koratal siva
-
'దావూది సాంగ్ ఎందుకు పెట్టలేదంటే'.. అసలు కారణం చెప్పేసిన ఎన్టీఆర్
జూనియర్ ఎన్టీఆర్- కొరటాల శివ కాంబోలో వచ్చిన యాక్షన్ చిత్రం దేవర. గత నెల 27న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. ఇప్పటికే వారం రోజుల్లోనే రూ.400 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. దేవర బ్లాక్‌బస్టర్ హిట్ కావడంతో టీమ్ అంతా సక్సెస్ సెలబ్రేషన్స్ చేసుకున్నారు.తాజాగా డైరెక్టర్ కొరటాల శివ, జూనియర్ ఎన్టీఆర్.. యాంకర్ సుమతో ఇంటర్వ్యూరు హాజరయ్యారు. ఈ సందర్భంగా ‘బ్లాక్‌బస్టర్ జర్నీ ఆఫ్ దేవర’ పేరుతో ఎన్టీఆర్, కొరటాల శివ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన దేవరలోని దావూది సాంగ్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. థియేటర్ వర్షన్లో దావూది సాంగ్ పెట్టకపోవడంపై క్లారిటీ ఇచ్చారు.'ఒక పాటను అదనంగా జత చేయాలంటే సెన్సార్ అనుమతులు తప్పనిసరి. మనం ఇష్టం వచ్చినట్లు యాడ్ చేయలేం. ఐదు భాషల్లో పెట్టాలంటే సమయం పడుతుంది. దావూది పాట తీసేయడానికి మేమంతా కలిసి తీసుకున్న నిర్ణయం. మీరు సినిమా చూస్తు ఉంటే కథ సీరియస్‌గా మొదలైపోయింది. ఆ సమయంలో సాంగ్ పెడితే బ్రేక్‌లా అనిపించింది. కథను చెప్పేటప్పుడు మనం బ్రేక్ ఇవ్వకూడదు. కథను చెప్పే ప్రయత్నంలో బయటకు తీసుకెళ్లడం సరికాదని భావించాం. అక్కడ దావుది సాంగ్ పెడితే బ్రేక్ ఇచ్చినట్లు అవుతుంది. మామూలుగా ఎన్టీఆర్ డ్యాన్స్ చేస్తే బాగుంటుందని అందరికీ ఉంటుంది. సినిమా కొన్ని రోజుల తర్వాత యాడ్ చేయాలని నిర్ణయించాం' అని అన్నారు. -
'నా తమ్ముడు, మా నాన్న' అంటూ తారక్‌పై కల్యాణ్ రామ్ ప్రశంసలు
ఎన్టీఆర్- కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం 'దేవర'. తాజాగా విడుదలైన ఈ సినిమా తారక్ ఫ్యాన్స్‌ను మెప్పిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద హౌస్‌ఫుల్ కలెక్షన్స్‌తో దేవర దూసుకుపోతున్నాడు. సినిమాకు మంచి ఆదరణ రావడంతో తాజాగా చిత్ యూనిట్ ప్రెస్‌మీట్ నిర్వహించింది. ఈ క్రమంలో దేవరను ఆదరిస్తోన్న ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపింది. చిత్ర సమర్పకులుగా ఉన్న కల్యాణ్ రామ్ దేవర గురించి ఇలా చెప్పుకొచ్చారు.దేవర సినిమాను ఆదరిస్తున్న వారందరికీ నా ధన్యవాదాలు. నా తమ్ముడు, మా నాన్న (ఎన్టీఆర్) యాక్టింగ్‌తో అదరగొట్టేశాడు. దేవరలో తన రోల్ వన్ మ్యాన్ షో అని చెప్పగలను. ఎంతో కష్టపడి మాకు ఇంతటి భారీ విజయాన్ని అందించిన చిత్ర యూనిట్‌కు కృతజ్ఞతలు.' అని కల్యాణ్ రామ్ చెప్పారు.అనంతరం చిత్ర దర్శకులు కొరటాల శివ మాట్లాడుతూ.. 'దేవరతో మాకు ఇంత పెద్ద హిట్ ఇచ్చిన ప్రేక్షకులకు, అభిమానులకు ధన్యవాదాలు. సినిమా ఫస్ట్ షో పడిన సమయం నుంచి నాకు వరసుగా కాల్స్ వస్తూనే ఉన్నాయి. దేవర సినిమానే నా ఉత్తమ సినిమా అంటూ వారు అభినందిస్తుంటే చాలా సంతోషంగా ఉంది. చిత్ర యూనిట్ కష్టం వల్లే దేవర సినిమాకు ఇలాంటి ప్రశంసలు దక్కుతున్నాయి.' అని ఆయన అన్నారు.నైజాంలో ‘దేవర’ చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్ చేసిన దిల్‌రాజు కూడా ఈ సక్సెస్ మీట్లో పాల్గొన్నారు. సినిమాలో ఆయన నటన మరోస్థాయిలో ఉంటుంది. 'వన్ మ్యాన్ షోతో సినిమాను తారక్ నడిపించారు. ప్రపంచదేశాలు కూడా నేడు తెలుగు హీరోల వైపు చూస్తున్నాయి. మన తెలుగు సినిమాలు కూడా ఇప్పుడు అన్ని దేశాల్లో రన్ అవుతున్నాయి. దీనంతటికి కారణమైన దర్శకులు, హీరోలకు నేను కృతజ్ఞతలు చెబుతుతున్నా.' అని దిల్ రాజు అన్నారు. -
కొరటాల కమ్ బ్యాక్ కు కౌంట్ డౌన్ మొదలైందా..?
-
జూ ఎన్ టిఆర్ పై హ్రితిక్ రోషన్ ట్వీట్ కి షైక్ అవుతున్న హాలీవుడ్
-
ఎన్టీఆర్ సరసన మరో హీరోయిన్ పేరు.. ఈ జోడీ కుదిరేనా ?
‘జనతా గ్యారేజ్’ (2016) వంటి హిట్ చిత్రం తర్వాత హీరో ఎన్టీఆర్, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్లో మరో సినిమా తెరకెక్కనుంది. మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ నిర్మించనున్న ఈ చిత్రం షూటింగ్ జూలైలో స్టార్ట్ కానుందని తెలిసింది. అయితే ఈ చిత్రంలో హీరోయిన్ ఎవరు? అన్నది ప్రస్తుతం ఇండస్ట్రీలో ఓ హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటి వరకు రష్మిక మందన్నాతోపాటు బాలీవుడ్ ముద్దుగుమ్మలు ఆలియా భట్, జాన్వీ కపూర్, దిశా పటానీ పేర్లు తెరపైకి వచ్చాయి. ఇప్పుడు తాజాగా బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే పేరు వినిపిస్తోంది. మరి.. ఎన్టీఆర్‌తో జోడీ కట్టే చాన్స్ అనన్యకు దక్కుతుందా? అనేది తెలియాలంటే వేచి చూడాలి. ఈ సంగతి ఇలా ఉంచితే.. విజయ్ దేవరకొండ హీరోగా డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘లైగర్’. ఇందులో హీరోయిన్గా నటిస్తోంది అనన్య పాండే. ఈ చిత్రం ద్వారా అనన్య పాండే టాలీవుడ్‌కు హీరోయిన్గా పరిచయమవుతున్నారు. ఆగస్టు 25న ఈ సినిమా రిలీజ్ కానుంది. చదవండి: ఎన్టీఆర్‌కు విలన్‌గా కమల్ హాసన్ !.. ఇదెక్కడి మాస్ ఐడియా నీల్ మావా.. నన్ను క్షమించండి..అభిమానులకు ఎన్టీఆర్ ఎమోషనల్ లేఖ var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1611343008.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
మహేష్ కొత్త సినిమాలోనూ అదే ఫార్ములా
స్పైడర్ సినిమాతో మరోసారి నిరాశపరిచిన సూపర్ స్టార్ మహేష్ బాబు, ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో భరత్ అనే నేను సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. పొలిటికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ సినిమాలో మహేష్ ముఖ్యమంత్రి కనిపించనున్నాడన్న ప్రచారం జరుగుతోంది. కొరటాల శివ తన ప్రతీ సినిమాలోనూ ఓ ఆసక్తికరమైన కాన్సెప్ట్‌తో ఫైట్ ఉండేలా ప్లాన్ చేస్తాడు. అదే తరహాలో భరత్ అనే నేను కోసం కూడా ఓ ఫైట్ ను డిజైన్ చేశాడట. మిర్చి సినిమాలో వానలో ఫైట్, శ్రీమంతుడు సినిమా కోసం మామిడి తోటలో ఫైట్, జనతా గ్యారేజ్‌లో గవర్నమెంట్ ఆఫీస్‌లో ఫైట్ సీన్స్ ఆ సినిమాలకే హైలెట్ గా నిలిచాయి. అదే తరహాలో భరత్ అనే నేను సినిమా కోసం హోలీ వేడుకల్లో పోరాట సన్నివేశాలు ప్లాన్ చేశాడట. మహేష్ సరసన కైరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను 2018 వేసవిలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. -
వేలంలో భారీ ధర పలికిన ఎన్టీఆర్ బైక్
సినిమాల్లో స్టార్స్ వాడిన వస్తువులకు యమా డిమాండ్ ఉంటుంది. అందుకే భారీ హైప్ క్రియేట్ చేసిన చిత్రాల్లో స్టార్ వాడిన దుస్తులు, బైక్స్ లాంటివి వేలానికి పెడుతుంటారు. అలా వచ్చిన సొమ్మును సామాజిక కార్యక్రమాలకు వినియోగిస్తుంటారు. అదే బాటలో జనతా గ్యారేజ్ సినిమాలో ఎన్టీఆర్ వాడిన బైక్ ను వేలం వేశారు. ఈ బైక్ ను జూనియర్ వీరాభిమాని రాజ్ కుమార్ రెడ్డి 10 లక్షల రూపాయలు చెల్లించి సొంతం చేసుకున్నారు. మంగళవారం జరిగిన కార్యక్రమంలో విజేతకు హీరో ఎన్టీఆర్, దర్శకుడు కొరటాల శివ చేతుల మీదుగా బైక్ ను అందజేశారు. ఈ వేలం ద్వారా వచ్చిన సొమ్మును బసవతారక రామారావు చారిటబుల్ ట్రస్ట్ కు అందజేయనున్నారు. జనతా గ్యారేజ సక్సెస్ తరువాత గ్యాప్ తీసుకున్న జూనియర్ ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ త్రిపాత్రభినయం చేస్తున్నాడన్న టాక్ వినిపిస్తోంది. -
కొత్త హీరో కోసం ముగ్గురు స్టార్ డైరెక్టర్లు
ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో భారీ హైప్ క్రియేట్ చేస్తున్న సినిమా జాగ్వర్. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి తనయుడు నిఖిల్ కుమార్‌ను హీరోగా పరిచేయం చేస్తూ ఆయనే స్వయంగా నిర్మిస్తున్న ఈ సినిమా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. దాదాపు 75 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కించినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఆడియో రిలీజ్ నుంచి ప్రమోషన్ వరకు ప్రతీ విషయంలోనూ అదే భారీతనాన్ని చూపిస్తున్నారు. అయితే తొలి సినిమా రిలీజ్ కాక ముందే నిఖిల్ కుమార్ రెండో సినిమా కోసం ముగ్గురు స్టార్ డైరెక్టర్లను లైన్లో పెట్టాడు. ఈ విషయాన్ని నిఖిల్ తండ్రి జాగ్వర్ నిర్మాత కుమారస్వామి స్వయంగా ప్రకటించారు. నిఖిల్ రెండో సినిమాను త్రివిక్రమ్ శ్రీనివాస్, కొరటాల శివ, పూరి జగన్నాథ్లలో ఒకరు డైరెక్ట్ చేసే అవకాశం ఉంది. నిఖిల్ తొలి సినిమాను పూరినే డైరెక్ట్ చేయాల్సి ఉండగా కథ సెట్ కాకపోవటంతో విరమించుకున్నారు. జాగ్వర్ రిలీజ్ తరువాత నిఖిల్ నెక్ట్స్ సినిమాకు దర్శకుడెవరో ప్రకటించే అవకాశం ఉంది. -
ప్రకృతిని, మనిషిని ప్రేమించమనే 'జనతా గ్యారేజ్'
మిర్చి, శ్రీమంతుడు లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాలను అందించిన కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన మూడో సినిమా జనతా గ్యారేజ్. వరుస హిట్స్‌తో సూపర్ ఫాంలో ఉన్న ఎన్టీఆర్ ఈ సినిమాతో రికార్డ్‌లు తిరగరాయలని ప్లాన్ చేస్తున్నాడు. అందుకు తగ్గట్టుగా భారీ కాస్టింగ్‌తో ఇంట్రస్టింగ్ స్టోరి లైన్‌తో తెరకెక్కిన జనతా గ్యారేజ్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ టీజర్ యూట్యూబ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేయగా.. తాజాగా ఆడియోతో పాటు థియేట్రికల్ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఇప్పటికే భారీ హైప్ క్రియేట్ కావటంతో ఆ అంచనాలను కంట్రోల్ చేస్తూ.. రూపొందించిన ఈ ట్రైలర్లో దాదాపు సినిమా స్టోరి లైన్‌ను రివీల్ చేశారు. ఎన్టీఆర్ సరసన సమంత, నిత్యా మీనన్ లు హీరోయిన్లుగా నటిస్తుండగా మళయాల సూపర్ స్టార్ మోహన్ లాల్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. ప్రకృతిని ప్రేమించే ఆనంద్ (ఎన్టీఆర్), మనుషుల్ని ప్రేమించి పెద్ద మనిషితో కలిసి సమాజం కోసం ఎలా పాటు పడ్డారన్నదే జనతా గ్యారేజ్ కథగా కనిపిస్తోంది. కొంత కాలంగా మాస్ మూసను పక్కన పెట్టి క్లాస్‌గా కనిపిస్తున్న ఎన్టీఆర్ ఈ సినిమాలో కూడా స్టైలిష్ గానే కనిపిస్తున్నాడు. అయితే మాస్ ఆడియన్స్ తన నుంచి ఆశించే డాన్స్‌లు.. పంచ్ డైలాగ్‌లు మాత్రం బాగానే ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఈ సినిమాతో ఎన్టీఆర్, కొరటాల శివలు ఇద్దరు హ్యట్రిక్ మీద కన్నేశారు. -
జనతా గ్యారేజ్ రిలీజ్‌పై అనుమానాలు
ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ జనతా గ్యారేజ్. ఎన్టీఆర్ మార్క్ మాస్ ఎలిమెంట్స్‌తో పాటు భారీ స్టార్ కాస్ట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా రిలీజ్‌పై మరోసారి అనుమానాలు కలుగుతున్నాయి. ముందుగా జనతా గ్యారేజ్‌ను ఆగస్టు 12 రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. అనుకున్న ప్రకారం శరవేగంగా షూటింగ్ చేసినా.. టార్గెట్‌ను అందుకోలేమేమో అన్న అనుమానంతో వాయిదా వేయక తప్పలేదు. అందుకే మూడు వారాలు ఆలస్యంగా సెప్టెంబర్ 2 జనతా గ్యారేజ్ రిలీజ్‌కు ప్లాన్ చేశారు చిత్రయూనిట్. అయితే ఆ రోజు రిలీజ్ విషయంలో కూడా చిత్రయూనిట్ ఆలోచనలో పడ్డారు. ట్రేడ్ యూనియన్స్‌తో పాటు లెఫ్ట్ పార్టీలు సయుక్తంగా సెప్టెంబర్ 2న భారత్ బంద్‌కు పిలుపునిచ్చాయి. దీంతో బంద్ ప్రభావం సినిమా రిలీజ్‌పై పడే అవకాశం ఉందన్న ఆలోచనలో ఉన్నారు యూనిట్. తెలుగుతో పాటు మళయాలంలో కూడా భారీ రిలీజ్‌కు ప్లాన్ చేయటంతో రికార్డ్ ఓపెనింగ్స్ టార్గెట్ చేసిన యూనిట్ సభ్యులకు ఇప్పుడు బంద్ భయం పట్టుకుందట. అందుకే ఒక రోజు ఆలస్యం సినిమాను రిలీజ్ చేయాలా..? లేక ఒక రోజు ముందుగానే రిలీజ్ చేస్తే బాగుంటుందా..? అన్న ఆలోచన చేస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతానికి పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న జనతా గ్యారేజ్ యూనిట్ త్వరలోనే సినిమా రిలీజ్‌పై క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది.