ఆ.. చుట్టమల్లే పాట వీడియో సాంగ్‌ వచ్చేసింది.. | Devara Movie: Chuttamalle Full Video Song Out Now | Sakshi
Sakshi News home page

Devara Movie: చుట్టమల్లే వీడియో సాంగ్‌.. రొమాంటిక్‌ మెలోడీకి మతి పోవాల్సిందే!

Published Sat, Oct 26 2024 6:51 PM | Last Updated on Sat, Oct 26 2024 7:13 PM

Devara Movie: Chuttamalle Full Video Song Out Now

జూనియర్‌ ఎన్టీఆర్‌ 'దేవర' సినిమాలో బ్లాక్‌బస్టర్‌ అయిన సాంగ్స్‌లో చుట్టమల్లే పాట ముందు వరుసలో ఉంటుంది. ఈ పాటకు థియేటర్లు సైతం ఊ కొడుతూ ఊగిపోయాయి. అంతలా యూత్‌ను పిచ్చెక్కించిన ఈ పాట ఫుల్‌ వీడియోను శనివారం రిలీజ్‌ చేశారు. విడుదలైన నిమిషాల్లోనే మిలియన్‌ వ్యూస్‌తో దూసుకుపోతోంది.

ఈ పాటలో తారక్‌, జాన్వీ కపూర్‌ల కెమిస్ట్రీ అదిరిపోయింది. అనిరుధ్‌ రవిచందర్‌ సంగీతం అందించిన ఈ పాటకు రామజోగయ్యశాస్త్రి లిరిక్స్‌ అందించాడు. శిల్పరావు గాత్రం ఈ రొమాంటిక్‌ మెలోడీని మరో లెవల్‌కు తీసుకెళ్లింది. దేవర సినిమా విషయానికి వస్తే సెప్టెంబర్‌ 27న విడుదలైన ఈ మూవీ రూ.500 కోట్లకు పైగా వసూలు చేసింది. నందమూరి కల్యాణ్‌రామ్‌ సమర్పణలో మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ .కె నిర్మించారు.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement