singam
-
నాటి రామాయణం నేటి పాత్రలతో.....
ఓటీటీలో ఇది చూడొచ్చు అనే ప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న వాటిలో హిందీ చిత్రం సింగమ్ ఎగైన్ ఒకటి. ఈ చిత్రం గురించి తెలుసుకుందాం.మన ఇతిహాసాలలో గొప్ప విలువలతో కూడుకున్న కథ రామాయణం. నాటి రామాయణాన్ని నేటి నేటివిటీతో ప్రస్తుత ప్రముఖ నటీనటులతో మళ్లీ మన ముందుకు తీసుకు వచ్చే ప్రయత్నం చేశారు బాలీవుడ్ దర్శకుడు రోహిత్ శెట్టి. ఇదే ప్రయత్నాన్ని గతంలో చాలా మందే చేసినా యాక్షన్ నేపథ్యంలో వచ్చిన ‘సింగమ్’ సిరీస్ చిత్రానికి ఈ తరహా ప్రయోగం చేయడం మొదటిసారి. అందులోనూ బాలీవుడ్లో భారీ తారాగణంతో ఇలాంటి అంశంతో కూడిన కథ తీయడమనేది నిజంగా సాహసమనే చెప్పాలి. ముందుగా ‘సింగమ్’ సిరీస్ గురించి చెప్పుకుందాం. ఈ సిరీస్‌లో వచ్చిన మూడో చిత్రం ‘సింగమ్ ఎగైన్’. సిరీస్‌లో ఈ భాగం ప్రేక్షకుల ముందు రావడా నికి దాదాపు పదేళ్లు పట్టింది. 2011లో ‘సింగమ్’ మొదటి చిత్రం రాగా 2014లో రెండో భాగంగా ‘సింగమ్ రిటర్న్స్’ విడుదలైంది. ఆ తరువాత మూడో భాగం 2024లో ‘సింగమ్ ఎగైన్’గా వచ్చింది.అన్ని సిరీస్‌లలో కథానాయకుడిగా ప్రముఖ స్టార్ అజయ్ దేవగన్ నటించారు. ఇకపోతే ప్రస్తుత ‘సింగమ్ అగైన్’ చిత్రంలో అజయ్ దేవగన్‌తో పాటు కరీనా కపూర్, దీపికా పదుకోన్, అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్, అర్జున్ కపూర్ తదితర ప్రముఖ నటులు నటించారు. రామాయణ కథనే ఇతివృత్తంగా అల్లుకున్న కథ ఇది. రామాయణంలోని పాత్రలను రిలేట్ చేస్తూ ఒక్కో పాత్రను పరిచయం చేస్తూ స్క్రీన్‌ప్లే కొనసాగుతుంది. ప్రత్యేకంగా చెప్పాలంటే సినిమాలో రామాయణ కథను టీవీ షో రూపంలో చూపిస్తూ కథను నడిపిస్తారు. అప్పటి రామాయణ కథ చరిత్రతో మనకు పరిచయం.అందుకే అది రమణీయ కావ్యం. కానీ ఇప్పటి ‘సింగమ్ ఎగైన్’ రణరంగమే ప్రధాన సూత్రంగా నడిచిన కథ. ఆఖరుగా ఒక్క మాట... రామాయణ కథను నేటి తరానికి మళ్లీ చెప్పడమనేది మంచిదే కానీ, ఎన్నో భావావేశాలున్న రామాయణ మూల కథలోంచి ఒక్క శౌర్య, వీర రసం మాత్రం తీసుకుని సినిమా రూ΄పొందించడం ఏమాత్రం సమంజసమో సినిమా తీసిన దర్శక–నిర్మాతలు, చూస్తున్న మనలాంటి ప్రేక్షకులు ఆలోచించాల్సిందే. ప్రైమ్ వీడియో ఓటీటీ వేదికగా ఈ సినిమా స్ట్రీమ్ అవుతోంది. మీరు కూడా చూసి ఆలోచించడం మొదలు పెట్టండి. – ఇంటూరు హరికృష్ణ -
ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 18 సినిమాలు
మరో వీకెండ్ వచ్చేసింది. 'ప్రణయ గోదారి', 'ఫియర్', 'పని', 'మిస్ యూ' లాంటి చోటామోటా మూవీస్ థియేటర్లలోకి వచ్చాయి. వీటిపై బజ్ పెద్దగా లేదు. దీంతో ప్రేక్షకుల దృష్టి ఓటీటీలపై పడింది. అందుకు తగ్గట్లే ఈ శుక్రవారం ఒక్కరోజే 18 సినిమాలు-వెబ్ సిరీసులు వచ్చేశాయి. వీటిలో పలు తెలుగు మూవీస్, డబ్బింగ్ చిత్రాలు ఉండటం విశేషం.(ఇదీ చదవండి: అవినాష్ జస్ట్ కమెడియన్ కాదు! బిగ్‌బాస్ ఎలివేషన్స్ వేరే లెవల్)మెకానిక్ రాకీ, సింగం ఎగైన్, బొగెన్ విల్లా లాంటి సినిమాలు కాస్త ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తున్నాయి. 'హరికథ' సిరీస్ కూడా ఈ రోజే రిలీజైంది. ఇంతకీ ఏయే ఓటీటీల్లో ఏ మూవీస్ స్ట్రీమింగ్ అవుతున్నాయంటే?ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన మూవీస్ (డిసెంబరు 13)నెట్ఫ్లిక్స్మిస్ మ్యాచ్డ్ సీజన్ 3 - హిందీ సిరీస్1992 - స్పానిష్ సిరీస్క్యారీ ఆన్ - ఇంగ్లీష్ సినిమాడిజాస్టర్ హాలీడే - ఇంగ్లీష్ మూవీట్యాలెంట్ లెస్ టకానో - జపనీస్ సిరీస్ (డిసెంబర్ 14)లా పల్మా - నార్వేజియన్ సిరీస్ (ఆల్రెడీ స్ట్రీమింగ్)నో గుడ్ డీడ్ - ఇంగ్లీష్ సిరీస్ (స్ట్రీమింగ్ అవుతోంది)అమెజాన్ ప్రైమ్మెకానిక్ రాకీ - తెలుగు సినిమాబండిష్ బండిట్స్ సీజన్ 2 - హిందీ సిరీస్సింగం ఎగైన్ - హిందీ సినిమాకథ ఇన్నువరె - మలయాళ మూవీరెడ్ వన్ - తెలుగు డబ్బింగ్ సినిమా (ఆల్రెడీ స్ట్రీమింగ్)హాట్స్టార్హరికథ - తెలుగు సిరీస్ఎల్టన్ జాన్ - ఇంగ్లీష్ మూవీఇన్విజబుల్ - స్పానిష్ సిరీస్జీ5డెస్పాచ్ - హిందీ సినిమాఆహావేరే లెవల్ ఆఫీస్ - తెలుగు సిరీస్జియో సినిమాబూకీ సీజన్ 2 - ఇంగ్లీష్ సిరీస్పారిస్ & నికోల్ - ఇంగ్లీష్ సిరీస్లయన్స్ గేట్ ప్లేషో ట్రైల్ సీజన్ 2 - ఇంగ్లీష్ సిరీస్ఆపిల్ ప్లస్ టీవీవండర్ పెట్స్ - ఇంగ్లీష్ సిరీస్సోనీ లివ్బొగెన్ విల్లా - తెలుగు డబ్బింగ్ మూవీ(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 8కు అందుకే వచ్చానన్న గౌతమ్.. ఏడ్చేసిన అవినాష్!) -
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 34 సినిమాలు
దేశవ్యాప్తంగా ప్రస్తుతం థియేటర్లలో 'పుష్ప 2' హంగామా నడుస్తోంది. దీంతో ఈ వారం కూడా బిగ్ స్క్రీన్‌పై తెలుగు సినిమాలేం రిలీజ్ కావట్లేదు. కానీ సిద్ధార్థ్ నటించిన 'మిస్ యూ' అనే డబ్బింగ్ చిత్రం ఒక్కడే రాబోతుంది. మరోవైపు ఓటీటీలో మాత్రం 30కి పైగా సినిమాలు-వెబ్ సిరీసులు స్ట్రీమింగ్ కాబోతున్నాయి.(ఇదీ చదవండి: ‘మంచు’ కుటుంబంలో హైడ్రామా)ఓటీటీల్లో రిలీజయ్యే సినిమాల విషయానికొస్తే 'సింగం ఎగైన్', 'బొగెన్ విల్లా', 'డిస్పాచ్' సినిమాలతో పాటు 'హరికథ' అనే వెబ్ సిరీస్ ఉన్నంతలో ఇంట్రెస్ట్ కలిగిస్తోంది. వీకెండ్ టైమ్‌కి కొత్త చిత్రాలు ఏమైనా సడన్ రిలీజ్ అని చెప్పి సర్ప్రైజ్ చేయొచ్చు. ఇంతకీ ఏ మూవీ ఏ ఓటీటీల్లోకి రాబోతుందంటే?ఓటీటీల్లో ఈ వారం రిలీజయ్యే సినిమాలు (డిసెంబరు 9 నుంచి 15 వరకు)అమెజాన్ ప్రైమ్సీక్రెట్ లెవల్ (ఇంగ్లీష్ సిరీస్) - డిసెంబరు 10సింగం ఎగైన్ (హిందీ సినిమా) - డిసెంబర్ 12బండిష్ బండిట్స్ సీజన్ 2 (హిందీ సిరీస్) - డిసెంబర్ 13నెట్ఫ్లిక్స్ద షేప్స్ ఆఫ్ లవ్ (జపనీస్ సిరీస్) - డిసెంబరు 09ద గ్రేట్ బ్రిటీష్ బేకింగ్ షో హాలీడేస్ సీజన్ 7 (ఇంగ్లీష్ సిరీస్) - డిసెంబరు 09జెమియా ఫాక్స్ (ఇంగ్లీష్ సినిమా) - డిసెంబర్ 10పోలో (ఇంగ్లీష్ సిరీస్) - డిసెంబరు 10రగ్డ్ రగ్బీ (కొరియన్ సిరీస్) - డిసెంబరు 10మకల్యాస్ వాయిస్ (ఇంగ్లీష్ మూవీ) - డిసెంబర్ 11మారియా (ఇంగ్లీష్ సినిమా) - డిసెంబర్ 11వన్ హండ్రెడ్ ఇయర్స్ ఆఫ్ సోలిట్యూడ్ (స్పానిష్ సిరీస్) - డిసెంబర్ 11క్వీర్ ఐ: సీజన్ 9 (ఇంగ్లీష్ సిరీస్) - డిసెంబర్ 11ద ఆడిటర్స్ (కొరియన్ సిరీస్) - డిసెంబర్ 11ద కింగ్స్ ఆఫ్ టుపేలో (ఇంగ్లీష్ సిరీస్) - డిసెంబర్ 11హౌ టూ మేక్ మిలియన్స్ బిఫోర్ గ్రాండ్ మా డైస్ (థాయ్ సినిమా) - డిసెంబర్ 12లా పల్మా (నార్వేజియన్ సిరీస్) - డిసెంబర్ 12నో గుడ్ డీడ్ (ఇంగ్లీష్ సిరీస్) - డిసెంబర్ 121992 (స్పానిష్ సిరీస్) - డిసెంబర్ 12క్యారీ ఆన్ (ఇంగ్లీష్ మూవీ) - డిసెంబర్ 13డిజాస్టర్ హాలీడే (ఇంగ్లీష్ సినిమా) - డిసెంబర్ 13మిస్ మ్యాచ్డ్ సీజన్ 3 (హిందీ సిరీస్) - డిసెంబర్ 13ట్యాలెంట్ లెస్ టకానో (జపనీస్ సిరీస్) - డిసెంబర్ 14హాట్స్టార్డ్రీమ్ ప్రొడక్షన్స్ (ఇంగ్లీష్ సిరీస్) - డిసెంబరు 11ఎల్టన్ జాన్ (ఇంగ్లీష్ మూవీ) - డిసెంబర్ 13హరికథ (తెలుగు సిరీస్) - డిసెంబర్ 13ఇన్విజబుల్ (స్పానిష్ సిరీస్) - డిసెంబర్ 13జియో సినిమాబూకీ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - డిసెంబర్ 13పారిస్ & నికోల్ (ఇంగ్లీష్ సిరీస్) - డిసెంబర్ 13బుక్ మై షోడ్యాన్సింగ్ విలేజ్: ద కర్స్ బిగిన్స్ (ఇండోనేసియన్ మూవీ) - డిసెంబరు 10ద క్రో (ఇంగ్లీష్ సినిమా) - డిసెంబరు 10సోనీ లివ్బొగెన్ విల్లా (తెలుగు డబ్బింగ్ మూవీ) - డిసెంబర్ 13జీ5డిస్పాచ్ (హిందీ సినిమా) - డిసెంబర్ 13లయన్స్ గేట్ ప్లేషో ట్రైల్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - డిసెంబర్ 13ఆపిల్ ప్లస్ టీవండర్ పెట్స్ (ఇంగ్లీష్ సిరీస్) - డిసెంబర్ 13(ఇదీ చదవండి: Bigg Boss 8: విన్నర్ ప్రైజ్‌మనీ కంటే ఎక్కువే సంపాదించిన విష్ణు!) -
Ajay Devgn: సీక్వెల్ స్టార్
యాక్షన్ హీరోగా, ఫ్యామిలీ హీరోగా అన్ని వర్గాల ప్రేక్షకులనూ మెప్పిస్తున్నారు అజయ్ దేవగన్. ఇప్పుడు ఈ హీరోకి ‘సీక్వెల్ స్టార్’ అని ట్యాగ్ ఇవ్వొచ్చు. ఎందుకంటే ఒకటి కాదు... రెండు మూడు కూడా కాదు... ఏకంగా ఎనిమిది చిత్రాల సీక్వెల్స్ అజయ్ దేవగన్ డైరీలో ఉన్నాయి. సీక్వెల్ చిత్రాల్లో నటించడం పెద్ద విషయం కాదు కానీ వరుసగా ఎనిమిది చిత్రాలంటే మాత్రం పెద్ద విషయమే. ఇక అజయ్ సైన్ చేసిన సీక్వెల్ చిత్రాల్లో ఇప్పటికే కొన్ని చిత్రాలు షూటింగ్ దశలో ఉండగా కొన్ని ఆరంభం కావాలి. ఆ చిత్రాల విశేషాలు తెలుసుకుందాం. అజయ్ దేవగన్ కెరీర్లో ‘సింగమ్’ చిత్రానిది ప్రత్యేక స్థానం. రోహిత్ శెట్టి దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్లో పోలీసాఫీసర్ సింగమ్‌గా అజయ్ దేవగన్ విజృంభించారు. 2011లో విడుదలైన ఈ చిత్రం బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఆ తర్వాత అజయ్ దేవగన్–రోహిత్ శెట్టి కాంబినేషన్లోనే ‘సింగమ్’కి సీక్వెల్‌గా ‘సింగమ్ రిటర్న్స్’ (2014) రూపొంది, సూపర్‌హిట్‌గా నిలిచింది. ‘సింగమ్ రిటర్న్స్’ విడుదలైన దాదాపు పదేళ్లకు ఈ ఫ్రాంచైజీలో భాగంగా ‘సింగమ్ ఎగైన్’ పేరుతో ఓ మూవీ రూపొందుతోంది. అజయ్ దేవగన్ హీరోగా ఈ చిత్రానికి కూడా రోహిత్ శెట్టియే దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా ఆగస్టులో రిలీజ్ కానుందని సమాచారం. అదే విధంగా అజయ్ దేవగన్ హీరోగా రాజ్‌కుమార్ గుప్తా దర్శకత్వంలో వచ్చిన ‘రైడ్’ (2018) మూవీ ఘనవిజయం సాధించింది. దాదాపు ఆరేళ్ల తర్వాత ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘రైడ్ 2’ తెరకెక్కుతోంది. అజయ్ దేవగన్ హీరోగా డైరెక్టర్ రాజ్‌కుమార్ గుప్తా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో వాణీ కపూర్, రితేశ్ దేశ్‌ముఖ్ కీలక పాత్రధారులు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా నవంబర్ 15న రిలీజ్ కానుంది. ఇదిలా ఉంటే.. ‘సింగమ్’ వంటి హిట్ సీక్వెల్స్ ఇచ్చిన హీరో అజయ్ దేవగన్–దర్శకుడు రోహిత్ శెట్టి కాంబినేషన్లో వచ్చిన మరో చిత్రం ‘గోల్మాల్’ (2006) ఘనవిజయం సాధించింది. ఈ చిత్రానికి సీక్వెల్‌గా అజయ్ దేవగన్–రోహిత్ శెట్టి కాంబినేషన్లోనే వచ్చిన ‘గోల్మాల్ రిటర్న్స్’ (2008) సూపర్ హిట్ అయింది. ‘గోల్మాల్’ ఫ్రాంచైజీలో ‘గోల్మాల్ 3’ (2010), ‘గోల్మాల్ 4’ (2017) కూడా వచ్చాయి. ‘గోల్మాల్ 5’ రానుంది. అజయ్ దేవగన్–రోహిత్ శెట్టి కాంబినేషన్లోనే రానున్న ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తయిందట. ఇకపోతే అజయ్ దేవగన్, రకుల్ ప్రీత్‌సింగ్, టబు ప్రధాన పాత్రల్లో నటించిన రొమాంటిక్ కామెడీ చిత్రం ‘దే దే ప్యార్ దే’. అకివ్ అలీ దర్శకత్వం వహించిన ఈ సినిమా 2019లో రిలీజై సూపర్ హిట్ అయింది. దాదాపు ఐదేళ్లకి ‘దే దే ప్యార్ దే 2’ సినిమాని ప్రకటించారు మేకర్స్. ఇందులోనూ అజయ్ దేవగన్ లీడ్ రోల్లో నటించనున్నారు. అయితే ‘దే దే ప్యార్ దే’కి అకివ్ అలీ దర్శకత్వం వహించగా.. ‘దే దే ప్యార్ దే 2’ మూవీని కొత్త దర్శకుడు అన్షుల్ శర్మ తెరకెక్కించనున్నారు. ఈ చిత్రాన్ని 2025 మే 1న విడుదల చేయనున్నట్లు యూనిట్ ప్రకటించింది. అలాగే అజయ్ దేవగన్ హీరోగా అశ్వినీ ధీర్ దర్శకత్వం వహించిన యాక్షన్ కామెడీ చిత్రం ‘సన్ ఆఫ్ సర్దార్’. 2012లో విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది. సునీల్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ‘మర్యాద రామన్న’ (2010) చిత్రానికి ఇది రీమేక్. ఇక ‘సన్ ఆఫ్ సర్దార్’ వచ్చిన పుష్కరం తర్వాత సీక్వెల్‌గా ‘సన్ ఆఫ్ సర్దార్ 2’ తెరకెక్కనుంది. తొలి భాగానికి అశ్వినీ ధీర్ దర్శకత్వం వహించగా, మలి భాగాన్ని డైరెక్టర్ విజయ్ కుమార్ అరోరా తెరకెక్కించనున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ మూవీ ఈ ఏడాదిలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది. అలాగే 2025లో ఈ సినిమాని రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. అదే విధంగా మలయాళ హిట్ మూవీ ‘దృశ్యం’ హిందీ రీమేక్‌లో అజయ్ దేవగన్ హీరోగా నటించారు. నిషికాంత్ కామత్ దర్శకత్వం వహించిన క్రైమ్ థ్రిల్లర్ ‘దృశ్యం’ (2015) హిట్‌గా నిలిచింది. ఈ చిత్రం విడుదలైన దాదాపు ఏడేళ్లకు ‘దృశ్యం 2’ రిలీజైంది. అజయ్ దేవగన్ లీడ్ రోల్లో నటించిన ఈ మూవీకి అభిషేక్ పాఠక్ దర్శకత్వం వహించారు. ఇదే ఫ్రాంచైజీలో మలయాళంలో ‘దృశ్యం 3’ రానుంది. ఈ చిత్రం హిందీ రీమేక్‌లో కూడా అజయ్ దేవగన్ నటిస్తారని సమాచారం. ఇదిలా ఉంటే వికాస్ బాల్ దర్శకత్వంలో అజయ్ దేవగన్ హీరోగా నటించిన ‘సైతాన్’ చిత్రం గత నెల 8న రిలీజై బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘సైతాన్ 2’ రానుంది. ఇంకా ఇంద్రకుమార్ దర్శకత్వంలో అజయ్ దేవగన్ ఓ హీరోగా నటించిన ‘ధమాల్’ (2007)తో పాటు ‘డబుల్ ధమాల్’ (2011), ‘టోటల్ ధమాల్’ (2019) మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ‘ధమాల్ 4’ కూడా రానుందని సమాచారం. ఇంద్రకుమార్ దర్శకత్వంలోనే అజయ్ దేవగన్ ఓ హీరోగా ఈ నాలుగో భాగం ఉంటుందని టాక్. ఇలా వరుసగా సీక్వెల్స్‌కి సైన్ చేసిన అజయ్ దేవగన్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘మైదాన్’ ఈ నెల 10న విడుదల కానుంది. ఈ చిత్రంలో ఆయన ఫుట్‌బాల్ కోచ్‌గా కనిపించనున్నారు. -
ప్రముఖ దర్శకుడి ఇంట్లో తీవ్ర విషాదం!!
ప్రముఖ తమిళ చిత్ర దర్శకుడు హరి ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన తండ్రి వీఏ గోపాలకృష్ణన్ ఈరోజు చెన్నైలో కన్నుమూశారు. ప్రస్తుతం ఆయనకు 88 సంవత్సరాలు కాగా.. గత కొన్ని వారాలుగా అనారోగ్యంతో చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. సింగం డైరెక్టర్ హరి తండ్రి మృతి పట్ల కోలీవుడ్ ప్రముఖులు, దర్శకనిర్మాతలు సంతాపం ప్రకటించారు. కాగా.. గోపాలకృష్ణన్ భౌతికకాయానికి టుటికోరిన్ జిల్లాలోని వారి స్వగ్రామం కాచనవెల్లిలో ఆదివారం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. దర్శకుడు హరితో పాటు గోపాలకృష్ణన్‌కు ఐదుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ప్రశాంత్ ప్రధాన పాత్రలో నటించిన 2002 తమిళ చిత్రం 'తమిజ్'తో అరంగేట్రం చేసిన దర్శకుడు హరి.. తన 21 సంవత్సరాల సినీ జీవితంలో అనేక కమర్షియల్ హిట్లను అందించారు. హరి ప్రస్తుతం విశాల్ హీరోగా ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. 2003లో సామి, 2010లో సింగం వంటి చిత్రాలతో బ్లాక్ బస్టర్ హిట్లను తన ఖాతాలో వేసుకున్నారు. -
ఆ సినిమాలకు సిగ్గు పడుతున్నా..
సాక్షి, చెన్నై: దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపిన తమిళనాడులోని తూత్తుకూడి, సాతాంకుళంలో పోలీసుల కస్టడీలో తండ్రీ కొడుకుల హత్య ఆరోపణల కేసులో ప్రముఖ తమిళ దర్శకుడు హరి గోపాలకృష్ణన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. విధి నిర్వహణలో పోలీసుల సవాళ్లు, వారి ధైర్యసాహసాలను హైలైట్ చేసిన చిత్ర దర్శకుడిగా పేరుగాంచిన హరి ఇకపై అలాంటి సినిమాలను చేయనంటూ కీలక ప్రకటన విడుదల చేశారు.(తండ్రీకొడుకుల అనూహ్య మరణం!) జయరాజ్, బెన్నిక్స్ దారుణ హత్యలపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన హరి ఇలాంటి సంఘటనలు మళ్లీ తమిళనాడులో జరగకూడదు. కొద్దిమంది అధికారుల కారణంగా, మొత్తం పోలీసు శాఖ ప్రతిష్ఠ దెబ్బతింటోందని వ్యాఖ్యానించారు. పోలీసులను ప్రశంసిస్తూ ఐదు సినిమాలు చేసినందుకు చింతిస్తున్నానని ఆయన తన ప్రకటనలో తెలిపారు. హరి దర్శకత్వంలో వచ్చిన సింగం, సింగం-2, సింగం-3, సామి, సామి-2 సినిమాలు బాక్సాఫీసు వద్ద భారీ విజయాలను నమోదు చేశాయి. (కస్టడీలో తండ్రి కొడుకుల మృతి; ఆందోళనలు) తమిళనాడులో పోలీస్ కస్టడీలో తండ్రీకొడుకులు మరణించడంపై ప్రజాగ్రహం పెల్లుబికింది. తమిళ సినీ పరిశ్రమ ప్రముఖులు కూడా ఘటనపై ఆగ్రహం వ్యక్తంచేశారు. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ బాధితుల కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అలాగే సింగం హీరో సూర్య ఈ సంఘటనను వ్యవస్థీకృత నేరంగా పేర్కొనగా, ప్రముఖ నటి కుష్బూ దీనిపై విచారణ చేపట్టి, దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మరోవైపు స్వరకర్త డి ఇమ్మన్ కూడా ఈ అమానవీయ హింసపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వాళ్లిద్దరూ భారతదేశపు జార్జ్ ఫ్లాయిడ్స్ అంటూ ఇమ్మన్ ట్వీట్ చేశారు. కాలా దర్శకుడు పా రంజిత్ స్పందిస్తూ పోలీసుల క్రూరత్వానికి మరో ప్రాణం కోల్పోకుండా చూసుకోవడం మన కర్తవ్యం. ఎలాంటి భయం లేకుండా ప్రజలపై హింసను ప్రయోగిస్తున్న ప్రతీ పోలీసు అధికారిని నేరస్థుడిగా భావించాలన్నారు. వీరితోపాటు హీరోయిన్లు సమంతా, కాజల్ అగర్వాల్, హన్సిక, అలాగే హీరో విష్ణు విశాల్ కూడా సంతాపం వ్యక్తం చేశారు. పోలీసుల దారుణాన్ని ఖండించారు. కాగా లాక్డౌన్ నిబంధనలను ఉల్లఘించారంటూ పి జయరాజ్ (59), ఆయన కుమారుడు బెన్నిక్స్ (31)లను పోలీసులు అరెస్టు చేయగా, రెండు రోజుల అనంతరం పోలీస్ కస్టడీలో అనుమానాస్పద పరిస్థితుల్లో వీరు మరణించడం కలకలం రేపింది. గుండెపోటుతో మరణించారని పోలీసులు ప్రకటించగా, తీవ్రంగా హింసించి, చంపేశారంటూ నిరసనలు మిన్నంటాయి. ఈ నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం సీబీఐ దర్యాప్తునకు ఆదేశించిన సంగతి తెలిసిందే. -
‘సింగం’ కాంబోలో మరో మూవీ
సౌత్ స్టార్ హీరో సూర్య, యాక్షన్ చిత్రాల దర్శకుడు హరి కాంబినేషన్లో వచ్చిన సింగం సిరీస్ ఎంతటి ఘనవిజయం సాదించిందో తెలిసిందే. ఈ సిరీస్‌లో మూడు భాగాలు వచ్చిన సినిమాలు తెలుగు తమిళ భాషల్లో సూపర్ హిట్ అయ్యాయి. తాజాగా ఈ కాంబినేషన్ మరో రిపీట్ అవుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇటీవల విక్రమ్ హీరోగా సామి స్క్వేర్ సినిమాను తెరకెక్కించిన హరి ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయారు. దీంతో తన తదుపరి చిత్రం విషయంలో జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు. ఇప్పటికే సూర్యకు లైన్ చెప్పిన హరి ప్రస్తుతం పూర్తి స్క్రిప్ట్ రెడీ చేసే పనిలో ఉన్నాడట. అయితే ఈ కాంబినేషన్లో రాబోయే సినిమా సింగంకు కొనసాగింపు కాదని తెలుస్తోంది. -
హిట్ కాంబినేషన్.. నాలుగో సారి.!
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, అనుష్కలది సూపర్ హిట్ కాంబినేషన్ అన్న సంగతి తెలసిందే. వీరిద్దరు హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన ‘సింగం’ సిరీస్ ఘనవిజయం సాధించింది. మూడు భాగాలుగా రిలీజ్ అయిన ఈ సినిమాలకు హరి దర్శకుడు. ఈ కాంబినేషన్ మరోసారి మ్యాజిక్ చేసేందుకు రెడీ అవుతున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న సూర్య 39వ సినిమాకు హరినే దర్శకత్వం వహించనున్నారు. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు హీరోయిన్గా మరోసారి అనుష్కనే తీసుకునే ఆలోచనలో ఉన్నాడు దర్శకుడు హరి. అయితే కొద్ది రోజులుగా లుక్ పరంగా విమర్శలు ఎదుర్కొంటున్న అనుష్క ప్రస్తుతం సినిమాలు అంగీకరించటం లేదు. మరి మరోసారి హరి, సూర్యలతో కలిసి పనిచేసేందుకు ఓకె చెపుతుందో లేదో చూడాలి. -
ఎస్ఐ శ్రీనివాసా మజాకా !
దొడ్డబళ్లాపురం: ఏ పోలీస్‌స్టేషన్‌కు బదిలీపై వెళ్లినా తనదైన స్టైల్లో విధులు నిర్వహిస్తూ వివాదాలను కొనితెచ్చుకునే విశ్వనాథపురం పోలీస్‌స్టేషన్ సబ్ఇన్స్పెక్టరర్ శ్రీనివాస్ మరోసారి తన సింగం స్టైల్లో పై అధికారికి, ఒక రాజకీయ నాయకుడికి ఫోన్లోనే క్లాస్ పీకారు. మంగళవారం తెల్లవారుజామునే తన పోలీస్‌స్టేషన్ పరిధిలో అక్రమంగా మైనింగ్ జరుగుతున్న ప్రదేశానికి వెళ్లి మైనింగ్ నిలిపివేయాలని హెచ్చరించారు. దీంతో అక్రమ మైనింగ్ నిర్వాహకులు పలువురు ప్రముఖులకు ఫోన్ చేశారు. తక్షణం ఎస్ఐ శ్రీనివాస్‌కు విజయపురం సీఐ మంజునాథ్, దేవనహళ్లి జేడీఎస్ నేత ఇద్దరూ ఫోన్‌చేసి మైనింగ్‌ను ఆపరాదని, వదిలేసి వెళ్లిపొమ్మని బెదిరించారు. దీంతో ఎస్ఐ శ్రీనివాస్ ఫోన్లోనే వారిని ఉతికారేసారు. మీరు, మీ అక్రమాలు అన్ని తెలుసు. నా డ్యూటీ నేను చేస్తున్నాను. డ్యూటీకి అడ్డుపడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. మీ భాగోతాలూ తోడతాను. పోలీసువై అక్రమాలకు కొమ్ము కాస్తావా? సిగ్గులేదూ అంటూ ఘాటుగా వార్నింగ్ ఇచ్చారు. దీంతో అక్కడున్న మైనింగ్ నిర్వాహకులు కాలికి బుద్ధిచెప్పారు. విశ్వనాథపురం పోలీస్‌స్టేషన్‌లో అక్రమ మైనింగ్కి సంబంధించి సంబంధించిన వారిపై కేసు నమోదు చేయడం జరిగింది. ఘటనాస్థలంలో కొందరు ఈ వీడియో చిత్రీకరించి సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్‌గా మారింది. -
హరితో సినిమా.. సింగం కాదు
కోలీవుడ్, టాలీవుడ్ లలో సూపర్ హిట్ నిలిచిన యాక్షన్ సీరీస్ సింగం. సూర్య హీరోగా తెరకెక్కిన ఈ సీరీస్ లో మూడు భాగాలు రిలీజ్ అయ్యాయి. అయితే తొలి రెండు భాగాలు ఘనవిజయం సాధించినా.. మూడో సినిమా మాత్రం ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. అయితే సినిమా రిలీజ్ సమయంలో సింగం సీరీస్ తరువాత కూడా కొనసాగుతుందని ప్రకటించాడు హరి. తాజాగా హరి దర్శకత్వంలో సూర్య మరో సినిమా చేయబోతున్నాడన్న ప్రచారం జరుగుతుంది. అయితే ఫ్యాన్స్.. సూర్య, హరి కాంబినేషన్ అంటే అది సింగం సీరీస్ లోని సినిమానే అయిఉంటుందని భావించారు. కానీ సూర్యతో హరి చేయబోయే నెక్ట్స్ సినిమా సింగం సీరీస్ కు కొనసాగింపు కాదని తెలుస్తోంది. సూర్య కోసం ఫ్రెష్ గా ఓ మాస్ ఎంటర్టైనర్ ను రెడీ చేస్తున్నాడు హరి. ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న విఘ్నేష్ శివన్ సినిమా, ఆ తరువాత సెల్వరాఘవన్ ల సినిమాలు పూర్తి చేసిన తరువాత హరి దర్శకత్వంలో సూర్య సినిమా తెరకెక్కనుంది. సూర్య హీరోగా హరి కొత్త కథతో సినిమా చేస్తుండటంతో సింగం సీరీస్ కు తెరపడినట్టేనని భావిస్తున్నారు ఫ్యాన్స్. -
విజయ్‌తో సినిమాపై సింగం డైరెక్టర్ కామెంట్
కోలీవుడ్ మాస్ యాక్షన్ సినిమాల స్పెషలిస్ట్‌గా పేరు తెచ్చుకున్న దర్శకుడు హరి. సింగం సీరీస్‌తో తిరుగులేని స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న హరి, కెరీర్లో ఇప్పటి వరకు డైరెక్ట్ చేసినవి కేవలం 14 చిత్రాలు మాత్రమే. రేసీ స్క్రీన్‌ప్లేతో పాటు ఫ్యామిలి ఎమోషన్స్, యాక్షన్ సీన్స్‌తో పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్లను తెరకెక్కించే హరి, ఇన్నేళ్ల కెరీర్లో ఇద్దరు స్టార్ హీరోలతో సినిమా చేయలేకపోయాడు. అయితే అందుకు కారణం ఏంటో కూడా చెపుతున్నాడు హరి. సూర్య, విక్రమ్, విశాల్, లాంటి స్టార్ హీరోలతో బ్లాక్ బస్టర్ హిట్స్ అందించిన హరి... విజయ్, అజిత్‌లతో సినిమాలు చేయలేకపోయాడు. సింగం తొలి భాగం రిలీజ్ అయిన సమయంలో విజయ్‌తో సినిమా చేసేందుకు చర్చలు జరిపిన హరి, సరైన నిర్మాత దొరక్క పోవటంతో ఈ సినిమా పట్టాలెక్కలేదు. ప్రస్తుతం సింగం 3 ప్రమోషన్లో భాగంగా మీడియాతో మాట్లాడిన హరి, విజయ్ మార్కెట్ రేంజ్‌కు తగ్గ స్థాయిలో సినిమాను తెరకెక్కించే నిర్మాత దొరికితే సినిమా చేసేందుకు తాను సిద్ధమే అంటూ ప్రకటించాడు. -
మేకింగ్ ఆఫ్ మూవీ - సింగం 3
-
రేసీ.. మాసీ సింగమ్
సింగమ్... ఓ సినిమా పేరు కాదు, అదో బ్రాండ్. అందులో సూర్య యాక్షన్, డైలాగ్ డిక్షన్, మీసకట్టు.. ప్రతిదీ బ్రాండ్. ‘సింగమ్’ బ్రాండ్ దెబ్బకి బాక్సాఫీస్ రెండుసార్లు షేక్ అయింది. ముచ్చటగా మూడోసారి నరసింహం అలియాస్ ‘సింగమ్’గా ఈ నెల 9న తమిళ హీరో సూర్య ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ సినిమా ఎలా ఉందో లుక్కేయండి! కథేంటి?: మంగుళూరు సిటీ పోలీస్ కమీషనర్ (జయప్రకాశ్) హత్యకు గురవుతాడు. నెలలు గడుస్తున్నా హంతకుల్ని పట్టుకోలేకపోయారంటూ విపక్షాలు చేస్తున్న విమర్శలు, ఆందోళనలతో కర్ణాటక అసెంబ్లీ అట్టుడుకు తుంది. అప్పుడు సౌతాఫ్రికన్ మాఫియా డాన్ డానీ ఆట కట్టించిన (సింగం–2లో) ఏపీ పోలీస్ నరసింహం (సూర్య) ని డిప్యూటేషన్‌పై సీబీఐ అధికారిగా మంగుళూరుకు రప్పిస్తారు కర్ణాటక హోంమంత్రి (శరత్‌బాబు). నరసింహంకి కమీషనర్ హత్య కేసు అప్పగిస్తారు. నిజాయితీకి మారుపేరు గా ముద్రపడిన నరసింహం... మంగుళూరుకి వచ్చిన వెంటనే రౌడీలతో స్నేహం చేస్తాడు. ఈ క్రమంలో కేంద్రమంత్రి కుమారుడు, ఆస్ట్రేలియాలో నివాసం ఉండే ఆ దేశ పౌరుడైన విఠల్‌ప్రసాద్ (అనూప్ సింగ్ ఠాకూర్) సిటీలో చేస్తున్న పలు అక్రమాలు నరసింహంకి తెలుస్తాయి. సాక్ష్యాలు చేతికి చిక్కిన తర్వాత విఠల్ అక్రమాలు వెలుగు లోకి తీసుకురావాలనుకున్న టైమ్‌లో నరసింహంకి షాక్. ‘రౌడీలతో నరసింహం స్నేహం’ పేరుతో పతాక శీర్షికల్లో వార్తలొస్తాయి. ఈ వార్త రాసింది... సిటీకి వచ్చినప్పట్నుంచీ నరసింహం వెంటపడిన విద్య అలియాస్ అగ్ని (శ్రుతీహాసన్) అనే అమ్మాయి. ఈ వార్తల్ని సాకుగా చూపి, సీబీఐ అతణ్ణి విధుల నుంచి తప్పుకోమంటుంది. అప్పుడు నరసింహం ఏం చేశాడు? కావ్య (అనుష్క)తో పెళ్లైన తర్వాత విడాకులు తీసుకున్నానని ఎందుకు అబద్ధం చెప్పాడు? ఆస్ట్రేలియాలో నివసించే విఠల్ అక్రమాలను ఎలా వెలుగులోకి తీసుకొచ్చాడు? తనపై ప్రజలు, ప్రభుత్వం పెట్టుకున్న నమ్మకాన్ని ఎలా నిలబెట్టుకున్నాడు? అనేది కథ. విశ్లేషణ: సింహం ఓ అడుగు వెనక్కి వేసిందంటే మూడడుగులు ముందుకు దూకడానికే, జూలు విదల్చడానికే అన్న సామెతను దర్శకుడు హరి బాగా వంటబట్టించుకున్నారు. సిన్మా ప్రారంభంలో కాస్త వెనకడుగు వేసిన నరసింహం.. జూలు విదిల్చిన దగ్గర్నుంచీ కథ వంద కిలోమీటర్ల వేగంతో పరుగులు తీసింది. ‘సింగమ్’ ఫ్రాంచైజీలో వచ్చిన గత సిన్మాల కంటే స్క్రీన్‌ప్లే ఇందులో మరింత ఫాస్ట్‌గా ఉంటుంది. హరి మార్క్ యాక్షన్ సీన్లు, డైరెక్షన్ ప్రతి ఫ్రేమ్‌లోనూ కనిపిస్తాయి. మాస్... అంటే సింగమ్. సింగమ్... అంటే మాస్ అనే రీతిలో ప్రతి సీన్, ప్రతి ఫైట్, ప్రతి డైలాగ్ పర్ఫెక్ట్గా కుదిరాయి. ఇంత మాస్ యాక్షన్ సిన్మాలోనూ దర్శకుడు హరి ఫ్యామిలీ ఎమోషన్స్‌ని చూపించిన తీరు బాగుంది. అనుష్క, శ్రుతీహాసన్ పాత్రలు కథతో పాటు ప్రయాణం చేశాయి. నరసింహం పాత్రలో సూర్య ఉగ్ర నరసింహుడిగా చెలరేగారు. పంచ్ డైలాగులు, యాక్షన్ సీన్లలో కసి, కథకు అవసరమైన చోట ఎమోషనల్ యాక్టింగ్‌తో ఇరగదీశారు. సంగీత దర్శకుడు హ్యారీస్ జయరాజ్ కూడా సీన్‌కి తగ్గట్టు తన సై్టల్లో కాకుండా మాసీగా రీ–రికార్డింగ్ చేశారు. పక్కా మాస్ మసాలా యాక్షన్ ఫిల్మ్ ఇది. -
సింగం దర్శకుడితో ఎన్టీఆర్.?
జనతా గ్యారేజ్ సినిమాతో కెరీర్లోనే బిగెస్ట్ హిట్ కొట్టిన ఎన్టీఆర్, నెక్ట్స్ సినిమా విషయంలో మాత్రం ఎటూ తేల్చుకోలేకపోతున్నాడు. వరుసగా డిఫరెంట్ మూవీస్ చేస్తూ వస్తున్న జూనియర్, ఈ సారి ప్రయోగాలను పక్కన పెట్టి పక్కా మాస్ కమర్షియల్ సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడు. అందుకు తగ్గ కథా కథనాలతో మాస్ కథలను పర్ఫెక్ట్గా డీల్ చేసే దర్శకుడి కోసం ఎదురుచూస్తున్నాడు. ఇప్పటికే త్రివిక్రమ్ శ్రీనివాస్, వివి వినాయక్, అనీల్ రావిపూడి లాంటి దర్శకుల పేర్లు వినిపించగా తాజాగా మరో ఆసక్తికరమైన పేరు వినిపిస్తోంది. తమిళనాట మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన హరి దర్శకత్వంలో ఎన్టీఆర్ తన నెక్ట్స్ సినిమా చేయబోతున్నాడట. సింగం సీరీస్‌తో తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడైన హరి, సింగం 3 రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఈ సినిమా తరువాత సామి సీక్వల్‌ను ప్లాన్ చేసిన హరి, ఎన్టీఆర్ కు కూడా ఓ కథ వినిపించాడన్న టాక్ వినిపిస్తోంది. మరి నిజంగానే తమిళ దర్శకుడితో ఎన్టీఆర్ సినిమా చేస్తున్నాడో లేదో తెలియాలంటే మాత్రం అఫీషియల్ ఎనౌన్స్మెంట్ వరకు వెయిట్ చేయాల్సిందే. -
రెస్ట్ అవసరం లేదంటున్న సింగం
తమిళ నాట ప్రయోగాత్మక చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన హీరో సూర్య. క్యారెక్టర్ కోసం ఎలాంటి రిస్క్ చేయడానికైనా రెడీగా ఉండే ఈ స్టార్ హీరో మేకింగ్ విషయంలో కూడా యమా స్పీడు చూపిస్తుంటాడు. తన రేంజ్ హీరోలందరూ ఏడాది ఒక్క సినిమాతో సరిపెడుతుంటే సూర్య మాత్రం కనీసం రెండు సినిమాలైనా రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నాడు. ప్రస్తుతం సూర్య తన కెరీర్ లో సూపర్ హిట్ సీరీస్ గా నిలిచిన సింగం సీరీస్ లో మూడో భాగంలో హీరోగా నటిస్తున్నాడు. హరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ పార్ట్ పూర్తి కాగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అయితే సింగం 3 షూటింగ్ తరువాత ఎలాంటి గ్యాప్ తీసుకోకుండా మరో సినిమాను మొదలెట్టేశాడు సూర్య. నానుమ్ రౌడీధాన్ సినిమా ఫేం విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో ఓ కమర్షియల్ ఎంటర్టైనర్ లో నటిస్తున్నాడు. స్టూడియో గ్రీన్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాను ఈ రోజే(బుధవారం) లాంఛనంగా ప్రారంభించారు. రెండు మూడు రోజుల్లో రెగ్యులర్ షూటింగ్ ను కూడా స్టార్ట్ చేసే ప్లాన్ లో ఉన్నారు. వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ కానున్న ఈసినిమాలో సూర్య సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. -
కాసులు తెచ్చే సినిమా కావాలి
