సింగం దర్శకుడితో ఎన్టీఆర్.? | Ntr next movie with singam hari | Sakshi
Sakshi News home page

సింగం దర్శకుడితో ఎన్టీఆర్.?

Published Tue, Nov 15 2016 4:10 PM | Last Updated on Mon, Sep 4 2017 8:10 PM

సింగం దర్శకుడితో ఎన్టీఆర్.?

సింగం దర్శకుడితో ఎన్టీఆర్.?

జనతా గ్యారేజ్ సినిమాతో కెరీర్లోనే బిగెస్ట్ హిట్ కొట్టిన ఎన్టీఆర్, నెక్ట్స్ సినిమా విషయంలో మాత్రం ఎటూ తేల్చుకోలేకపోతున్నాడు. వరుసగా డిఫరెంట్ మూవీస్ చేస్తూ వస్తున్న జూనియర్, ఈ సారి ప్రయోగాలను పక్కన పెట్టి పక్కా మాస్ కమర్షియల్ సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడు. అందుకు తగ్గ కథా కథనాలతో మాస్ కథలను పర్ఫెక్ట్గా డీల్ చేసే దర్శకుడి కోసం ఎదురుచూస్తున్నాడు.

ఇప్పటికే త్రివిక్రమ్ శ్రీనివాస్, వివి వినాయక్, అనీల్ రావిపూడి లాంటి దర్శకుల పేర్లు వినిపించగా తాజాగా మరో ఆసక్తికరమైన పేరు వినిపిస్తోంది. తమిళనాట మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్గా నిలిచిన హరి దర్శకత్వంలో ఎన్టీఆర్ తన నెక్ట్స్ సినిమా చేయబోతున్నాడట. సింగం సీరీస్తో తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడైన హరి, సింగం 3  రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఈ సినిమా తరువాత సామి సీక్వల్ను ప్లాన్ చేసిన హరి, ఎన్టీఆర్ కు కూడా ఓ కథ వినిపించాడన్న టాక్ వినిపిస్తోంది. మరి నిజంగానే తమిళ దర్శకుడితో ఎన్టీఆర్ సినిమా చేస్తున్నాడో లేదో తెలియాలంటే మాత్రం అఫీషియల్ ఎనౌన్స్మెంట్ వరకు వెయిట్ చేయాల్సిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement