మరో వీకెండ్ వచ్చేసింది. 'ప్రణయ గోదారి', 'ఫియర్', 'పని', 'మిస్ యూ' లాంటి చోటామోటా మూవీస్ థియేటర్లలోకి వచ్చాయి. వీటిపై బజ్ పెద్దగా లేదు. దీంతో ప్రేక్షకుల దృష్టి ఓటీటీలపై పడింది. అందుకు తగ్గట్లే ఈ శుక్రవారం ఒక్కరోజే 18 సినిమాలు-వెబ్ సిరీసులు వచ్చేశాయి. వీటిలో పలు తెలుగు మూవీస్, డబ్బింగ్ చిత్రాలు ఉండటం విశేషం.
(ఇదీ చదవండి: అవినాష్ జస్ట్ కమెడియన్ కాదు! బిగ్‌బాస్ ఎలివేషన్స్ వేరే లెవల్)
మెకానిక్ రాకీ, సింగం ఎగైన్, బొగెన్ విల్లా లాంటి సినిమాలు కాస్త ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తున్నాయి. 'హరికథ' సిరీస్ కూడా ఈ రోజే రిలీజైంది. ఇంతకీ ఏయే ఓటీటీల్లో ఏ మూవీస్ స్ట్రీమింగ్ అవుతున్నాయంటే?
ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన మూవీస్ (డిసెంబరు 13)
నెట్‌ఫ్లిక్స్
మిస్ మ్యాచ్డ్ సీజన్ 3 - హిందీ సిరీస్
1992 - స్పానిష్ సిరీస్
క్యారీ ఆన్ - ఇంగ్లీష్ సినిమా
డిజాస్టర్ హాలీడే - ఇంగ్లీష్ మూవీ
ట్యాలెంట్ లెస్ టకానో - జపనీస్ సిరీస్ (డిసెంబర్ 14)
లా పల్మా - నార్వేజియన్ సిరీస్ (ఆల్రెడీ స్ట్రీమింగ్)
నో గుడ్ డీడ్ - ఇంగ్లీష్ సిరీస్ (స్ట్రీమింగ్ అవుతోంది)
అమెజాన్ ప్రైమ్
మెకానిక్ రాకీ - తెలుగు సినిమా
బండిష్ బండిట్స్ సీజన్ 2 - హిందీ సిరీస్
సింగం ఎగైన్ - హిందీ సినిమా
కథ ఇన్నువరె - మలయాళ మూవీ
రెడ్ వన్ - తెలుగు డబ్బింగ్ సినిమా (ఆల్రెడీ స్ట్రీమింగ్)
హాట్‌స్టార్
హరికథ - తెలుగు సిరీస్
ఎల్టన్ జాన్ - ఇంగ్లీష్ మూవీ
ఇన్విజబుల్ - స్పానిష్ సిరీస్
జీ5
డెస్పాచ్ - హిందీ సినిమా
ఆహా
వేరే లెవల్ ఆఫీస్ - తెలుగు సిరీస్
జియో సినిమా
బూకీ సీజన్ 2 - ఇంగ్లీష్ సిరీస్
పారిస్ & నికోల్ - ఇంగ్లీష్ సిరీస్
లయన్స్ గేట్ ప్లే
షో ట్రైల్ సీజన్ 2 - ఇంగ్లీష్ సిరీస్
ఆపిల్ ప్లస్ టీవీ
వండర్ పెట్స్ - ఇంగ్లీష్ సిరీస్
సోనీ లివ్
బొగెన్ విల్లా - తెలుగు డబ్బింగ్ మూవీ
(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 8కు అందుకే వచ్చానన్న గౌతమ్.. ఏడ్చేసిన అవినాష్!)
Comments
Please login to add a commentAdd a comment