‘సింగం’ దర్శకుడితో సినిమా..?
‘సింగం’ దర్శకుడితో సినిమా..?
Published Mon, Nov 11 2013 1:40 AM | Last Updated on Wed, Aug 29 2018 1:59 PM
బాలకృష్ణను యాంగ్రీయంగ్‌మేన్‌గా ఆవిష్కరించిన తొలి సినిమా ‘రౌడీ ఇన్‌స్పెక్టర్’. ఆ సినిమాకు ముందు ఆయన ఆ స్థాయి రౌద్రపూరితమైన పాత్ర చేయలేదు. ఆ సినిమా తర్వాత బాలకృష్ణ చేసిన ఏమోషనల్ కేరక్టర్లు అంటే... సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, లక్ష్మీనరసింహ, సింహా చిత్రాలనే చెప్పుకోవాలి. బాలయ్య ఇమేజ్‌ని ఆకాశమంత ఎత్తులో నిలబెట్టిన సినిమాలివి. మళ్లీ ఆ స్థాయి సినిమాలు బాలయ్య నుంచి రాలేదు. ప్రస్తుతం ఆయన బోయపాటి శ్రీను దర్శకత్వంలో ‘లెజెండ్’ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులోని బాలకృష్ణ పాత్ర గత చిత్రాలను తలదన్నే స్థాయిలో ఉంటుందని సమాచారం.
ఇదిలావుంటే.. బాలయ్య మరో మాస్ డెరైక్టర్‌కి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేశారని తెలిసింది. ఆ దర్శకుడు ఎవరో కాదు. తమిళ మాస్ డెరైక్టర్ హరి. యముడు, సింగం-2 చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న దర్శకుడాయన. హరి చెప్పిన లైన్ నచ్చడంతో బౌండ్ స్క్రిప్ట్‌తో రమ్మని హరిని బాలయ్య పురమాయించినట్లు తెలిసింది. ఇటీవలే ‘సింగం-2’ చిత్రం కూడా బాలయ్య చూశారట. హరి దర్శకత్వంలో నటించబోయే చిత్రంలో బాలకృష్ణ పవర్‌ఫుల్ పోలీస్‌గా కనిపిస్తారని తెలిసింది. డిసెంబర్‌లో ఈ సినిమా సెట్స్‌కి వెళుతుందని, ‘ఈగ’ నిర్మాత సాయి కొర్రపాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తారని కూడా వార్తలు వినిపిస్తున్నాయి.
Advertisement
Advertisement