
జూనియర్ ఎన్టీఆర్- కొరటాల శివ కాంబోలో వచ్చిన మాస్ యాక్షన్ చిత్రం దేవర పార్ట్-1. గతేడాది దసరా ముందు థియేటర్లలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్‌హిట్‌గా నిలిచింది. ఈ మూవీతో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. సైఫ్ అలీ ఖాన్ కీలక పాత్ర పోషించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది.
అయితే ఈ సినిమాలోని ఓ సాంగ్ మాత్రం అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ మూవీలోని 'చుట్టమల్లే చుట్టేస్తావే' సాంగ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ఈ పాటకు స్టెప్పులేస్తూ సందడి చేశారు. ఈ పాటతో ప్రతి ఒక్కరూ మీమ్స్ కూడా క్రియేట్ చేశారు. అంతలా ఆడియన్స్‌కు బాగా కనెక్ట్ అయింది ఈ సాంగ్.
అయితే తాజాగా ఆ పాటను వింటూ నయనతార కవలలు ఎంజాయ్ చేస్తూ కనిపించారు. లేడీ సూపర్ స్టార్ నయన్ దంపతులు తమ ఇద్దరు పిల్లలతో కలిసి కారులో వెళ్తూ చుట్టమల్లే సాంగ్ తమిళ వర్షన్‌ను ఆస్వాదించారు. దీనికి సంబంధించిన వీడియోను నయనతార భర్త విఘ్నేశ్ శివన్ తన ఇన్‌స్టాలో షేర్ చేశారు. ఇది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతమందించారు.
కాగా.. నయనతార ప్రస్తుతం టెస్ట్ అనే మూవీలో కనిపించనుంది. ఈ చిత్రం నేరుగా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. త్వరలోనే అధికారికంగా విడుదల తేదీని ప్రకటించనున్నారు మేకర్స్. మరోవైపు విఘ్నేష్ శివన్.. ప్రదీప్ రంగనాథన్, కృతి శెట్టితో కలిసి లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment