జూనియర్ ఎన్టీఆర్- కొరటాల శివ కాంబోలో వచ్చిన యాక్షన్ చిత్రం దేవర. గత నెల 27న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. ఇప్పటికే వారం రోజుల్లోనే రూ.400 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. దేవర బ్లాక్‌బస్టర్ హిట్ కావడంతో టీమ్ అంతా సక్సెస్ సెలబ్రేషన్స్ చేసుకున్నారు.
తాజాగా డైరెక్టర్ కొరటాల శివ, జూనియర్ ఎన్టీఆర్.. యాంకర్ సుమతో ఇంటర్వ్యూరు హాజరయ్యారు. ఈ సందర్భంగా ‘బ్లాక్‌బస్టర్ జర్నీ ఆఫ్ దేవర’ పేరుతో ఎన్టీఆర్, కొరటాల శివ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన దేవరలోని దావూది సాంగ్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. థియేటర్ వర్షన్‌లో దావూది సాంగ్ పెట్టకపోవడంపై క్లారిటీ ఇచ్చారు.
'ఒక పాటను అదనంగా జత చేయాలంటే సెన్సార్ అనుమతులు తప్పనిసరి. మనం ఇష్టం వచ్చినట్లు యాడ్ చేయలేం. ఐదు భాషల్లో పెట్టాలంటే సమయం పడుతుంది. దావూది పాట తీసేయడానికి మేమంతా కలిసి తీసుకున్న నిర్ణయం. మీరు సినిమా చూస్తు ఉంటే కథ సీరియస్‌గా మొదలైపోయింది. ఆ సమయంలో సాంగ్ పెడితే బ్రేక్‌లా అనిపించింది. కథను చెప్పేటప్పుడు మనం బ్రేక్ ఇవ్వకూడదు. కథను చెప్పే ప్రయత్నంలో బయటకు తీసుకెళ్లడం సరికాదని భావించాం. అక్కడ దావుది సాంగ్ పెడితే బ్రేక్ ఇచ్చినట్లు అవుతుంది. మామూలుగా ఎన్టీఆర్ డ్యాన్స్ చేస్తే బాగుంటుందని అందరికీ ఉంటుంది. సినిమా కొన్ని రోజుల తర్వాత యాడ్ చేయాలని నిర్ణయించాం' అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment