
పదం పలికింది – పాట నిలిచింది
సరిగ్గా చూడగలిగితే, సమస్త ప్రపంచం నీలోనే ఉందంటుంది భారతీయ చింతన. దాన్ని నిజం చేస్తూ, సమస్త ప్రకృతినీ మనిషికి అన్వయిస్తూ ‘జనతా గ్యారేజ్’ కోసం పాట రాశారు రామజోగయ్య శాస్త్రి.
‘ప్రణామం ప్రణామం ప్రణామం
ప్రభాత సూర్యుడికి ప్రణామం
ప్రణామం ప్రణామం ప్రణామం
సమస్త ప్రకృతికి ప్రణామం’ అని సాగే ఈ గీతంలో–
‘మన చిరునవ్వులే పూలు
నిట్టూర్పులు తడి మేఘాలు
హృదయమే గగనం రుధిరమే సంద్రం ఆశే పచ్చదనం
మారే ఋతువుల వర్ణం
మన మనసుల భావోద్వేగం
సరిగా చూస్తే ప్రకృతి మొత్తం మనలో ప్రతిబింబం’ అన్నారాయన.
దీనికి సంగీతం దేవీశ్రీప్రసాద్. గాయకుడు శంకర్ మహదేవన్. 2016లో వచ్చిన ఈ చిత్రానికి దర్శకుడు కొరటాల శివ. ఎన్టీఆర్ కథానాయకుడు.
Comments
Please login to add a commentAdd a comment