
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్- కొరటాల శివ కాంబోలో వచ్చిన మోస్ట్ అవైటేడ్ చిత్రం దేవర పార్ట్-1. అభిమానుల భారీ అంచనాల మధ్య సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజైంది. మొదటి రోజే బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. తొలివారంలో ఏకంగా రూ.405 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. దీంతో దేవర చిత్రబృందం సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ మూవీ టీం సభ్యులంతా తమ అభిప్రాయాలను పంచుకున్నారు.
అయితే దేవర చిత్రంలో ఫ్యాన్స్‌ను నిరాశకు గురిచేసిన విషయం ఆ ఒక్కటే. మాస్ సాంగ్ దావూది సాంగ్ థియేటర్లో రాకపోవడంతో డైహార్డ్ ఫ్యాన్స్ తెగ ఫీలయ్యారు. దీంతో మేకర్స్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆ సాంగ్‌ను యాడ్ చేసినట్లు పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ రోజు నుంచే బిగ్ స్క్రీన్‌పై దాపూది సాంగ్ చూసేయండి అంటూ ట్విటర్‌లో పోస్ట్ చేశారు. దీంతో యంగ్ టైగర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.
కాగా.. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ జాన్వీకపూర్ హీరోయిన్‌గా నటించింది. నటుడు సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో మెప్పించారు. ఇందులో ప్రకాశ్ రాజ్, శ్రీకాంత్ కీలక పాత్రలు పోషించారు. కాగా.. దేవర మూవీకి అనిరుధ్ రవిచందర్ సంగీతమందించారు.
To all the fans who have been waiting to get into the KILI KILIYE mood 🕺🏻
Enjoy #Daavudi at your nearest cinemas now! 🔥#Devara #BlockbusterDevara pic.twitter.com/MIxMveHW8b— Devara (@DevaraMovie) October 4, 2024
Comments
Please login to add a commentAdd a comment