సార్వత్రిక ఎన్నికలను కవర్ చేయకుండా తనను దేశం విడిచి వెళ్లమని భారత హోంశాఖ చెప్పినట్లు ఫ్రెంచ్ జర్నలిస్ట్ సెబాస్టియన్ ఫ్రాన్సిస్ చేసిన ఆరోపణలపై భారత్ శనివారం స్పందించింది. భారత దేశం వదలి వెళ్లాల్సి వచ్చిందని సెబాస్టియన్ చేసిన వ్యాఖ్యలు సరికాదని తెలిపింది. ఆయన వర్క్ పర్మిట్ రిన్యూవల్ పునరుద్ధరణ పరిశీలనలో ఉందని స్పష్టం చేసింది.
‘ఫ్రాన్సిస్ ‘ఓవర్సీస్ సిటిజన్‌షిప్ ఆఫ్ ఇండియా’ గుర్తింపు కార్డును కలిగి ఉన్నారు. అయితే జర్నలిజం కవరేజీకి సంబంధించి కొన్ని నిబంధనలకు అనుమతి కలిగి ఉండాలి. 2024 మేలో ఆయన వర్క్ పర్మిట్ రిన్యూవల్ కోసం మరోసారి దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఆయన దరఖాస్తును తాము పరిశీలిస్తున్నాం. ఇక దేశం బయట ఆయన చేసే ప్రయాణానికి సంబంధి పూర్తి హక్కులు ఉన్నాయి ’అని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జైశ్వాల్ తెలిపారు.
‘2024 సార్వత్రిక ఎన్నికల కవరేజీ చేయకుండా బలవంతంగా నేను భారత్ వెళ్లి పోవాల్సి వచ్చింది. దీంతో జూన్ 17న భారత్ నుంచి వెళ్లిపోయాను. మార్చి 7న హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ తన జర్నలిస్ట్ అనుమతిని పునరుద్దరించడానికి నిరాకరించింది. సాధారణ ఎన్నికలను కవర్ చేసేందుకు తిరస్కరించింది. 2011 నుంచి నేను జర్నలిస్ట్‌గా భారత్‌లో పనిచేస్తున్నా. నేను భారతీ మహిళను వివాహం చేసుకున్న కారణంగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల నా కుటుంబం ప్రభావితం అవుతుంది’ అని సెబాస్టియన్ ఫ్రాన్సిస్ ‘ఎక్స్’లో తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment