
కామెడీ తప్ప ఏం చేయగలవ్? ఫినాలేలో అడుగుపెట్టే అర్హత నీకు లేదు.. ఇలాంటి కామెంట్లను తట్టుకుని ఈ సీజన్‌లోనే ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యాడు ముక్కు అవినాష్. నామినేషన్స్‌లోకి ఒకే ఒకవారం రాగా.. నబీల్ ఇచ్చిన ఎవిక్షన్ షీల్డ్ సాయంతో ఆ వారం గండం గట్టెక్కాడు. తర్వాత మెగా చీఫ్ అయ్యాడు, టికెట్ టు ఫినాలే గెలిచి ఫైనలిస్ట్ అయ్యాడు.

కొందరే స్నేహితులు..
ఈ సీజన్‌కు ఎంటర్‌టైన్‌మెంట్‌ను జోడించిన అవినాష్ తన ప్రయాణాన్ని తలుచుకుని భావోద్వేగానికి లోనయ్యాడు. తెలియని సముద్రం భయాన్ని పెంచితే.. తెలిసిన సముద్రం అంచనాలను పెంచుతుంది. ఈరోజు మీరీ స్థానంలో నిలిచి ఆ నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు. ఈ ఇంట్లో కొందరే మీకు స్నేహితులైనా అందరూ మీకు ఆప్తులే..

జస్ట్ కమెడియన్ కాదు
మీ భార్యకెంతో ఇష్టమైన రింగుల జుట్టును ఆటపై ప్రేమతో త్యాగం చేశారు. ఈసారి అవినాష్ కామెడీ మాత్రమే చేయగలిగే జస్ట్ కమెడియన్ కాదు.. అన్నీ చేయగలిగే ఎంటర్‌టైనర్‌లా మిమ్మల్ని మీరు ఆవిష్కరించారు. అన్ని అనారోగ్యాల నుంచి ఉపశమనం ఇచ్చే దివ్యౌషధం నవ్వు ఒక్కటే! ఆ నవ్వును పంచే మీరు అందరికన్నా ఐశ్వర్యవంతులు అంటూ బిగ్‌బాస్ అవినాష్‌పై ప్రశంసలు కురిపించాడు.
Comments
Please login to add a commentAdd a comment