత్రమే సొంతమైన పట్టం ఇది. దాన్ని మరొకరు టచ్ చేయాలని ఆశపడితే ఫలితం తీవ్రంగా ఉంటుందన్నది రుజువైంది. అలాంటిది ఆయన అభిమానిగా చెప్పుకునే నృత్య దర్శకుడు, నటుడు రాఘవలారెన్స్ తాను నటించిన మొట్టశివ కెట్టశివ చిత్రం టైటిల్లో మక్కల్ సూపర్‌స్టార్ అని వేయించుకున్నారు. దాన్ని దర్శకుడు సాయిరమణి తనపై అభిమానంతో అలా వేయించారని తప్పించుకునే ప్రయత్నం చేసినా, ఆ చిత్రాన్ని చూసిన ప్రేక్షకులు మాత్రం అంగీకరించలేదు. చిత్రం ఆశించిన విజయం సాధించలేదు. దీంతో ఏ ప్రాంతంలో ఉన్న తమిళులకైనా రజనీకాంత్‌నే సూపర్‌స్టార్ అని ఆయన ప్రకటించక తప్పలేదు. నయనతారకు అచ్చిరాని పట్టం: ఇకపోతే ప్రస్తుతం టాప్ హీరోయిన్గా వెలుగొందుతున్న నటి నయనతార హీరోయిన్ ఓరియంటెడ్ కథా చిత్రాలు చేస్తూ బిజీగా ఉన్నారు. అలాంటి కథతో మాయ చిత్రం విజయం సాధించడంతో నయనతారకు లేడీ సూపర్‌స్టార్ పట్టం కట్టారు. అయితే అలా తొలిసారిగా టైటిల్ కార్డులో వేయించిన చిత్రం డోర. ఇటీవల విడుదలైన ఈ చిత్రం ఆశించిన రిజల్ట్‌ను అందుకోలేకపోయిందనే టాక్ సినీ వర్గాల్లో వినిపిస్తోంది. ఏక కాలంలో తమిళం, తెలుగు భాషల్లో విడుదలైన డోర చిత్రం వసూళ్లను పెద్దగా రాబట్టలేకపోయిందనే టాక్ ట్రేడ్‌వర్గాల్లో వినిపిస్తోంది. విషయం ఏమిటంటే నయనతార తొలిసారిగా తన పాత్రకు డబ్బింగ్ చెప్పుకున్న చిత్రం ఇదే. ఏతావాతా లేడీ సూపర్‌స్టార్ పట్టం నయనతారకు అచ్చిరాలేదని తెలుస్తోంది. పట్టం అన్నది సినీ వర్గాలు ఇచ్చినా, దాన్ని అభిమానులు అంగీకరించాల్సిఉంటుందన్నది మరచిపోకూడదు. మరి తదుపరి చిత్రానికి నయనతార ఆ లేడీ సూపర్‌స్టార్ పట్టాన్ని వేసుకుంటారా? లేదా? అన్నది వేచి చూడాల్సిందే. -
అందుకే ఆమె లేడీ సూపర్‌స్టార్
ఒకప్పుడు గ్లామరస్ స్టార్. ఇప్పుడు లేడీ సూపర్‌స్టార్. ఆ నటి ఎవరన్నది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎస్ దటీజ్ ఒన్ అండ్ ఓన్లీ నయనతార. ఇప్పుడు తను మోస్ట్ వాంటెడ్ హీరోయిన్, టాపెస్ట్స్టార్. టాలెంటెడ్ యువ దర్శకులకు ఆశాస్టార్, నిర్మాతలకు వసూళ్ల క్వీన్. ఇంతకీ ఈ పట్టానికి ఎందుకు అర్హురాలయ్యారంటే, చిత్ర షూటింగ్లో తనకు సంబంధించిన సన్నివేశాల చిత్రీకరణ పూర్తి కాగానే చేతులు దులుపుకుని వెళ్లి కెరవన్ వ్యాన్‌లో విశ్రాంతి తీసుకోరు. షూటింగ్ లొకేషన్లోనే ఉండి సహ నటీనటుల నటనను గమనిస్తుంటారు. షూటింగ్లో ఆలస్యం అయినా చిరాకు పడరు. కస్సుబుస్సులాడరు. ప్రశాంతంగా ఉంటారు. నటనపై అంకితభావం మెండు. ఈ విషయాలను ఆమెతో కలిసి నటించే సహ నటీనటులందరూ గ్రహించే విషయం. ప్రముఖ నటినన్న గర్వాన్ని ప్రదర్శించరు. అందుకే నయనతార అంటే అందరూ ఇష్టపడతారు. స్టార్ హీరోల నుంచి, యువ నటుల వరకూ నయనతారతో నటించాలని కోరుకుంటారు.అందుకే నయనతార లేడీసూపర్‌స్టార్ అయ్యారు.ఇలా అన్నది ఎవరో కాదు నయనతార నటించిన డోర చిత్రంలో ఆమెతో నటించిన నటుడు హరీష్ ఉత్తమన్. డోర చిత్రం ఈ నెల 31న తెరపైకి రానుంది. ఈ చిత్రానికి సెన్సార్‌బోర్డు ఏ సర్టిఫికెట్‌ను ఇచ్చింది.దీంతో సెన్సార్బోర్డుపై దర్శకుడు విఘ్నేశ్‌శివ విమర్శలు గుప్పించడం విశేషం.ఈయనకేం సంబంధం అని మాత్రం అడగకండి. ఈయన నటి నయనతార ప్రేమించుకుంటున్నారన్న వ్యవహారం గురించి మీడియాలో చాలా కాలంగానే ప్రచారం అవుతున్న విషయం తెలిసిందే. అంతే కాదు వీరిద్దరూ సహజీవనం చేస్తున్నారన్న టాక్ కోలీవుడ్‌లో గట్టిగానే వినిపిస్తోంది. అయినా ఈ విషయం గురించి ఇటు నయనతార గానీ, అటు దర్శకుడు విఘ్నేశ్శివగానీ నోరు మెదపడంలేదు. ఇంతకీ డోర చిత్రానికి ఏ సర్టిఫికెట్ ఇవ్వడం గురించి దర్శకుడు విఘ్నేశ్‌శివ స్పందన ఏమిటన్నదేగా మీ ఆసక్తి. అక్కడికే వస్తున్నాం. డోర చిత్రానికి ఏ సర్టిఫికెట్ ఇస్తారు. దృవంగళ్ 16, మానగరం చిత్రాలాంటి వాటికి యూఏ సర్టిఫికెట్లు ఇస్తారు. ఇటీవల విడుదలైన పలు చిత్రాలకు యూ సర్టిఫికెట్లు అందిస్తారు. రాను రాను సెన్సార్ బోర్డుపై ప్రేమ రోజురోజుకు అధికం అవుతోంది అంటూ వ్యంగాస్త్రాలు సంధించారు. -
అమ్మాయి... కారు... ఓ దెయ్యం!
‘‘దెయ్యం కారును ఎందుకు ఆవహించింది..? కారుతో దెయ్యం ఎలా పగ తీర్చుకుంది..? అసలు నయనతారకు దెయ్యానికి గల సంబంధం ఏంటి..? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం తెలుసుకోవాలంటే ‘డోర’ చిత్రం చూడాల్సిందే’’ అని మల్కాపురం శివకుమార్ అన్నారు. నయనతార టైటిల్ రోల్లో దాస్ రామసామి దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన ‘డోర’ ఈ నెల 31న విడుదల కానుంది. తెలుగులో సుర„ ఎంటర్టైన్మెంట్ అధినేత మల్కాపురం శివకుమార్ విడుదల చేస్తున్నారు. శనివారం పాత్రికేయుల సమావేశంలో మల్కాపురం శివకుమార్ మాట్లాడుతూ – ‘‘ఇప్పటివరకూ వచ్చిన హర్రర్ చిత్రాల కన్నా ‘డోర’ డిఫరెంట్‌గా ఉంటుంది. కారులో దెయ్యం ఏ విధంగా ట్రావెల్ అవుతుందన్న డిఫరెంట్ కాన్సెప్ట్‌తో సినిమా తీయడం జరిగింది. నయనతార ఎంతో ఇష్టపడి చేసిన ప్రాజెక్ట్ ఇది. ఆమె మంచి కథలను ఎంచుకుంటూ ముందుకు వెళుతోంది. చిన్నపిల్లలకు కనెక్ట్ అవుతుందని నయనతార కోరిక మేరకు టైటిల్‌ను ‘డోర’గా నిర్ణయించాం. టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తెలుగులో ఈ చిత్రాన్ని 400 పైగా థియేటర్లలో రిలీజ్ చేస్తున్నాం. డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబ్యూటర్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. బయ్యర్లు ఉన్నప్పటికి సినిమా హిట్ అవుతుందనే నమ్మకంతో వీలైన చోట్ల మేమే విడుదల చేసేందుకు ఫ్లాన్ చేస్తున్నాం. వివేక్, మెర్విన్ కొత్తవారైనా మంచి మ్యూజిక్ అందించారు. దాస్ రామసామిగారికి ఇది మొదటి సినిమా అయినా బాగా చిత్రీకరించారు. ప్రస్తుతం డైరెక్ట్‌గా తెలుగులో మూడు చిత్రాలు చేసేందుకు ఫ్లాన్ చేస్తున్నాం. అందులో ఒకటి సమాజానికి ఉపయోగపడే కథతో డైరెక్టర్ కుమార్‌తో ఓ సినిమా చేయబోతున్నాం. సక్సెస్‌లో ఉన్న హీరోలు, డైరెక్టర్లతో మరో రెండు సినిమాలను ప్లాన్ చేస్తున్నాం’’ అన్నారు. -
దళితులకు ఒక్క ఎకరా భూమి కూడా ఇవ్వలేదు ?
-
అంతా భయం.. భయం!
కారు దానంతటదే స్టార్ట్ అయిపోతుంది. మార్చకుండానే గేర్లు మారిపోతాయి. ఆన్ చేయకుండానే సిగ్నల్ లైట్స్ వెలుగుతాయి. ఓ మనిషి కంగారుపడటానికి ఇంతకు మించి ఏం కావాలి? ఇంతకీ ఇదంతా చేసేది ఎవరు? అంటే.. ‘ఆత్మ’. ఆ ఆత్మ కారులోనే ఉంటుందా? బయట ఉంటుందా? హీరోయిన్‌కు, ఆత్మపగకు ఉన్న లింక్ ఏంటి? ఈ ప్రశ్నలన్నింటికి సమాధానం తెలసుకోవాలంటే ఈ నెల 31 న విడుదలవుతున్న ‘డోర’ చిత్రం చూడాలంటు న్నారు దర్శకుడు దాస్ రామసామి. తెలుగు, తమిళ భాషల్లో నయనతార టైటిల్ రోల్లో రూపొందిన ఈ చిత్రాన్ని సుర„ ఎంటర్టైన్మెంట్ మీడియా పతాకంపై మాల్కాపురం శివకుమర్ తెలుగులో విడుదల చేయ నున్నారు. ఈ సందర్భంగా శివకుమార్ మాట్లాడుతూ– ‘‘ కారులో దెయ్యం అనే థ్రిల్లింగ్ కాన్సెప్ట్‌తో సినిమా నిర్మించాం. స్క్రీన్‌ప్లే చిత్రానికి హైలెట్. హారర్ సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం ఇది. ఇటీవల విడుదలైన పాటలకు మంచి స్పందన లభిస్తోంది’’ అన్నారు. -
మయూరిలా మరో సక్సెస్
– నిర్మాత మల్కాపురం ‘‘తమిళంలో ‘డోర’ చిత్రం ఆడియో వేడుక చేయలేదు. తెలుగు పాటల వేడుకలో నేను తొలిసారి స్టేజ్ ఎక్కుతున్నా. ఈ నెల 31న తెలుగు, తమిళంలో మా చిత్రం విడుదలవుతుంది. తెలుగు ప్రేక్షకులు మా చిత్రాన్ని పెద్ద సక్సెస్ చేయాలి’’ అన్నారు దర్శకుడు దాస్. నయనతార లీడ్ రోల్లో ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని తమిళంలో జబర్, తెలుగులో సురక్ష్ ఎంటర్టైన్మెంట్ మీడియా పతాకంపై మల్కాపురం శివకుమార్ నిర్మించారు. వివేక్, మెరిన్ స్వరపరచిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. మల్కాపురం శివకుమార్ మాట్లాడుతూ – ‘‘నటనకు నయనతార పెట్టింది పేరు. ‘మయూరి’ చిత్రంలాగా ఈ చిత్రంతో నయన్ మరో సక్సెస్ సాధిస్తారు. తెలుగు, తమిళంలో ఒకేసారి విడుదల చేస్తున్నాం. తెలుగు సంగీతం విషయంలో యశోకృష్ణ ఎంతో సపోర్ట్ చేశారు. ‘సింగం 3’ తర్వాత మా బ్యానర్లో గర్వంగా చెప్పుకునే సినిమా ‘డోర’ అవుతుంది’’ అన్నారు. వివేక్, మెరిన్, దర్శకులు ఎన్.శంకర్, జి.అశోక్, దశరథ్, పాటల రచయిత చంద్రబోస్ తదితరులు ఈ వేడుకలో పాల్గొన్నారు. -
లోకం చుట్టిరానున్న నయన
చాలా కాలం క్రితం లోకం చుట్టిన వీరుడు చిత్రం రూపొందింది. ఎంజీఆర్ నటించిన ఈ చిత్రం తమిళంలో పాటు తెలుగులోనూ అనువాదమై విశేష ప్రేక్షకాదరణను పొందింది. అలా కథానాయకులే దేశదేశాలు చుట్టొచ్చిన కథా చిత్రాల్లో నటించారు. నటి నయనతార ఆ తరహాలో సాగే కథతో వెండి తెరపైకి రావడానికి రెడీ అవుతున్నారు. ప్రస్తుతం లేడీ సూపర్‌స్టార్‌గా వెలిగిపోతున్న నటి నయన.అన్భే నీఎంగే చిత్రంతో లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు శ్రీకారం చుట్టిన ఈ సంచలన తార ఆ చిత్రం ఆశించిన విజయం సాధించకపోయినా ఆ తరువాత వరుసగా అలాంటి కథా చిత్రాలే ఆమెను వరించడం విశేషం. నయనతార నటించిన హారర్ కథా చిత్రం మాయ అనూహ్య విజయం సాధించడం కూడా ఇందుకు కారణంగా చెప్పవచ్చు.తాజాగా ఈ అమ్మడు నటిస్తున్న డోరా, అరం, కొలైయుధీర్ కాలం, ఇమైకా నోడిగళ్ మొదలగు చిత్రాలన్నీ హీరోయిన్ ప్రధాన ఇతివృత్తంతో తెరకెక్కుతున్న చిత్రాలే. మరో పక్క శివకారి్తకేయన్ లాంటి యువ నటులతోనూ నటిస్తున్న నయనతార తాజాగా దేశవిదేశాలు చుట్టొచ్చే వైవిధ్యభరిత కథా చిత్రంలో నటించడానికి రెడీ అవుతున్నారు. ఫ్రాన్స్ లో జర్నలిస్ట్‌గా పని చేసే నయనతార చిన్నతనంలోనే తల్లిదండ్రుల జాడ తెలుసుకోవడానికి లోకం చుట్టిరావడానికి బయలు దేరతారట.అలా ఆమె ఫ్రాన్స్, జర్మనీ, పోలెండ్, మంగోలియా దేశాలు తిరిగి చివరికి చెన్నైకి వచ్చేలా కథ ఉంటుందట. దర్శకుడు మిష్కన్ శిషు్యడు కృష్ణమాచారి మెగాఫోన్ పట్టనున్న ఈ చిత్రాన్ని ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ నిర్మించనుంది.చిత్ర షూటింగ్ ఈ నెలాఖరున ప్రారంభం కానుందని కోలీవుడ్ వర్గాల సమాచారం. -
నయనా.. నిన్నొదల!
ఆ కారులో ఓ ఆత్మ ఉంది. అది నయనతారను వెతుక్కుంటూ వచ్చింది. వచ్చిన పని ముగించేంత వరకూ వదల నయనా... నిన్నొదల అంటుంది. ఆత్మ ఏ పని మీద వచ్చింది? నయనతారనే ఎందుకు వెంటాడుతుంది? తెలియా లంటే సినిమా విడుదలయ్యే వరకూ వెయిట్ చేయమంటున్నారు నిర్మాత మల్కాపురం శివకుమార్. నయనతార ముఖ్యతారగా దాస్ రామసామి దర్శక త్వంలో రూపొందిన తెలుగు, తమిళ హారర్ థ్రిల్లర్ ‘డోర’. మల్కాపురం శివకుమార్ తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. త్వరలో టీజర్, ఈ నెలలో ఆడియో రిలీజ్ చేస్తామని ఆయన తెలిపారు. -
నయన కోసం అనిరుద్ పాట
లేడీ సూపర్‌స్టార్ నయనతార నటిస్తున్న తాజా చిత్రాల్లో ఒకటి దోరా. హారర్ కథా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని దాస్ రామస్వామి దర్శకత్వంలో నేమిచంద్ జపక్ పతాకంపై హిందేశ్ జపక్ నిర్మిస్తున్నారు.ఈ చిత్రానికి వివేక్–మెర్విన్ ల ద్వయం సంగీతాన్ని అందిస్తున్నారు.ఇందులోని ఎంగే పోరా దోరా, వాళ విడు పాటలు ఇప్పటికే విడుదలై సంగీత ప్రియుల మధ్య మంచి స్పందనను పొందుతున్నాయి. తాజాగా చిత్ర నాయకి నయనతార అతీంద్రియ శక్తులతో పోరాడి గెలిచే ఇతి వృత్తంగా సాగే రా రా రా అనే ఆక్రోశంగా సాగే పాటను ఇటీవల యువ సంగీత తరంగం, గాయకుడు అనిరుద్ పాడగా రికార్డ్ చేసినట్లు చిత్ర వర్గాలు వెల్లడించారు. ఈ పాట మధ్యమధ్యలో నయనతార సంభాషణలు చోటు చేసుకుంటాయని చెప్పారు. ఇలా మంచి జనరంజకమైన పాటలతో కూడిన ఈ చిత్ర ఆడియో హక్కుల్ని సోనీ మ్యూజిక్ సంస్థ పొందిందని, త్వరలోనే చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. -
ఎక్కడికి వెళ్తున్నావ్ డోరా?
ముఖంలో ఆందోళన, నుదుట రక్తం... ఒంటరిగా కారు నడుపుతూ ఎక్కడికో వెళ్తున్నారు నయనతార. ఇంత కంగారుగా ఎక్కడికెళుతున్నారని ఏవేవో ఊహించుకోవద్దు. కొత్త సినిమా కోసమే నయనతార బయలుదేరారు. ఈ బ్యూటీ ముఖ్యతారగా రూపొందుతోన్న తమిళ హారర్ కామెడీ మూవీ ‘డోరా’. ఇక్కడున్న స్టిల్ చూస్తే.. పెద్ద గండం నుంచి నయన తప్పించుకుని వెళ్తున్నట్టుంది కదూ! ఈ సిట్యువేషన్‌కి తగ్గట్టు సినిమాలో ‘ఎంగ పోర డోరా’ (‘ఎక్కడికి వెళ్తునావ్ డోరా’ అని అర్థం) అనే పాటను స్వరపరిచారు. శుక్రవారం ఈ పాటను విడుదల చేశారు. పాట విన్న ప్రేక్షకులకు సినిమాపై ఆసక్తి పెరిగింది. ‘మాయ’ (తెలుగులో ‘మయూరి’) తర్వాత నయనతార ప్రధానపాత్రలో నటిస్తున్న హారర్ చిత్రమిది. కొత్త కుర్రాడు దాస్ రామసామి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి వివేక్–మెర్విన్ ద్వయం సంగీతం అందిస్తున్నారు. -
నయన్ పారితోషికం రూ.7 కోట్లా?
ప్రేక్షకులు సినిమాలు చూడడానికి థియేటర్లకు రావడం లేదు. చిత్రాలకు వసూళ్లు లేవు. థియేటర్లు మూసు కోవలసిన పరిస్థితి. మరో పక్క చిత్రాలు కొనుగోలు చేయడానికి బయ్యర్లు రావడం లేదు. వ్యాపారం జరగడం లేదు. 400 వందలకు పైగా చిత్రాలు సెన్సార్ పూర్తి చేసుకుని విడుదలకు నోచుకోక మగ్గుతున్నాయి. చిత్ర పరిశ్రమ క్లిష్టపరిస్థితుల్లో పడింది. ఇవీ పరిశ్రమ పెద్దలు వాపోతున్న మాటలు. ఇదిలా ఉంటే ఇక తారల విషయానికి వస్తే పారితోషికాలను సినిమా, సినిమాకు పెంచుకు పోతున్నారన్నది నిజం. నటి నయనతార విషయానికే వస్తే కోలీవుడ్‌లో రూ.10 లక్షల పారితోషికంతో ప్రారంభమైన తన కెరీర్ ఇప్పుడు కోట్లకు చేరింది. మొన్నటి వరకూ మూడు కోట్లు పుచ్చుకున్న ఈ మాలీవుడ్ సంచలన తార ఇటీవల నాలుగు కోట్లు డిమాండ్ చేస్తున్నారట. ఏంటి అప్పుడే ఆశ్చర్య పోతున్నారా? ఈ మొత్తం హీరోల సరసన నటించడానికేనట. నయనతార ఈ మధ్య హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రాల్లోనే అధికంగా నటిస్తున్నారన్న విషయం తెలిసిందే. మాయ చిత్రం నుంచి ఈ తరహా చిత్రాల అవకాశాలు ఆమె తలుపు తట్టడం ఎక్కువైంది. ప్రస్తుతం నయనతార నటిస్తున్న డోరా, ఇమైక్కా నోడిగళ్, అరం, కొలైయుధీర్ కాలం తదితర చిత్రాలన్నీ కథానాయకి చుట్టూ తిరిగే కథా చిత్రాలే. ఇలాంటి చిత్రాలకు ఆ జాన పారితోషికం డిమాండ్ చేస్తున్నదెంతో తెలుసా? అక్షరాలా ఏడు కోట్లట. ఇది ఏ దక్షిణాది తార పొందనటు వంటి మొత్తం అని వేరే చెప్పాలా’ అయితే ఇది టూమచ్ అంటున్నారు సినీ వర్గాలు. నయనతార చిత్రాలు లాభాలు గడిస్తున్నాయి అందుకే అంత పారితోషికం డిమాండ్ చేస్తున్నారనే వారూ లేక పోలేదు. -
డిజిటల్ ఫార్మెట్లో డోరా గీతాలు
డోరా చిత్ర గీతాలను డిజిట ల్ ఫార్మెట్లో విడుదల కానున్నారుు.లేడీ సూపర్‌స్టార్ నయనతార నటిస్తున్న తాజా చిత్రాల్లో డోరా ఒకటి. వి.హిందేశ్ జపక్ సమర్పణలో నెమిచంద్ జపక్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దాస్ రామస్వామి దర్శకత్వం వహిస్తున్నారు. నయనతార ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో తంబిరామయ్య, హరీష్‌ఉత్తమన్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని సర్గుణం సినిమాస్ సంస్థ నెమిచంద్ జపక్కు ఫస్ట్‌కాపీ బెస్లో నిర్మిస్తోంది.ఈ చిత్రానికి వివేక్-మెర్విన్ల ద్వయం సంగీతాన్ని, దినేశ్కృష్ణన్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ డోరా చిత్ర టాకీ పార్టు పూర్తి అరుు్యందన్నారు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటున్న డోరా చిత్ర ఆడియోను సింగిల్ ట్రాక్‌ను సోనీ మ్యూజిక్ సంస్థ డిజిటల్ విధానంలో వరుసగా ఒక్కో పాటను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోందని చెప్పారు. నయన ఇప్పటి వరకూ నటించనటువంటి పాత్రను ఇందులో చేస్తున్నారని చెప్పారు. ఈ చిత్రం ఫస్ట్‌లుక్ పోస్టర్ ఇటీవల విడుదల చేయగా మంచి అటెన్సన్ను క్రియేట్ చేసిందని, చిత్రం కచ్చితంగా మంచి విజయాన్ని సాధిస్తుందనే నమ్మకాన్ని దర్శకుడు వ్యక్తం చేస్తున్నారు. -
ఆ కారులో షికారు బేజారు!
సినిమాలో లీడ్ రోల్ చేసే ఆర్టిస్ట్ లుక్ ఎలా ఉంటుందో విడుదలకు ముందు చూపించడానికి ఫస్ట్ లుక్ విడుదల చేస్తుంటారు. ఫేవరెట్ స్టార్ లుక్ ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురు చూస్తారు. నయనతార అభిమానులు ఆమె టైటిల్ రోల్ చేస్తున్న తాజా చిత్రం ‘డోర’ ఫస్ట్ లుక్ కోసం అలానే ఎదురు చూశారు. లుక్ బయటికొచ్చింది. నయనతార వెనక్కి తిరిగి ఉన్న ఈ లుక్‌ని చూసి, ‘మేడమ్ కొంచెం టర్నింగ్ ఇచ్చుకుంటే బాగుండేది’ అని ఫ్యాన్స్ అనుకోవడం సహజం. కానీ, ఈ పోస్టర్లో నయనతార ముందు కారు, పైన మేఘాల్లో కనిపిస్తున్న ఫేసు చూసి, సమ్‌థింగ్ డిఫరెంట్ మూవీ చేస్తోందని ఆనందపడుతున్నారు. దాసు రామస్వామి దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో ఈ హార్రర్ మూవీ రూపొందుతోంది. తెలుగులో మల్కాపురం శివకుమార్ నిర్మిస్తున్నారు. నిర్మాత మాట్లాడుతూ - ‘‘ఇప్పటివరకూ వచ్చిన హార్రర్ చిత్రాలకు భిన్నంగా, వైవిధ్యమైన కథాంశంతో ఈ చిత్రం ఉంటుంది. ఊహించని మలుపులతో ఆసక్తికరంగా సాగుతుంది. నయనతార పాత్ర చాలా బాగుంటుంది’’ అన్నారు. ఈ చిత్రంలో ఓ కారు పాత్ర కీలకంగా ఉంటుంది. ఆ కారులో షికారు చేసేవాళ్లు బేజారైపోతారట. దానికీ, డోరాకీ లింకేంటి? అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్.