Ajay Bhupathi
-
ప్రేమకథ షురూ
అభినవ్ మణికంఠ(Abhinav Manikanta), దివిజా ప్రభాకర్, తన్మయి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ప్రేమకథా చిత్రం ‘హే చికితా(Hey Chikittha)’. ధన్‌రాజ్ లెక్కల దర్శకత్వంలో ఎన్. అశోక ఆర్ఎన్ఎస్, ‘గరుడవేగ’ అంజి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.ఈ సినిమా టైటిల్ పోస్టర్‌ను దర్శకుడు అజయ్ భూపతి(Ajay Bhupathi) విడుదల చేశారు. ‘‘ఈ సినిమా షూటింగ్‌ను ప్రారంభించాం. తెలంగాణ, ఆంధ్రాలోని పలు లొకేషన్స్‌లో చిత్రీకరణ జరుపుతాం’’ అని యూనిట్ తెలిసింది. ఈ చిత్రానికి సంగీతం: చరణ్ అర్జున్, కెమేరా: ‘గరుడవేగ’ అంజి. -
ఆర్జీవీ శిష్యుడి సినిమా.. పోస్టర్ రిలీజ్ చేసిన 'మంగళవారం' డైరెక్టర్
మోహిత్ పెద్దాడ హీరోగా నటిస్తున్న చిత్రం నా లవ్ స్టోరీ. వినయ్ గోను దర్శకత్వం వహిస్తున్నారు. మహీర క్రియేషన్స్, సుప్రియ ఆర్ట్స్ బ్యానర్లపై దొమ్మరాజు అమరావతి, శ్రీకాంత్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నా లవ్ స్టోరీ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్‌ను 'మంగళవారం' చిత్ర దర్శకుడు అజయ్ భూపతి లాంచ్ చేశారు. ఈ సందర్భంగా అజయ్ భూపతి మాట్లాడుతూ... ఈ చిత్ర దర్శకుడు వినయ్ గోను, నేను ఆర్జీవీ గారి దగ్గర అసిస్టెంట్స్‌గా వర్క్ చేశాం.ఈ వాలంటైన్స్ డే సందర్బంగా ఈ సినిమా పోస్టర్‌ను లాంచ్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. పోస్టర్ చాలా కొత్తగా ఉంది. వినయ్ గోను ఈ సినిమా ద్వారా పెద్ద సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నాను" అన్నారు. దర్శకుడు వినయ్ గోను మాట్లాడుతూ.."మా పోస్టర్ లాంచ్ చేసిన అజయ్ భూపతికి ధన్యవాదాలు" అని చెప్పారు. సంగీత దర్శకుడు చరణ్ అర్జున్ మాట్లాడుతూ.."ఏం మాయ చేసావే లాంటి మ్యూజిక్ లవ్ స్టోరీకి సంగీతం అందించాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాను. అలాంటి నాకు డైరెక్టర్ వినయ్ గారు ఈ సినిమా ద్వారా అవకాశమిచ్చారు. ఈ అందమైన ప్రేమ కథకు అద్భుతమైన సంగీతాన్ని అందిస్తాను. మళ్లీ వచ్చే ప్రేమికుల రోజున ఇందులోని పాటలు అందరూ రింగ్ టోన్ పెట్టుకునేలా ఉంటాయన్న నమ్మకం ఉంది అన్నారు. మార్చి నెల మొదటి వారం నుంచి ఈ చిత్రం తొలి షెడ్యూల్ ప్రారంభిస్తామని నిర్మాతలు తెలిపారు. -
స్టార్ హీరో తనయుడితో అజయ్ భూపతి కొత్త సినిమా!
తొలి సినిమా ‘ఆర్.ఎక్స్ 100’తోనే టాలీవుడ్లో ఓ సంచలనం సృష్టించాడు డైరెక్టర్ అజయ్ భూపతి. ఆ తర్వాత తెరకెక్కించిన ‘మహా సముద్రం’ ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోయినా.. ‘మంగళవారం’మూవీతో మళ్లీ కల్ట్ హిట్ కొట్టాడు. గతేడాదిలో విడుదలైన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలలతో పాటు పలు అవార్డులను సొంతం చేసుకుంది. (చదవండి: దేవర..ఇక్కడ 20.. అమెరికాలోనూ 20కి పైనే!)ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందని అప్పుడే ప్రకటించాడు. దీంతో అజయ్ నెక్ట్స్ మూవీ అదే అకున్నారు. కానీ దాని కంటే ముందు ఓ భారీ సినిమాను తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నాడట అజయ్.యాక్షన్ బ్యాక్ డ్రాప్లో ఓ మంచి స్టోరీ రెడీ చేశాడట. ఈ సినిమాలో తమిళ స్టార్ హీరో విక్రమ్ తనయుడు ధృవ్ హీరోగా నటించబోతున్నట్లు తెలుస్తోంది. తెలుగుతో పాటు పాటు తమిళ్లో కూడా విడుదల చేయబోతున్నారట. ఇప్పటికే స్క్రిప్ట్ మొత్తం రెడీ అయిందట. ప్రొడక్షన్ పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఓ భారీ నిర్మాత సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. త్వరలోనే అధికారికంగా ఈ చిత్ర ప్రకటన చేయబోతున్నట్లు సమాచారం. -
టాలీవుడ్ డైరెక్టర్ అరుదైన ఘనత..!
ఆర్ఎక్స్ 100 మూవీతో బ్లాక్‌బస్టర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్న టాలీవుడ్ డైరెక్టర్ అజయ్ భూపతి. గతేడాది మంగళవారం సినిమాతో మరో సూపర్ హిట్ కొట్టారు. పాయల్ రాజ్‌పుత్ ప్రధాన పాత్రలో తెరకెక్కించి ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ మూవీ అభిమానుల ఆదరణ దక్కించుకుంది. తాజాగా అజయ్ భూపతికి అరుదైన అవార్డ్ వరించింది. ఇండియన్ వరల్డ్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఉత్తమ దర్శకుడిగా ఆయన ఘనత దక్కించుకున్నారు. మంగళవారం సినిమా హిట్ కావడంతోనే ఈ అవార్డ్‌కు ఎంపికయ్యారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. అవార్డ్ రావడం పట్ల సంతోషం వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా జ్యూరీ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ‘ కాగా.. అజయ్ భూపతి ఆర్ఎక్స్ 100తో టాలీవుడ్లో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత తెరకెక్కించిన మహాసముద్రం పెద్దగా హిట్ కొట్టలేకపోయింది. గతేడాది మంగళవారం మూవీతో మళ్లీ సక్సెస్ బాట పట్టారు. ఈ చిత్రంలో ప్రియదర్శి, నందిత శ్వేత, దివ్య పిళ్లై కీలక పాత్రలు పోషించారు. Elated to receive BEST DIRECTOR Award for #Mangalavaaram at "INDIAN WORLD FILM FESTIVAL 2024" 🔥 Thankyou @miniboxoffice Team for the honour 😇 pic.twitter.com/8gTebipvqu — Ajay Bhupathi (@DirAjayBhupathi) April 16, 2024 -
అక్కడ అవార్డుల ఖాతా తెరిచిన అజయ్ భూపతి 'మంగళవారం'
'ఆర్ఎక్స్ 100', 'మహాసముద్రం' చిత్రాల తర్వాత అజయ్ భూపతి దర్శకత్వం నుంచి వచ్చిన సినిమా 'మంగళవారం'. పాయల్ రాజ్‌పుత్ అద్భుతమైన నటనతో పాటు థ్రిల్లింగ్ రెస్పాన్స్‌తో థియేటర్లలో బ్లాక్ బస్టర్ చిత్రంగా నిలిచింది. ఈ చిత్రం ఇటీవల పాపులర్ ఓటీటీ సంస్థ అయిన డిస్నీ హాట్ స్టార్‌లో విడుదలై ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకులని కూడా అలరిస్తుంది. తాజాగా ఈ చిత్రం జైపూర్ ఫిలిం ఫెస్టివల్లో 4 అవార్డులని గెలుచుకుంది. దీంతో ఈ సినిమాకు పనిచేసినందుకు ఎంతో గర్వంగా ఉందని డైరెక్టర్ అజయ్ భూపతి తెలిపారు. డైరెక్టర్ అజయ్ భూపతి సక్సెస్ మీట్లో చెప్పినట్లుగా ప్రతిష్ఠాత్మకంగా జరిగే జైపూర్ ఫిలిం ఫెస్టివల్లో 4 అవార్డులను 'మంగళవారం' సినిమా గెలుచుకుందని చిత్ర నిర్మాతలు ముద్ర మీడియా వర్క్స్ స్వాతి రెడ్డి గునుపాటి, సురేష్ వర్మ తెలిపారు. తమ చిత్రానికి ఈ అవార్డ్స్ దక్కడం చాలా సంతోషం అని విన్నర్స్ పేర్లు వెల్లడించారు. కథ - కథనాలతో ఆకట్టుకుంటూనే సాంకేతిక పరంగా, నిర్మాణ పరంగా అద్భుతమైన విలువలున్న చిత్రంగా 'మంగళవారం' ఇప్పటికే దిగ్గజాల నుంచి ప్రశంసలు అందుకోగా ఈ అవార్డులు కేవలం ఆరంభం మాత్రమే అని తమ ఆనందం వ్యక్తం చేశారు చిత్ర దర్శకుడు, నిర్మాతలు. ముద్ర మీడియా వర్క్స్ స్వాతి రెడ్డి గునుపాటి, సురేష్ వర్మ నిర్మాణ భాగస్వామ్యంలో 'ఎ' క్రియేటివ్ వర్క్స్ పతాకం పై అజయ్ భూపతి ఈ చిత్ర నిర్మాణంలోకి భాగమయ్యారు. ► ఉత్తమ నటి - పాయల్ రాజపుత్ ► ఉత్తమ సౌండ్ డిజైన్ - రాజా కృష్ణన్ ► ఉత్తమ ఎడిటింగ్ - గుళ్ళపల్లి మాధవ్ కుమార్ ► ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్ - ముదసర్ మొహమ్మద్ -
మంగళవారం బ్యూటీ.. సినిమాల్లోకి రాకముందు ఏం చేసిందంటే?
ఆర్ఎక్స్100 ఫేమ్ అజయ్ భూపతి మరోసారి ప్రేక్షకులను థియేటర్లకు పరుగులు పెట్టించారు. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తనకు అచొచ్చిన హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ ప్రధానపాత్రలో మంగళవారం చిత్రాన్ని తెరకెక్కించారు. నవంబరు 17న రిలీజైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. విలేజ్ బ్యాక్‌డ్రాప్ స్టోరీకి తోడు హారర్, థ్రిల్లర్ కాన్సెప్ట్ కావడంతో మూవీ హిట్ అయిపోయింది. ఈ సినిమాకు రిలీజ్‌కు ముందే అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు తగ్గుట్టుగానే అజయ్ భూపతి మరోసారి తన మార్క్‌ను చూపించారు. ప్రస్తుతం ఈ చిత్రం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఈ సినిమాలో నటించిన హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. అంతే కాకుండా ఈ చిత్రంలో నటీనటులు కూడా దాదాపుగా సినిమాల్లో కనిపించినవాళ్లే. కానీ ఈ మంగళవారం చిత్రంలో అందరినీ ఆకర్షించిన ఓ క్యారెక్టర్ ఉంది. లీడ్ క్యారెక్టర్ పాయల్ రాజ్‌పుత్ అయినప్పటికీ.. సినిమా చూసినంత సేపు తన పాత్రలో కనిపించి అందరినీ ఆకట్టుకుంది. ఇంతకీ ఆ క్యారెక్టర్ ఎవరు? సినిమాల్లోకి ఎలా వచ్చింది? అచ్చం తెలుగుమ్మాయిలా కనిపించిన ఆమె ఇంతకుముందే టాలీవుడ్ సినిమాల్లో నటించిందా? ఆ వివరాలు తెలియాలంటే ఓ లుక్కేద్దాం. పాయల్ రాజ్‌పుత్ తర్వాత మంగళవారం తన అందంతో మెప్పించిన నటి మరెవరో కాదు.. జమీందార్ భార్య. ఈ చిత్రంలో చైతన్యకు భార్యగా తన నటన, అందంతో అందరినీ ఆకట్టుకుంది. అయితే ఆమెకు ఈ చిత్రం తెలుగులో మొదటి చిత్రమేమీ కాదు. మంగళవారం కంటే ముందే తగ్గేదేలే చిత్రంతో టాలీవుడ్‌కు పరిచయమైంది. దివ్య ప్రస్థానం ఆమె అసలు పేరు దివ్య పిళ్లై. కేరళకు చెందిన నారాయణ పిళ్లై, చంద్రిక దంపతులకు దివ్య దుబాయ్‌లో జన్మించింది. ఆమె తల్లిదండ్రులది కేరళలోని మావేలికర స్వగ్రామం. దివ్య పిళ్లై రెండవ కుమార్తె కాగా.. దుబాయ్‌లోనే చదువు పూర్తి చేసింది. ఇంజినీరింగ్ అయిపోయిన వెంటనే ఆమెకు దుబాయి ఎయిర్‌లైన్స్.. అరబ్ ఎమిరేట్స్‌లో ఉద్యోగం వచ్చింది. కలిసొచ్చిన స్నేహితుని పెళ్లి ఎయిర్‌లైన్ సిబ్బందిగా తన కెరీర్‌ను ప్రారంభించిన దివ్యకు అనుకోకుండా సినిమా ఛాన్స్ వచ్చింది. ఆమె తన స్నేహితుడి వివాహానికి వెళ్లగా.. అక్కడ డైరెక్టర్ వినీత్ కుమార్ ఆమెను చూశారు. ఆ తర్వాత 2015 మలయాళంలో పుష్ప విలన్ ఫాహాద్ ఫాజిల్ హీరోగా నటించిన అయల్ నంజళ్ల అనే చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమైంది. ఆ తర్వాత పృథ్వీరాజ్ నటించిన ఊజం చిత్రంలో నటించింది. ఈ రెండు బాక్సాఫీస్ వద్ద హిట్‌గా నిలిచాయి. బ్యాక్ టు బ్యాక్ రెండు హిట్ సినిమాలు, మలయాళంలో ఇద్దరు టాప్ హీరోల సరసన చేయడంతో ఫుల్ ఫోకస్ సినిమాలవైపే మళ్లింది. ఎయిర్‌లైన్ సిబ్బందిగా కెరీర్ ప్రారంభించిన పూర్తిగా సినిమాలపైనే దృష్టి పెట్టింది. అంతకుముందు ఎలాంటి నటనా అనుభవం లేకపోయినా వరుస సినిమా ఆఫర్లతో దూసుకెళ్తోంది. తెలుగులో నవీన్ చంద్ర నటించిన తగ్గదేలే చిత్రంలో కనిపించింది. ఇటీవలే రిలీజైన ఆర్య వెబ్ సిరీస్ ది విలేజ్‌లోనూ కీలక పాత్ర పోషించింది. అంతే కాకుండా మాస్టర్ పీస్ (2017), సేఫ్ (2019) చిత్రాలకు మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ ఏడాది మంగళవారం సినిమాతో సూపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్న దివ్య పిళ్లై ప్రస్తుతం మార్స్ అనే చిత్రంలో నటిస్తోంది. ఆమె సినిమాలతో పాటు మలయాళంలో సీరియల్స్, పలు షోలలో కనిపించింది. మంగళవారం కథేంటంటే? 1996లో ఆంధ్రాలోని ఓ పల్లెటూరు. ఊళ్లో ఇద్దరికి అక్రమ సంబంధం ఉందని ఎవరో గోడ మీద రాస్తారు. తర్వాతి రోజే ఆ ఇద్దరూ చనిపోయింటారు. పరువు పోవడంతో హత్య చేసుకున్నారని ఊరి జనం అనుకుంటారు. పోలీసులకు మాత్రం ఇవి హత్యలని అనుమానం. అలానే మరో మంగళవారం... ఇలానే గోడ మీద అక్రమ సంబంధం అని పేర్లు రాసిన తర్వాత మరో ఇద్దరు చనిపోతారు. ఇంతకీ గోడ మీద పేర్లు రాస్తున్నది ఎవరు? ఈ హత్యలతో శైలు (పాయల్ రాజ్‌పుత్)కి సంబంధమేంటి? చివరకు ఏమైందనేదే 'మంగళవారం' స్టోరీ. -
ఓటీటీలోకి వచ్చేసిన 'మంగళవారం' సినిమా.. స్ట్రీమింగ్ అందులోనే
సాధారణంగా కొత్త మూవీస్ ఏ శుక్రవారమో శనివారమో ఓటీటీల్లో రిలీజ్ అవుతుంటాయి. కొన్నికొన్నిసార్లు మాత్రం డిఫరెంట్‌గా వారం మధ్యలో విడుదల చేస్తుంటారు. అలా ఇప్పుడు ఓ తెలుగు హిట్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ అయిపోతుంది. అదే 'మంగళవారం'. పాయల్ రాజ్‌పుత్- అజయ్ భూపతి కాంబో.. ఈ మూవీతో మరో క్రేజీ హిట్ అందుకున్నాడు. హిట్ సినిమా 'ఆర్ఎక్స్ 100' సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన డైరెక్టర్ అజయ్ భూపతి.. ఆ తర్వాత 'మహాసముద్రం'తో ఘోరమైన ఫ్లాప్ అందుకున్నాడు. దీంతో ఎలాగైనా హిట్ కొట్టాలని 'మంగళవారం' మూవీ తీశారు. తనకు అచొచ్చిన పాయల్ రాజ్‌పుత్ ఇందులో హీరోయిన్గా చేసింది. విలేజ్ బ్యాక్‌డ్రాప్ స్టోరీకి తోడు హారర్, థ్రిల్లర్ కాన్సెప్ట్ కావడంతో మూవీ హిట్ అయిపోయింది. (ఇదీ చదవండి: బాలీవుడ్ మరో స్కామ్ బండారం బయటపెట్టిన 'యానిమల్' నిర్మాత) ఆ ఓటీటీలోనే అయితే థియేటర్లలో 'మంగళవారం' సినిమా.. నవంబరు 17న రిలీజ్ చేశారు. కానీ అదే టైంలో క్రికెట్ వరల్డ్‌కప్ ఫైనల్ ఉండటంతో దీన్ని జనాలు సరిగా పట్టించుకోలేదు. ఇప్పుడు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీలోకి ఈ చిత్రం వచ్చేసింది. కాబట్టి ఎంచక్కా ఇంట్లోనే చూసేయొచ్చు. థియేటర్లలో ఈ మూవీని శుక్రవారం రిలీజ్ చేశారు గానీ ఓటీటీలో మాత్రం మంగళవారమే రిలీజ్ చేశారండోయ్. తెలుగుతో పాటు దక్షిణాదిలోని అన్ని భాషల్లో 'మంగళవారం' స్ట్రీమింగ్ అవుతుండటం విశేషం. ఈ మూవీలో కొన్ని అడల్ట్ సీన్స్ ఉంటాయి. కాబట్టి ఫ్యామిలీతో కలిసి చూడకండి! కథేంటి? 1996లో ఆంధ్రాలోని ఓ పల్లెటూరు. ఊళ్లో ఇద్దరికి అక్రమ సంబంధం ఉందని ఎవరో గోడ మీద రాస్తారు. తర్వాతి రోజే ఆ ఇద్దరూ చనిపోయింటారు. పరువు పోవడంతో హత్య చేసుకున్నారని ఊరి జనం అనుకుంటారు. పోలీసులకు మాత్రం ఇవి హత్యలని అనుమానం. అలానే మరో మంగళవారం... ఇలానే గోడ మీద అక్రమ సంబంధం అని పేర్లు రాసిన తర్వాత మరో ఇద్దరు చనిపోతారు. ఇంతకీ గోడ మీద పేర్లు రాస్తున్నది ఎవరు? ఈ హత్యలతో శైలు (పాయల్ రాజ్‌పుత్)కి సంబంధమేంటి? చివరకు ఏమైందనేదే 'మంగళవారం' స్టోరీ. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 27 సినిమాలు రిలీజ్) -
ఓటీటీలోకి 'మంగళవారం' థ్రిల్లర్ సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
పాయల్ రాజ్‌పూత్ ప్రధాన పాత్రలో అజయ్ భూపతి తెరకెక్కించిన పాన్ ఇండియా సినిమా 'మంగళవారం'. మిస్టీరియస్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా నవంబర్ 17న విడుదలైంది. 'ఆర్ఎక్స్ 100' లాంటి విజయం తర్వాత హీరోయిన్ పాయల్ రాజ్‌పూత్, డైరెక్టర్ అజయ్ భూపతి కాంబినేషన్లో ఈ సినిమా వచ్చింది. స్వాతిరెడ్డి గునుపాటి, సురేష్ వర్మ సంయుక్తంగా దీనిని నిర్మించారు. నందిత శ్వేత, దివ్య పిళ్లై, అజయ్ ఘోష్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న మంగళవారం చిత్రం ఓటీటీలోకి విడుదల అయ్యేందకు రెడీగా ఉంది. ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 26న మంగళవారం రోజునే ఈ చిత్రాన్ని ఓటీటీలోకి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట. అందుకు సంబంధించిన పోస్టర్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కానీ ఈ చిత్రం ఓటీటీ విడుదల గురించి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. థ్రిల్లర్ కాన్సెప్టెతో తెరకెక్కిన ఈ సినిమాలో పాయల్ రాజ్‌పూత్ నటనకు మంచి మార్కులే పడ్డాయి. 'ఆర్ఎక్స్ 100' సినిమా మాదిరే ఇందులో కూడా అదే రేంజులో అందాలను ఆరబోసింది పాయల్. ఇందులో ఆమె నటనకు ఎవరైనా ఫిదా అవుతారు.. అంతలా ఈ సినిమా కోసం ఆమె గ్రౌండ్ వర్క్ చేసిందని చెప్పవచ్చు. సినిమా ప్రారంభంలో కథలో ట్విస్ట్‌లు ఇస్తూ వెళ్లిన దర్శకుడు సెకండాఫ్‌లో ఒక్కొక్కటి రవీల్ చేసిన విధానానికి ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యారు. సినిమా చివరి 45 నిమిషాల్లో ఎన్నో ట్విస్టులు ఉంటాయి. 'కాంతార'కు అజనీష్ అందించిన మ్యూజిక్ మంగళవారం సినిమాకు బాగా ప్లస్ అయింది. ముఖ్యంగా 'గణగణ మోగాలి' పాటకు ఆయన అందించిన మ్యూజిక్‌తో పూనకాలు వచ్చేస్తాయి. -
నెటిజన్‌కు ఇచ్చిపడేసిన హీరోయిన్!
ప్రస్తుతం సోషల్ మీడియాలో మంగళవారం మూవీ గురించే తెగ ట్రెండ్ అవుతోంది. ఆర్ఎక్స్100 పాయల్ రాజ్‌పుత్ ప్రధాన పాత్రలో వచ్చిన ఈ చిత్రం సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఇటీవలే థియేటర్లలో రిలీజైన మంగళవారం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. తనకు తొలి ఛాన్స్ ఇచ్చిన అజయ్ భూపతి దర్శకత్వంలోనే ఆమె నటించింది. పాయల్ ప్రధాన రోల్లో తెరకెక్కించిన ఈ చిత్రం నవంబరు 17న సినిమా థియేటర్లలో రిలీజైంది. బాక్సాఫీస్ వద్ద వసూళ్లతో దూసుకెళ్తోంది.(ఇది చదవండి: నన్ను హీరో చేసింది తెలుగు డైరెక్టరే.. అనిల్ కపూర్ ఆసక్తికర కామెంట్స్!)అయితే సోషల్ మీడియాలో పాయల్ రాజ్‌పుత్‌పై రోజుకు ట్రోల్స్ వస్తున్నాయి. తాజాగా ఓ నెటిజన్ చేసిన అసభ్యకర కామెంట్స్‌కు తనదైన శైలిలో ఇచ్చిపడేసింది. మంగళవారం చిత్రంలోని ఓ సీన్ క్లిప్‌ను ట్విటర్లో షేర్ చేసిన నెటిజన్ చాలా నీచంగా పోస్ట్ పెట్టాడు. ఆమె లో దుస్తులపై దారుణంగా కామెంట్స్ చేయడంతో దీనికి పాయల్ రియాక్ట్ అయింది. పాయల్ రాజ్‌పుత్ ఏమాత్రం భయపడకుండా గట్టిగానే కౌంటరిచ్చింది. అది నాది కాదు.. ప్రొడక్షన్ హౌస్ వాళ్లు ఇచ్చింది' తనదైన శైలిలో బుద్ది చెప్పింది. ఇది చూసిన నెటిజన్స్ సైతం అతని తీరును వ్యతిరేకిస్తున్నారు. -
నా జీవితాన్ని 'మంగళవారం' మార్చింది: ప్రియదర్శి
‘‘అజయ్ భూపతికథ చెబితే సుదర్శన్ థియేటర్లో సినిమా చూస్తున్నట్లు ఉంటుంది. ‘మహాసముద్రం’ కథ వింటూ పదిసార్లు ఉలిక్కిపడ్డా. అయితే డేట్స్ కుదరక నేనా సినిమా చేయలేకపోయా. ఒక్క మాటలో మాట్లాడుకునే పాయింట్‌తో ‘మంగళవారం’ని రెండున్నర గంటల సినిమాగా నిజాయతీగా చెపారు అజయ్ భూపతి’’ అని హీరో విశ్వక్ సేన్ అన్నారు. పాయల్ రాజ్‌పుత్ లీడ్ రోల్లో అజయ్ భూపతి దర్శకత్వం వహించిన చిత్రం ‘మంగళవారం’. స్వాతీ రెడ్డి గునుపాటి, ఎం. సురేష్ వర్మ, అజయ్ భూపతి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 17న విడుదలైంది. ఈ సినిమా సక్సెస్ మీట్లో అజయ్ భూపతి మాట్లాడుతూ–‘‘పాయల్ పాత్రని అర్థం చేసుకుంటారా? రిసీవ్ చేసుకుంటారా అని కాస్త భయపడ్డా. అయితే ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు’’ అన్నారు. ప్రియదర్శి మాట్లాడుతూ.. ‘నా సినిమా అంటే ఓటీటీలో వచ్చినప్పుడు చూసుకోవచ్చని అనుకుంటారేమో... ఇది థియేటర్లలో చూడాల్సిన సినిమా. ప్రతి నటుడు శుక్రవారం తన జీవితం మారుస్తుందని వెయిట్ చేస్తాడు. నాకు ఒక 'మంగళవారం' మార్చింది. నా జీవితంలో గుర్తుపెట్టుకునే 'మంగళవారం' ఇది. దీనికి కారణం అజయ్ భూపతి. ఆయన ఆడిషన్స్ అంటే మళ్లీ వెళతా’ అన్నారు. ‘మా సంస్థలో తీసిన తొలి సినిమా ‘మంగళవారం’ని సక్సెస్ చేసిన ప్రేక్షకులకు పాదాభివందనం’ అన్నారు సురేష్ వర్మ. -
‘మంగళవారం’ మూవీలో మాస్క్‌లో ఉంది ఎవరో తెలుసా...(ఫొటోలు)
-
మంగళవారం మూవీ.. ఆ టాలీవుడ్ హీరోను దించేశారుగా!
'ఆర్ఎక్స్ 100' సినిమాతో హీరోయిన్గా పరిచయమైన బ్యూటీ పాయల్ రాజ్‌పుత్. ఆ తర్వాత ఒక్క సరైనా హిట్ పడలేదు. తాజాగా బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన దర్శకుడు అజయ్ భూపతితోనే మళ్లీ జతకట్టింది. పాయల్ ప్రధాన రోల్లో తెరకెక్కించిన మంగళవారం మూవీ నవంబరు 17న సినిమా థియేటర్లలో రిలీజైంది. మొదటి రోజే ఆడియన్స్ నుంచి పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఆర్ఎక్స్100 మూవీతో తొలి ప్రయత్నంలోనే ప్రేక్షకులను మెప్పించారు అజయ్ భూపతి. అయితే ఆ తర్వాత అజయ్ మహాసముద్రం మూవీ డిజాస్టర్‌గా నిలిచింది. దీంతో ఈసారి ఎలాగైనా హిట్టు కొట్టాలన్న లక్ష్యంతో పాయల్‌తో కలిసి ‘మంగళవారంతో దూసుకొచ్చారు. (ఇదీ చదవండి: Bigg Boss 7: ఈ వారం డబుల్ ఎలిమినేషన్.. ఆ ఇద్దరు ఔట్?) అయితే ఈ చిత్రం గురించి పాత్రలపై ఎప్పటికప్పుడు క్లారిటీ ఇస్తూనే వచ్చారు. కానీ ఈ సినిమాలోని ఓ లీడ్ క్యారెక్టర్ పేరును మాత్రం ఎక్కడా రివీల్ చేయలేదు. ఇంతలా సోషల్ మీడియా ఉన్న ఈ రోజుల్లో ఓ మెయిన్ రోల్ చేసిన హీరో పేరును బయటకు రాకుండా చేయడమంటే మామూలు విషయం కాదు. కానీ అజయ్ భూపతి చేసి చూపించారు. ఆ పాత్రలో నటించింది మన టాలీవుడ్ హీరోనే కావడం మరో విశేషం. ఇంతకీ అతనెవరో మీకు తెలుసుకోవాలనుందా? అయితే ఆ వివరాలేంటో ఓ లుక్కేద్దాం. మొత్తానికి ఈ చిత్రంలో లీడ్ రోల్ పోషించింది పాయల్ రాజ్‌పుత్. కానీ మన తెలుగు హీరో పేరును దాచి ఆడియన్స్‌కు బిగ్ సర్ప్రైజ్ ఇచ్చారు అజయ్. ఆ హీరో మరెవరో కాదు.. బలగం ఫేమ్ ప్రియదర్శి పులికొండ. వేణు యెల్దండి దర్శకత్వంలో తెరకెక్కించిన బలగం సినిమాలో నటించారు. ఈ విషయాన్ని ఎక్కడా రివీల్ చేయకుండా జాగ్రత్త పడ్డారు. ఈ రోజుల్లో పెద్ద పెద్ద సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ లీక్ అవుతున్నాయి. అలాంటిది ప్రియదర్శి నటించాడనే విషయాన్ని మాత్రం బయటకు రాకుండా జాగ్రత్త పడ్డారంటే మంగళవారం చిత్రబృందాన్ని మెచ్చుకోవాల్సిందే. (ఇదీ చదవండి: Mangalavaaram Review: ‘మంగళవారం’ మూవీ రివ్యూ) #Mangalavaram in Theatres now 💥💐💥💐 pic.twitter.com/8pOArYDuPZ — Moviezupp Entertainment (@moviezupp) November 17, 2023 -
Mangalavaaram Review: ‘మంగళవారం’ మూవీ రివ్యూ
టైటిల్: మంగళవారం నటీనటులు: పాయల్ రాజ్‌పుత్, నందితా శ్వేతా, రవీంద్ర విజయ్, శ్రీ తేజ్, చైతన్య కృష్ణ, శ్రవణ్ రెడ్డి, దివ్యా పిళ్ళై, అజయ్ ఘోష్, లక్ష్మణ్ తదితరులు నిర్మాతలు: స్వాతి రెడ్డి గునుపాటి, ఎం. సురేష్ వర్మ, అజయ్ భూపతి దర్శకత్వం:అజయ్ భూపతి సంగీతం: అజనీష్ లోకనాథ్ సినిమాటోగ్రఫీ: శివేంద్ర దాశరథి ఎడిటింగ్: మాధవ్ కుమార్ గుళ్లపల్లి విడుదల తేది: నవంబర్ 17, 2023 ‘మంగళవారం’కథేంటంటే.. ఈ సినిమా కథ 1986-96 మధ్య కాలంలో సాగుతుంది. మహాలక్ష్మిపురం గ్రామంలో వరుసగా ఇద్దరేసి చొప్పుగా చనిపోతుంటారు. అది కూడా ఆ గ్రామ దేవత మాలచ్చమ్మకి ఇష్టమైన మంగళవారం రోజున. ఆ ఊర్లో వివాహేతర సంబంధాలు పెట్టుకున్న ఓ ఆడ, మగ వ్యక్తుల పేర్లు ఎవరో గుర్తు తెలియని వ్యక్తుల గోడపై రాయడం.. అది చూసే వాళ్లు ఆత్మహత్య చేసుకున్నట్లు గ్రామస్తులంతా నమ్ముతారు. కానీ ఆ ఊరికి కొత్తగా వచ్చిన ఎస్సై మీనా(నందితా శ్వేత)మాత్రం అవి ఆత్మహత్యలు కావు హత్యలని అనుమానిస్తోంది. మృతదేహాలను పోస్ట్‌మార్టం చేయించాలని ప్రయత్నిస్తే.. ఆ ఊరి జమిందారు ప్రకాశం బాబు(చైతన్య కృష్ణ) ఒప్పుకోరు. మరో మంగళవారం కూడా ఊర్లో మరో ఇద్దరు అనుమానస్పదంగా చనిపోతారు. దీంతో ఎస్సై మీనా ఊర్లో వాళ్లను ఒప్పించి ఆ మృతదేహాలను పోస్ట్‌మార్టంకు తరలిస్తారు. ఊరి ప్రజలు మాత్రం గోడలపై రాతలు రాస్తున్న అజ్ఞాత వ్యక్తిని పట్టుకునేందుకు అర్థరాత్రులు గస్తీ నిర్వహిస్తారు. అసలు గోడపై రాస్తున్న అజ్ఞాత వ్యక్తి ఎవరు? అతని లక్ష్యమేంటి? ఊర్లో జరిగినవి హత్యలా? ఆత్మహత్యలా? వీటికి ఆ ఊరి నుంచి వేలివేయబడ్డ శైలజా అలియాస్ శైలు(పాయల్ర రాజ్‌పుత్)కు ఉన్న సంబంధం ఏంటి? శైలు నేపథ్యం ఏంటి? ఆమెను ఊరి నుంచి ఎందుకు వెలివేశారు? ఊర్లో జరిగే చావులకు ఫోటోగ్రాఫర్ వాసు (శ్రవణ్ రెడ్డి), డాక్టర్ (రవీంద్ర విజయ్), జమీందారు భార్య (దివ్యా పిళ్ళై), శైలు చిన్ననాటి స్నేహితుడు రవిలకు ఉన్న సంబంధం ఏంటి? చివరకు ఏం జరిగింది? అనేది థియేటర్స్‌లో మంగళవారం సినిమా చూసి తీరాల్సిందే. ఎలా ఉందంటే.. హారర్ టచ్‌తో సాగే రివేంజ్ డ్రామా థ్రిల్లర్ చిత్రమిది. దాంతో పాటు మహిళలకు సంబంధించి ఓ మంచి సందేశాన్ని కూడా అందించారు. అయితే ఆ సందేశాన్ని ఇచ్చేందుకు దర్శకుడు అల్లుకున్న కథ చాలా కొత్తగా ఉన్నా.. ప్రేక్షకులు చూసే కోణాన్ని బట్టి ఫలితం ఉంటుంది. ఎందుకంటే.. ఈ కథలో దర్శకుడు అజయ్ భూపతి చాలా సెన్సిటివ్ అయిన ‘హైపర్ సెక్స్ డిజార్డర్’ అనే మానసిక, లైంగిక రుగ్మత, వివాహేతర సంబంధాల గురించి చర్చించారు. అలా అని ఇది మెసేజ్ ఓరియెంటెంట్ ఫిల్మ్‌గా సాగదు. కథ ప్రారంభం నుంచే ఉత్కంఠ కొనసాగుతుంది. ఈ సినిమా ఉన్న మరో ప్రత్యేకత ఏంటంటే.. ఇంటర్వెల్ వరకు మెయిన్ క్యారెక్టర్ ఎంట్రీ ఉండదు.. అసలు కథ ప్రారంభం కాదు కానీ.. ఎక్కడ బోర్ కొట్టదు. అద్భుతమైన స్క్రీన్‌ప్లేతో మాయ చేశాడు అజయ్ భూపతి. శైలు చిన్ననాటి ఎపిసోడ్‌తో కథ ప్రారంభం అవుతుంది. తల్లి చనిపోవడం..తండ్రి మరోపెళ్లి చేసుకోవడం..అమ్మమ్మ దగ్గరే శైలు పెరగడం.. ఇలా మొదటి నుంచే హీరోయిన్ క్యారెక్టర్‌పై సానుభూతి కలిగించేలా కథను మలిచాడు దర్శకుడు. శైలు, రవిల చిన్ననాటి ప్రేమ కథను కాసేపు చూపించి..ఆ తర్వాత వెంటనే స్టోరీని పదేళ్ల ముందుకు అంటే 1996కు తీసుకెళ్లాడు. అక్కడ వరుస మరణాలు.. గోడపై ఆక్రమ సంబంధాలు పెట్టుకున్న వారి పేర్లు రాయడం.. మరుసటి రోజే వాళ్లు శవాలై కనిపించడం.. ఇలా ప్రతి మంగళవారం జరగడం.. దాని వెనుక ఉన్నదెవరని ఎస్సై మాయ చేపట్టే విచారణ.. అజ్ఞాత వ్యక్తిని పట్టుకునేందుకు ఊరి ప్రజలు రంగంలోకి దిగడం.. ఇలా చాలా ఉత్కంఠభరితంగా కథనం సాగుతుంది. హీరో హీరోయిన్లు పాత్రలు లేకుండానే ఫస్టాఫ్‌ను పరుగులు పెట్టించాడు దర్శకుడు. ఇక ఇంటర్వెల్ ముందు శైలు పాత్రకు ఇచ్చే ట్విస్ట్ అదిరిపోవడంతో పాటు సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. శైలు లవ్‌స్టోరీ ఎపిసోడ్‌తో చాలా ఎమోషనల్‌గా ద్వితియార్థం ప్రారంభం అవుతుంది. తెరపై శైలు పాత్ర బోల్డ్‌గా చూపిస్తూనే. ఆమెపై సానుభూతి కలించేలా చేశాడు దర్శకుడు అజయ్ భూపతి. అలా చేయడం చాలా కష్టమైన పని.. కొంచెం తేడా కొట్టినా.. ఫలితమే మారిపోతుంది. కానీ అజయ్ మాత్రం బలమైన స్క్రిప్ట్‌తో ఈ సాహసం చేసి విజయం సాధించాడు. అయితే ఫస్టాఫ్‌తో పోలిస్తే సెకండాఫ్ కాస్త నెమ్మదిగా సాగడం.. బలమైన పాత్రలకు సరైన ముగింపు లేకపోవడం కాస్త మైనస్. క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్టులు ఊహించని విధంగా ఉంటాయి. ఎవరెలా చేశారంటే.. ఆర్ఎక్స్ 100 తర్వాత పాయల్ రాజ్‌పుత్ చాలా సినిమాల్లో నటించినా.. ఆ స్థాయి గుర్తింపు మాత్రం రాలేదు. చాలా సినిమాల్లో ఆమెను గ్లామర్ గాళ్‌గానే చూపించారు. కానీ మంగళవారం చిత్రంతో ఆమెలోని మరో యాంగిల్‌ని తెలుగు ప్రేక్షకులను పరిచయం చేసింది. శైలు పాత్రలో ఒదిగిపోయింది. ఎమోషనల్ సీన్లలో అద్భుతంగా నటించింది. గ్లామర్‌తో పాటు నటనకు స్కోప్ ఉన్న పాత్ర ఇది. ఇక ఎస్సై మాయగా నందిని శ్వేత మరో డిఫరెంట్ రోల్ ప్లే చేసి మెప్పించింది. అయితే నటనకు అంత ప్రాధాన్యత ఉన్న పాత్ర కాదు ఆమెది. అజయ్ ఘోష్, లక్ష్మణ్ పాత్రలు పండించిన కామెడీ బాగా వర్కౌట్ అయింది. వారిద్ధరి మధ్య సంబాషణలు నవ్వులు పూయిస్తాయి. శైలు చిన్ననాటి ప్రియుడు, మాస్క్ ధరించిన వ్యక్తి( ఈ నటుడి ఎవరనేది తెరపై చూస్తేనే థ్రిలింగ్‌గా ఉంటుంది) కూడా అద్భుతంగా నటించాడు. ఆర్ఎంపీ డాక్టర్‌గా రవీంద్ర విజయ్, జమిందారుగా చైతన్య కృష్ణ, అతని భార్యగా దివ్యా పిళ్ళైతో పాటు శ్రీతేజ్, శ్రవణ్ రెడ్డి తదితరులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. ఇక సాంకేతిక విషయాలకొస్తే.. ఈ సినిమాకు ప్రధాన బలం అజనీష్ లోకనాథ్ సంగీతం. తనదైన బీజీఎంతో సినిమా స్థాయిని పెంచేశాడు. అతను అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు కొత్త లుక్‌ని అదించింది. శివేంద్ర దాశరథి సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు చాలా ఉన్నతంగా ఉన్నాయి. -అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
'మంగళవారం' ఛాన్స్ కోసం డైరెక్టర్ వెంటపడ్డా: పాయల్
'ఆర్ఎక్స్ 100' సినిమాతో హీరోయిన్గా పరిచయమైన బ్యూటీ పాయల్ రాజ్‌పుత్. ఆ మూవీ తర్వాత ఒక్క హిట్ కూడా కొట్టలేకపోయింది. దీంతో తనకు హిట్ ఇచ్చిన దర్శకుడు అజయ్ భూపతితోనే 'మంగళవారం' చేసింది. ఈ శుక్రవారం (నవంబరు 17)న సినిమా థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన పాయల్.. పలు ఇంట్రెస్టింగ్ విషయాలు బయటపెట్టింది. (ఇదీ చదవండి: 'బిగ్‌బాస్' షోలో వివాదం.. లేడీ కంటెస్టెంట్‌పై పోలీస్ కేసు) 'సార్... నాకు ఒక సినిమా ఇవ్వండి. ఒక అవకాశం కావాలి' అని అజయ్ భూపతి వెంట పడ్డా. 'మంచి క్యారెక్టర్ వస్తే తప్పకుండా ఫోన్ చేస్తా' అని చెప్పారు. అలానే కొన్నాళ్లకు ఫోన్ రాగానే ఓకే చెప్పేశా. నాకు ఇది కమ్ బ్యాక్ అవుతుందని ఆశిస్తున్నా. ఇండియాలో ఈ టైప్ క్యారెక్టర్, కథతో ఎవరూ సినిమా చేయలేదు. చాలా సెన్సిటివ్ టాపిక్ డిస్కస్ చేశాం. రెస్పాక్ట్ ఇస్తూ సెన్సిటివిటీతో సినిమా తీశాం. శైలు పాత్ర హెయిర్, మేకప్ కోసం ప్రతిరోజు రెండు గంటలు పట్టేది. మేకప్ కంటే క్యారెక్టర్ ఎమోషనల్ జర్నీ నుంచి బయటకు రావడానికి ఎక్కువ టైమ్ పట్టింది. షూటింగ్ కంప్లీట్ చేసిన తర్వాత 15 రోజులు దాన్నుంచి బయటకు రాలేకపోయాను. నా చేతిపై గాట్లు, నా లుక్ చూసి 'నీకు ఏమైంది?' అని అమ్మ అడిగింది. పక్కా పల్లెటూరి అమ్మాయిలా ఉన్నావ్ అని చెప్పింది. 'పాయల్... నిన్ను చూస్తే గర్వంగా ఉంది. నువ్వు నటించిన క్యారెక్టర్ గురించి నాకు తెలుసు. ఆ రోల్ చేయడం అంత ఈజీ కాదు' అని ప్రీ రిలీజ్ సందర్భంగా అల్లు అర్జు చెప్పారు. ఐయామ్ సో హ్యాపీ అని పాయల్ రాజ్‌పుత్ చెప్పుకొచ్చింది. (ఇదీ చదవండి: తెలుగు యంగ్ హీరోకి గాయం.. పట్టుజారి అలా పడిపోవడంతో!) -
‘మంగళవారం’ టైటిల్ ఎందుకు పెట్టామంటే: అజయ్ భూపతి
‘‘మంగళవారం’ అంటే మంచిది కాదని ఓ అభిప్రాయం ఉంది. అయితే మంగళవారం చాలా శుభప్రదమైన రోజు. జయవారం అంటారు. గతంలో మనకు ఆ రోజే సెలవు ఉండేది.. బ్రిటీషర్లు వచ్చాక ఆ సెలవుని ఆదివారానికి మార్చారు. ‘మంగళవారం’ టైటిల్ ΄పోస్టర్ విడుదల చేయగానే సీనియర్ డైరెక్టర్ వంశీగారు ఫోన్ చేసి, ‘చాలా మంచి టైటిల్ అజయ్. నేను చాలాసార్లు ఆ టైటిల్ అనుకుంటే నిర్మాతలు ఒప్పుకోలేదు’ అన్నారు. ఆయన నుంచి ఫోన్ రావడం చాలా సంతోషంగా అనిపించింది’’ అని దర్శకుడు అజయ్ భూపతి అన్నారు. ΄పాయల్ రాజ్‌పుత్, అజ్మల్ అమీర్ జంటగా నటించిన చిత్రం ‘మంగళవారం’. స్వాతి రెడ్డి గునుపాటి, ఎం.సురేష్ వర్మతో కలిసి అజయ్ భూపతి ‘ఎ’ క్రియేటివ్ వర్క్స్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 17న విడుదలవుతోంది. ఈ సందర్భంగా అజయ్ భూపతి చెప్పిన విశేషాలు. ∙‘మహాసముద్రం’ సినిమా చిత్రీకరణలో ఉన్నప్పుడు ‘మంగళవారం’ చిత్రం చేయాలని ఫిక్స్ అయ్యాను. కమర్షియల్ సినిమాలు ఒక మీటర్ మీద వెళతాయి కాబట్టి చేయడం కష్టం కాదు. కానీ, ‘మంగళవారం’ లాంటి చిత్రం తీయడం చాలా కష్టం. డైరెక్షన్ అండ్ టెక్నికల్ వేల్యూస్, ఆర్టిస్టుల యాక్టింగ్ వంటివి చాలా ఉంటాయి. అలాగే నటీనటులతో ΄పాటు సాంకేతిక నిపుణులందర్నీ ఒక్క తాటిపైకి తీసుకు రావడం కష్టంగా అనిపించింది. ∙‘మహాసముద్రం’ సమయంలో అదితీరావు హైదరీకి కూడా ‘మంగళవారం’ కథ చెప్పాను.. ఆమె చేస్తానన్నారు. అయితే ఆ తర్వాత ఆమెను నేను సంప్రదించలేదు. ‘మంగళవారం’ కోసం సుమారు 40, 50 మందిని ఆడిషన్ చేశా. ఆ తర్వాత ఓ రోజు ‘మనం మళ్లీ సినిమా చేద్దాం’ అంటూ ΄పాయల్ నుంచి ఓ మెసేజ్ వచ్చింది. ఆ పాత్రకు తను సరిపోతుందా? లేదా అని విజువలైజ్ చేసుకున్నాను.. రెండు రోజుల తర్వాత ఫొటోషూట్ చేశాం. తను సరిపోతుందని తెలిశాక ఓకే చేశా. ∙‘మంగళవారం’ ఏ స్థాయి సినిమా అని నేను ముందు ఊహించకోకపోతే 20 కోట్లు ఖర్చు పెట్టను. అల్లు అర్జున్‌గారికి ఏడాదిన్నర క్రితమే ఈ కథ చెప్పాను. అందుకే ఆయన ట్రైలర్ చూసిన తర్వాత సినిమా ఎలా ఉంటుందో ఊహించి, మాట్లాడారు. మా బ్రదర్ సురేష్ వర్మ, స్వాతి రెడ్డిగార్లతో కలిసి ఈ సినిమా నిర్మాణంలో భాగమవడం సంతోషంగా ఉంది. ‘మంగళవారం’ సినిమాకు కొనసాగింపు ఉంటుంది’’ అన్నారు. -
'మంగళవారం'లో జీరో ఎక్స్పోజింగ్... చివరి 45 నిమిషాలు మాత్రం!
'ఆర్ఎక్స్ 100' ఫేమ్ దర్శకుడు అజయ్ భూపతి తీసిన సినిమా 'మంగళవారం'. పాయల్ రాజ్‌పుత్ ప్రధాన పాత్రలో నటించింది. నవంబర్ 17న తెలుగుతో పాటు ఇతర దక్షిణాది భాషల్లో విడుదలవుతోంది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన అజయ్ భూపతి.. సినిమా గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. (ఇదీ చదవండి: పెళ్లికి తొందరపడుతున్న తమన్నా.. ఆ ప్రాబ్లమ్ వల్లే ఇలా!) 'మంగళవారం' ఐడియా అలా! 'మహాసముద్రం' తీస్తున్నప్పుడు 'మంగళవారం' ఐడియా వచ్చింది. చేయాలని అప్పుడే ఫిక్స్ అయ్యాను. కథ రాసేటప్పుడు, తీసేటప్పుడు ఎక్కువ టెన్షన్ ఫీలయ్యా. ఇలాంటి సినిమాకు దర్శకత్వం అంత సులభం కాదు. పాయల్ క్యారెక్టర్ అలా పాయల్ రాజ్‌పుత్ క్యారెక్టర్ చూసి ప్రేక్షకులు షాక్ అవుతారు. జీవితంలో మళ్ళీ చేయలేనటువంటి పెర్ఫార్మన్స్ ఈ సినిమాలో చేసింది. తనకు నా మీద ఉన్న నమ్మకంతో ఈ సినిమా చేయడానికి ఒప్పుకొంది. (ఇదీ చదవండి: రెండు వారాల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తున్న స్టార్ హీరో సినిమా) 'మంగళవారం'లో జీరో ఎక్స్‌పొజింగ్. నా జీవితంలో ఒక్క వల్గర్ షాట్ తీయలేదు. పాయల్ ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తే... న్యూడ్ అని కొందరు అన్నారు. కానీ, అందులో గమనిస్తే... కళ్ళలో ఏడుస్తూ ఉంటుంది. ఆ గాఢత చూసే వాళ్ళకు తెలుస్తుంది. ఇండస్ట్రీ నుంచి పెద్ద పెద్ద దర్శకులు ఫోన్ చేసి 'బ్యాక్ చూద్దామని పోస్టర్ ఓపెన్ చేస్తే కళ్ళ మీదకు తీసుకువెళ్ళావ్' అని అన్నారు. థియేటర్ల నుంచి వచ్చే ప్రేక్షకులు ఏడుస్తూ వస్తారు. ఆమెను చూసి ఫీల్ అవుతారు. మంగళవారం శుభప్రదమైన రోజు. జయవారం అంటారు. ముందు మనకు ఆ రోజు సెలవు ఉండేది. బ్రిటీషర్ల వచ్చి ఆదివారం సెలవు చేశారు. ఈ టైటిల్ పోస్టర్ విడుదల చేయగానే పెద్ద వంశీ గారు ఫోన్ చేశారు. ''మంచి టైటిల్ అజయ్! నేను చాలాసార్లు ఆ టైటిల్ పెడదాం అంటే నిర్మాతలు ఒప్పుకోలేదు'' అన్నారు. ఆయన నుంచి ఫోన్ రావడం చాలా సంతోషంగా ఉంది. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 31 సినిమాలు) -
'మంగళవారం'లో చాలా బోల్డ్ విషయం ఉంది.. దానికి ధైర్యం కావాలి: అల్లు అర్జున్
RX100తో సూపర్ హిట్ కొట్టిన దర్శకుడు అజయ్ భూపతి, ఆ చిత్ర నటి పాయల్ రాజ్ పుత్ కాంబోలో వస్తున్న మిస్ట్రీరియస్ డార్క్ థ్రిల్లర్ ‘మంగళవారం’. ఈ చిత్రం వచ్చే శుక్రవారం థియేటర్స్‌లో విడుదల కానుంది. కాగా ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ శనివారం జరిగింది. ఇక ఈవెంట్‌కి ముఖ్య అతిథిగా హాజరైన అల్లు అర్జున్ మాట్లాడుతూ.. పాయల్ నటించిన RX100 ల్యాండ్ మార్క్ ఫిల్మ్. ఈ మంగళవారం కూడా అలాంటి మైల్స్టోన్ అవుతుంది. అజయ్ ఈ సినిమా కథ నాకు చెప్పినప్పుడు నేను షాక్ అయ్యాను. ఇందులో చాలా బోల్డ్ విషయం ఉంది. ఇలాంటి సినిమా తీయాలంటే ధైర్యం కావాలి. టీజర్ చూసిన వెంటనే సినిమా చూడాలనిపించే సినిమాలు చాలా తక్కువగా ఉంటాయి.నాకు ఈ సినిమా టీజర్ చూడగానే సినిమా చూడాలనిపించింది. నాకు అజయ్ డైరెక్షన్లో వచ్చిన RX100 సినిమా అంటే చాలా ఇష్టం. ఆయన గొప్ప టెక్నీషియన్. గొప్ప డైరెక్టర్ అనే నమ్మకం ఉంది. నేను ఈ టీజర్‌ను సుకుమార్ గారికి చూపించాను. ఆయన టీజర్ చూసి షాక్ అయ్యారు. చాలా బాగా చేశాడు డైరెక్టర్ అన్నారు. లైఫ్‌లో మనకి చాలా తక్కువ మంది ఫ్రెండ్స్ మాత్రమే మన సక్సెస్‌ని వాళ్లు సెలబ్రేట్ చేసుకుంటారు. నాకు స్వాతి, ప్రణవ్‌లు అలాంటి వాళ్లే. ఇది వాళ్ల ఫస్ట్ సినిమా. వాళ్లు ఇంకా ఎన్నో మంచి సినిమాలు తీయాలని కోరుకుంటున్నాను. వాళ్ల కోసం వచ్చి సపోర్ట్ చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. -
మంగళవారం ఈవెంట్.. స్పెషల్ అట్రాక్షన్‌గా ఐకాన్ స్టార్!
'ఆర్ఎక్స్ 100', 'మహాసముద్రం' చిత్రాల తర్వాత అజయ్ భూపతి దర్శకత్వం వహించిన తాజా చిత్రం 'మంగళవారం'. ఈ చిత్రంలో పాయల్ రాజ్‌పుత్, 'రంగం' ఫేమ్ అజ్మల్ అమీర్ జంటగా నటించారు. ఈ చిత్రాన్ని అజయ్ భూపతి ఏ క్రియేటివ్ వర్క్స్, ముద్ర మీడియా వర్క్స్ పతాకంపై స్వాతి రెడ్డి గునుపాటి, సురేష్ వర్మ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన క్రేజీ అప్డేట్ వచ్చేసింది. ఈ నెల 11న హైదరాబాద్ జేఆర్సీ కన్వెషన్ సెంటర్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అంతే కాకుండా ఈవెంట్‌కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా వస్తున్నట్లు తెలిపారు. కాగా.. ఇప్పటికే ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ కాగా.. ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ట్రైలర్ చూస్తే 'ఆర్ఎక్స్ 100' తరహాలో ఈ మూవీనే తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో నందిత శ్వేత, దివ్య పిళ్లై, రవీంద్ర విజయ్, అజయ్ ఘోష్, శ్రీ తేజ్, శ్రవణ్ రెడ్డి ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. కాగా.. నవంబర్ 17న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో సినిమా విడుదల కానుంది. #AlluArjun𓃵 Anna Chief guest For #Mangalavaram Pre-Release Event 🔥😁 Pics Loading⚡💥#Pushpa2TheRule | #MangalavaramPreReleaseEvent pic.twitter.com/KlOj07hkwZ — BUNN¥_BØ¥🪓🦁 (@Aa_cult_boy) November 7, 2023 #Mangalavaram Pre Release Event Passes Available contact me pic.twitter.com/xGbelnAMgr — Gogarla Srikanth Icon (@SrikanthGogarl3) November 9, 2023 -
ఆవకాయ తాండ్ర...
‘అప్పడప్పడ తాండ్ర ఆవకాయ తాండ్ర...’ అంటూ చిందేశారు దర్శకుడు తరుణ్ భాస్కర్. అజయ్ భూపతి దర్శకత్వం వహించిన ‘మంగళవారం’ చిత్రంలోని పాట ఇది. పాయల్ రాజ్‌పుత్, అజ్మల్ అమీర్ జంటగా స్వాతీ రెడ్డి గునుపాటి, సురేష్ వర్మ .ఎం నిర్మించారు. బి. అజనీష్ లోక్‌నాథ్ స్వరపరచిన ఈ చిత్రంలోని ‘అప్పడప్పడ తాండ్ర...’ అంటూ సాగే పాటని రిలీజ్ చేశారు. తరుణ్ భాస్కర్, గణేష్ ఎ. రాసిన ఈ పాటను రాహుల్ సిప్లిగంజ్ పాడారు. ఈ ప్రత్యేక పాటలో తరుణ్ భాస్కర్ నటించడం విశేషం. ‘‘తరుణ్ భాస్కర్ గెటప్, లుంగీలో డాన్స్ చేయడం ఈ పాట ప్రత్యేకత. కోనసీమలోని ఓ పల్లెటూరిలో చిత్రీకరించిన ఈ పాట పల్లె ప్రజల మధ్య సంభాషణలు, ఊరిలో పరిస్థితులను తెరపై ఆవిష్కరించేలా ఉంటుంది’’ అన్నారు అజయ్ భూపతి. -
'అంతా నా వల్లే అంటున్నారు'.. డైరెక్టర్ పోస్ట్ వైరల్!
‘సమ్మోహనం’తో టాలీవుడ్ అభిమానులకు పరిచయమైన హీరోయిన్ అదితి రావు హైదరీ. తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం లాంటి భాషల్లో చాలా చిత్రాల్లో నటించింది. తాజాగా తన 37వ పుట్టినరోజును జరుపుకుంది. అక్టోబర్ 28న జన్మించిన ఈ హైదరబాదీ భామ తెలుగులో సైకో, అంతరిక్షం, హే సినామికా లాంటి చిత్రాల్లో నటించింది. (ఇది చదవండి: పునీత్ రాజ్‌కుమార్ రెండో వర్థంతి.. కన్నీరు పెడుతున్న ఫ్యాన్స్) అయితే కోలీవుడ్ హీరోతో మన హైదరాబాదీ బ్యూటీ అదితి రావు హైదరి డేటింగ్లో ఉన్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ కలిసి మహా సముద్రం చిత్రంలో కలిసి నటించారు. ఈ మూవీని అజయ్ భూపతి డైరెక్షన్లో తెరకెక్కించగా.. టాలీవుడ్ హీరో శర్వానంద్ కూడా నటించారు. ఈ సినిమా సమయంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ పుట్టిందని చాలా సార్లు వార్తలొచ్చాయి. ఈ జంట లివ్ ఇన్ రిలేషన్లో ఉన్నారంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున రూమర్స్ వినిపించాయి. అంతే కాకుండా ఇద్దరు కలిసి పార్టీల్లో కనిపించడంతో వీరి రిలేషన్‌పై నిజమేనంటూ కథనాలు హల్చల్ చేశాయి. అయితే తాజాగా అదితి బర్త్‌డే సందర్భంగా సిద్ధార్థ్ తన ఇన్‌స్టాలో విషెస్ చెప్పారు. ఈ ఒక్క పోస్ట్‌తో వీరిద్దరి రిలేషన్‌పై ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు కోలీవుడ్ హీరో. అయితే ఈ ఫోటోను మహాసముద్రం డైరెక్టర్ తన ట్విటర్లో షేర్ చేశారు. దీనంతటికీ కారణం నేనేనా? అంటూ కాస్తా ఫన్నీగా ట్వీట్ చేశారు. ట్వీట్లో రాస్తూ..' దీనికి కారణం నేనే అని అందరూ అనుకుంటున్నారు... అసలు ఏం జరుగుతోంది??' అంటూ అదితి, సిద్ధార్త్ ఉన్న ఫోటోను పంచుకున్నారు. ప్రస్తుతం దర్శకుడు అజయ్ భూపతి చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది. కాగా.. సిద్ధార్థ్ ఇటీవలే చిన్నా(చిత్తా) సినిమాతో ప్రేక్షకులను అలరించారు. అదితి ప్రస్తుతం గాంధీ టాక్స్, లయనీస్ లాంటి చిత్రాలతో బిజీగా ఉంది. (ఇది చదవండి: 'గంగమ్మ తల్లిమీద ఒట్టు'.. అలా జరిగిందంటే.. విశ్వక్ సేన్ సంచలన పోస్ట్!) View this post on Instagram A post shared by Siddharth (@worldofsiddharth) Everyone thinks I'm the reason for this... What's actually happening?? 🤔#Siddharth @aditiraohydari pic.twitter.com/vcXQcMrmvu — Ajay Bhupathi (@DirAjayBhupathi) October 28, 2023 -
మంగళవారం కోసం ఎదురు చూస్తున్నా!
‘‘ఆర్ఎక్స్ 100’ తర్వాత నేను, అజయ్ భూపతి లేదా నేను, పాయల్ ఎప్పుడు మళ్లీ సినిమా చేస్తామని అందరూ అడుగుతుంటే.. మంచి కథ కుదరాలని చెబుతూ వచ్చాను. వారిద్దరి కాంబినేషన్లో ‘మంగళ వారం’ సినిమా చేస్తున్నట్లు వార్తలు చూసి, నన్ను వదిలేసి ఇద్దరూ సినిమా చేశారు అనుకున్నా (నవ్వుతూ). అజయ్ తన సొంతూరు ఆత్రేయపురంలో ‘ఆర్ఎక్స్ 100’ తీశాడు. ఇప్పుడు ఆ ఊరిని మరో విధంగా ‘మంగళవారం’లో చూపించాడు. 100 పర్సెంట్ అందరికంటే ఈ సినిమా కోసం నేనెక్కువ ఎదురు చూస్తున్నాను’’ అని హీరో కార్తికేయ అన్నారు. పాయల్ రాజ్‌పుత్, అజ్మల్ ఆమిర్ జంటగా అజయ్ భూపతి దర్శకత్వం వహించిన చిత్రం ‘మంగళవారం’. స్వాతీ రెడ్డి గునుపాటి, సురేష్ వర్మ .ఎం నిర్మించిన ఈ సినిమా నవంబర్ 17న విడుదల కానుంది. ఈ చిత్రం ట్రైలర్‌ని హీరో చిరంజీవి సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో హీరో కార్తికేయ ట్రైలర్‌ని రిలీజ్ చేశారు. అజయ్ భూపతి మాట్లాడుతూ– ‘‘మంగళవారం’ మంచి డార్క్ థ్రిల్లర్. ఇందులో మహిళలకు సంబంధించిన పాయింట్‌ని టచ్ చేశాం. కార్తికేయ, నా కాంబినేషన్లో మరో సినిమా ఉంటుంది’’ అన్నారు. ‘‘మా నాన్నకు (నిమ్మగడ్డ ప్రసాద్), నాకు సినిమాలంటే ఇష్టం. సినిమా నిర్మించాలనే నా కల ‘మంగళవారం’తో నెరవేరింది’’ అన్నారు స్వాతీ రెడ్డి. ‘‘ఈ సినిమాతో నేను, స్వాతి నిర్మాతలుగా పరిచయమవడం గర్వంగా ఉంది’’ అన్నారు సురేష్ వర్మ. ‘‘నా కెరీర్ ఎటు వెళుతుందో తెలియని అనిశ్చితి ఉన్న సమయంలో ‘మంగళవారం’కి చాన్స్ ఇచ్చారు అజయ్‌గారు’’ అన్నారు పాయల్. -
ఈ కారణంతో సర్జరీ కూడా చేపించుకోలేదు: పాయల్ రాజ్‌పుత్
ఆర్ఎక్స్100తో సూపర్ హిట్ కొట్టిన అజయ్ భూపతి మహాసముద్రంతో ఫ్లాప్ ఇచ్చాడు. చాలారోజుల గ్యాప్ తర్వాత పక్కా ప్లాన్‌తో ఈసారి మంగళవారం అనే సినిమాతో ప్రేక్షకులముందుకొస్తున్నాడు. ఇందులో పాయల్ రాజ్‌పుత్, 'రంగం' ఫేమ్ అజ్మల్ అమీర్ జంటగా నటించారు. తాజాగా ఈ చిత్రం ట్రైలర్‌ని సోషల్ మీడియా వేదికగా మెగాస్టార్ చిరంజీవి విడుదల చేసి, చిత్రబృందానికి అభినందనలు తెలిపారు. సస్పెన్స్, క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా నవంబర్ 17న థియేటర్లలో విడుదల కానుంది. 1980లో ఒక గ్రామంలో వరుస హత్యల కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది. (ఇదీ చదవండి: ఓటీటీలోకి భారీ యాక్షన్ మూవీ.. తెలుగులోనూ రిలీజ్.. బిగ్ అప్డేట్) ఈ కథపై హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ తాజాగా ఒక విషయాన్ని ఇలా షేర్ చేసింది. 'అజయ్ నన్ను అప్రోచ్ అయ్యే టైమ్‌కు నా పరిస్థితి ఎలా ఉందో ఎవరికీ తెలియదు. అప్పుడు నేను కిడ్నీ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నాను. సర్జరీకి వెళ్లాల్సిందే అని వైద్యులు సూచించారు. అయితే అజయ్ చెప్పిన కథ నాకెంతో నచ్చేసింది. ఈ సినిమా తప్పకుండా చేయాలని నిర్ణయించుకున్నాను. సినిమా పూర్తయ్యాకే సర్జరీకి వెళ్తాను.' అని అప్పుడే చెప్పాను. ఇదొక అద్భుతమైన కథతో రూపొందిన సినిమా అని. తప్పకుండా ప్రేక్షకులకు నచ్చుతుందని అలాగే తనకు కూడా తెలుగులో మంచి విజయాన్ని అందిస్తుందని నమ్ముతున్నట్లు పాయల్ చెప్పుకొచ్చింది. ఈ సినిమా ట్రైలర్‌ను చిరంజీవి ఎందుకు లాంచ్ చేశారంటే ‘మంగళవారం’ సినిమా నిర్మాత స్వాతిరెడ్డి గునుపాటి తన కుమార్తె శ్రీజకి మంచి స్నేహితురాలని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. స్వాతిరెడ్డి ఎంతో డైనమిక్ అమ్మాయి అని.. అలాంటి అమ్మాయి నిర్మాణ సంస్థను ఏర్పాటుచేయడమే కాకుండా తనే దగ్గరుండి ఒక సినిమాను నిర్మిస్తే కచ్చితంగా ప్రోత్సహించాలని మెగాస్టార్ చెప్పారు. ‘మంగళవారం’ ట్రైలర్‌ను ఎక్స్ ద్వారా విడుదల చేసిన చిరంజీవి.. చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. (ఇదీ చదవండి: 'భగవంత్ కేసరి'కి షాకిచ్చిన తారక్,మెగా ఫ్యాన్స్.. భారీగా నష్టాలు) -
ఆ ఊర్లోని చావులకు కారణం ఎవరు?.. ఆసక్తికరంగా ‘మంగళవారం’ ట్రైలర్
‘ఆర్ఎక్స్ 100'ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘మంగళవారం’. . పాయల్ రాజ్‌పుత్, 'రంగం' ఫేమ్ అజ్మల్ అమీర్ జంటగా నటించారు. తాజాగా ఈ చిత్రం ట్రైలర్‌ని సోషల్ మీడియా వేదికగా మెగాస్టార్ చిరంజీవి విడుదల చేసి, చిత్రబృందానికి అభినందనలు తెలిపారు. ఒక ఊర్లో జరిగే వరుస హత్యల నేపథ్యంలో ఈ చిత్రాన్ని తిర్చిదిద్దినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. ఊర్లో అక్రమ సంబంధాలు పెట్టుకున్న వ్యక్తుల పేర్లను ఓ అజ్ఞాతవాసి గోడపై రాస్తుంటాడు. ఆ గోడమీద రాస్తున్నదెవరు? ఎందుకు అలా చేస్తున్నారు? ప్రతి మంగళవారం ఊర్లో ఎందుకు హత్యలు జరుగుతున్నాయి? తదితర ఆసక్తికర విషయాలను తెలియజేస్తూ ‘ట్రైలర్’ సాగుతుంది. ముద్ర మీడియా వర్క్స్ పతాకంపై స్వాతి రెడ్డి గునుపాటి, సురేష్ వర్మ నిర్మించిన ఈ చిత్రం నవంబర్ 17న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానుంది. -
శుక్రవారం రిలీజ్ కానున్న మంగళవారం!
ఆర్ఎక్స్ 100, మహా సముద్రం చిత్రాల దర్శకుడు అజయ్ భూపతి తాజాగా తెరకెక్కిస్తోన్న మంగళవారం. ఈ సినిమాలో ఆర్ఎక్స్ 100 భామ పాయల్ రాజ్‌పుత్ లీడ్ రోల్లో పోషిస్తుండగా.. శ్రీతేజ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ముద్ర మీడియా వర్క్స్ పతాకంపై స్వాతి రెడ్డి గునుపాటి, సురేష్ వర్మ .ఎం నిర్మిస్తున్నారు. ఆర్ఎక్స్ 100తో సూపర్ హిట్ అందుకున్న అజయ్ భూపతి.. ఈ మూవీని పాన్ ఇండియా రేంజ్లో రూపొందిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మేకర్స్ క్రేజీ అప్డేట్ ఇచ్చారు. అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన 'మంగళవారం' నవంబర్ 17న విడుదల కానుంది. (ఇది చదవండి: కాంతార ప్రీక్వెల్.. ఇప్పుడంతా దానిపైనే తెగ చర్చ!) గ్రామీణ యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్ సినిమాపై అభిమానుల్లో ఆసక్తి మరింత పెంచాయి. కాగా.. ఈ సినిమాలో చైతన్య కృష్ణ, అజయ్ ఘోష్, లక్ష్మణ్ తదితరులు నటించారు. ఈ చిత్రానికి కన్నడ అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్నారు. (ఇది చదవండి: టాలీవుడ్లో సూపర్ హిట్ జోడీ.. ఎంత చిలిపిగా ఉన్నారో చూడండి!!) గతంలో దర్శకుడు అజయ్ భూపతి ఈ సినిమాపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. 'మంగళవారం' చిత్రాన్ని డిఫరెంచ్గా తెరకెక్కిస్తున్నట్లు అభివర్ణించారు. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఎవరూ ప్రయత్నించని కాన్సెప్ట్‌తో ఈ సినిమా చేస్తున్నామని.. ఇందులో మొత్తం 30 పాత్రలున్నాయని తెలిపారు. ఆర్ఎక్స్ 100 తరహాలోనే అజయ్ ఈ సినిమా ద్వారా ప్రేక్షకులకు ఊహించని సర్ ప్రైజ్ ఇస్తాడని నమ్ముతున్నారు. ఈ సినిమాను నవంబర్ 17న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. Excited to show y'all a story that'll twist your heart like never before🦋#Mangalavaaram #Mangalavaar #Chevvaikizhamai #Chovvazhcha Releasing Worldwide in Telugu, Hindi, Tamil, Malayalam, Kannada on November 17th 🔥 An @AJANEESHB Musical 🥁@starlingpayal @Nanditasweta… pic.twitter.com/1G9OjAAn0w — Ajay Bhupathi (@DirAjayBhupathi) September 26, 2023 -
సక్సెస్ మీట్లో మాట్లాడి ఐదేళ్లయింది
‘‘క్లాక్స్ నాకు 2009 నుంచి పరిచయం. అప్పట్నుంచి నాకు కథలు చెబుతుంటాడు. డిఫరెంట్ కాన్సెప్టుల్లో నటించడం, చేయడం కాస్త కష్టం.. నిర్మాతలు ముందుకు రారు, కమర్షియల్ ఫార్మాట్లో సినిమా చేయమని తనతో చెప్పాను. కానీ బెన్నీలాంటి నిర్మాతలు ఇప్పుడు కొత్త కథలను ప్రోత్సహిస్తున్నారు. ఇక కొత్త కొత్త పాత్రలు చేస్తున్న కార్తికేయకు పెద్ద హిట్ పడాలని అనుకున్నాను. ఇప్పుడు ‘బెదురులంక’తో హిట్ కొట్టేశాడు’’ అని హీరో శ్రీ విష్ణు అన్నారు. కార్తికేయ, నేహా శెట్టి జంటగా నటించిన చిత్రం ’బెదురులంక 2012’. క్లాక్స్ దర్శకత్వంలో రవీంద్ర బెనర్జీ (బెన్నీ) ముప్పానేని నిర్మించిన ఈ చిత్రం గత వారం విడుదలైంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ నిర్వహించిన విజయోత్సవంలో హీరో శ్రీ విష్ణు, దర్శకుడు అజయ్ భూపతి తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ‘‘కార్తికేయకు హిట్ వస్తే నాకూ హిట్ వచ్చినట్టే’’ అని అజయ్ భూపతి అన్నారు. కార్తికేయ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా ప్రయాణంలో ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నాం. ఫస్ట్ డే ఫస్ట్ షో చూసి బాగుందని అందరూ చెప్పిన తర్వాత పెద్ద రిలీఫ్ అనిపించింది. ఇలా సక్సెస్ మీట్లో మాట్లాడి ఐదేళ్లయింది. ‘ఆర్ఎక్స్ 100’ తర్వాత నేను చేసిన సినిమాలు అనుకున్న రేంజ్‌కు వెళ్లలేదు. ఒక్క హిట్ వస్తే చాలనుకున్న టైమ్‌లోనే ‘బెదురులంక’ వచ్చింది’’ అన్నారు. ‘‘సినిమాను ఇంత పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులకు థ్యాంక్స్’’ అన్నారు రవీంద్ర బెనర్జీ (బెన్నీ) ముప్పానేని. ఇంకా బీవీఎస్ రవి, నేహా శెట్టి తదితరులు మాట్లాడారు. ∙బెన్నీ, శ్రీ విష్ణు, కార్తికేయ, నేహాశెట్టి -
భారీ హిట్ కొట్టేందుకు పక్కా స్కెచ్‌తో వస్తున్న ముగ్గురు డైరెక్టర్లు
సినిమాలు అన్నాక హిట్స్‌తో పాటు ప్లాపులు కూడా సహజం కానీ హిట్ వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉంటూ ఇంకో హిట్ సినిమా తీసేందకు ప్లాన్ చేయాలి.. ఒకవేళ ప్లాప్ వస్తే మరో భారీ హిట్ కొట్టేందుకు స్కెచ్ వెయ్యాలి. ఇలానే సినిమా ఇండస్ట్రీలో అందరికి ఉంటుంది. ఈ ముగ్గురు దర్శకులు మాత్రం మొదట్లో హిట్ కొట్టి ఆ తర్వాత వచ్చిన సినిమాలతో భారీ డిజాస్టర్‌ను మూటకట్టుకున్నారు. (ఇదీ చదవండి: రాకేష్ మాస్టర్ భార్యపై దాడి.. నడిరోడ్డుపై చితక్కొట్టిన మహిళలు) ఐదేళ్ల క్రితం వచ్చిన 'ఆర్ఎక్స్-100'తో దర్శకుడు అజయ్ భూపతి సినీ ఇండస్ట్రీకి భారీ షాక్ ఇచ్చాడు. అప్పట్లో ఈ సినిమా భారీ హిట్‌ను సొంతం చేసుకుంది. ఆ తర్వాత ఆయన నుంచి వచ్చిన మహాసముద్రం డిజాస్టర్ అయింది. దాంతో తాజాగా తన సత్తా చాటేందకు పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్గా మంగళవారం అనే పాన్ ఇండియా సినిమాతో కమ్‌బ్యాక్ ఇవ్వాలనుకుంటున్నాడు అజయ్. ఇప్పటికే ఆయన టీజర్ విడుదల చేశారు. దానిని చూసిన వారందరూ ఈసారి హిట్ కొట్టడం ఖాయం అంటున్నారు. మరోవైపు మహేష్ బాబుతో 'బ్రహ్మోత్సవం' సినిమాను డైరెక్ట్ చేసిన శ్రీకాంత్ అడ్డాల ఇప్పటికి కోలుకోలేకపోతున్నాడు. ఆ సినిమా భారీ అంచనాలతో వచ్చి డిజాస్టర్‌గా మిగిలిపోయింది. కానీ విక్టరీ వెంకటేష్‌తో 'నారప్ప' సినిమా తీసినా అది ఓటీటీకే పరిమితం అయింది. తాజాగా ఆయన నుంచి పెదకాపు ప్రాజెక్ట్‌తో శ్రీకాంత్ వస్తున్నాడు. ఈ సినిమా ట్రైలర్ విడుదలైన రోజు నుంచి యూట్యూబ్‌ను షేక్ చేస్తుంది. ఇదే కోవలో మరోక దర్శకుడు శివ నిర్వాణ కూడా ఉన్నారు. నానితో 'టక్ జగదీష్' సినిమాను తీసి.. దానిని డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్ చేశారు. అక్కడ అది ప్రేక్షకులను నిరాశపరిచింది. అందుకే ఈయన ఈసారి ఇండస్ట్రీలో భారీ హిట్ కొట్టేందుకు పక్కా స్కెచ్‌తో వస్తున్నాడు. విజయ్ దేవరకొండ, సమంత కాంబినేషన్లో 'ఖుషి' తీస్తున్నాడు. ఈ సినిమాపై ఆయన భారీ ఆశలు పెట్టుకున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ సింగల్ ఇప్పటికే ట్రెండింగ్‌లో ఉంది. ఈ ముగ్గురి దర్శకులు సినిమాలు రిలీజ్‌కు రెడీగా ఉన్నాయి. చూద్దాం ఈసారి భారీ హిట్ కొడతారేమో. (ఇదీ చదవండి: లగ్జరీ ఫ్లాట్ కొనుగోలు చేసిన యంగ్ హీరో.. ఎన్ని కోట్లంటే?) -
పాయల్ కొత్త సినిమా టీజర్.. అలాంటి సీన్స్‌తో!
'ఆర్ఎక్స్ 100' తర్వాత పాయల్ రాజ్‌పుత్, దర్శకుడు అజయ్ భూపతి కలిసి చేస్తున్న సినిమా 'మంగళవారం'. గ్రామీణ నేపథ్య కథతో తీస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతోంది. ఈ క్రమంలోనే తాజాగా టీజర్ ని రిలీజ్ చేశారు. ఒకటిరెండు డైలాగ్స్ మాత్రమే ఉన్నప్పటికీ సమ్‌థింగ్ డిఫరెంట్ అనేలా ఉంది. ఈ టీజర్ లో చాలా క్యారెక్టర్స్ ని చూపించారు. వాళ్లందరూ ఆకాశంలో ఏదో వింతను చూస్తున్నట్లు ఉన్న సీన్స్ మాత్రమే చూపించారు. చివర్లో పాయల్ అరుస్తున్న సన్నివేశం, నగ్నంగా ఉన్న సీన్స్ అయితే 'మంగళవారం'పై ఆసక్తిని పెంచుతున్నాయి. 'కాంతార' ఫేమ్ అజనీష్ లోక్‌నాథ్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అయితే మేజర్ హైలెట్ గా నిలిచింది. విడుదల తేదీ ప్రకటించలేదు గానీ ఇదేదో బాక్సాఫీస్ దగ్గర గట్టిగానే వర్కౌట్ అయ్యేలా కనిపిస్తోంది. (ఇదీ చదవండి: సమంత మళ్లీ ప్రేమలో పడిందా? ఆ పోస్ట్ అర్థమేంటి?) -
అజయ్ దర్శకత్వంలో..?
గత ఏడాది అక్టోబరులో ‘ది ఘోస్ట్’ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చారు నాగార్జున. ఆ తర్వాత తదుపరి చిత్రం గురించి ఆయన అధికారికంగా ప్రకటించలేదు. కథలు వింటూ బిజీగా ఉన్నారు. దర్శకుడు మోహన్‌రాజా, రచయిత బెజవాడ ప్రసన్నకుమార్ వంటివారు నాగార్జునకు కథలు వినిపించారట. అయితే ఏదీ ఫైనలైజ్ కాలేదని సమాచారం. తాజాగా నాగార్జునకు ‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ దర్శకుడు అజయ్ భూపతి ఓ కథను వినిపించారని, ఈ కథ ఆయనకు నచ్చిందని, త్వరలోనే వీరి కాంబోలో సినిమా ఉంటుందనీ ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. ఈ సినిమాను శ్రీనివాసా చిట్టూరి నిర్మించనున్నారని తెలిసింది. -
పాయల్ రాజ్‌పుత్ ‘మంగళవారం’ షూటింగ్ పూర్తి
‘ఆర్ఎక్స్ 100’ వంటి హిట్ మూవీ తర్వాత అజయ్ భూపతి దర్శకత్వంలో పాయల్ రాజ్‌పుత్ నటించిన చిత్రం ‘మంగళవారం’. స్వాతి రెడ్డి గునుపాటి, సురేష్ వర్మ .ఎం నిర్మిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. ఈ సందర్భంగా అజయ్ భూపతి మాట్లాడుతూ– ‘‘గ్రామీణ నేపథ్యంలో యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రమిది. ఈ సినిమాలో మొత్తం 30 పాత్రలు ఉండగా, ప్రతి పాత్రకు ప్రాముఖ్యం ఉంటుంది’’ అన్నారు. స్వాతి రెడ్డి గునుపాటి మాట్లాడుతూ–‘‘ఇప్పటివరకు రానటువంటి కొత్త జానర్ కథతో ‘మంగళవారం’ఉంటుంది. ఈ సినిమా షూటింగ్ 99 రోజులు చేస్తే.. అందులో 51 రోజులు రాత్రి వేళల్లో చిత్రీకరణ చేశాం. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో రూపొందిన ఈ చిత్రం విడుదల తేదీ, ఇతర వివరాలు త్వరలో వెల్లడిస్తాం’’ అన్నారు. -
బోల్డ్ లుక్ లో పాయల్ రాజపుత్...
-
పాయల్ రాజ్‌పుత్ సెన్సేషనల్ ఫస్ట్ లుక్
'ఆర్ఎక్స్ 100' ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం ‘మంగళవారం’. పాయల్ రాజ్‌పుత్ ప్రధాన పాత్ర పోషిస్తోంది. స్వాతి గునుపాటి, సురేష్ వర్మలలతో కలిసి అజయ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి పాయల్ ఫస్ట్‌లుక్‌ని విడుదల చేశారు మేకర్స్. 'మంగళవారం' సినిమాలో శైలజ పాత్రలో పాయల్ రాజ్‌పుత్ నటిస్తున్నట్లు ఫస్ట్ లుక్ విడుదల సందర్భంగా తెలిపారు. ఆ లుక్ చూస్తే... పాయల్ కళ్ళల్లో కన్నీటి పొర కనబడుతోంది. ఆమె వేలిపై సీతాకోక చిలుక ఉంది. జడలో మల్లెపూలు ఉన్నాయి. అయితే, ఒంటి మీద ఒక్క నూలుపోగు కూడా లేదు. వెనుక నుంచి ఫోటో తీశారు. ఇదొక ఎమోషనల్ అండ్ బోల్డ్ లుక్ అని చెప్పవచ్చు. ప్రస్తుతం పాయల్ లుక్ నెట్టింట్ వైలర్ అవుతోంది. (చదవండి: రాహుల్ రామకృష్ణ కొడుకుని చూశారా? పేరు భలేగా ఉందే?) ఈ సినిమా గురించి అజయ్ మాట్లాడుతూ.. 'గ్రామీణ నేపథ్యంలో 1990వ దశకంలో సాగే కథతో తీస్తున్న చిత్రమిది. మన నేటివిటీతో కూడిన డిఫరెంట్ యాక్షన్ థ్రిల్లర్. రా అండ్ రస్టిక్ గా ఉంటుంది. థియేటర్ల నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా ప్రేక్షకులకు గుర్తు ఉండేలా పాయల్ క్యారెక్టరైజేషన్ ఉంటుంది. ఇప్పటి వరకు ఇండియాలో ఎవరూ ప్రయత్నించనటువంటి కొత్త జానర్ సినిమా. సినిమాలో 30 పాత్రలు ఉన్నాయి. ప్రతి పాత్రకూ కథలో ప్రాముఖ్యం ఉంటుంది' అని అన్నారు. ‘ 'ఆర్ఎక్స్ 100'లో ఇందు పాత్ర ప్రేక్షకులకు ఎలా గుర్తు ఉండిపోతుందో, ఇప్పుడీ 'మంగళవారం'లో శైలజ పాత్ర కూడా అలాగే గుర్తు ఉంటుంది’ అన్నారు నిర్మాతలు స్వాతి గునుపాటి, సురేశ్ వర్మ. ఈ చిత్రానికి ‘కాంతార’ఫేమ్ అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్నారు. Shailuu... will stay in your hearts for a long while 🔥 Presenting @starlingpayal in a never-seen-before role from our new-genre film #Mangalavaaram #Chevvaikizhamai #Chovvazhcha 🦋@DirAjayBhupathi @AJANEESHB @MudhraMediaWrks @ACreativeWorks_ #SwathiGunupati #SureshVarmaM pic.twitter.com/IYJmL7eHd1 — Ajay Bhupathi (@DirAjayBhupathi) April 25, 2023 -
'ఆర్ఎక్స్ 100' డైరెక్టర్ అజయ్ భూపతి కొత్త సినిమా పోస్టర్ రిలీజ్
ఆర్ఎక్స్ 100 సినిమాతో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న డైరెక్టర్ అజయ్ భూపతి. ఆ తర్వాత భారీ అంచనాల మధ్య మహాసముద్రం అనే సినిమాను తెరకెక్కించినా ఆ మూవీ అంతగా సక్సెస్ కాలేదు. దీంతో కాస్త గ్యాప్ తీసుకొని మంగళవారం అనే సినిమాను రూపొందిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి టైటిల్ అండ్ కాన్సెప్ట్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. అంతేకాకుండా ఇది పాన్ ఇండియాన్ సినిమా అంటే బజ్ క్రియేట్ చేశారు. స్వాతి - సురేశ్ వర్మ నిర్మిస్తున్న ఈ సినిమాకి అజనీశ్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్నారు.హారర్ జానర్లో ఈ సినిమా కథను తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తుంది. కాగా ఆర్ఎక్స్ 100తో క్రేజ్ సంపాదించుకున్న పాయల్ ఈ మూవీలో హీరోయిన్గా నటించనుందని టాక్ వినిపిస్తుంది. దీనిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. Here's the Title & Concept Poster of our #Mangalavaaram #Chevvaikizhamai #Chovvazhcha 🦋 It's a PAN-SOUTH INDIAN movie🔥 'KANTARA' fame @AJANEESHB is scoring 🎶 to this never-seen-before film 💥@MudhraMediaWrks @ACreativeWorks_ #SwathiGunupati #SureshVarmaM pic.twitter.com/VqMNy64wYj — Ajay Bhupathi (@DirAjayBhupathi) February 28, 2023 -
'ఆర్ ఎక్స్ 100' డైరెక్టర్‌తో పాయల్ రాజ్‌పుత్.. ఈసారి హిట్టు గ్యారెంటీనా?
'ఆర్ ఎక్స్ 100' సినిమాతో సూపర్‌హిట్ కొట్టిన దర్శకుడు అజయ్ భూపతి. రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమా యూత్‌కు బాగా కనెక్ట్ అయ్యింది. ఈ జోష్‌తో ఆయన మహాసముద్రం సినిమాను రూపొందించారు. కానీ ఈ చిత్రం ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. దీంతో కొంత గ్యాప్ తీసుకున్న ఆయన తాజాగా మరో క్రేజీ ప్రాజెక్ట్‌తో రానున్నారు. ఇప్పటికే దీనికి 'మంగళవారం' అనే టైటిల్‌ను కూడా ఫిక్స్ చేశారు. కాగా ఈ సినిమాలో మరోసారి పాయల్ రాజ్‌పుత్ హీరోగా నటించనుందని టాక్ వినిపిస్తుంది. దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది. లేడీ ఓరియెంటెడ్ తరహాలో ఈ సినిమాను రూపొందించనున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే షూటింగ్ ప్రారంభించిన మేకర్స్ ఈ వేసవి కానుకగా సినిమాను రిలీజ్ చేయనున్నారు. -
ఇండస్ట్రీ పెద్ద దిక్కుగా రామ్ గోపాల్ వర్మ!, ఆ దర్శకుడు ట్వీట్ వైరల్
ప్రస్తుతం టాలీవుడ్లో ఇండస్ట్రీ పెద్దగా ఎవరనే అంశం హాట్ టాపిక్‌గా మారింది. ఆదివారం జరిగిన ఓ కార్యక్రమంలో చిరు మాట్లాడుతూ.. ఇండస్ట్రీ పెద్దగా ఉండలేనని, ఇద్దరు గొడవ పడుతుంటే దాన్ని పరిష్కరించడానికి ముందుకు రానన్నారు. కానీ ఆపదలో ఉంటే మాత్రం కచ్చితంగా ఆదుకుంటానంటూ చిరు చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. అనంతరం మోహన్ బాబు సినీ పరిశ్రమకు బహిరంగ లేఖ రాస్తూ.. ఇండస్ట్రీ అంటే నలుగురు హీరోలు, నలుగురు ప్రొడ్యూసర్లు, నలుగురు డిస్ట్రిబ్యూటర్లు మాత్రమే కాదని వేల కుటుంబాలు, జీవితాలన్నారు. చదవండి: దుబాయ్‌లో హీరోయిన్‌తో హీరో విక్రమ్ తనయుడు డేటింగ్, ఫొటోలు వైరల్ ఇండస్ట్రీలో సమస్యల గురించి సీఎంలకు వివరించాలంటే అందరూ కూర్చుని మాట్లాడుకోవాలి కానీ, నలుగురినే రమ్మన్నారనడం ఏంటని ప్రశ్నించారు. ఇక్కడ ఎవరు ఎక్కువ కాదు, తక్కువ కాదు, అందరూ సమానమేనని.. అందరం కలిసికట్టుగా ఉండాలని ఆయన పేర్కొన్నారు. ఈ క్రమంలో దివంగత డైరెక్టర్ దాసరి నారాయణ లోటు తీరుస్తూ ఆయన స్థానంలో ఉండి పరిశ్రమను ముందుండి నడిపించే పెద్ద దిక్కు ఎవరా? అనే దానిపై ఇండస్ట్రీలో సర్వత్రా చర్చ జరుగుతోంది. చదవండి: ఆంటీతో డేటింగ్ అంటూ ట్రోల్స్, తొలిసారి ఘాటుగా స్పందించిన యంగ్ హీరో ఈ క్రమంలో ఆర్ఎక్స్ 100 దర్శకుడు, రామ్ గోపాల్ వర్మ శిష్యుడు అజయ్ భూపతి చేసిన ఓ ట్వీట్ హాట్‌టాపిక్ మారింది. తన బాస్ ( రాంగోపాల్ వర్మ )ని ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా చూడాలన్నది తన ఆశ అని పేర్కొన్నాడు. ‘సామీ మీరు రావాలి సామీ’ అంటూ అజయ్ భూపతి రాసుకొచ్చిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియా వైరల్‌గా మారింది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో టిక్కెట్ల వివాదంపై చర్చ నడుస్తున్న క్రమంలో ఆర్జీవీ వరస ట్వీట్లు చేస్తూ తనదైన శైలిలో స్పందించిన సంగతి తెలిసిందే. మా బాస్ ( రాంగోపాల్ వర్మ ) ని ఇండస్ట్రీకి పెద్ద దిక్కు గా చూడాలని నా కోరిక... సామీ మీరు రావాలి సామీ 🥳😎#ఇండస్ట్రీపెద్ద @RGVzoomin pic.twitter.com/0Y3Nnf0w48 — Ajay Bhupathi (@DirAjayBhupathi) January 2, 2022 -
Rx 100కు సీక్వెల్ ?
-
అభిమానులకు క్షమాపణలు చెప్పిన డైరెక్టర్ అజయ్‌భూపతి
MahaSamudram Director Ajay Bhupathi Says Sorry: ఆర్ఎక్స్ 100 లాంటి బ్లాక్ బస్టర్ తరువాత అజయ్ భూపతి దర్శకత్వం వహించిన చిత్రం ‘మహా సముద్రం’. శర్వానంద్, సిద్దార్థ్ హీరోలు, అదితిరావు హైదరి, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్స్‌గా నటించిన ఈ చిత్రం ఇటీవలె విడుదలైంది. ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమా యావరేజ్ టాక్‌ను సొంతం చేసుకుంది. దీంతో అభిమానులు తమ అసంతృప్తిని సోషల్‌మీడియా ద్వారా డైరెక్టర్ భూపతికి తెలిపారు. తాజాగా పవన్‌రెడ్డి అనే ట్విట్టర్ యూజర్..మహాసముద్రం ఏంటి అన్నా అలా తీశావ్? చాలా ఎక్స్పెక్ట్ చేశా అంటూ ట్వీట్ చేశాడు. దీనికి స్పందించిన అజయ్‌భూపతి.. మీ అంచనాలను అందుకోలేకపోయినందుకు క్షమించండి. నెక్ట్స్ టైం మంచి కథతో వస్తాను అని పేర్కొన్నాడు. ప్రస్తుతం అజయ్ భూపతి చేసిన ఈ ట్వీట్ నెట్టింట చక్కర్లు కొడుతుంది. Sorry for not reaching your expectations... Next time I will be back with a story that can satisfy you all... https://t.co/RTWin30gKV — Ajay Bhupathi (@DirAjayBhupathi) October 28, 2021 చదవండి: హీరోయిన్గా మారిన టిక్‌టాక్ స్టార్ నాగచైతన్యతో కలిసి ఉన్న ఫోటోలను డిలీట్ చేసిన సమంత -
‘ఆర్ఎక్స్ 100’ రీమేక్‌గా ‘తడప్’.. కథ కొంచెం మారినట్లుందిగా..
మొదటి సినిమాతోనే అజయ్ భూపతికి ప్రత్యేక గుర్తింపు వచ్చేలా చేసిన సినిమా ‘ఆర్ఎక్స్ 100’. కార్తికేయు, పాయల్ రాజ్‌పుత్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం టాలీవుడ్లో ఎలాంటి సంచనాలకు దారితీసిందో తెలిసిందే. ఈ చిత్రం ఇప్పుడు బాలీవుడ్లో ‘తడప్’గా రీమేక్ అవుతోంది. స్టార్ యాక్టర్ సునీల్ శెట్టి తనయుడు అహాన్ శెట్టి, తారా సుతారియా జంటగా వస్తున్న ఈ మూవీ ట్రైలర్‌ని తాజాగా విడుదలైంది. మెగాస్టార్ చిరంజీవి లాంచ్ చేసిన ఈ ట్రైలర్ ఆకట్టుకునేలా ఉంది. అయితే అక్కడి ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లు ‘ఆర్ఎక్స్ 100’ కథకి కొన్ని మార్పులు చేసినట్లు అర్థమవుతోంది. అయితే హీరో, హీరోయిన్ల నటన మాత్రం అదిరిపోయింది. రఫ్, సాఫ్ట్ వంటి రెండు డిఫరెంట్ లుక్స్‌తో అహాన్ ఆకట్టుకుంటున్నాడు. ఈ ఏడాది డిసెంబర్ 3న విడుదల కానున్న ఈ చిత్రాన్ని సాజిద్ నడియడ్వాలా నిర్మిస్తుండగా.. మిలాన్ లుథ్రియా దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే ఇంతకుముందు కూడా కొత్త డైరెక్టర్‌గా సందీప్ రెడ్డి వంగా చేసిన ‘అర్జున్ రెడ్డి’ హిందీలో రీమేక్ అయ్యి సంచలన విజయం సాధించింది. కాగా టాలీవుడ్లో మరో కొత్త డైరెక్టర్ చేసిన ఈ సినిమా రీమేక్ ఎలాంటి సంచనాలకు దారి తీస్తుందో చూడాలి. చదవండి: ‘మహాసముద్రం’లోని ట్విస్ట్‌లు అంచనాలకు అందవు: మ్యూజిక్ డైరెక్టర్ -
Mahasamudram: స్నేహితుడు మంచోడైనా.. చెడ్డోడైనా వదలొద్దు
‘‘సినిమాలు విడదలైనప్పుడు యాక్టర్స్‌కు ప్రేక్షకులు మార్కులు వేస్తారు. ఈ సినిమాకు ప్రేక్షకులు ఎన్ని మార్కులు వేస్తారా? అని ఆసక్తికరంగా చూస్తున్నాం. అలాగే ఇమేజ్ అనే పదానికి చాలా అర్థాలు ఉంటాయి. ఈ చిత్రదర్శకుడు అజయ్ భూపతి ఈ సినిమాలో నాకో కొత్త ఇమేజ్‌ని క్రియేట్ చేశాడు’’ అన్నారు సిద్ధార్థ్. అజయ్ భూపతి దర్శకత్వంలో శర్వానంద్, సిద్ధార్థ్ హీరోలుగా రామబ్రహ్మం సుంకర నిర్మించిన చిత్రం ‘మహాసముద్రం’. ఇందులో అతిదీరావ్ హైదరి, అనూ ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లు. ఈ సినిమా నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా విలేకర్ల సమావేశంలో సిద్ధార్థ్ మాట్లాడుతూ – ‘‘అర్జున్ పాత్రలో శర్వా, విజయ్ పాత్రలో నేను నటించాను. ఈ సినిమా బరువు మోసిన శర్వా జ్వరం కారణంగా ఇక్కడికి రాలేకపోయాడు. ‘మహాసముద్రం’ ఒక అద్భుతమైన సినిమా. గర్వంగా చెప్పుకునే తెలుగు సినిమా’’ అని అన్నారు. ‘‘కొన్ని స్టోరీలకు హీరోలను వెతుక్కోవాల్సిన పనిలేదు. కథే హీరోలను వెతుక్కుంటుందంటారు. అదృష్టం కొద్దీ ఈ సినిమా శర్వా, సిద్ధార్థ్‌ల దగ్గర ఆగింది. మన స్నేహితుడు మంచోడైనా, చెడ్డోడైనా వదలొద్దన్నదే ఈ సినిమా మెయిన్ పాయింట్’’ అన్నారు అజయ్ భూపతి. ‘‘ఫీమెల్ సెంట్రిక్ కథల్లో నటించడం ఎప్పుడూ ప్రత్యేకంగానే ఉంటుంది’’ అన్నారు అదితీరావ్ హైదరీ. ‘‘ఈ ప్రాజెక్ట్ స్టార్టింగ్‌లో అజయ్ భూపతికి ఉన్న నమ్మకం ఇప్పుడు మా అందరిలోనూ ఉంది’’ అన్నారు అనిల్ సుంకర. -
ఇద్దరు హీరోలతో మూవీ అంటే వచ్చే కిక్ వేరు : అజయ్ భూపతి
‘దర్శకుడు కావాలన్నదే నా కల. ఆర్ఎక్స్ 100 తో ఆ కల నెరవేరింది. ఆ సినిమా హిట్ అవుతుందా? ఫ్లాప్ అవుతుందా? అని కూడా ఆలోచించలేదు. నేను దర్శకుడని అయ్యాను అనే తప్పా.. సినిమా ఫలితం గురించి నేను ఆలోచించలేదు. నాకు పలాన సినిమా చేయాలి అనే కల ఏమీ లేదు. నచ్చిన చిత్రాలు చేసుకుంటూ వెళ్తాను’అన్నారు దర్శకుడు అజయ్ భూపతి. ఆర్ఎక్స్ 100 లాంటి బ్లాక్ బస్టర్ తరువాత అజయ్ భూపతి దర్శకత్వం వహించిన చిత్రం ‘మహా సముద్రం’. శర్వానంద్, సిద్దార్థ్ హీరోలుగా నటించిన ఈ చిత్రాన్ని ఎ.కె.ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సుంకర రామబ్రహ్మం నిర్మిస్తున్నారు.. ఇన్టెన్స్ లవ్, యాక్షన్ డ్రామాగా రూపొందుతోన్న ఈ చిత్రంలో అదితిరావు హైదరి, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. దసరా కానుకగా అక్టోబర్ 14న రాబోతోన్న ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా నేడు (మంగళవారం) దర్శకుడు అజయ్ భూపతి మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు మీకోసం.. ►ఈ సినిమాలో మహా పాత్రకు కొంత మందిసెట్ అవుతారు. సమంత గారికి కూడా ఈ కథ బాగా నచ్చింది. ముందు ఆమెను కూడా అనుకున్నాను. కానీ చివరకు అదితిరావు హైదరిని తీసుకున్నాను. ►ఇద్దరు హీరోలతో సినిమా అంటే వచ్చే కిక్ వేరు. ఇద్దరు హీరోలున్న దళపతి, విక్రమ్ వేదా ఇలా ఎన్నో సినిమాలు తెరపై చూస్తే ఏదో తెలియని ఆనందం వేస్తుంది. అలాంటి ఫీల్‌ను ప్రేక్షకులకు ఇవ్వాలని, ఆ కిక్‌ను వారికి మళ్లీ చూపించాలనే సినిమాను తీశాను. ►ఆర్ ఎక్స్ 100 తరువాత చాలా ఆఫర్లు వచ్చాయి. అవన్నీ పక్కనపెట్టేసి మహా సముద్రం కోసం ట్రై చేశాను. ఆర్ ఎక్స్ 100 కంటే ముందే పాయింట్ఉంది. నేను తరువాత తీయబోయే సినిమా ఇదే అని కార్తికేయకు కూడా సెట్లోచెప్పేవాడిని. ►మహాసముద్రం పూర్తిగా కల్పిత కథ. ఓ ఇద్దరు స్నేహితుల మధ్య జరిగే కథ, ఇద్దరు ప్రేమికుల మధ్య జరిగే కథ. కొన్ని పాత్రల మధ్య జరిగే కథ. వైజాగ్‌లో సముద్రానికి ఆనుకుని ఉన్న లొకేషన్లో సాగే కథ. అక్కడి వ్యక్తులు, వారి వ్యక్తిత్వాల మధ్య జరిగే కథ. ►ఏ స్టోరీలో అయినా సరే ఫీమేల్ క్యారెక్టర్ బలంగా ఉంటే అది సక్సెస్ అవుతుందని నా ప్రగాఢ నమ్మకం. బాలచందర్ గారి చిత్రాలంటే నాకు చాలా ఇష్టం. అంతులేని కథలో జయప్రద పాత్ర ఇష్టం. సినిమాలో అలా వచ్చి వెళ్లే క్యారెక్టర్లను నేను రాయను. ►కథ రాసుకున్నప్పుడు ఎవ్వరినీ ఊహించుకోలేదు. ఇద్దరు హీరోలు అని కథ రాసుకున్నా. కొంత మంది దగ్గరికి వెళ్లాను. కథ బాగా నచ్చిందని అందరూ అన్నారు. కానీ కొంత మంది సోలో హీరో అయితే చేస్తాను అని అన్నారు. కానీ నేను ఇదే కథ చేస్తాను అని పట్టుబట్టాను. అలా చివరకు శర్వా, సిద్దులు ఓకే అయ్యారు. ►హీరోల కోసం కథలో ఎలాంటి మార్పులు చేయలేదు. కానీ కొన్ని కొన్ని సీన్లలో మాటలు, వారే మాట్లాడే విధానం, బాడీ లాంగ్వేజ్‌ను మార్చుకున్నాను. ►ఫ్రెండ్ అంటే నాలుగు రోజులు కలిసి తిరిగి, బీర్లు తాగివెళ్లడం కాదు. ఒక్కసారి మనం ఫ్రెండ్ అని అనుకుంటే.. వాడు చేసే తప్పులను, ఒప్పులను అంగీకరించాలి. జీవితాంతం వాడి కోసం నిలబడాలని చెప్పే కథ. ►నాకు ఈ సినిమాకు ఎంత బడ్జెట్ అయిందో తెలియదు. నిర్మాతలు కూడా నాకు ఎప్పుడూ ఇంత బడ్జెట్ అయిందని చెప్పలేదు. ఈ సినిమాను నా మీద వదిలేశారు. నాకు ఏ సమస్యను రానివ్వలేదు. కొత్త ఆర్టిస్ట్‌ల్లా నా దగ్గరికి వచ్చే వారు. సినిమా ఇంత బాగా వచ్చిందంటే దానికి కారణం నిర్మాతలే. నాలుగు నెలల్లోనే ఈ చిత్రాన్ని పూర్తి చేశాను. కరోనా సెకండ్ వేవ్ ప్రారంభమైనా కూడా వైజాగ్‌లో జాగ్రత్తగా షూటింగ్ చేసుకుని వచ్చాం. ►ప్రతీ పాత్రకు ఆది, అంతం ఉంటుంది. అలా వచ్చీ వెళ్లే పాత్రలు నా సినిమాలో ఉండవు. ఏ ఒక్కరూ కూడా నా క్యారెక్టర్ లెంగ్త్ ఎంత అని అడగలేదు. శర్వా, సిద్దులు సైతం వచ్చారు.. వారి క్యారెక్టర్ చేసి వెళ్లారు. ఈ సినిమా ఇంత బాగా రావడానికి కారణం వాళ్లే. ►ఆర్ ఎక్స్ 100 సమయంలోనూ రెండు ట్రైలర్లు కట్ చేశాను. ఇప్పుడు కూడా అలానే చేశాను. అది నా స్టైల్. కథలో దమ్ము ఉండాలి. కావాలంటే నేను ఇంకో ట్రైలర్‌ను కూడా కట్ చేయగలను. ట్రైలర్ చూసి ఈ కథను చెప్పలేరు. ఇందులో సబ్ స్టోరీస్ చాలా ఉంటాయి. ►ప్రేమకు హద్దుల్లేవు. నీ మీద నీకు ఎంత ప్రేమ అని అంటే.. అంత ఇంత అని చెప్పలేం. దాన్ని కొలవలేం. ఒక్కోసారి ప్రేమించిన వారి కోసం ఏదైనా చేయాలనిపిస్తుంది. అందుకే కొలవలేనంత ప్రేమ అనే క్యాప్షన్‌ను పెట్టాం. ►నేను చూసిన కొంతమంది క్యారెక్టర్స్, వారి క్యారెక్టరైజేషన్స్ ఈ చిత్రంలో వాడాను. అలా మా అమ్మమ్మ గారు తన చేతిని కొరుక్కునేది. పిల్లల అల్లరిని తట్టుకోలేక అలా చేసివారు. అదే రావు రమేష్ గారికి పెట్టాం. జగపతి బాబు గారి పాత్రను మన చుట్టూ చూస్తుంటాం. ఆయనే ఈ సినిమా క్యారెక్టర్స్ అతి పెద్ద బలంగా మారుతాయి. సినిమా చూసి బయటకు వచ్చాక హీరో హీరోయిన్లు గుర్తుకు ఉండరు. క్యారెక్టర్సే గుర్తుంటాయి. ►ఎప్పుడూ విలన్ క్యారెక్టర్లు వేసే వారిని తీసుకొచ్చి విలన్‌గా చూపిస్తే ఏం బాగుంటుంది. అందుకే ఎప్పుడూ లవర్ బాయ్ క్యారెక్టర్లు వేసిన సిద్దును ఇందులో మాస్ యాంగిల్లో చూపించాను. అదే ప్రేక్షకుల్లో ఇంట్రెస్ట్ కలిగిస్తుంది. నేను క్యారెక్టర్ ఇలా ఉండాలని చెప్పాను. కానీ మేకోవర్ కోసం ఆయనే కష్టపడ్డారు. సిద్దు మేకప్ మేన్ చాలా రకాలుగా ట్రై చేశారు. ►ఫస్ట్ ఫ్రేమ్ నుంచి చివరి ఫ్రేమ్ వరకు శర్వా క్యారెక్టర్ కోసం అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. సినిమా చూసి బయటకు వచ్చాక శర్వా పాత్రను మీరంతా ప్రేమిస్తారు. ►మ్యూజిక్ డైరెక్టర్ చైతుకి నా మెంటాలిటీ తెలుసు. నాకు ఏ టైప్, కొత్త జానర్లు అంటే ఇష్టమని తెలుసు. రంభ రంభ, చెప్పకే చెప్పకే పాటలు ఇప్పటికే సక్సెస్ అయ్యాయి. ఇక సినిమాలో విజువల్స్ చూస్తే అందరికీ నచ్చుతాయి. ఈ సినిమాకు ఆయనే మెయిన్ పిల్లర్. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇరగదీశాడు. కొత్త సౌండ్స్ వింటారు. నా బాస్ (ఆర్జీవీ) దగ్గర నేర్చుకుందే సౌండ్ గురించి. ఆ విషయంలో నేను చాలా జాగ్రత్తలు తీసుకుంటాను. ►ఆర్ ఎక్స్ 100 సినిమాకు పని చేసిన డైరెక్షన్ టీంలో ఇప్పటికి ముగ్గురు దర్శకులు అయ్యారు. ఇక మహా సముద్రం కోసం పని చేసిన పది మంది త్వరలోనే దర్శకులు కాబోతోన్నారు. వారు నాకంటే టాలెంట్. ►ఆర్ ఎక్స్ 100 సినిమా పాన్ ఇండియా. ఇప్పుడు అన్ని భాషల్లో రీమేక్ అవుతోంది. అంటే ఆర్ ఎక్స్ 100 ఐడియా పాన్ ఇండియా. ఇప్పుడు మహా సముద్రం కూడా పాన్ ఇండియా సినిమానే. ఆ దిశగా చర్చలు కూడా జరుగుతున్నాయి. ►ఆర్ ఎక్స్ 100 బాలీవుడ్ రీమేక్ కోసం ఆఫర్ వచ్చింది. బాలీవుడ్లో చేయాలనే ఆసక్తి నాకు లేదు. నాకు ఇక్కడ చాలా బాగుంది. అక్కడి కంటే ఇక్కడే బాగుంది. తెలియని వాళ్ల దగ్గరకి వెళ్లి సినిమా చేయాలని ఇప్పుడు అనిపించలేదు. భవిష్యత్తు గురించి ఇప్పుడే ఏం చెప్పలేను. ►ఓటీటీలో కూడా ఆఫర్లు వస్తున్నాయి. నెట్ ఫ్లిక్స్‌లో ఆంథాలజీ కాన్సెప్ట్ కోసం అడిగారు. ఆ ప్రాజెక్ట్ చేస్తున్నాను. ఓటీటీలో అయితే మన ఐడియాను ఇంకాస్త విస్తృతంగా చూపించవచ్చు. థియేటర్లో చూపించలేని ఐడియాను, ఆ స్పాన్‌ను ఓటీటీ కోసం ఇంకాస్త పెంచుకోవచ్చు. నాకు కూడా ఓటీటీ అంటే ఇష్టం. ►ఆర్ ఎక్స్ 100 సినిమాను ఆర్జీవీ గారు వెంటనే చూడలేదు. ఆ తరువాత ఎప్పుడో చూశారు. ఈ సినిమా ట్రైలర్ ఆయనకు బాగా నచ్చింది. ట్వీట్ కూడా వేశారు. సినిమా చూస్తారా? అని అడిగాను. తరువాత చూస్తాను అని అన్నారు. ►అన్ని జానర్లలో చిత్రాలు చేయాలని ఉంది. మహా సముద్రం తరువాత మాస్ ఎంటర్టైనర్తో రాబోతోన్నాను. స్క్రిప్ట్ కూడా రెడీగా ఉంది. హీరో ఎవరనేది ఇంకా ఫిక్స్ కాలేదు. చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే అన్ని వివరాలు ప్రకటిస్తాను. -
పండగకి వచ్చిన ప్రతిసారీ హిట్ సాధించా..
‘‘మహాసముద్రం’ శర్వా సినిమా అని సిద్ధూ అన్నాడు. కానీ నేను ఒప్పుకోను. ఈ సినిమాకు కథే హీరో. ఓ సందర్భంలో రావు రమేష్‌గారు దర్శకుడు అజయ్ భూపతి దగ్గర ఓ కథ ఉందని, కానీ హీరోలు కుదరడం లేదనీ అన్నారు. మంచి హిట్ ఇచ్చిన దర్శకుడికి హీరోలు కుదరకపోవడం ఏంటి? అనుకున్నాను. ఆ తర్వాత నేను కథ విని ఫస్ట్ సిట్టింగ్‌లోనే ఓకే చెప్పాను. అనిల్ సుంకర్‌గారు కూడా కథ వినగానే ఓకే చెప్పారు’’ అని శర్వానంద్ అన్నారు. శర్వానంద్, సిద్ధార్థ్ హీరోలుగా ‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మించిన చిత్రం ‘మహాసముద్రం’. ఈ చిత్రంలో అదితిరావు హైదరీ, అనూ ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లు. ఈ నెల 14న రిలీజ్ కానున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో అతిథిగా పాల్గొన్న హీరో కార్తికేయ సినిమా సెకండ్ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా శర్వానంద్ మాట్లాడుతూ – ‘‘తొమ్మిది మంది జీవితాల్లో జరిగే కథ ఇది. మహా (అదితి) క్యారెక్టర్ చుట్టూ తిరిగే కథ. మహాలాంటి క్యారెక్టర్ చేయడం కష్టం. అదితీ అద్భుతంగా చేశారు. అనూ ఇమ్మాన్యుయేల్ కూడా బాగా చేశారు. ‘అంతఃపురం’లో జగపతిబాబుగారి యాక్టింగ్ చూసి, ఫ్యాన్ అయిపోయాను. ఆయనతో యాక్ట్ చేయాలన్న నా కల ఈ చిత్రంతో నిజమైంది. నేను పండక్కి వచ్చిన ప్రతిసారీ అందరం పండగ చేసుకున్నాం. ఒక సంక్రాంతికి ‘ఎక్స్‌ప్రెస్ రాజా’తో, ఇంకో సంక్రాంతికి ‘శతమానంభవతి’తో, ఒక దసరాకు ‘మహానుభావుడు’తో హిట్ సాధించా. ఈ దసరాకు ‘మహాసముద్రం’తో వస్తున్నాం. హిట్ కొడుతున్నాను’’ అన్నారు. సిద్ధార్థ్ మాట్లాడుతూ – ‘‘ఏ స్టార్ (నక్షత్రం)కీ సొంత వెలుగు ఉండదు. ఏ స్టార్ అయినా సూర్యుడి వెలుగు తీసుకోవాలి. నా సూర్యులు తెలుగు ప్రేక్షకులు. అందరూ ఇది మల్టీస్టారర్ ఫిల్మ్ అంటున్నారు. కానీ నా దృష్టిలో ఇప్పుడు కాదు.. ఎప్పటికీ ‘మహాసముద్రం’ శర్వానంద్ సినిమానే. ‘ఆర్ఎక్స్ 100’ తర్వాత అజయ్ భూపతి స్పీడ్ ఏమాత్రం తగ్గలేదు. మన అభిమాన స్టార్ స్క్రీన్‌పై వచ్చారని చప్పట్లు కొట్టకుండా.. వారు ఎలాంటి పెర్ఫార్మెన్స్ చేశారో చూసి చప్పట్లు కొట్టే సినిమా ఇది’’ అన్నారు. అజయ్ భూపతి మాట్లాడుతూ– ‘‘ఇది భావోద్వేగాల ప్రేమకథ. డిఫరెంట్ క్యారెక్టరైజేషన్‌తో కూడిన కొందరి జీవితాలు ఎవరి వల్ల ఏ విధంగా ప్రభావితం అయ్యాయి అనే అంశం కూడా ఉంటుంది. ఈ సినిమాలో స్టోరీయే హీరో. భావోద్వేగాలు నిండిన కళ్లతో ప్రేక్షకులు థియేటర్ నుంచి బయటకు వస్తారు. ‘ఆర్ఎక్స్ 100’ అప్పుడు కూడా ఇలానే మాట్లాడితే ఓవర్‌గా మాట్లాడుతున్నాడన్నారు. అప్పుడు ఆడియన్స్‌ను థియేటర్స్‌కు తీసుకుని రావాలని ప్రయత్నించాం. కానీ ఇప్పుడు ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకున్నా ఫర్వాలేదు. ‘మహాసముద్రం’ బ్లాక్‌బస్టర్ అవుతుంది’’ అన్నారు. నిర్మాత అనిల్ సుంకర మాట్లాడుతూ – ‘‘అజయ్ చెప్పిన కథ నాకు కొత్తగా అనిపించింది. శర్వా, సిద్ధార్థ్, అను, అదితీ ఈ సినిమాకు నాలుగు పిల్లర్లు. ‘మహాభారతం’లో యుద్ధానికి శకుని కారణం అయితే.. ఈ సినిమాలో అలాంటి శకుని గూని బాజ్జీ పాత్ర చేశారు రావు రమేష్‌గారు. సినిమాలు తీసేది థియేటర్స్‌లో విడుదల చేయడానికే. కుదరకపోతే తప్ప... కుదిరినప్పుడు సినిమాను తప్పకుండా థియేటర్స్‌లోనే రిలీజ్ చేయాలి’’ అన్నారు. ‘‘ఈ సినిమాలో స్మిత క్యారెక్టర్ ఇచ్చిన అజయ్ భూపతిగారికి, నిర్మాతలకు థ్యాంక్స్’’ అన్నారు అనూ ఇమ్మాన్యుయేల్. ‘‘మహా క్యారెక్టర్ ఇచ్చిన అజయ్ భూపతికి, సినిమాను థియేటర్స్‌లో విడుదల చేస్తున్న అనిల్ సుంకరగారికి ధన్యవాదాలు’’ అన్నారు అదితీరావు హైదరీ. ‘‘నేనేంటో నిరూపించుకోవడానికి ‘మహాసముద్రం’ లాంటి సినిమా ఇచ్చిన దర్శక–నిర్మాతలకు ధన్యవాదాలు’’ అన్నారు మ్యూజిక్ డైరెక్టర్ చేతన్ భరద్వాజ్. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ఆ ప్యానల్‌కి మద్దతిచ్చిన వారికే క్యారెక్టర్లు రాస్తాడట..అజయ్ భూపతి ట్వీట్ వైరల్
MAA Elections 2021: మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల్లో రోజుకో వివాదం చోటు చేసుకుంటుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇరు ప్యానళ్ల సభ్యులు పరస్పరం మాటల దాడి చేసుకుంటున్నారు. మొదట్లో కేవలం సంస్థాగతంగా విమర్శించుకున్న నటులు.. ప్రస్తుతం వ్యక్తిగత విమర్శలు చేసుకుంటున్నారు. ఎన్నికలకు మూడు రోజులు మాత్రమే మిగిలి ఉండడంతో ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు ప్యానల్ సభ్యులు ప్రచారం ముమ్మరం చేశారు. విమర్శలు, వాదనలు, ఆరోపణలతో ప్రత్యర్థులపై విరుచుకుపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆర్ఎక్స్ 100 డైరెక్టర్ అజయ్ భూపతి చేసిన ట్వీట్ సెన్సేషన్‌గా మారింది.‘నాకు నచ్చిన ప్యానల్‌కి మద్దతిచ్చిన వారికే క్యారెక్టర్లు రాస్తా..' అని అని నాతో ఇప్పుడే ఒక డైరెక్టర్ అన్నాడని పేర్కొంటూ ట్విటర్లో పోస్ట్ పెట్టాడు అజయ్. దానికి 'మా' ఎలక్షన్స్ అనే హ్యాష్ ట్యాగ్ జత చేశారు. నాకు నచ్చిన ప్యానల్ కి మద్దతిచ్చిన వారికే క్యారెక్టర్లు రాస్తా... (అని నాతో ఇప్పుడే ఒక డైరెక్టర్ అన్నాడు)#MAAElections — Ajay Bhupathi (@DirAjayBhupathi) October 6, 2021 మరో ట్వీట్లో ‘ఈ థ్రిల్లర్ ఎపిసోడ్లు చూస్తుంటే నాక్కూడా రెండు మూడు సినిమాల్లో నటించి 'మా' లో కార్డు తీసుకుని ఎన్నికల్లో ప్రెసిడెంటుగా పోటీ చేయాలనుంది.ఏదేమైనా, ఈ ఎన్నికల తరువాత 14th న మన "మహాసముద్రం’ రిలీజ్ ఉంది.. అందరూ తప్పకుండా థియేటర్లలోనే చూడండి’ అని కామెంట్ చేశాడు. దీంతో ఈ రెండు ట్వీట్లు క్షణాల్లో వైరల్ అయ్యాయి. అయితే అజయ్ భూపతితో అలాంటి కామెంట్ చేసిన సదరు డైరెక్టర్ ఎవరి వర్గం అనేది స్పష్టత లేదు. ఈ థ్రిల్లర్ ఎపిసోడ్లు చూస్తుంటే నాక్కూడా రెండు మూడు సినిమాల్లో నటించి 'మా' లో కార్డు తీసుకుని ఎన్నికల్లో ప్రెసిడెంటుగా పోటీ చేయాలనుంది. ఏదేమైనా, ఈ ఎన్నికల తరువాత 14th న మన "మహాసముద్రం" రిలీజ్ ఉంది.. అందరూ తప్పకుండా థియేటర్లలోనే చూడండి!!#MahaSamudramonOct14th #MAAElections pic.twitter.com/yJD3GWIZwR — Ajay Bhupathi (@DirAjayBhupathi) October 6, 2021 -
‘మహాసముద్రం’లోని ట్విస్ట్‌లు అంచనాలకు అందవు: మ్యూజిక్ డైరెక్టర్
ఆర్ఎక్స్ 100 వంటి బ్లాక్ బస్టర్ తర్వాత అజయ్ భూపతి దర్శకత్వంలో వస్తున్న సినిమా ‘మహా సముద్రం’. శర్వానంద్, సిద్దార్థ్ హీరోలుగా చేస్తున్న ఈ మూవీలో అదితిరావు హైదరి, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఇన్టెన్స్ లవ్, యాక్షన్ డ్రామాగా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని ఎ.కె.ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సుంకర రామబ్రహ్మం నిర్మిస్తున్నాడు. దసరా కానుకగా అక్టోబర్ 14న రాబోతున్న ఈ సినిమా గురించి మ్యూజిక్ డైరెక్టర్ చేతన్ భరద్వాజ్ మీడియాతో ముచ్చటించారు. వివరాలిలా.. ► ఎంతో ఇన్టెన్సిటీ ఉన్న ఎమోషనల్ లవ్‌స్టోరీ ‘మహా సముద్రం’. ఈ చిత్రం చూసిన తర్వాత ఏం మాట్లాడకుండా మౌనంగా వెళ్లారు. చివరి 40 నిమిషాలు సినిమా ఎంతో ఎక్సైట్మెంట్ని ఇస్తుంది. ► అమాయకంగా ఉండే మనుషుల జీవితాల్లో వచ్చే మార్పుల సమాహారమే ఈ చిత్రం. ఇలాంటి సినిమాకు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇవ్వడం ఛాలెంజింగ్‌గా అనిపించింది. అందరి అంచనాలు మించేలా సినిమా ఉంటుంది. ► మ్యూజిక్ అనేది కథకు అనుగుణంగానే ఇస్తాను. కథ బాగుంటే.. మ్యూజిక్ కూడా బాగుంటుంది. కథను బట్టే మ్యూజిక్ ఇవ్వడానికి ఎక్కువగా ప్రయత్నిస్తుంటాను. ► ఆర్ఎక్స్ 100 సినిమాలో కంటే ఎక్కువ ట్విస్ట్‌లు మహాసముద్రంలో ఉంటాయి. అంటే దాదాపు ఐదారు ఉంటాయి. అవి ప్రేక్షకుల అంచనాలకు అందవు. ఒక అతీంద్రియ శక్తితో పాటు.. టైం, విధి మనిషిని ఎన్ని రకాలుగా మార్చుతుందనేది చూపించబోతున్నాం. ► ఆర్ఎక్స్ 100 సినిమాకు చేసిన ప్రయోగాన్ని ప్రేక్షకులు బాగా రిసీవ్ చేసుకున్నారు. దీంతో ఈ సినిమాకు ఒళ్లు దగ్గరపెట్టుకుని మరింత జాగ్రత్తగా మ్యూజిక్ అందించాను. కచ్చితంగా ఇందులోని అన్ని పాటలు ఆడియన్స్‌ని ఆకట్టుకుంటాయి. ► మహా అనే క్యారెక్టర్లో చాలా ఆసక్తిని రేపుతుంది. ఆమె జీవితంలో జరిగే సంఘటనలు చుట్టూ ఉన్న వారి జీవితాలను ఎలా ప్రభావితం చేశాయనేది కథ. ► కొన్ని జానర్స్ మూవీ సెంట్రిక్‌గా చేయాల్సి ఉంటుంది. మూవీలో ఆ పర్టిక్యులర్ సీన్లో వచ్చే పాట ఆడియెన్స్‌కు కనెక్ట్ అయితే.. ఆ పాట హిట్టైనట్టే. ఆర్ఎక్స్ 100 సినిమాకి అదే మ్యాజిక్ వర్కౌట్ అయ్యింది. ఈ సినిమాలో నాకు చెప్పకే చెప్పకే అనే పాట ఎక్కువగా ఇష్టం. ► దర్శకుడు కథను ఎంతో క్లియర్‌గా, డీటైల్డ్‌గా నాకు చెప్పారు. లైవ్ బేస్డ్ ఎలిమెంట్స్ చేసే స్కోప్ ఇచ్చారు. ► ప్రతీ ఒక్కరూ అద్బుతంగా నటించారు. ఇంత ఇంటెన్స్ ఉన్న సినిమాను ఈ మధ్య కాలంలో చూసి ఉండరు. ప్రతీ ఒక్క పాత్రకు ఇంపార్టెన్స్ ఉంటుంది. ఈ చిత్రానికి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చేయడం చాలా కష్టంగా అనిపించినా.. ఛాలెంజింగ్‌గా తీసుకున్నాను. ► చైతన్య ప్రసాద్, భాస్కరభట్ల, కిట్టు విశ్వప్రగడ అందరూ అద్భుతంగా రాశారు. సినిమాలోని ఎమోషన్‌ను ముందుకు తీసుకెళ్లలా వారి పాటలు ఉన్నాయి. ► బ్యాక్ గ్రౌండ్ కన్నా.. సాంగ్స్ చేయడమే నాకు ఇష్టం. పాటలు చేయడంలో ఫ్రీడం ఎక్కువగా ఉంటుంది. ఆర్ఎక్స్ 100 లో రుధిరం, ఎస్ఆర్ కళ్యాణమండపంలోని చుక్కల చున్నీ బాగా ఇష్టం. ► పాటలు ఎప్పుడూ కూడా సినిమాకు తగ్గట్టే ఉండాలి. పాటలను బట్టే సినిమాలను చూస్తున్నారు. ఆర్ఎక్స్ 100 సినిమాకు అంత ఆదరణ ఇచ్చినందుకు ప్రేక్షకులకు రుణపడి ఉంటాను. నా జర్నీ నాకు ఎంతో సంతృప్తినిచ్చింది. చదవండి: ఇండియాకు తిరిగి వచ్చాను, కోలుకుంటున్నా: హీరో సిద్ధార్థ్ -
‘మహా సముద్రం’ మూవీ స్టిల్స్
-
పది రోజుల్లో అడ్వాన్స్ చెక్ అందింది
శ్రీ సింహా కోడూరి హీరోగా రూపొందిన చిత్రం ‘తెల్లవారితే గురువారం’. సాయి కొర్రపాటి సమర్పణలో రజని కొర్రపాటి, రవీంద్ర బెనర్జీ ముప్పనేని నిర్మించిన ఈ సినిమా నేడు విడుదలవుతోంది. చిత్రదర్శకుడు మణికాంత్ మాట్లాడుతూ– ‘‘ఆర్ఎక్స్ 100’కు అజయ్ భూపతిగారి వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేశాను. ‘తెల్లవారితే గురువారం’ కథ నచ్చడంతో శ్రీ సింహానే నిర్మాతలను మాట్లాడారు. పది రోజుల్లోనే అడ్వాన్స్ చెక్ చేతికిచ్చారు. సింహా తన పాత్రకి న్యాయం చేశారు. మ్యూజిక్‌తో కాలభైరవ ఈ సినిమాని మరో మెట్టుపైకి ఎక్కించారు. ఈ చిత్రానికి కథ, మాటలు నా ఫ్రెండ్ నాగేంద్రవే. ప్రస్తుతానికి రెండు కథలున్నాయి. ఎప్పటికైనా నా అభిమాన హీరో తారక్ (జూనియర్ ఎన్టీఆర్)తో ఓ సినిమా చేయలనేది నా కల’’ అన్నారు. -
అలల కంటే మొండివాడిని.. మరి మీరూ?!
‘ఆర్ఎక్స్ 100’తో సూపర్ హిట్ అందుకున్న దర్శకుడు అజయ్ భూపతి ఇటీవల శర్వానంద్, హీరో సిద్దార్థ్‌లతో మల్లీస్టార్ చిత్రం ‘మహాసముద్రం’ తెరకెక్కిస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ థీమ్ పోస్టర్‌ను హీరో శర్వానంద్ దీపావళి సందర్భంగా విడుదల చేశాడు. ఎకే ఎంటర్టైనమెంట్స్ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అదితి రావు హైదరి, అను ఇమ్మాన్యూయేల్‌లు కథానాయికలుగా నటిస్తున్నారు. దీపావళి పండగ సందర్భంగా ఈ సినిమా థీమ్ పోస్టర్‌ను చిత్రయూనిట్ విడుదల చేసింది. ఈ థీమ్ పోస్టర్‌ను తన ట్విటర్ ఖాతాలో షేర్ చేస్తూ... ‘సముద్రం అంతా లోతు, అలల కంటే మొండివాడిని.. అంటూ తన సహా నటులైన సిద్దార్థ్‌తో పాటు హీరోయిన్స్ అదితి రావ్, అను ఇమ్మాన్యూమేల్‌లను ట్యాగ్ చేసి మరీ మీరు ఎవరూ అని ప్రశ్నించాడు. అంతేగాక దర్శకుడు అజయ్ భూపతి, నిర్మాతలను ట్యాగ్ చేసి ప్రేక్షకులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపాడు. (చదవండి: షేక్ చేస్తున్న శర్వానంద్ ‘భలేగుంది బాలా’ సాంగ్) I'm stubborn than the waves, deep as the seas! @aditiraohydari @Actor_Siddharth @ItsAnuEmmanuel Who are you? #MahaSamudram #ThemePoster 🌊 #HappyDiwali 🪔@DirAjayBhupathi @AnilSunkara1 @AKentsOfficial pic.twitter.com/MGHfjfaFb8 — Sharwanand (@ImSharwanand) November 14, 2020 కాగా అజయ్ భూపతి మొదటిసారిగా దర్శకత్వం వహించిన రొమాంటిక్ చిత్రం ‘ఆర్ఎక్స్ 100’ బ్లాక్‌బ్లస్టర్ హిట్ కావడంతో ప్రేక్షకులు ఈ సినిమాపై భారీగానే అంచనాలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఎర్రటి ఆకాశం, సముద్రం బ్యాక్‌గ్రౌండ్‌లో బ్రిడ్జికి అవతలవైపు ఓ వ్యక్తి పరుగులు తీస్తూ, ఇవతల బ్రిడ్జిపై ఇద్దరూ మనుషులు గన్‌పై నిలుచున్నట్లుగా ఉండి పరుగెడుతున్న వ్యక్తి వైపు గురిపెడుతున్న ఈ పోస్టర్ ప్రేక్షకుల్లో మరింత ఆసక్తిని పెంచుతోంది. ఇక పొస్టర్‌కు కింద ‘అమితమైన ప్రేమ’ అనే ట్యాగ్ లైన్ ఉండటం చూసి ‘సముద్రం’ రోమాంటిక్, థ్రీల్లర్ నేపథ్యంలో సాగనుందని, దర్శకుడు ఈ సినిమాను ఓరెంజ్‌లో చూపించబోతున్నాడంటూ అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అంతేగాక దాదాపు ఏడేళ్ల తర్వాత ‘బొమ్మరిల్లు’ హీరో సిద్దార్థ్ తెలుగు రీఎంట్రీ ఇవ్వడంలో ఈ సినిమాపై మరింత అంచనాలు పెరిగాయి. ఈ చిత్రం ప్రస్తుతం విశాఖపట్నంలో షూటింగ్ జరుపుకుంటోంది. (చదవండి: టాలీవుడ్లో కొత్త జోడి.. సాయి కాదు అదితి) -
ఎనిమిదేళ్ల తర్వాత ‘మహాసముద్రం’..
‘‘ఎనిమిదేళ్ల తర్వాత ‘మహాసముద్రం’ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు రీ ఎంట్రీ ఇస్తున్నందుకు ఆనందంగా ఉంది. ఈ సినిమాకి ఈ నెల నుంచి పని చేయబోతున్నాను.. చెప్పినట్లుగానే నేను తిరిగి వస్తున్నాను. ఒక గొప్ప టీమ్‌తో, గొప్ప సహనటీనటులతో పని చేయబోతున్నందుకు చాలా ఆనందంగా ఉంది’’ అన్నారు సిద్ధార్థ్. శర్వానంద్, సిద్ధార్థ్ హీరోలుగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘మహాసముద్రం’. ‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సుంకర రామబ్రహ్మం నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్లుగా అదితీరావ్ హైదరి, అనూ ఇమ్మాన్యుయేల్ నటిస్తున్నారు. ఇంటెన్స్ లవ్ అండ్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కనుంది. -
సమంత ప్లేస్‌లో‘వరల్ఢ్ ఫేమస్ లవర్’ నటి
సాక్షి, హైదరాబాద్: 'కౌసల్య కృష్ణమూర్తి', 'వరల్డ్ ఫేమస్ లవర్' చిత్రాలతో వెండితెరకు పరిచయమైన నటి ఐశ్వర్య రాజేశ్ ప్రస్తుతం తెలుగులో నానితో ‘టెక్ జగదీశ్’ లో నటిస్తున్న విషయం తెలిసిందే. అంతేగాక తమిళంలో పలు ప్రాజెక్టులకు సంతాకాలు చేసిన ఐశ్వర్యకు చేతి నిండా సినిమాతో ఫుల్ బిజీగా ఉంది. ఈ నేపథ్యంలో ఆమె మరో లక్కీ ఛాన్స్ కొట్టేసింది. ఏకంగా సమంత స్థానంలో నటించే అవకాశాన్ని అందిపుచ్చుకుంది. ఆర్ఎక్స్ 100 చిత్ర దర్శకుడు అజయ్ భూపతి తాజాగా తీస్తున్న మహా సముద్రం సినిమాలో శర్వానంద్‌కు జోడిగా ఐశ్వర్యను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్ పాత్రకు మొదట దర్శకుడు సమంతను సంప్రదించినట్లు సమాచారం. ఆమెకు కథ వివరించగా పాత్ర నచ్చి ఒకే చెప్పినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే కొన్ని కారణాల వల్ల సమంత ఇటీవల ఈ సినిమా నుంచి తప్పుకోవడంతో చివరకు ఈ పాత్రకు దర్శకుడు ఐశ్వర్య రాజేష్‌ను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. కాగా తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కించనున్న ఈ సినిమాలో మరో హీరోగా లవర్ బాయ్ సిద్దార్థ నటింస్తున్నాడు. దాదాపు నాలుగేళ్ల తర్వాత తిరిగి సినిమాల్లో గ్రాండ్ ఏంట్రీ ఇవ్వనున్నాడు ఈ లవర్ బాయ్. ‘బొమ్మరిల్లు’, ‘నువ్వు వస్తానంటే.. నేనొద్దంటానా’తో తెలుగులో బ్లక్‌బస్టర్ హిట్ కొట్టిన సిద్దార్థ్‌కు ఆ తర్వాత సక్సెస్‌లు తక్కువే అని చెప్పుకొవచ్చు. 2016లో పలు సినిమాలతో పాటు తమిళ డబ్బింగ్ సినిమాల్లో నటించినప్పటికి అవి అంతగా గుర్తింపు పొందలేదు. దీంతో కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న సిద్ధార్థ్ ‘మహా సముద్రం’తో ఎంట్రీ ఇస్తున్నాడు. -
మహా సముద్రంలో...
‘ఆర్ఎక్స్ 100’ చిత్రదర్శకుడు అజయ్ భూపతి దర్శకత్వంలో ‘మహాసముద్రం’ అనే చిత్రం రూపొందనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాని ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సుంకర రామబ్రహ్మం నిర్మించనున్నారు. ఇందులో ఇద్దరు హీరోలు ఉంటారు. ఒక హీరోగా శర్వానంద్ పేరుని ఎప్పుడో ప్రకటించిన చిత్రబృందం తాజాగా మరో హీరోగా సిద్ధార్థ్ నటించబోతున్నట్లు తెలిపింది. చాలాకాలం తర్వాత సిద్ధార్థ్ చేస్తున్న డైరెక్ట్ తెలుగు చిత్రమిది. సిద్ధార్థ్ చివరిగా ‘గృహం’, ‘వదలడు’ అనే డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. సౖరైన స్క్రిప్ట్‌తో తెలుగు సినిమాకు ఎంట్రీ ఇవ్వాలనుకున్న సిద్ధార్థ్ ‘మహాసముద్రం’ కథ నచ్చటంతో ప్రాజక్ట్‌లోకి ఎంటర్ అయ్యారు. ఈ చిత్రానికి సంబంధించి ప్రతివారం ఓ ప్రకటన విడుదల చేస్తామని చిత్రబృందం తెలియజేసింది. -
శర్వాకు జోడీగా...
