
శ్రీ సింహా కోడూరి హీరోగా రూపొందిన చిత్రం ‘తెల్లవారితే గురువారం’. సాయి కొర్రపాటి సమర్పణలో రజని కొర్రపాటి, రవీంద్ర బెనర్జీ ముప్పనేని నిర్మించిన ఈ సినిమా నేడు విడుదలవుతోంది. చిత్రదర్శకుడు మణికాంత్ మాట్లాడుతూ– ‘‘ఆర్‌ఎక్స్ 100’కు అజయ్ భూపతిగారి వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేశాను. ‘తెల్లవారితే గురువారం’ కథ నచ్చడంతో శ్రీ సింహానే నిర్మాతలను మాట్లాడారు. పది రోజుల్లోనే అడ్వాన్స్ చెక్ చేతికిచ్చారు. సింహా తన పాత్రకి న్యాయం చేశారు. మ్యూజిక్‌తో కాలభైరవ ఈ సినిమాని మరో మెట్టుపైకి ఎక్కించారు. ఈ చిత్రానికి కథ, మాటలు నా ఫ్రెండ్ నాగేంద్రవే. ప్రస్తుతానికి రెండు కథలున్నాయి. ఎప్పటికైనా నా అభిమాన హీరో తారక్ (జూనియర్ ఎన్టీఆర్)తో ఓ సినిమా చేయలనేది నా కల’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment