వేలంలో భారీ ధర పలికిన ఎన్టీఆర్ బైక్ | Ntr Janatha Garage Bike Charity Auction | Sakshi

వేలంలో భారీ ధర పలికిన ఎన్టీఆర్ బైక్

Mar 8 2017 10:08 AM | Updated on Sep 5 2017 5:33 AM

వేలంలో భారీ ధర పలికిన ఎన్టీఆర్ బైక్

వేలంలో భారీ ధర పలికిన ఎన్టీఆర్ బైక్

సినిమాల్లో స్టార్స్ వాడిన వస్తువులకు యమా డిమాండ్ ఉంటుంది. అందుకే భారీ హైప్ క్రియేట్ చేసిన చిత్రాల్లో స్టార్ వాడిన దుస్తులు,

సినిమాల్లో స్టార్స్ వాడిన వస్తువులకు యమా డిమాండ్ ఉంటుంది. అందుకే భారీ హైప్ క్రియేట్ చేసిన చిత్రాల్లో స్టార్ వాడిన దుస్తులు, బైక్స్ లాంటివి వేలానికి పెడుతుంటారు. అలా వచ్చిన సొమ్మును సామాజిక కార్యక్రమాలకు వినియోగిస్తుంటారు. అదే బాటలో జనతా గ్యారేజ్ సినిమాలో ఎన్టీఆర్ వాడిన బైక్ ను వేలం వేశారు. ఈ బైక్ ను జూనియర్ వీరాభిమాని రాజ్ కుమార్ రెడ్డి 10 లక్షల రూపాయలు చెల్లించి సొంతం చేసుకున్నారు.

మంగళవారం జరిగిన కార్యక్రమంలో విజేతకు హీరో ఎన్టీఆర్, దర్శకుడు కొరటాల శివ చేతుల మీదుగా బైక్ ను అందజేశారు. ఈ వేలం ద్వారా వచ్చిన సొమ్మును బసవతారక రామారావు చారిటబుల్ ట్రస్ట్ కు అందజేయనున్నారు. జనతా గ్యారేజ సక్సెస్ తరువాత గ్యాప్ తీసుకున్న జూనియర్ ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ త్రిపాత్రభినయం చేస్తున్నాడన్న టాక్ వినిపిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement