లోకం చుట్టిరానున్న నయన
చాలా కాలం క్రితం లోకం చుట్టిన వీరుడు చిత్రం రూపొందింది. ఎంజీఆర్ నటించిన ఈ చిత్రం తమిళంలో పాటు తెలుగులోనూ అనువాదమై విశేష ప్రేక్షకాదరణను పొందింది. అలా కథానాయకులే దేశదేశాలు చుట్టొచ్చిన కథా చిత్రాల్లో నటించారు. నటి నయనతార ఆ తరహాలో సాగే కథతో వెండి తెరపైకి రావడానికి రెడీ అవుతున్నారు. ప్రస్తుతం లేడీ సూపర్‌స్టార్‌గా వెలిగిపోతున్న నటి నయన.అన్భే నీఎంగే చిత్రంతో లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు శ్రీకారం చుట్టిన ఈ సంచలన తార ఆ చిత్రం ఆశించిన విజయం సాధించకపోయినా ఆ తరువాత వరుసగా అలాంటి కథా చిత్రాలే ఆమెను వరించడం విశేషం.
నయనతార నటించిన హారర్ కథా చిత్రం మాయ అనూహ్య విజయం సాధించడం కూడా ఇందుకు కారణంగా చెప్పవచ్చు.తాజాగా ఈ అమ్మడు నటిస్తున్న డోరా, అరం, కొలైయుధీర్ కాలం, ఇమైకా నోడిగళ్ మొదలగు చిత్రాలన్నీ హీరోయిన్ ప్రధాన ఇతివృత్తంతో తెరకెక్కుతున్న చిత్రాలే. మరో పక్క శివకారి్తకేయన్ లాంటి యువ నటులతోనూ నటిస్తున్న నయనతార తాజాగా దేశవిదేశాలు చుట్టొచ్చే వైవిధ్యభరిత కథా చిత్రంలో నటించడానికి రెడీ అవుతున్నారు.
ఫ్రాన్స్ లో జర్నలిస్ట్‌గా పని చేసే నయనతార చిన్నతనంలోనే తల్లిదండ్రుల జాడ తెలుసుకోవడానికి లోకం చుట్టిరావడానికి బయలు దేరతారట.అలా ఆమె ఫ్రాన్స్, జర్మనీ, పోలెండ్, మంగోలియా దేశాలు తిరిగి చివరికి చెన్నైకి వచ్చేలా కథ ఉంటుందట. దర్శకుడు మిష్కన్ శిషు్యడు కృష్ణమాచారి మెగాఫోన్ పట్టనున్న ఈ చిత్రాన్ని ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ నిర్మించనుంది.చిత్ర షూటింగ్ ఈ నెలాఖరున ప్రారంభం కానుందని కోలీవుడ్ వర్గాల సమాచారం.