అంతా భయం.. భయం!
కారు దానంతటదే స్టార్ట్ అయిపోతుంది. మార్చకుండానే గేర్లు మారిపోతాయి. ఆన్ చేయకుండానే సిగ్నల్ లైట్స్ వెలుగుతాయి. ఓ మనిషి కంగారుపడటానికి ఇంతకు మించి ఏం కావాలి? ఇంతకీ ఇదంతా చేసేది ఎవరు? అంటే.. ‘ఆత్మ’. ఆ ఆత్మ కారులోనే ఉంటుందా? బయట ఉంటుందా? హీరోయిన్‌కు, ఆత్మపగకు ఉన్న లింక్ ఏంటి? ఈ ప్రశ్నలన్నింటికి సమాధానం తెలసుకోవాలంటే ఈ నెల 31 న విడుదలవుతున్న ‘డోర’ చిత్రం చూడాలంటు న్నారు దర్శకుడు దాస్ రామసామి.
తెలుగు, తమిళ భాషల్లో నయనతార టైటిల్ రోల్‌లో రూపొందిన ఈ చిత్రాన్ని సుర„ ఎంటర్‌టైన్‌మెంట్ మీడియా పతాకంపై మాల్కాపురం శివకుమర్ తెలుగులో విడుదల చేయ నున్నారు. ఈ సందర్భంగా శివకుమార్ మాట్లాడుతూ– ‘‘ కారులో దెయ్యం అనే థ్రిల్లింగ్ కాన్సెప్ట్‌తో సినిమా నిర్మించాం. స్క్రీన్‌ప్లే చిత్రానికి హైలెట్. హారర్ సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం ఇది. ఇటీవల విడుదలైన పాటలకు మంచి స్పందన లభిస్తోంది’’ అన్నారు.