
జూనియర్ ఎన్టీఆర్- కొరటాల శివ కాంబోలో వచ్చి యాక్షన్ చిత్రం 'దేవర'. ఈ మాస్ యాక్షన్ మూవీ సెప్టెంబర్ 27న థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. విడుదలైన కొద్ది రోజుల్లోనే రూ.500 కోట్లకు పైగానే వసూళ్లు సాధించింది. ఈ మూవీ రిలీజై నెల రోజులైనప్పటికీ థియేటర్లలో దూసుకెళ్తోంది.
తాజాగా ఈ మూవీ నుంచి ఫేవరేట్ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. 'దూకే ధైర్యమా జాగ్రత్త.. దేవర ముంగిట నువ్వెంత' అంటూ సాగే ఫియర్ సాంగ్ ఫుల్ వీడియోను రిలీజ్ చేశారు. ఇప్పటికే విడుదలైన పాటలకు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. మీరు కూడా దేవర ఫియర్ ఫుల్ వీడియో సాంగ్‌ను చూసి ఎంజాయ్ చేయండి.
The thumping #FearSong Video is out now! 🔥https://t.co/ifDty3vMEi
Let the fear grip every nerve and ignite the madness ❤️🔥#Devara #BlockbusterDevara— Devara (@DevaraMovie) October 29, 2024