దేవర మూడో సాంగ్‌: స్టెప్పులతో అదరగొట్టిన తారక్‌ | Devara Movie: Daavudi Video Song Out Now | Sakshi
Sakshi News home page

Devara Movie: దావూదీ వీడియో సాంగ్‌ చూశారా?

Published Wed, Sep 4 2024 5:41 PM | Last Updated on Wed, Sep 4 2024 7:34 PM

Devara Movie: Daavudi Video Song Out Now

జూనియర్‌ ఎన్టీఆర్‌ హీరోగా నటిస్తున్న లేటెస్ట్‌ మూవీ దేవర. ఈ చిత్రం గురించి ఏ చిన్న అప్‌డేట్‌ వచ్చినా ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుషీ అవుతున్నారు. ఇప్పటికే దేవర నుంచి రిలీజైన రెండు పాటలు ‘ఫియర్ సాంగ్..’, ‘చుట్టమల్లె..’ యూట్యూబ్‌లో సంచలనం సృష్టిస్తున్నాయి. తారక్‌- జాన్వీ కపూర్‌ల జోడీని చూసి అభిమానులు ముచ్చటపడిపోతున్నారు. 

మూడో పాట..
తాజాగా ఈ సినిమా నుంచి మూడో పాట వచ్చేసింది. దావూదీ.. అంటూ సాగే ఈ పాటలో ఎన్టీఆర్‌ డ్యాన్స్‌తో అదరగొట్టేశాడు. రామజోగ‌య్య శాస్త్రి తెలుగులో రాసిన ఈ పాట‌ను త‌మిళంలో విఘ్నేష్ శివ‌న్‌, హిందీలో కౌస‌ర్ మునీర్, క‌న్న‌డ‌లో వ‌ర‌ద‌రాజ్ చిక్‌బ‌ల్లాపుర‌, మ‌ల‌యాళంలో మాన్‌కొంబు గోపాల‌కృష్ణ రాశారు. 

ఏ భాషలో ఎవరు పాడారంటే?
పాడిన వారి విష‌యానికి వ‌స్తే న‌క‌ష్ అజీజ్‌, ఆకాశ తెలుగు, హిందీ, క‌న్న‌డ భాష‌ల్లో ఆల‌పించారు. న‌క‌ష్ అజీజ్‌, ర‌మ్యా బెహ్రా త‌మిళ‌, మ‌ల‌యాళంలో పాడారు. కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న ఈ చిత్రాన్ని నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ స‌మ‌ర్ప‌ణ‌లో ఎన్టీఆర్ ఆర్ట్స్‌, యువ సుధ ఆర్ట్స్ ప‌తాకాల‌పై మిక్కిలినేని సుధాక‌ర్‌, హ‌రికృష్ణ‌.కె నిర్మిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ కీల‌క పాత్ర‌లో అల‌రించ‌బోతున్నారు. ‘దేవర: పార్ట్ 1’ సెప్టెంబర్ 27న విడుదల కానుంది.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement