Sai Korrapati
-
పది రోజుల్లో అడ్వాన్స్ చెక్ అందింది
శ్రీ సింహా కోడూరి హీరోగా రూపొందిన చిత్రం ‘తెల్లవారితే గురువారం’. సాయి కొర్రపాటి సమర్పణలో రజని కొర్రపాటి, రవీంద్ర బెనర్జీ ముప్పనేని నిర్మించిన ఈ సినిమా నేడు విడుదలవుతోంది. చిత్రదర్శకుడు మణికాంత్ మాట్లాడుతూ– ‘‘ఆర్ఎక్స్ 100’కు అజయ్ భూపతిగారి వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేశాను. ‘తెల్లవారితే గురువారం’ కథ నచ్చడంతో శ్రీ సింహానే నిర్మాతలను మాట్లాడారు. పది రోజుల్లోనే అడ్వాన్స్ చెక్ చేతికిచ్చారు. సింహా తన పాత్రకి న్యాయం చేశారు. మ్యూజిక్‌తో కాలభైరవ ఈ సినిమాని మరో మెట్టుపైకి ఎక్కించారు. ఈ చిత్రానికి కథ, మాటలు నా ఫ్రెండ్ నాగేంద్రవే. ప్రస్తుతానికి రెండు కథలున్నాయి. ఎప్పటికైనా నా అభిమాన హీరో తారక్ (జూనియర్ ఎన్టీఆర్)తో ఓ సినిమా చేయలనేది నా కల’’ అన్నారు. -
శ్రీ విష్ణు భళా.. ప్రారంభం
వైవిధ్యమైన చిత్రాలు నిర్మించే సాయి కొర్రపాటి తాజాగా ‘భళా తందనాన’ అనే సినిమాకి శ్రీకారం చుట్టారు. శ్రీ విష్ణు హీరోగా ‘బాణం’ దర్శకుడు చైతన్య దంతులూరి దర్శకత్వంలో సాయి కొర్రపాటి సమర్పణలో రజనీ కొర్రపాటి నిర్మిస్తున్న ఈ సినిమాలో కేథరిన్ కథానాయిక. మంగళవారం జరిగిన ఈ చిత్రం ప్రారంభోత్సవంలో తొలి సన్నివేశానికి ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి కెమెరా స్విచ్చాన్ చేయగా, శ్రీశైల దేవస్థానం మాజీ ప్రధాన సలహాదారు పురాణపండ శ్రీనివాస్ క్లాప్‌నిచ్చారు. కీరవాణి సతీమణి శ్రీవల్లి, రాజమౌళి సతీమణి రమా రాజమౌళి స్క్రిప్ట్‌ను చిత్రబృందానికి అందించారు. మార్చిలో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది. -
పురాణపండపై బాలకృష్ణ, కొర్రపాటి ప్రశంసలు
పవిత్ర హృదయం, నిశ్చలమైన భక్తితోనే ‘శ్రీనివాసో విజయతే’ వంటి అపురూప గ్రంథాలను వేలకొలది భక్తగణానికి నందమూరి బాలకృష్ణ , సాయి కొర్రపాటి సమర్పించగలిగారని ‘ద్వారకా తిరుమల’ అర్చక బృందం ప్రశంసల వర్షం కురిపించింది. వైకుంఠ ఏకాదశి సందర్భంగా హీరో నందమూరి బాలకృష్ణ, వారాహి చలనచిత్రం అధినేత సాయి కొర్రపాటి ‘శ్రీనివాసో విజయతే’ ఏడు వేల ప్రతులను ద్వారకా తిరుమల దేవస్థాన అధికారులకు అందజేశారు. అదేవిధంగా వైకుంఠ ఏకాదశి సందర్భంగా ద్వారకా తిరుమలేశుడిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులకు సాయి కొర్రపాటి ఉచితంగా పంపిణిచేశారు. కాగా, ఈ గ్రంథాలు చదివిన భక్తులు తిరుమలేశుడి భక్తి పారవశ్యంలో మునిగితేలుతున్నారు. ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ 'శ్రీనివాసో విజయతే' గంధాన్ని రచించారు. ప్రఖ్యాత ఆధ్యాత్మిక సంస్థ జ్ఞాన మహా యజ్ఞ కేంద్రం ప్రచురించింది. గతంలో నందమూరి బాలకృష్ణ సమర్పణలో 500 అఖండ ఆంజనేయ చిత్రాలతో, యంత్ర మంత్రాత్మకంగా 'నేనున్నాను' మహాగ్రంథాన్ని వారాహి సంస్థ ప్రచురించింది. ఈ గ్రంథాన్ని కూడా పురాణపండ శ్రీనివాస్ రచించి జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించారు. ఈ సందర్భంగా పురాణపండ శ్రీనివాస్‌పై బాలకృష్ణ, సాయికొర్రపాటి ప్రశంసల వర్షం కురిపించారు. -
మెగా అల్లుడి ‘విజేత’
-
రేపే మెగా అల్లుడి ‘విజేత’ టీజర్
మెగా ఫ్యామిలీ నుంచి చాలా మంది హీరోలు వచ్చారు. మెగా సపోర్ట్‌తో ఎంట్రీ ఇచ్చినా.. తమకంటూ ప్రత్యేక శైలిని ఏర్పరుచుకున్నారు మెగా హీరోలు. ఈ నేపథ్యంలో చిరు చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ టాలీవుడ్‌కు ఎంట్రీ ఇవ్వనున్న విషయం తెలిసిందే. త్వరలోనే ‘విజేత’గా మన ముందుకు రాబోతున్నారు. ఇటీవలె విడుదల చేసిన ఫస్ట్ లుక్కు పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను రేపు (జూన్ 12)న విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. ఈ నెల 24న జరిగే ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా రాబోతున్నట్లు ప్రకటించారు. మెగాస్టార్ మాత్రమే కాక మిగతా మెగా హీరోలందరూ హాజరు కాబోతున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా ఈ హీరోకు మెగా ఫ్యామిలీ సపోర్ట్ గట్టిగానే ఉండబోతోందని తెలుస్తోంది. కళ్యాణ్ దేవ్‌కు జోడిగా మాళవికా నాయర్ నటిస్తోంది. రాకేశ్ శశి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఓ మైలురాయి చిత్రమైన విజేత సినిమా టైటిల్‌ను ఈ సినిమాకు పెట్టడంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. మరి ఈ సినిమా విజయవంతమై కళ్యాణ్ దేవ్‌ను బాక్సాఫీస్ వద్ద విజేతగా నిలబెడుతుందో లేదో వేచి చూడాలి. ఈ సినిమాకు సినిమాటోగ్రఫర్ : సెంథిల్‌కుమార్, నిర్మాత : రజనీ కొర్రపాటి, మ్యూజిక్ : హర్షవర్థన్ రామేశ్వర్. Teaser of #Vijetha marking the debut of #KalyaanDhev will be out on June 12th at 8:59 am. A film by @rakeshsashii under #SaiKorrapati Production |@vaaraahicc. @iamMalavikaNair @DOPSenthilKumar @murlisharma72 #HarshavardhanRameshwar |#VijethaTeaser pic.twitter.com/TDOjoZMEYI — BARaju (@baraju_SuperHit) June 11, 2018 -
అల్లుడు ఆన్ లొకేషన్
మెగా అల్లుడు ఇన్ యాక్షన్. యస్... హీరోగా బుధవారం చిరంజీవి అల్లుడు కల్యాణ్ దేవ్ యాక్షన్ మొదలు పెట్టారు. రాకేశ్ శశి దర్శకత్వంలో సాయి కొర్రపాటి, రజనీ కొర్రపాటి నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్‌లో మొదలైంది. ఇందులో మాళవికా నాయర్ హీరోయిన్. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ – ‘‘చిరంజీవిగారి అల్లుడు కల్యాణ్ దేవ్ పరిచయం అవుతున్న ఈ సినిమాను నిర్మిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. రాకేశ్ శశి ప్రిపేర్ చేసిన బ్యూటిపుల్ స్క్రిప్ట్‌ను ఎక్కడా రాజీపడకుండా తెరకెక్కిస్తాం. ‘బాహుబలి’ కెమెరామేన్ సెంథిల్ ఈ సినిమాకు పని చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఇంకా ఈ సినిమాలో బోలెడన్ని విశేషాలు ఉన్నాయి. ఈ షెడ్యూల్లో కల్యాణ్‌తో పాటు కీలక నటీనటుల పాల్గొంటారు’’ అని అన్నారు. ఈ సినిమాకు సమర్పణ: సాయి శివాని, సంగీతం: యోగేష్, సాహిత్యం: రెహమాన్. -
మరో మెగా హీరో ఎంట్రీ
ఇప్పటికే మెగా ఫ్యామిలీ నుంచి చిరంజీవి, పవన్ కళ్యాణ్‌ల తరువాత రామ్ చరణ్, అల్లు అర్జున్, సాయిధరమ్ తేజ్, వరుణ్ తేజ్, శిరీష్ లాంటి హీరో వచ్చారు. తాజాగా మెగాస్టార్ చిన్నల్లుడు కళ్యాణ్‌ను కూడా హీరోగా పరిచయం చేసేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా జరుగుతున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు మరో మెగా హీరో ఎంట్రీ పై వార్తలు వినిపిస్తున్నాయి. మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడట. చిరంజీవి హీరోగా తెరకెక్కిన శంకర్ దాదా ఎమ్బీబీయస్ సినిమాలో బాలనటుడిగా కనిపించాడు వైష్ణవ్. ఈ మెగా వారసుడిని హీరోగా పరిచయం చేసే బాధ్యతను నిర్మాత సాయి కొర్రపాటి తీసుకున్నారన్న టాక్ వినిపిస్తోంది. కొత్త దర్శకుడి సినిమాతో వైష్ణవ్ హీరోగా పరిచయం అయ్యే అకాశం ఉంది. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలవడనుందన్న టాక్ వినిపిస్తోంది. -
నిఖిల్ కాదన్న కథతో మెగా అల్లుడు..!
మెగా ఫ్యామిలీ నుంచి మరో హీరో అరంగేట్రానికి రంగం సిద్ధమవుతోంది. చిరంజీవి చిన్నల్లుడు, శ్రీజ భర్త కళ్యాణ్ కనుగంటి హీరోగా పరిచయం అయ్యేందుకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన కథా చర్చలు కూడా పూర్తయ్యాయన్న టాక్ వినిపిస్తోంది. జత కలిసే సినిమా ఫేం రాకేష్ శశి కళ్యాణ్ తొలి సినిమాకు దర్శకత్వం వహించనున్నాడట. అయితే ఈ సినిమాకు సంబంధించి మరో ఆసక్తికర వార్త టాలీవుడ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. ఈ కథ ముందుగా యంగ్ హీరో నిఖిల్ కు వినిపించారట. తండ్రి కొడుకుల మధ్య జరిగే సెంటిమెంట్ కథ కావటంతో తనకు సూట్ కాదన్న ఉద్దేశంతో నిఖిల్ రిజెక్ట్ చేశాడట. అయితే అదే కథ కళ్యాణ్ కు నచ్చటం, మెగాస్టార్ కూడా ఓకె చెప్పటంతో త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుందన్న ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాను సాయి కొర్రపాటి వారాహి చలన చిత్రం బ్యానర్ పై తెరకెక్కించనున్నారు. -
మరో మెగా వారసుడు రెడీ..!
మెగా ఫ్యామిలీ నుంచి ఇప్పటికే అరడజనుకుపైగా హీరోలు వెండితెర మీద సందడి చేస్తున్నారు. తాజాగా ఇదే ఫ్యామిలీ నుంచి మరో హీరో తెరంగేట్రానికి సిద్ధమవుతున్నాడు. మెగాస్టార్ అల్లుడు, చిరు చిన్న కూతురు శ్రీజ భర్త కళ్యాణ్ కనుగంటి సినీ ప్రవేశంపై చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఇంత వరకు మెగా ఫ్యామిలీ నుంచి అధికారిక ప్రకటన లేకపోయినా.. కళ్యాణ్ లుక్స్, మేకోవర్ చూస్తుంటే మాత్రం సినిమాల్లోకి రావటం ఖాయమనిపిస్తుంది. తాజాగా కళ్యాణ్ చేయబోయే సినిమాపై ఆసక్తికర వార్త టాలీవుడ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. కళ్యాణ్ ను తెరకు పరిచయం చేసే బాధ్యతను మెగా ఫ్యామిలీ దర్శకుడు రాకేష్ శశి(జత కలిసే ఫేం), నిర్మాత సాయి కొర్రపాటి లకు అప్పగించారట. అంతేకాదు రామ్ చరణ్ కథల ఎంపిక విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారని, మెగాస్టార్ ఓకే అన్న వెంటనే సినిమాను పట్టాలెకక్కించాలని భావిస్తున్నారట. ప్రస్తుతానికి ఈప్రాజెక్ట్ పై ఎలాంటి అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ లేకపోయినా.. త్వరలోనే మెగా అల్లుగా ఎంట్రీకిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. -
హీరోగా చేయాలని చేసిన సినిమా కాదిది!
‘‘ఇప్పుడు పనిగట్టుకుని హీరోగా చేయాల్సిన అవసరం నాకు లేదు. స్క్రిప్ట్ నచ్చడంతో ‘పటేల్ సార్’ చేశా. డైరెక్టర్స్ ఛాలెంజిగ్ రోల్స్ ఆఫర్ చేస్తే ఆ కిక్కే వేరు. అలా కిక్ ఇచ్చే పాత్రలు చేయడం నాకిష్టం. క్యారెక్టర్ ఆర్టిస్టుగా సినిమాలు పెరుగుతున్నాయి. అందుకే సూపర్ స్క్రిప్ట్ అనిపిస్తేనే హీరోగా చేస్తా’’ అన్నారు జగపతిబాబు. వాసు పరిమి దర్శకత్వంలో సాయి శివాని సమర్పణలో వారాహి చలన చిత్రంపై రజినీ కొర్రపాటి నిర్మాతగా, సాయి కొర్రపాటి నిర్మాణసారథ్యంలో రూపొందిన ‘పటేల్ సార్’ ఈ నెల 14న రిలీజ్ కానుంది. కొంత గ్యాప్ తర్వాత హీరోగా చేయడం, ఇతర విశేషాలను జగపతిబాబు ఈ విధంగా పంచుకున్నారు. ♦ ‘పటేల్ సార్’ పాత్ర నచ్చి, ఈ సినిమా చేశా. నిజానికి లుక్ కుదిరితేనే చేద్దామనుకున్నా. అందుకే, ఆ క్యారెక్టర్‌కి తగ్గట్టు మారిపోయా. సాయి కొర్రపాటిగారు నిర్మాత కావడంతో ఈ సినిమాకి బలం చేకూరింది. అందుకే ఈ సినిమాకి ఆయన ఫస్ట్ హీరో. యూనిట్లో ఉన్న 150 మందీ ఈ సినిమాకి హీరోలే. ∙ ♦ కొంతమంది డిస్టిబ్యూటర్స్, బయ్యర్స్ ఈ స్టోరీ లైన్ విని, సూపర్‌హిట్ సాధిస్తారని చెప్పారు. మలయాళంలో ‘పులి మురుగన్’ చేశాక అక్కడివాళ్లు నన్ను ‘డాడీ గిరిజా’ అని పిలవడం మొదలుపెట్టారు. ఈ సినిమా విడుదలయ్యాక తెలుగు ప్రేక్షకులు నన్ను ‘పటేల్ సార్’ అని పిలిస్తే, ఆశ్చర్యపోనక్కర్లేదు. ∙ ♦ ఈ సినిమా ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ట్రైలర్ చూసినవాళ్లల్లో కొందరు ఇది థ్రిల్లర్ సినిమానా లేక హర్రరా? అనుకునే అవకాశం ఉంది. కానీ ఫ్యామిలీ డ్రామాలో నడిచే థ్రిల్లర్ మూవీ. రాజమౌళిగారు నిజానికి దగ్గరగా ఉండే మనిషి. అలాంటి ఆయన ఈ సినిమా గురించి ట్వీట్ చేశారంటే సినిమా ఎంత బాగుంటుందో ఉహించుకోవచ్చు. ♦ ‘పటేల్ సార్’ సూపర్‌హిట్ అవ్వకపోతే నిరుత్సాహపడతాను. ఈ సినిమాపై నాకంత నమ్మకం ఉంది. ప్రేక్షకులు ఆదరిస్తారన్న నమ్మకమూ ఉంది. ∙ ♦ రిచ్ బిజినెస్‌మేన్, రిచ్ ఫాదర్ క్యారెక్టర్స్ అంటే నేనే అన్నట్లుగా అయిపోయింది. అందుకే ‘పూర్ క్యారెక్టర్స్’ వస్తే బాగుంటుందనుకుంటున్నా. కొంతమంది అడగడానికి మొహమాటపడి నాదాకా రారు. ఎవరైనా వచ్చి నన్ను కలవొచ్చు. కథ నచ్చితే ఎలాంటి రోల్స్ చేయడానికైనా రెడీ. ‘దంగల్’లో ఆమిర్‌ఖాన్ డిఫరెంట్ రోల్ ట్రై చేశారు. అలాంటి క్యారెక్టర్ ఒకటి చేయబోతున్నా. క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేసినప్పుడు మాత్రం హీరో తర్వాత నాకు పేరు రావాలని ట్రై చేస్తాను. నేను ఎవరితోనూ పోటీపడను. నా 20 సినిమాలూ నాకుంటాయి. ఆ విషయంలో ఎలాంటి సందేహం లేదు. ∙ ♦ ‘సముద్రం’ అనే టెలీఫిల్మ్ ప్లాన్ చేస్తున్నాం. కొన్ని బ్యాడ్ ఇన్సిడెంట్స్తో లైఫ్ ఆగిపోదు. యూటర్న్ తీసుకుని ఎక్కడో ఒకచోట మళ్లీ మంచిగా ప్రారంభం కావాల్సిందే. అందుకు నా జీవితం ఓ ఉదాహరణ. అది కొంతమందికి ఇన్స్పిరేషన్ అవ్వాలన్నది ఈ టెలీఫిల్మ్ ముఖ్యోద్దేశం. -
మోక్షజ్ఞ లాంచింగ్‌కు నిర్మాత ఫిక్స్
నందమూరి నటసింహం బాలకృష్ణ వారసుడిగా ఆయన తనయుడు మోక్షజ్ఞ సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇవ్వనున్న సంగతి తెలిసిందే. బాలకృష్ణ వందో సినిమాలోనే మోక్షజ్ఞ అతిథి పాత్రలో కనిపిస్తాడంటూ ప్రచారం జరిగినా.. కథా పరంగా కుదరకపోవటంతో విరమించుకున్నారు. అయితే తాజాగా మోక్షజ్ఞ లాంచింగ్ సినిమాను తానే నిర్మిస్తున్నట్టుగా ప్రకటించాడు నిర్మాత సాయి కొర్రపాటి. పలు సక్సెస్ఫుల్ చిత్రాలతో అభిరుచి గల నిర్మాతగా పేరు తెచ్చుకున్న సాయి కొర్రపాటి, బాలకృష్ణకు అత్యంత సన్నిహితుడు. అందుకే మోక్షజ్ఞను పరిచయం చేసే బాధ్యతను సాయికి అప్పగించాడు బాలయ్య. ప్రస్తుతానికి మోక్షజ్ఞ హీరోగా చేయబోయే సినిమా కోసం కథ ఎంపిక చేసే పనిలో ఉన్నారు నిర్మాత. వారాహి చలన చిత్ర బ్యానర్లో తెరకెక్కనున్న ఈ సినిమాను ఎప్పుడు ప్రారంభించేది మాత్రం సాయి కొర్రపాటి ప్రకటించలేదు. -
ఒకే ప్రపంచం..నాలుగు కథలు.. మనమంతా
మళయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ హీరోగా తెరకెక్కుతున్న తొలి తెలుగు సినిమా మనమంతా. విభిన్న చిత్రాల దర్శకుడు చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను అభిరుచి గల నిర్మాత సాయి కొర్రపాటి వారాహి చలనచిత్ర బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఫస్ట్ టీజర్ రిలీజ్ అయ్యింది. తొలి టీజర్లో పాత్రల పరిచయంతో పాటు సినిమాలో ఆ పాత్రలు ప్రవర్తించే తీరును కూడా చూపించాడు దర్శకుడు. ఒకే ప్రపంచం.. నాలుగు కథలు అన్న ట్యాగ్ లైన్లోనే ఈ సినిమాలో నాలుగు కీలక పాత్రలు ఉంటాయన్న హింట్ ఇచ్చిన దర్శకుడు ఆ పాత్రలను తొలి టీజర్లోనే పరిచయం చేసేశాడు. మహిత్, స్కూలుకు వెళ్లే 12 ఏళ్ల అమ్మాయి. అభిరామ్ ఇంజనీరింగ్ స్టూడెంట్. గాయత్రి హౌస్ వైఫ్, సాయిరాం సూపర్ మార్కెట్లో అసిస్టెంట్ మేనేజర్. ఇలా సినిమాలో నాలుగు కీలక పాత్రలను టీజర్లో పరిచయం చేశాడు దర్శకుడు. చాలాకాలం తరువాత గౌతమి టాలీవుడ్ స్క్రీన్ మీద రీ ఎంట్రీ ఇస్తుండగా, కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ తొలిసారిగా తెలుగు సినిమాలో నటిస్తున్నాడు. అంతేకాదు తన తొలి సినిమాలోనే ఓన్‌గా డబ్బింగ్ చెప్పుకొని అందరికీ షాక్ ఇచ్చాడు. ఇలాంటి క్రేజీ కాంబినేషన్‌ను సెట్ చేసి, రిలీజ్‌కు ముందే మంచి హైప్ క్రియేట్ చేసిన నిర్మాత సాయి కొర్రపాటి, క్వాలిటీ పరంగా కూడా అదే స్థాయిని చూపిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకొంటున్న ఈ సినిమాను తెలుగుతో పాటు మళయాళంలోనూ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. -
ఎన్టీఆర్, కృష్ణలను గుర్తు చేస్తున్నాడు
ప్రజెంట్ జనరేషన్ హీరోలు ఒక సినిమా సెట్స్ మీద ఉండగా, మరో సినిమా గురించి ఆలోచించే ప్రయత్నం కూడా చేయటం లేదు. ముఖ్యంగా స్టార్ ఇమేజ్ ఉన్న హీరోలైతే ఏడాదికి ఒక్క సినిమా చేయటమే గగనంగా కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఒకేసారి రెండు సినిమాల షూటింగ్లలో పాల్గొంటున్నాడు యంగ్ హీరో నారా రోహిత్. ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో యమా బిజీగా ఉన్న రోహిత్ ఒకేసారి రెండు సినిమాల షూటింగ్లలో పాల్గొంటున్నాడు. చాలాకాలం క్రితమే ప్రారంభమైన సావిత్రి షూటింగ్ ఇంకా కొనసాగుతూనే ఉండగా, ఇటీవల రాజా చెయ్యి వేస్తే సినిమాను మొదలు పెట్టాడు. ఈ రెండు సినిమాల షూటింగ్లలో ప్యారలల్‌గా పాల్గొంటున్న రోహిత్, అచ్చంగా రోజుకు 24 గంటలూ సెట్లోనే ఉంటున్నాడు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రాజా చెయ్యివేస్తే, ఆ తర్వాత సాయంత్రం 6 గంటల నుంచి మర్నాటి ఉదయం 6 గంటల వరకు సావిత్రి సినిమా షూటింగ్లలో పాల్గొంటున్నాడు. షాట్ బ్రేక్‌లలో రెస్ట్ తీసుకుంటూ యమా స్పీడుగా ఈ సినిమాలను పూర్తి చేసే పనిలో ఉన్నాడు. అప్పట్లో ఎన్టీఆర్, కృష్ణ లాంటి సీనియర్ హీరోలు ఇలాగే రోజులో రెండు మూడు సినిమాల్లో నటించేవారు. ఈ జనరేషన్లో ఒక్క రోహిత్ మాత్రమే ఇంత సాహసం చేస్తున్నాడు. -
నారా vs నందమూరి
ప్రస్తుతం టాలీవుడ్ అందరికంటే బిజీగా ఉన్న యంగ్ హీరో నారా రోహిత్. దాదాపు పది సినిమాలు చేతిలో ఉన్న ఈ యంగ్ హీరో ఇటీవలే 'రాజా చెయ్యి వేస్తే' అనే సినిమా అంగీకరించాడు. అంతేకాదు ఈ సినిమా కోసం ఓ ఆసక్తికరమైన కాంబినేషన్‌ను కూడా సెట్ చేస్తున్నాడు రోహిత్. కొత్త దర్శకుడు ప్రదీప్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో విలన్‌గా నందమూరి వారసుడిని ఎంపిక చేశారు. నందమూరి వారసుడిగా ఎంట్రీ ఇచ్చి హీరోగా నిలదొక్కుకోవడానికి తంటాలు పడుతున్న నటుడు తారక రత్న. గ్రాండ్‌గా లాంచ్ అయినా, తరువాత ఆ ఫాంను కొనసాగించలేకపోయాడు తారకరత్న. రవిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన అమరావతి సినిమాతో విలన్‌గా మారిన ఈ నందమూరి చిన్నోడు చాలాకాలం తర్వాత మరోసారి ప్రతినాయక నటిస్తున్నాడు. అది నారా రోహిత్‌కు ప్రతినాయకుడిగా కావటంతో ఈ వార్త మరింత హాట్ టాపిక్‌గా మారింది. వారాహి చలనచిత్ర బ్యానర్‌పై సక్సెస్ఫుల్ నిర్మాత సాయి కొర్రపాటి ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. రోహిత్ కెరీర్లో గతంలో ఎన్నడూ చేయని విధంగా ఫుల్‌లెంగ్త్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ సినిమాను తెరకెక్కించడానికి రెడీ అవుతున్నాడు దర్శకుడు ప్రదీప్. వెండితెర మీద నారా వర్సెస్ నందమూరి ఫార్ములా ఎంత వరకు వర్కవుట్ అవుతుందో చూడాలి. -
'తుంగభద్ర' ఆడియో ఆవిష్కరణ
-
ఊహలు గుసగుసలాడె...
నటుడు అవసరాల శ్రీనివాస్ దర్శకునిగా పరిచయమవుతున్న చిత్రం ‘ఊహలు గుస గుసలాడె’. సాయి కొర్రపాటి సమర్పణలో రజనీ కొర్రపాటి నిర్మిస్తున్న ఈ చిత్రంలో శౌర్య, రాశి ఖన్నా ముఖ్య పాత్రధారులు. కల్యాణి కోడూరి స్వరాలందించిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. సాయి కొర్రపాటి పాటలు సీడీని ఆవిష్కరించి అతిథులకు అందించారు. నటునిగా పరిశ్రమకు పరిచయమైనా, దర్శకత్వం తన లక్ష్యమని, సాయి కొర్రపాటి లాంటి నిర్మాత దొరకడం తన అదృష్టమని, నటీనటుల అభినయం, కల్యాణి కోడూరి పాటలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని అవసరాల శ్రీనివాస్ అన్నారు. అతిథులుగా విచ్చేసిన డి.సురేశ్‌బాబు, ఎం.ఎం.కీరవాణి, ఎస్.ఎస్.రాజమౌళి, వి.వి.వినాయక్, గుణ్ణం గంగరాజు, ఇంద్రగంటి మోహనకృష్ణ, బోయపాటి శ్రీను, అల్లరి నరేశ్, నాని, నందినీరెడ్డి, జెమినీ కిరణ్, దాము సినిమా విజయం సాధించాలని తమ ఆకాంక్షను వెలిబుచ్చారు. -
ఊహలు గుసగుసలాడె మూవీ ఆడియో లాంచ్
-
ఊహలు గుసగుసలాడె మూవీ పోస్టర్స్, వర్కింగ్ స్టిల్స్
-
‘సింగం’ దర్శకుడితో సినిమా..?
బాలకృష్ణను యాంగ్రీయంగ్‌మేన్‌గా ఆవిష్కరించిన తొలి సినిమా ‘రౌడీ ఇన్స్పెక్టర్’. ఆ సినిమాకు ముందు ఆయన ఆ స్థాయి రౌద్రపూరితమైన పాత్ర చేయలేదు. ఆ సినిమా తర్వాత బాలకృష్ణ చేసిన ఏమోషనల్ కేరక్టర్లు అంటే... సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, లక్ష్మీనరసింహ, సింహా చిత్రాలనే చెప్పుకోవాలి. బాలయ్య ఇమేజ్‌ని ఆకాశమంత ఎత్తులో నిలబెట్టిన సినిమాలివి. మళ్లీ ఆ స్థాయి సినిమాలు బాలయ్య నుంచి రాలేదు. ప్రస్తుతం ఆయన బోయపాటి శ్రీను దర్శకత్వంలో ‘లెజెండ్’ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులోని బాలకృష్ణ పాత్ర గత చిత్రాలను తలదన్నే స్థాయిలో ఉంటుందని సమాచారం. ఇదిలావుంటే.. బాలయ్య మరో మాస్ డెరైక్టర్‌కి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేశారని తెలిసింది. ఆ దర్శకుడు ఎవరో కాదు. తమిళ మాస్ డెరైక్టర్ హరి. యముడు, సింగం-2 చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న దర్శకుడాయన. హరి చెప్పిన లైన్ నచ్చడంతో బౌండ్ స్క్రిప్ట్‌తో రమ్మని హరిని బాలయ్య పురమాయించినట్లు తెలిసింది. ఇటీవలే ‘సింగం-2’ చిత్రం కూడా బాలయ్య చూశారట. హరి దర్శకత్వంలో నటించబోయే చిత్రంలో బాలకృష్ణ పవర్ఫుల్ పోలీస్‌గా కనిపిస్తారని తెలిసింది. డిసెంబర్లో ఈ సినిమా సెట్స్‌కి వెళుతుందని, ‘ఈగ’ నిర్మాత సాయి కొర్రపాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తారని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. -
పాటల పనిలో...
ఈగ, అందాలరాక్షసి చిత్రాలతో అభిరుచిగల నిర్మాతగా పేరు తెచ్చుకున్న సాయి కొర్రపాటి.. వారాహి చలనచిత్రం పతాకంపై ఓ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ప్రొడక్షన్ నం3గా రూపొందుతోన్న ఈ చిత్రం ద్వారా నటుడు అవసరాల శ్రీనివాస్ దర్శకునిగా పరిచయం అవుతున్నారు. శౌర్య, రాషి ఖన్నా జంటగా నటిస్తున్నారు. కల్యాణి కోడూరి స్వరాలందిస్తున్న ఈ చిత్రం పాటల రికార్డింగ్ ఇటీవలే మొదలైంది. అనంత శ్రీరామ్ సాహిత్యం అందించగా, సునీత తొలి పాటను ఆలపించారు. భిన్నమైన కథాకథనాలతో ఈ సినిమా ఉంటుందని సాయి కొర్రపాటి తెలిపారు. సిల్లీ మాంక్స్ సినిమా సహ నిర్మాణంలో రూపొందుతోన్న ఈ చిత్రానికి వెంకట్ సి.దిలీప్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. -
మెగాఫోన్ పట్టనున్న అవసరాల శ్రీనివాస్
ఆష్టా చెమ్మా, పిల్ల జమిందార్ చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులను మెప్పించిన ప్రముఖ నటుడు అవసరాల శ్రీనివాస్. త్వరలో ఓ తెలుగు చిత్రానికి దర్శకత్వం వహించనున్నట్లు వర్థమాన నటుడు అవసరాల శ్రీనివాస్ బుధవారం చెన్నైలో వెల్లడించారు. హాస్య ప్రధానంగా నడిచే కథకు హీరోతోపాటు ప్రముఖ హస్య నటులను ఎంపిక చేయనున్నట్లు చెప్పారు. అందుకు సంబంధించిన కథను రూపొందించినట్లు తెలిపారు. తాను నిర్మించనున్న చిత్రానికి సాయి కోర్రపాటి నిర్మాతగా వ్యవహారిస్తున్నారని చెప్పారు. ఆయన గతంలో ఈగ, అందాల రాక్షసి లాంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించారని శ్రీనివాస్ తెలిపారు. అలాగే ప్రముఖ దర్శకుడు శ్రీనివాస్ గోగినేనితో మరో చిత్రానికి పని చేస్తున్నట్లు ఆయన వివరించారు. ఆ చిత్రం కూడా ప్రధానంగా వినోదభరితంగా ఉంటుందన్నారు. ఆ రెండు చిత్రాలు త్వరలో ప్రారంభంకానున్నాయన్నారు.