తమిళ్‌తో పాటు తెలుగులో కూడా స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న సౌత్ హీరో సూర్య. రొటీన్ కమర్షియల్ సినిమాలకు భిన్నంగా సినిమాలు చేసే సూర్య మాస్ క్యారెక్టర్స్ తోనూ అదరగొడుతున్నాడు. అయితే కొద్ది రోజులుగా వరుసగా ప్రయోగాలు చేస్తున్న ఈ మ్యాన్లీ స్టార్, భారీ కలెక్షన్లు సాధించే సినిమాలను మాత్రం అందించలేకపోతున్నాడు. తన తోటి హీరోలు 50 కోట్లు, 100 కోట్ల కలెక్షన్లతో దూసుకుపోతుంటే భారీ వసూళ్లను సాధించటంలో సూర్య వెనకపడిపోతున్నాడు. ఇటీవల విడుదలైన 24 బిగ్ హిట్ అనిపించుకున్నా, భారీ బడ్జెట్ కారణంగా ఈ సినిమా కాస్ట్ ఫెయిల్యూర్‌గా నిలిచింది. దీంతో పోటీలో నిలబడేందుకు ఓ కమర్షియల్ సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నాడు సూర్య. ప్రస్తుతం తనకు వరుస హిట్స్ అందించిన హరి దర్శకత్వంలో సింగం సినిమాకు రెండో సీక్వెల్‌గా తెరకెక్కుతున్న ఎస్ 3లో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమా తరువాత కబాలి ఫేం పా రంజిత్ దర్శకత్వంలో మరో సినిమాకు రెడీ అవుతున్నాడు. ఈ రెండు సినిమాలను కమర్షియల్ హిట్స్‌గా మలిచేందుకు కష్టపడుతున్నాడు ఈ విలక్షణ నటుడు. -
సూర్య సినిమాకు నో చెప్పాడు
కోలవరి పాటతో ఒక్కసారిగా నేషనల్ లెవల్లో క్రేజ్ సొంతం చేసుకున్న యువ సంగీత దర్శకుడు అనిరుధ్. ఈ యంగ్ మ్యూజిషియన్ ప్రస్తుతం సౌత్‌లో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా కొనసాగుతున్నాడు. అందుకే సౌత్ ఇండియన్ టాప్ హీరోలు కూడా అనిరుధ్ పాటలకు స్టెప్పులేయాలని ఎదురుచూస్తున్నారు. అయితే ఎంత బిజీగా ఉన్న మ్యూజిషియన్ అయినా సూర్య లాంటి టాప్ హీరో సినిమాకు ఛాన్స్ వస్తే కాదనరు. కానీ అనిరుధ్ మాత్రం ఆ సాహసం చేశాడు. సూర్య, హరి కాంబినేషన్లో తెరకెక్కిన సింగం, సింగం 2 సినిమాలకు సీక్వెల్‌గా సింగం-3 సినిమాను తెరకెక్కిస్తున్నారు. అయితే తొలి రెండు భాగాలకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించగా మూడో భాగానికి మాత్రం అనిరుధ్‌తో మ్యూజిక్ చేయించాలని భావించారట చిత్రయూనిట్. ఇప్పటికే చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న అనిరుధ్, సింగం 3 సినిమాకు మ్యూజిక్ ఇవ్వలేనంటూ రిజెక్ట్ చేసేశాడు. దీంతో మరోసారి దేవీ శ్రీ నే సింగంకు సంగీతం అందించే ఛాన్స్ ఉందంటున్నారు. సూర్య ప్రస్తుతం విక్రమ్ కుమార్ డైరెక్షన్లో '24' సినిమాలో నటిస్తున్నాడు. సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాను తమిళ, తెలుగు భాషల్లో ఒకేసారి నిర్మిస్తున్నారు. ఈ సినిమా పూర్తయిన తరువాత నవంబర్ 15 నుంచి సింగం 3 షూటింగ్ ప్రారంభించనున్నారు. -
‘సింగం’ దర్శకుడితో సినిమా..?
బాలకృష్ణను యాంగ్రీయంగ్‌మేన్‌గా ఆవిష్కరించిన తొలి సినిమా ‘రౌడీ ఇన్స్పెక్టర్’. ఆ సినిమాకు ముందు ఆయన ఆ స్థాయి రౌద్రపూరితమైన పాత్ర చేయలేదు. ఆ సినిమా తర్వాత బాలకృష్ణ చేసిన ఏమోషనల్ కేరక్టర్లు అంటే... సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, లక్ష్మీనరసింహ, సింహా చిత్రాలనే చెప్పుకోవాలి. బాలయ్య ఇమేజ్‌ని ఆకాశమంత ఎత్తులో నిలబెట్టిన సినిమాలివి. మళ్లీ ఆ స్థాయి సినిమాలు బాలయ్య నుంచి రాలేదు. ప్రస్తుతం ఆయన బోయపాటి శ్రీను దర్శకత్వంలో ‘లెజెండ్’ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులోని బాలకృష్ణ పాత్ర గత చిత్రాలను తలదన్నే స్థాయిలో ఉంటుందని సమాచారం. ఇదిలావుంటే.. బాలయ్య మరో మాస్ డెరైక్టర్‌కి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేశారని తెలిసింది. ఆ దర్శకుడు ఎవరో కాదు. తమిళ మాస్ డెరైక్టర్ హరి. యముడు, సింగం-2 చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న దర్శకుడాయన. హరి చెప్పిన లైన్ నచ్చడంతో బౌండ్ స్క్రిప్ట్‌తో రమ్మని హరిని బాలయ్య పురమాయించినట్లు తెలిసింది. ఇటీవలే ‘సింగం-2’ చిత్రం కూడా బాలయ్య చూశారట. హరి దర్శకత్వంలో నటించబోయే చిత్రంలో బాలకృష్ణ పవర్ఫుల్ పోలీస్‌గా కనిపిస్తారని తెలిసింది. డిసెంబర్లో ఈ సినిమా సెట్స్‌కి వెళుతుందని, ‘ఈగ’ నిర్మాత సాయి కొర్రపాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తారని కూడా వార్తలు వినిపిస్తున్నాయి.