‘ఆర్ఎక్స్ 100’తో సంచలన విజయం అందుకున్నారు దర్శకుడు అజయ్ భూపతి. తన తదుపరి చిత్రం ‘మహాసముద్రం’ని శర్వానంద్ హీరోగా చేయబోతున్నట్టు ఇటీవలే ప్రకటించారు. ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ నిర్మించనుంది. ఇందులో శర్వాకు జోడీగా ఐశ్వర్యా రాజేష్ నటిస్తారని సమాచారం. ‘కౌసల్యా కృష్ణమూర్తి, వరల్డ్ ఫేమస్ లవర్’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలయ్యారు ఐశ్వర్య. ఇదిలా ఉంటే ఈ సినిమాలో మరో హీరో కూడా నటించే అవకాశం ఉందని టాక్. ప్రస్తుతం శర్వానంద్ ‘శ్రీకారం’ అనే సినిమా చేస్తున్నారు. అది పూర్తయిన వెంటనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. -
వారం వారం ఆశ్చర్యం
కథాబలం ఉన్న చిత్రాలు, నటనకు అవకాశం ఉన్న పాత్రలు మాత్రమే ఎంపిక చేసుకునే శర్వానంద్ ‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో ఓ చిత్రం అంగీకరించారు. ఈ చిత్రానికి ‘మహా సముద్రం’ అనే టైటిల్‌ని ఖరారు చేశారు. ఏకే ఎంటర్టై¯Œ మెంట్స్ పతాకంపై సుంకర రామబ్రహ్మం ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ సందర్భంగా దర్శక–నిర్మాతలు మాట్లాడుతూ –‘‘ఇందులో శర్వానంద్ ఓ ఛాలెంజింగ్ రోల్ చేయనున్నారు. ఈ పాత్రలో నటించేందుకు ఆయన చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఇంటె¯Œ ్స లవ్–యాక్షన్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందించనున్నాం. ఈ సినిమాకు సంబంధించి ప్రతి వారం ఆశ్చర్యపరిచే ఏదో ఒక సంచలన ప్రకటన వెలువడుతుంది’’ అన్నారు. -
దర్శకుడు అజయ్ భూపతికి కరోనా
టాలీవుడ్‌లోనూ కరోనా మహమ్మారి మెల్లిమెల్లిగా వ్యాప్తి చెందటం ప్రారంభం అయింది. ఇటీవలే దర్శకులు తేజ, రాజమౌళిలకు కరోనా వచ్చిన సంగతి తెలిసిందే. రాజమౌళి ఆల్రెడీ నెగటివ్ అయ్యారు. తాజాగా దర్శకుడు అజయ్ భూపతికి కరోనా వచ్చింది. ‘వచ్చేసింది (కరోనాను ఉద్దేశించి). త్వరలో వస్తా, ప్లాస్మా ఇస్తా’’ అని ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు అజయ్. ‘ఆర్ ఎక్స్ 100’తో దర్శకుడు అజయ్ భూపతి సంచలనం సష్టించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఓ మల్టీ స్టారర్ చిత్రం ప్లాన్ చేస్తున్నారు. -
అజయ్ భూపతి పేరుతో.. విజయ్‌లా మాట్లాడి
సాక్షి, హైదరాబాద్: టాలీవుడ్ సెన్సేషన్ స్టార్ విజయ్ దేవరకొండ, ‘ఆర్ఎక్స్ 100’ దర్శకుడు అజయ్ భూపతి పేర్లతో కొందరు కేటుగాళ్లు సైబర్ నేరాలకు పాల్పడుతున్న ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. సినిమాలు, టీవీ సీరియళ్లు, మోడలింగ్‌లో అవకాశాలు ఇప్పిస్తామంటూ అమాయక జనాల నుంచి డబ్బులు వసూలు చేసేందుకు సరికొత్త మోసాలకు తెరలేపారు. ‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ అజయ్ భూపతి పేరుతో నకిలీ వాట్సప్ నెంబర్ సృష్టించి కథానాయికలు, మోడల్స్ కావాలని, ఆసక్తి ఉన్నవారు ఫోటోలు, వీడియోలు పంపాలని యువతకు కొందరు కేటుగాళ్లు సైబర్ వల వేస్తున్నారు. ఈ ప్రకటనలు చూసి ఆశపడిన ఆశావాహుల నుంచి వేలాది రూపాయలు వారి ఖాతాల్లో జమచేసుకుంటున్నారు. ఇలా నటన, మోడలింగ్‌లో శిక్షణ, అవకాశాలు ఇప్పిస్తామని నమ్మించి వేలల్లో డబ్బులు దోచుకొని ఆ నేరగాళ్లు ఉడాయిస్తున్నారు. ఈ క్రమంలో ఈ ప్రకటనలను చూసిన కొంతమంది యువతులు నేరుగా దర్శకుడిని సంప్రదించడంతో ఈ తతంగమంతా వెలుగులోకి వచ్చింది. వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించిన అజయ్ భూపతి తన పేరుపై నకిలీ అకౌంట్లు సృష్టించి మోసాలకు పాల్పడుతున్నారని ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక హీరో విజయ్ దేవరకొండ పేరుతో బాన్సువాడకు చెందిన సాయికిరణ్ ఓ యూట్యూబ్ ఛానల్ ప్రారంభించాడు. విజయ్‌లా మాట్లాడి పలువురు యువతులను ఆకర్షించి మోసం చేసే ప్రయత్నం చేశాడు. విషయం తెలుసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు, విజయ్ దేవరకొండ బృందం ఓ ప్రణాళిక రచించారు. ఒక యువతితో సాయి కిరణ్‌తో మాట్లాడించి హైదరాబాద్‌కు రప్పించారు. సదరు యువతిని కలిసేందుకు నిందితుడు సాయి కిరణ్ హైదరాబాద్‌కు రాగానే సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. -
టాలీవుడ్లో కొత్త జోడి.. సాయి కాదు అదితి
‘అర్ఎక్స్100’తో సూపర్ విజయాన్ని అందుకున్న దర్శకుడు అజయ్ భూపతి. తాజాగా ఆయన ఇద్దరు కథా నాయకులతో ‘మహా సముద్రం’ తెరకెక్కించబోతున్న సంగతి తెలిసిందే. ఇందులో శర్వానంద్, సిద్ధార్థ్ కలిసి నటించబోతున్నారు. ‘బొమ్మరిల్లు’తో తన కంటూ ప్రత్యేకమైన అభిమానులను సొంతం చేసుకున్న సిద్ధార్థ్ పలు చిత్రాల్లో నటించిన అనంతరం తెలుగు సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చాడు. అయితే చాలా కాలం తర్వాత అజయ్ భూపతి చిత్రంతో టాలీవుడ్లోకి రీఎంట్రీ ఇస్తున్నాడు. అయితే ఈ సినిమాకు సంబంధించిన మరో అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ చిత్రంలో శర్వానంద్ సరసన హీరోయిన్ అదితిరావు హైదరీని చిత్రబృందం ఎంపిక చేసింది. దీంతో తెలుగు తెరపై మరొ కొత్త జోడి సందడి చేయనుందని సినీ అభిమానులు సంబరపడిపోతున్నారు. ఇందులో ఒకే హీరోయిన్‌కు అవకాశం ఉన్నట్లు సమాచారం. తొలుత సాయిపల్లవిని తీసుకోవాలని భావించినప్పటికీ చివరికి అదితి వైపే చిత్రబృందం మొగ్గు చూపింది. ఇక అదితి సుధీర్‌బాబు హీరోగా వచ్చిన ‘సమ్మోహనం’ చిత్రంలో హీరోయిన్గా నటించింది. ఇంద్రగంటి మోహన్‌కృష్ణ దర్వకత్వం వహించిన ఈ చిత్రంలో నటన పరంగా అదితికి మంచి మార్కులే పడినప్పటికీ అవకాశాలు మాత్రం అంతగారాలేదు. ఇక ఈ చిత్రాన్ని అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. చదవండి: ‘అసలు మీరెవరు.. మమ్మల్ని అడగడానికి?’ ఆ అకౌంట్ నాది కాదు.. స్వాతి క్లారిటీ var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_841250433.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
ఒక్క ఫ్లాప్‌తో విలువ తగ్గిపోదు
‘‘ఒక్క అపజయంతో ఏ యాక్టర్ విలువ తగ్గిపోదు’’ అంటున్నారు అదితీ రావ్ హైదరీ. మణిరత్నం దర్శకత్వంలో చేసిన ‘చెలియా’తో దక్షిణాదిన పాపులర్ అయిన అదితీ తెలుగులో ‘సమ్మోహనం’ చిత్రం చేశారు. మూడు నాలుగు రోజులుగా సమంతతో అదితీని ముడిపెట్టి సోషల్ మీడియాలో ఓ వార్త హల్చల్ చేస్తోంది. అదేంటంటే.. ‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ అజయ్ భూపతి ఓ సినిమా (‘మహాసముద్రం’ అనే టైటిల్ ప్రచారంలో ఉంది) ప్లాన్ చేస్తున్నారు. ఇందులో సమంతను కథానాయికగా తీసుకోవాలనుకున్నారని ప్రచారమైంది. అయితే ఇటీవల విడుదలైన తమిళ ‘96’ తెలుగు రీమేక్ ‘జాను’ ఆశించిన ఫలితం సాధించకపోవడంతో అజయ్ భూపతి తన మనసు మార్చుకుని, కథానాయికగా అదితీ రావ్ హైదరీని తీసుకోవాలనుకుంటున్నారనే ప్రచారం మొదలైంది. ఈ వార్త గురించి అదితీ తన ట్వీటర్ ద్వారా స్పందించారు. ‘‘ఈ విషయం గురించి మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉందనిపించింది. అందుకే చెబుతున్నా. ఒక్క ఫ్లాప్ వల్ల ఏ యాక్టర్ విలువ తగ్గిపోదు. దయచేసి ఇలాంటి ఆలోచనలను మనం ప్రోత్సహించవద్దు. అలాగే సినిమాకి సంబంధించిన ప్రకటనను చేసే అవకాశం డైరెక్టర్ లేదా ప్రొడ్యూసర్‌కి ఇవ్వాలి. వాళ్లను గౌరవించాలి’’ అని పేర్కొన్న అదితీ.. ఈ సినిమా గురించి తనను సంప్రదించారా? లేదా? అనే విషయంలో మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. -
భవ్య బ్యానర్లో...
‘ఆర్ఎక్స్ 100’తో దర్శకుడిగా బ్లాక్‌బస్టర్ ఎంట్రీ ఇచ్చారు అజయ్ భూపతి. ప్రస్తుతం తన రెండో సినిమాను సెట్స్ మీదకు తీసుకువెళ్లే ప్లాన్‌లో ఉన్నారు. అది సెట్స్ మీదకు వెళ్లకముందే తన మూడో సినిమాను ప్రకటించారు. భవ్య క్రియేషన్స్ బ్యానర్లో ఈ సినిమా ఉంటుందని, ఇందులో ఓ పెద్ద హీరో నటించనున్నారని ప్రకటించారు. ఇక రెండో సినిమా విషయానికి వస్తే... రవితేజ ఈ సినిమాలో హీరోగా నటించాల్సి ఉంది. ఆయన ఈ సినిమా నుంచి తప్పుకున్నారు. మరి ఇప్పుడు హీరోగా ఎవరు నటిస్తారో చూడాలి. -
ఎవరా ‘చీప్ స్టార్’..?
తొలి సినిమాతోనే సెన్సేషన్ సృష్టించి యువ దర్శకుడు అజయ్ భూపతి. రామ్‌గోపాల్ వర్మ శిష్యుడిగా ఇండస్ట్రీకి పరిచయం అయిన అజయ్ భూపతి, తొలి సినిమా ఆర్ఎక్స్ 100తోనే తన మార్క్ చూపించాడు. ఈ సినిమా హీరో కార్తికేయ, హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్‌లతో పాటు దర్శకుడిగా అజయ్‌కి కూడా మంచి పేరు తీసుకువచ్చింది. అయితే తొలి సినిమా ఘన విజయం సాధించినా అజయ్ రెండో సినిమా ఇంతవరకు ప్రారంభం కాలేదు. మహా సముద్రం అనే కథను సిద్ధం చేసుకున్న అజయ్ ఆ కథ కోసం హీరోలను వెతికే పనిలో ఉన్నాడు. ముందుగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా ఈ ప్రాజెక్ట్ ఉంటుందన్న టాక్ వినిపించింది. కానీ తరువాత సీన్లోకి సీనియర్ హీరోగా రవితేజ వచ్చాడు. రవితేజ కూడా మహా సముద్రం నుంచి తప్పుకున్నట్టుగా ఇటీవల వార్తలు వినిపించాయి. ఈ సమయంలోనే అజయ్ భూపతి ‘చీప్ స్టార్’ అంటూ ట్వీట్ చేయటంతో ఈ ట్వీట్ వైరల్‌గా మారింది. అజయ్ ఎవరి ఉద్దేశించి ఈ ట్వీట్ చేశాడన్న చర్చ జరుగుతోంది. ఇటీవల నాగచైతన్యతో కూడా అజయ్ చర్చలు జరిపాడన్న వార్తలు వినిపించాయి. ప్రాజెక్ట్ ఆలస్యమవుతున్న కారణంగానే అజయ్ ఇలా స్పందించాడా..? బెల్లంకొండ సాయి శ్రీనివాస్, రవితేజ, నాగచైతన్యలలో ఒకరిని ఉద్దేశించే ఇలాంటి ట్వీట్ చేశాడా..? లేక మరెవరినైనా దృష్టిలో పెట్టుకొని చేశాడా..? అన్న విషయం తెలియాలంటే మాత్రం అజయ్ క్లారిటీ ఇవ్వాల్సిందే. 'Cheap Star' — Ajay Bhupathi (@DirAjayBhupathi) September 2, 2019 -
ముచ్చటగా మూడోసారి?
‘బెంగాల్ టైగర్, టచ్ చేసి చూడు’ సినిమాల్లో కలసి నటించారు రవితేజ, రాశీ ఖన్నా. ఈ ఇద్దరూ మూడోసారి కలసి నటించనున్నారని తెలిసింది. ‘ఆర్ఎక్స్ 100’ తర్వాత దర్శకుడు అజయ్ భూపతి ‘మహా సముద్రం’ అనే సినిమా తెరకెక్కించడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇందులో రవితేజ, సిద్ధార్థ్ హీరోలుగా యాక్ట్ చేస్తారని సమాచారం. రవితేజకు జోడీగా అదితీరావ్ హైదరీ నటించనున్నారని వార్తలు వచ్చాయి. డేట్స్ ఇష్యూ కారణంగా ఆమె ఈ సినిమా నుంచి తప్పుకున్నారని, ఆమె స్థానంలో రాశీఖన్నా వచ్చారని తెలిసింది. సెప్టెంబర్ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది. -
స్మగ్లింగ్ పార్ట్నర్స్?
విశాఖపట్నంలో స్మగ్లింగ్ చేయడానికి స్కెచ్ వేస్తున్నారట రవితేజ. ఆ ప్లాన్‌కు హెల్ప్ చేస్తున్నారట సిద్ధార్థ్. మరి.. వీరిద్దరి పార్టనర్షిప్ వివరాలు తెలుసుకోవాలంటే చాలా టైమ్ పడుతుంది. ‘ఆర్ఎక్స్ 100’ వంటి సూపర్‌హిట్‌ను అందించిన అజయ్‌భూపతి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కనుంది. దీనికి ‘మహాసముద్రం’ అనే టైటిల్‌ని అనుకుంటున్నారు. ఈ చిత్రంలో రవితేజ, సిద్ధార్ధ్ హీరోలుగా నటించనున్నారు. రవితేజకు జోడీగా అదితీరావ్ హైదరీ కనిపించనున్నారు. సిద్ధార్థ్ సరసన హీరోయిన్ ఎంపిక కావాల్సి ఉంది. ఈ సినిమా చిత్రీకరణ అక్టోబర్‌లో ప్రారంభం కానుందని సమాచారం. విశాఖపట్నం నేపథ్యంతో లవ్, ఎమోషన్ అంశాలకు స్మగ్లింగ్ ఎలిమెంట్‌ను స్క్రిప్ట్‌కు జత చేశారట అజయ్ భూపతి. -
చైతూ సినిమాలో ‘ఆర్ఎక్స్ 100’ హీరో
ఆర్ఎక్స్ 100 సినిమాతో ఘన విజయం సాధించిన కార్తికేయ ప్రస్తుతం హిప్పీ, గుణ 369 చిత్రాల్లో హీరోగా నటిస్తున్నాడు. అంతేకాదు నాని హీరోగా విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న గ్యాంగ్ లీడర్ సినిమాలో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలోనూ నటిస్తున్నాడు. తాజాగా మరో యంగ్ హీరోతో కలిసి నటించేందుకు కార్తికేయ ఓకె చెప్పినట్టుగా తెలుస్తోంది. కార్తికేయకు బ్రేక్ ఇచ్చిన అజయ్ భూపతి తన తదుపరి చిత్రం ప్రారంభించేందుకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమాలో నాగచైతన్య హీరోగా నటించనున్నాడన్న టాక్ వినిపిస్తోంది. అంతేకాదు ఈ సినిమాలో ఓ కీలక పాత్రకు కార్తికేయను సంప్రదించినట్టుగా తెలుస్తోంది. అజయ్ అడగటంతో కార్తికేయ కూడా వెంటనే ఒప్పేసుకున్నాడట. ఈ సినిమాలో చైతూకు జోడిగా సమంత నటించే అవకాశం ఉంది. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్‌పై త్వరలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. -
పవర్‌ఫుల్‌పోలీస్
‘మజిలీ’ సినిమాలో క్రికెటర్ పూర్ణగా బంతులను బౌండరీలు దాటించారు నాగచైతన్య. లేటెస్ట్గా చేస్తున్న ‘వెంకీ మామ’ సినిమాలో మిలటరీ ఆఫీసర్‌గా బార్డర్ దగ్గర శత్రువులను రఫ్ ఆడించనున్నారట. నెక్ట్స్ అజయ్ భూపతి దర్శకత్వంలో చేయబోయే సినిమాలో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తారట. ‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో నాగచైతన్య ఓ యాక్షన్ థ్రిల్లర్ చేయడానికి అంగీకరించిన సంగతి తెలిసిందే. ఇందులో స్టైలిష్ పోలీస్ ఆఫీసర్‌గా చైతన్య పాత్రను డిజైన్ చేశారట అజయ్ భూపతి. ‘సాహసం శ్వాసగా సాగిపో’ సినిమా క్లైమాక్స్‌లో కొద్దిసేపు పోలీస్‌గా కనిపించారు చైతన్య. ఇందులో పూర్తిస్థాయి పోలీస్‌గా తొలిసారి కనిపించనున్నారు. ఈ చిత్రానికి ‘మహా సముద్రం’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. పి. కిరణ్ నిర్మించనున్న ఈ సినిమాలో హీరోయిన్గా సమంతను నటింపచేయాలనే ఆలోచనలో చిత్రబృందం ఉందని తెలిసింది. ఈ ఏడాది సెకండ్ హాఫ్‌లో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. -
చై సై?
‘మజిలీ’ సక్సెస్‌తో ఫుల్ జోష్ మీద ఉన్నారు నాగచైతన్య. ప్రస్తుతం తన మేనమామ వెంకటేశ్‌తో కలసి ‘వెంకీ మామ’ సినిమా చేస్తూ బిజీగా ఉన్నారు. బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఫుల్‌స్పీడ్‌తో షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమా తర్వాత నాగచైతన్య చేయబోయే సినిమా ఏంటంటే.. ‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో ఓ సినిమా ఉండబోతోందని ఫిల్మ్‌నగర్‌లో వినిపిస్తోంది. ఆల్రెడీ అజయ్, చైతూ మధ్య స్టోరీ డిస్కషన్స్ కూడా నడిచాయట. అజయ్ చెప్పిన స్టోరీ లైన్‌కు ఇంప్రెస్ అయిన చైతూ ‘వెంకీ మామ’ సినిమా తర్వాత ఈ సినిమానే స్టార్ట్ చేయనున్నారట. ఈ చిత్రానికి చై సై అన్నారనే వార్త బలంగా వినిపిస్తోంది. ఈ చిత్రాన్ని ఆనంది ఆర్ట్స్ బ్యానర్‌పై పి. కిరణ్ నిర్మించనున్నారట. -
సమ్మర్లో షురూ
‘ఆర్ఎక్స్ 100’ సూపర్‌హిట్ సాధించడంతో అజయ్ భూపతి క్రేజీ దర్శకుడిగా మారిపోయారు. అతను చేయబోయే తదుపరి ప్రాజెక్ట్‌పై ఆసక్తి నెలకొంది. మల్టీస్టారర్ చిత్రంగా అజయ్ తన రెండో ప్రాజెక్ట్‌ను ఎంచుకున్న సంగతి తెలిసిందే. ఇందులో ఓ హీరోగా బెల్లంకొండ సాయిశ్రీనివాస్ నటించనున్నారు. మరో హీరో ఎవరన్నది ఇంకా ఫిక్స్ కాలేదు. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ మే నెలలో ప్రారంభం కానుందని సమాచారం. మొదటి చిత్రం ‘ఆర్ఎక్స్ 100’ వంటి రా సబ్జెక్ట్‌నే అజయ్ తయారు చేశారని సమాచారం. -
ప్రేమలో మాస్టార్లు..
ప్రేమ.. ఎప్పుడు, ఎక్కడ, ఎవరిని, ఎందుకు పలకరిస్తుందో ఎవరికి తెలుసు? వస్తూనే ఓ గిలి.. మది లోగిలి అదిరిపడేలా.. ఆ ప్రత్యేకమైన వ్యక్తి స్ఫురణకు వస్తే చాలు.. అప్పటి వరకు దగ్గరున్న వారంతా దూరమైపోతే బాగుణ్ణు అనే భావన. ఆమె లేదా అతడి ధ్యాస తప్ప మరేదీ అవసరం లేదన్న తాదాత్మ్యత. ఇదీ.. అని ప్రత్యేకంగా ఏదీ చెప్పలేని ఓ మధురానుభూతి మనసును ఆవరిస్తుంది. నూత్న యవ్వనం తొలి రోజుల్లోనే కాదు.. మలి వయసులోనూ.. ఆ మాటకొస్తే ఏ వయసులోనైనా.. కారణమేదైనా స్పందించే మనసుండాలే కానీ వలపుశరాల బారిన పడనివారుండరు అనడం అతిశయోక్తి కాదేమో.. అలాంటి ప్రేమజీవుల అనుభూతులు.. ప్రేమైక జీవనం గడుపుతున్న కొన్ని జంటల విజయాలు ప్రేమికుల రోజున మీ కోసం.. ఆత్రేయపురం (కొత్తపేట): మండలంలోని వివిధ గ్రామాల్లో పలువురు యువతీ, యువకులు వారి ప్రేమ యుద్ధంలో విజయం సాధించి సుఖమయ జీవనం సాగిస్తున్నారు. ఆత్రేయపురం గ్రామానికి చెందిన ప్రముఖ చిత్ర దర్శకుడు వేగేశ్న అజయ్ భూపతి, శిరి వారిలో ఒక జంట. వీరి ఇరువురు ప్రేమికుల రోజు సాక్షిగా ‘ఆర్ఎక్స్–100’ వాహనంపై యమస్పీడుగా దూసుకుపోతున్నారు. ఆయన సతీమణి శిరి ఇంజినీరింగ్ పూర్తి చేసి తను ప్రేమించిన వ్యక్తిని ఎన్ని అవాంతరాలు ఎదురైనా తట్టుకుని పెళ్లి చేసుకుని జీవితాన్ని పూలబాటగా మార్చుకున్నారు. అలాగే ఆత్రేయపురం మండలం ర్యాలి గ్రామానికి చెందిన కప్పల శ్రీధర్, స్వరూప పరస్పరం అవగాహనతో ప్రేమికుల రోజు సాక్షిగా జీవితాన్ని సుఖమయం చేసుకుని పిల్లా పాపలతో ఎందరికో ఆదర్శంగా నిలిచారు. అలాగే ఆత్రేయపురం జెడ్పీటీసీ సభ్యులు మద్దూరి సుబ్బలక్ష్మి , మద్దూరి బంగారం ప్రేమించుకుని పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకుని సుఖంగా జీవిస్తూ ప్రేమికులందరికీ ఆదర్శంగానిలుస్తున్నారు. ప్రేమకు పెద్దల అంగీకారం ఉంటేనే మంచిది ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్):ఇరు కుటుంబాల పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకుంటేనే జీవితమంతా ఆనందంగా ఉంటుందంటారు ఎల్ఐసీ రాజమహేంద్రవరం రూరల్ బ్రాంచి ఉద్యోగి గురుమహేష్, అంజలి దంపతులు. మూడున్నరేళ్ల క్రితం దగ్గర బంధువైన అంజలిని ప్రేమించారు. ఇద్దరి మనసులు ఒక్కటవడంతో ఇరు కుటుంబాల పెద్దలను ఒప్పించి గత ఏడాది వివాహం చేసుకున్నారు. ఇరు కుటుంబాల అంగీకారంతో వివాహం చేసుకోవడం వలన సంతోషంగా జీవించవచ్చంటారు. అందుకే ప్రేమికులు ఎవరైనా పెద్దల అంగీకారంతో వివాహం చేసుకుంటే ఆ కుటుంబం సుఖసంతోషాలతో ఉంటుందన్నారు. మా దాంపత్యం ఎంతో అన్యోన్యం మామిడికుదురు (పి.గన్నవరం): ‘చదువుకునే సమయంలో ఇద్దరం ఇష్టపడి ప్రేమ వివాహం చేసుకున్నాం. రెండు దశాబ్దాలు అయ్యింది. ఇంత వరకు మా ఇద్దరి మధ్య ఎటువంటి అరమరికలు లేకుండా అన్యోన్యంగా జీవిస్తున్నాం’ అంటున్నారు మామిడికుదురుకు చెందిన ఉండ్రు శ్రీనుబాబు, బళ్ల జ్యోతి. 1999లో ఈ జంట ప్రేమ వివాహం చేసుకున్నారు. బీఎస్సీ., బీఈడీ., పూర్తి చేసిన శ్రీనుబాబు ప్రస్తుతం తాటిపాక భాష్యం స్కూల్లో టీచర్‌గా పని చేస్తున్నారు. జ్యోతి కూడా బీఎస్సీ., బీఈడీ., పూర్తి చేసి సర్వశిక్షాభియాన్‌లో సీఆర్పీగా పని చేస్తున్నారు. వీరి కుమారుడు వినయ్‌రామ్ కృష్ణా జిల్లా నూజివీడులో ట్రిపుల్ ఐటీ మెకానికల్ ఇంజినీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. కుమార్తె అంబిక పశ్చిమ గోదావరి జిల్లా తణుకు బీఎన్ఎం కళాశాలలో అగ్రికల్చర్ డిప్లొమా చదువుతోంది. ‘మాకు కుటుంబ సభ్యుల ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయి’. ‘మా పిల్లల్ని ప్రయోజకులుగా తీర్చిదిద్దుతున్నాం. మేము కోరుకున్న జీవితం ఇదే. మా పిల్లలు ప్రయోజకులు కావాలనే మేము కోరుకున్నాం. మా అభిలాష నెరవేరింది. మాకు ఈ జీవితం చాలా ఆనందంగా ఉంది. మా 20 ఏళ్ల దాంపత్య జీవితంలో ఎన్నడూ ఎటువంటి సమస్యా ఎదురుకాలేదు’ అంటున్నారు శ్రీనుబాబు, జ్యోతి. ఒకరినొకరు అర్థం చేసుకుని జీవిస్తే ఎటువంటి సమస్యలు ఉండవంటారు వారు. పంతాలు, పట్టింపులకు పోకుండా ఒకరి మనసును మరొకరు అర్థం చేసుకుని నడుచుకుంటే ఏ విధమైన సమస్యలు ఉండన్నది వారి సిద్ధాంతం. ధనిక–పేద వ్యత్యాసంచెరిపేసిన ప్రేమ.. అమలాపురం టౌన్: పెద్దలను ఎదిరించి ప్రేమించిన వారిని పెళ్లి చేసుకోవడం తిరుగుబాటు అవుతుంది. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోవడం సర్దుబాటు అవుతుంది. ఈ రెండు మార్గాల్లో ప్రేమికులు ఏ మార్గంలో పెళ్లి చేసుకున్నా భార్యాభర్తలు అరమరికలు లేకుండా అన్యోన్యంగా జీవించగలిగితేనే వారి ప్రేమకు అర్థం.. పరమార్థం. ప్రేమపెళ్లితో ఒక్కటైన జంట వాసంశెట్టి సుభాష్, లక్ష్మీ సునీత. అమలాపురం పట్టణం మద్దాలవారిపేటకు చెందిన సుభాష్ది ధనిక కుటుంబమైనప్పటికీ తన మనసుకు నచ్చిన పేదింటి యువతిని నిజాయతీగా ప్రేమించి.. అంతే నిజాయతీగా తన ఇంట్లో వారికి చెప్పి.. ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. ఎదురెదురు ఇళ్లలోని కుటుంబాలైన వారు పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోవడంలో సఫలీకృతులయ్యారు. రాజకీయ నాయకుడిగా, వ్యాపారవేత్తగా ఎంత తీరిక లేకుండా ఉన్నప్పటికీ సుభాష్‌కు తాను మెచ్చి ప్రేమించి పెళ్లి చేసుకున్న లక్ష్మీ సునీత అంటే నాడూ.. ఈనాడూ అదే మక్కువ. పదేళ్ల వారి ప్రేమకు గుర్తుగా ముద్దులొలికే కవల ఆడపిల్లలు సత్య దీవిత, సత్య దీక్షిత. వారిరువురికీ వీరిరువురే ప్రపంచం. కాకతాళీయమే అయినా సుభాష్ తన పెద్దలను, ఆమె ఇంటి పెద్దలనూ ఒప్పించిన రోజు ఫిబ్రవరి 14 కావడం గమనార్హం. ప్రేమలో మాస్టార్లు సామర్లకోట (పెద్దాపురం): వారు ఇరువురు వేర్వేరు పాఠశాలల్లో ఉపాధ్యాయులు. తరువాత ఒకే హైస్కూల్లో పనిచేశారు. ఆ కాలంలో ప్రేమజీవులై పట్టణ ప్రముఖులు సహకరించడంతో 1991లో వివాహం చేసుకున్నారు తాళ్లూరి వైకుంఠం, ఏఎల్‌వీ కుమారి. ప్రస్తుతం వైకుంఠం పీడీగాను, కుమారి సైన్సు టీచరుగా బచ్చు ఫౌండేషన్ మున్సిపల్ హైస్కూల్లోనే పని చేస్తున్నారు. వైకుంఠం యార్లగడ్డ అక్కిరాజు మున్సిపల్ హైస్కూల్, బచ్చు ఫౌండేషన్ మున్సిపల్ హైస్కూల్స్‌లో పని చేసి అనేక మంది క్రీడాకారులను తయారు చేశారు. కబడ్డీ, ఖోఖోలలో జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనే విధంగా తర్ఫీదు ఇవ్వడం జరిగింది. దాంతో అనేక మంది విద్యార్థులు కబడ్డీ కోటాలో ఉద్యోగాలు కూడా సంపాదించుకున్నారు. కుమారి సైన్సు టీచరుగా 8 నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులకు బోధించడంలో ఆరితేరిన ఉపాధ్యాయురాలుగా గుర్తింపు పొందారు. ఎప్పుడు నవ్వుతూ ఇతరులను నవ్విస్తూ ఉంటారని సహోపాధ్యాయులతో పాటు, పాఠశాల హెచ్ఎం తోటకూర సాయిరామకృష్ణ కూడా ఆమెను అభినందిస్తుంటారు. వైకుంఠం వ్యాయామ ఉపాధ్యాయుడు కావడంతో పిల్లలకు ఆటల విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపడం కుమారుడి ఎస్సై సెలక్షన్‌కు ఎంతగానో దోహదం చేసింది. రెండో కుమారుడు పుష్పకల్యాణ్ ఐఏఎస్ లక్ష్యంతో హైదరాబాద్‌లో గ్రూప్స్‌కు శిక్షణ పొందుతున్నట్లు వైకుంఠం తెలిపారు. తమది ప్రేమ వివాహం అయినా పెద్దలు కూడా అంగీకరించడంతో ఎంతో సంతోషంగా జీవిస్తున్నట్టు ఏఎల్‌వీ కుమారి, వైకుంఠం తెలిపారు. తమ పిల్లల వివాహం వారి ఇష్టం ప్రకారమే జరుగుతుందని చెప్పారు. ప్రేమ వివాహం చేసుకునే ముందు వారు ఒకరిని ఒకరు అర్థం చేసుకొవడం వలన సమస్యలు ఏర్పడే అవకాశం ఉండదని తెలిపారు. ఏది ఏమైనా సమస్యలు వచ్చిన సమయంలో సర్దుకుపోవడం వల్ల ప్రశాంతంగా జీవించడానికి వీలు కలుగుతుందని వారు అభిప్రాయపడ్డారు. వైకల్యం శరీరానికే.. ప్రేమకు కాదు.. రామచంద్రపురం రూరల్: రామచంద్రపురం మండలం నరసాపురపుపేటకు చెందిన పంపన శివయ్య పుట్టుకతోనే అంగవైకల్యంతో జన్మించాడు. శారీరకంగా మరుగుజ్జుతనం ఉన్నా.. మానసికంగా దృఢ చిత్తంతో ఎదిగాడు. అంగవైకల్యం వల్ల అతని చదువు 8వ తరగతిని మించి సాగలేదు. అయినప్పటికీ తనను కంటికి రెప్పలా కాపాడుకున్న తన కన్నతల్లిని వృద్ధాప్యంలో కంటి పాపలా కాపాడుకున్నాడు. రామచంద్రపురం తహసీల్దార్ కార్యాలయం వద్ద పలు సమస్యలతో వచ్చే వారికి సహాయకారిగా ఉంటూ వారికి దరఖాస్తులు నింపడం, అర్జీలు రాయడం చేస్తూ తల్లిని పోషించుకునేవాడు. దూరపు బంధువైన ధనలక్ష్మిని శివయ్యను పెళ్లి చేసుకోమని బంధువులు అడిగారు. కన్నతల్లిని కన్నబిడ్డలా చూసుకుంటున్న శివయ్య వ్యక్తిత్వం తెలిసిన ఆమె వెంటనే వివాహానికి ఒప్పుకుంది. కానీ శివయ్య వివాహం చేసుకుంటే తన తల్లిని పోషించుకోలేమోనని భావించి పెళ్లికి నిరాకరించాడు. అయితే శివయ్యను ఇష్టపడిన ధనలక్ష్మి అతనినే పెళ్లి చేసుకోవాలని భావించి, నిరీక్షించింది. రెండేళ్ల తరువాత వృద్ధాప్యంతో తల్లి మరణించిన తరువాత ధనలక్ష్మి తన కోసం పెళ్లి చేసుకోకుండా ఎదురు చూస్తోందని తెలిసి ఆమెను 2006 పిబ్రవరి పదిన వివాహం చేసుకున్నాడు. వీరి ప్రేమకు గుర్తుగా కుమార్తె కల్యాణి జన్మించింది. శివయ్యకు 2013లో ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది. ప్రస్తుతం రామచంద్రపురం మండల పరిషత్ కార్యాలయంలో సబ్‌స్టాఫ్‌గా పనిచేస్తున్నాడు. రామచంద్రపురం వైఎస్సార్ నగర్లో సొంత ఇల్లు ఉంది. కుమార్తె కల్యాణి ఏడో తరగతి చదువుతోంది. ఈ ప్రేమజంట తమ ప్రేమకు ప్రతిరూపమైన కుమార్తెను అల్లారుముద్దుగా చూసుకుంటూ ఆనందంగా జీవిస్తున్నారు. ప్రేమకు కోవెల ఆ ఇల్లు కాకినాడ రూరల్: 1984లో ప్రేమించి పెళ్లిచేసుకున్న ఆ దంపతులు ఆనాటి ప్రేమను వ్యతిరేకించిన పెద్దలను ప్రేమతోనే ఒప్పించారు. ఎవరేంటో, వారి మనసేంటో తెలియకుండా పెళ్లి చేసుకునే వారికంటే ఒకరి మనస్సు ఒకరు అర్ధంచేసుకున్న దంపతులు అన్యోన్యంగా ఉంటారనే విషయాన్ని పెద్దలకు వివరించిన దంపతులు మణమ్మ, శర్మ. కాకినాడ వాజపేయాజుల వారి వీధిలో 1983లో కాపు సామాజిక వర్గానికి చెందిన అమ్మాయి నాగమణిని సనాతన బ్రాహ్మణ కుటుంబానికి చెందిన సీతారామ శర్మ ప్రేమించి పెళ్లి చేసుకోవడమే కాకుండా వారి సంతానమైన ఇద్దరబ్బాయిలకు ప్రేమ పెళ్లిళ్లే చేశారు. జమ్మలమడక నాగమణి, రామశర్మ దంపతుల కుమారులు రామ్‌లాల్ భరత్, రవితేజలు ప్రేమ పెళ్లిళ్లు చేసుకుంటానంటే సరే అని పెళ్లిళ్లు చేసిన ఘనత వారికే దక్కింది. ఇప్పుడు ఆ ఇంట్లో అందరూ ఎంతో ఆనందంగా కాపురాలు చేసుకుంటూ ఆదర్శ కుటుంబాలుగా పేరు పొందుతున్నారు. -
‘ఆర్ఎక్స్ 100’ దర్శకుడి ‘మహా సముద్రం’
తొలి చిత్రం ఆర్ఎక్స్ 100తోనే ఘన విజయం సాధించిన యంగ్ డైరెక్టర్ అజయ్ భూపతి. ఈ సినిమా సక్సెస్‌తో అజయ్ భూపతికి వరుస అవకాశాలు క్యూ కట్టాయి. నితిన్ లాంటి యంగ్ హీరోస్ అజయ్‌తో సినిమా చేసేందుకు ఇంట్రస్ట్ చూపించారు. తాజాగా అజయ్ భూపతి తన నెక్ట్స్ ప్రాజెక్ట్ ను ఫైనల్ చేసే పనిలో ఉన్నాడు. యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా సినిమా చేయనున్నాడు అజయ్. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాకు మహా సముద్రం అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది. మాఫియా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సాయి శ్రీనివాస్‌కు జోడిగా ఓ స్టార్ హీరోయిన్ను తీసుకునే ఆలోచనలో ఉన్నారు చిత్రయూనిట్. త్వరలోనే సినిమాకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడించనున్నారు. -
స్క్రిప్ట్ రెడీ
తొలి సినిమాకే ‘ఆర్ఎక్స్ 100’ లాంటి బోల్డ్ స్క్రిప్ట్‌తో వచ్చి బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని అందుకున్నారు దర్శకుడు అజయ్ భూపతి. మరి నెక్ట్స్ సినిమాకి ఎలాంటి స్క్రిప్ట్‌తో వస్తారో అని ఇండస్ట్రీ ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఆల్రెడీ అజయ్ భూపతి మల్టీస్టారర్ కథ సిద్ధం చేసే పనిలో ఉన్నారనే విషయం తెలిసిందే. తాజా వార్తేంటంటే ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ పనులన్నీ పూర్తయిపోయాయట. ఇద్దరు ముగ్గురు హీరోలకు కథ కూడా వినిపించారని సమాచారం. మరికొన్ని రోజుల్లో ఈ మల్టీస్టారర్‌లో కనిపించే హీరోలెవరో అధికారిక ప్రకటన వచ్చే వీలుంది. -
‘ఆర్ఎక్స్ 100’ రీమేక్‌లో స్టార్ వారసుడు
టాలీవుడ్ లో సంచలన విజయం సాధించిన బోల్డ్ లవ్ స్టోరి ఆర్ఎక్స్ 100. అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో కార్తికేయ, పాయల్ రాజ్‌పుత్‌లు హీరో హీరోయిన్లుగా నటించారు. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా ఘన విజయం సాధించటంతో ఇతర భాషలనుంచి రీమేక్ హక్కుల కోసం మంచి డిమాండ్ ఏర్పడింది. ఇప్పటికే కన్నడలో ఈ సినిమా రీమేక్ పనులు ప్రారంభమయ్యాయి. హిందీ రైట్స్‌ను కూడా ప్రముఖ నిర్మాత సాజిద్ నదియావాల సొంతం చేసుకున్నారు. తాజాగా ఈ సినిమాకు హీరోను కూడా ఫైనల్ చేశారు. ఒకప్పటి బాలీవుడ్ హీరో సునీల్ శెట్టి వారసుడు అహన్ శెట్టి, ‘ఆర్ఎక్స్ 100’ రీమేక్‌తో బాలీవుడ్‌కు పరిచయం కానున్నాడు. మిలన్ లూత్రియా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడించనున్నారు. IT'S OFFICIAL... Sajid Nadiadwala ropes in director Milan Luthria for Ahan Shetty’s debut... An official remake of #Telugu hit #RX100. pic.twitter.com/AliZIgcFCS — taran adarsh (@taran_adarsh) 15 November 2018 -
ఆర్ఎక్స్100తో శాండిల్‌వుడ్‌కి...
‘ఆర్ఎక్స్ 100’.. తెలుగులో ఈ ఏడాది అనూహ్య విజయం అందుకున్న చిత్రాల్లో ఒకటి. కార్తికేయ, పాయల్ రాజ్‌పుత్ జంటగా అజయ్ భూపతి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా కలెక్షన్ల సునామీ సృష్టించింది. ఈ చిత్రం ఇప్పుడు కన్నడంలో రీమేక్ కానుంది. నిర్మాత డి.ఎస్. రావు ‘ఆర్ఎక్స్ 100’ కన్నడ రీమేక్ హక్కులు దక్కించుకున్నారు. నితిన్‌తో ‘ద్రోణ’, నానీతో ‘ పిల్ల జమీందార్’, నిఖిల్‌తో ‘ కళావర్ కింగ్’, మనోజ్‌తో ‘మిస్టర్ నూకయ్య’ వంటి చిత్రాలు నిర్మించిన డి.ఎస్.రావు ‘ఆర్.ఎక్స్.100’తో నిర్మాతగా కన్నడ రంగంలోకి అడుగుపెట్టను న్నారు. ‘‘ఓ యువ కన్నడ కథానాయకుడితో ఈ చిత్రాన్ని నిర్మిస్తాం’’ అన్నారు డీఎస్ రావు. -
మల్టీస్టారర్?
ఫస్ట్ సినిమా ‘ఆర్ఎక్స్ 100’తో సక్సెస్ అందుకున్నారు దర్శకుడు అజయ్ భూపతి. బాక్సాఫీస్ వద్ద కూడా ఈ బండి బాగానే సౌండ్ చేసిన సంగతి తెలిసిందే. తన నెక్ట్స్ ప్రాజెక్ట్‌గా మల్టీస్టారర్ చేస్తున్నట్టు ఆ మధ్య ‘సాక్షి’కి తెలిపారు అజయ్ భూపతి. లేటెస్ట్గా వినిపిస్తున్న సమాచారమేంటంటే ఈ మల్టీస్టారర్‌లో ఎనర్జిటిక్ హీరో రామ్, ‘మహానటి’తో తెలుగు ఆడియన్స్‌కు దగ్గరైన మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ హీరోలుగా కనిపిస్తారట. ఈ ప్రాజెక్ట్‌ను ‘స్రవంతి’ రవికిశోర్ నిర్మించనున్నారు. ఇద్దరు భిన్న మనస్తత్వాలు కలిగి ఉన్న మనుషుల మధ్య జరిగే కథలా ఈ చిత్రం ఉండబోతోందని, అలాగే ఫస్ట్ సినిమాలానే రియలిస్టిక్‌గానే ఉంటుందని కూడా దర్శకుడు ఓ సందర్భంలో పేర్కొన్నారు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతున్న ఈ చిత్రం ఈ ఏడాది చివర్లో సెట్స్ మీదకు వెళ్లనుందని సమాచారం. -
‘ఆర్ఎక్స్ 100’ దర్శకుడితో ఎనర్జిటిక్ స్టార్
తొలి సినిమాతోనే టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారిన దర్శకుడు అజయ్ భూపతి. కార్తికేయ, పాయల్ రాజ్‌పుత్ హీరో హీరోయిన్లుగా అజయ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఎక్స్ 100 సంచలన విజయం సాధించింది. దీంతో ఈ క్రేజీ డైరెక్టర్‌తో వర్క్ చేసేందుకు యంగ్ హీరోలు ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. తాజాగా అజయ్ దర్శకత్వంలో నటించేందుకు ఎనర్జిటిక్ స్టార్ రామ్ ఓకె చెప్పారన్న టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం త్రినాథ్‌రావు నక్కిన దర్శకత్వంలో హలోగురు ప్రేమ కోసమే సినిమాలో నటిస్తున్న రామ్.. ఆ సినిమా తరువాత అజయ్ భూపతి దర్శకత్వంలో ఓ మల్టీస్టారర్ సినిమాలో నటించేందుకు ఓకె చెప్పారట. ఈ సినిమాలో రామ్ తో పాటు మాలీవుడ్ యంగ్ హీరో దుల్కర్ సల్మాన్‌ను నటింప చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సినిమాను రామ్ సొంత నిర్మాణ సంస్థ స్రవంతి మూవీస్ నిర్మించనుంది. -
‘ఆర్ఎక్స్100’ హీరోయిన్ కొత్త సినిమా అప్డేట్
ఇటీవల సంచలన విజయం సాధించిన చిన్న సినిమా ఆర్ఎక్స్100. అజయ్ భూపతి దర్శకత్వంలో కార్తికేయ, పాయల్ రాజ్‌పుత్‌లు హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన ఈ సినిమా అందరికీ మంచి గుర్తింపు తీసుకువచ్చింది. ముఖ్యంగా తొలి సినిమాలోనే బోల్డ్ పర్ఫామెన్స్తో ఆకట్టుకున్న పాయల్ రాజ్‌పుత్‌కు వరుస అవకాశాలు తలుపు తట్టాయి. అయితే పాయల్ మాత్రం నటనకు ఆస్కారం ఉన్న పాత్ర కోసం ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ భామ తన రెండో సినిమాకు ఓకె చెప్పినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. భానుశంకర్ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాలో పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్గా నటించనున్నారు. అంతేకాదు ఈ సినిమాలో పాయల్ యాక్షన్స్ సీన్స్ కూడా చేయనుందన్న టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాతో పాటు సీ కళ్యాణ్ నిర్మాతగా తెరకెక్కించనున్న మరో సినిమాకు కూడా పాయల్ ఓకె చెప్పినట్టుగా తెలుస్తోంది. -
ఓ ఇంటివాడైన ‘RX 100’ దర్శకుడు
-
పెద్ద మనసు చాటుకున్న ఆర్ఎక్స్ 100 చిత్రయూనిట్
-
కేరళ బాధితుల కోసం ‘ఆర్ఎక్స్ 100’ వేలం
ఇటీవల చిన్న సినిమాగా విడుదలై సంచలన విజయం సాధించిన చిత్రం ఆర్ఎక్స్ 100. అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో కార్తీకేయ, పాయల్ రాజ్‌పుత్‌లు హీరో హీరోయిన్లుగా నటించారు. యూత్‌ను ఆకట్టుకునే అంశాలతో తెరకెక్కిన ఈ సినిమా భారీ వసూళ్లను కూడా సాధించింది. తాజాగా ఆర్ఎక్స్ 100 చిత్రయూనిట్ తమ పెద్ద మనసును చాటుకున్నారు. కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో అతలాకుతలమైన కేరళ కోసం తమ వంతుసాయం అందించేందుకు ముందుకు వచ్చారు. బాదితుల కోసం సినిమాలో ఉపయోగించిన ఆర్ఎక్స్ 100 వాహనాన్ని వేలానికి పెట్టారు. వేలం ద్వారా వచ్చిన మొత్తానికి కేరాళ వరద బాధితుల సహాయనిధికి అందించనున్నారు. ఈ మేరకు హీరో కార్తీకేయ, దర్శకుడు అజయ్ భూపతి వీడియో మేసెజ్‌లు రిలీజ్ చేశారు. Please support this noble cause.Send your details and bidding amount to rx100auction@gmail.com or whatsapp to 9100445588 .Minimum bid amount is 50,000₹. pic.twitter.com/ywPER3y52a — Kartikeya (@ActorKartikeya) 20 August 2018 -
‘ఆర్ఎక్స్ 100’ దర్శకుడికి కాస్ట్లీ గిఫ్ట్
ఇటీవల సంచలన విజయం సాధించిన చిన్న సినిమా ఆర్ఎక్స్100. ఈ సినిమాతో దర్శకుడు అజయ్ భూపతి టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారాడు. బోల్డ్ కంటెంట్ తో తెరకెక్కిన ఆర్ఎక్స్ 100 మంచి విజయం సాధించటమే కాదు నిర్మాతకు కాసుల పంట పండించింది. అందుకే తనకు ఇంతటి ఘన విజయాన్ని అందించిన దర్శకుడికి నిర్మాత అశోక్ గుమ్మకొండ ఓ కాస్ట్లీ బహుమతి ఇచ్చారు. అజయ్ భూపతికి జీప్ కంపెనీ కారును అందించారు. కార్తికేయ, పాయల్ రాజ్‌పుత్‌లు హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన ఆర్ఎక్స్ 100 సినిమాలో రావూ రమేష్. రాంఖీలు ఇతర కీలక పాత్రల్లో నటించారు. చైతన్య భరద్వాజ్ సంగీతమందించారు. -
రష్మీ ఫైట్ చేస్తే...
జై, రష్మీ గౌతమ్ జంటగా జానీ దర్శకత్వంలో యూ అండ్ ఐ సమర్పణలో ఎస్ జై ఫిలిమ్స్ పతాకంపై రూపొందిన సినిమా ‘అంతకు మించి’. సతీష్, ఎ. పద్మనాభరెడ్డి, జై నిర్మించారు. భాను, కన్నా సహ నిర్మాతలు. ఈ సినిమాను ఈ నెల 24న విడుదల చేయనున్నట్లు ‘ఆర్ఎక్స్ 100’ మూవీ దర్శకుడు అజయ్ భూపతితో ఎనౌన్స్మెంట్ చేయించారు చిత్రబృందం. ఈ సందర్భంగా అజయ్ భూపతి మాట్లా డుతూ– ‘‘ట్రైలర్, రొమాంటిక్ సీన్స్ బాగున్నాయి. ఈ సినిమా నిర్మాత కమ్ హీరో జై చేస్తున్న ఈ ప్రయత్నం సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. ‘దర్శకుడు సుకుమార్‌గారు విడుదల చేసిన మా సినిమా ట్రైలర్‌కు మంచి స్పందన లభిస్తోంది. దర్శకుడిగా ఇది నా తొలి చిత్రం. రష్మిగారు చాలా బాగా నటించారు. జై అనుభవం ఉన్న నటుడిలా యాక్ట్ చేశాడు’’ అన్నారు జానీ. ‘‘అంతకుమించి’ అనే టైటిల్ ఎందుకు పెట్టామో సినిమా చూశాక ఆడియన్స్‌కు అర్థం అవుతుంది’’ అన్నారు జై. ‘‘అందరి ఎఫర్ట్ ఈ ‘అంతకు మించి’ సినిమా. నిర్మాతల ముఖాల్లో నవ్వు కనబడితే తృప్తిగా ఉంటుంది. ఈ చిత్రం నిర్మాతల ముఖాల్లో ఆ నవ్వు చూశా. హీరో జైకి మంచి టెక్నికల్ నాలెడ్జ్ ఉంది. ఈ సినిమాలో నేను డూప్స్ లేకుండా స్టంట్స్ చేశా’’ అన్నారు రష్మీ గౌతమ్. అజయ్ ఘోష్, టిఎన్ఆర్, మధునందన్, హర్ష నటించిన ఈ సినిమాకు సునీల్ కశ్యప్ సంగీతం అందించారు. -
ఆగస్టు 24న ‘అంతకు మించి’
జై, రష్మి గౌతమ్ హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతున్న హర్రర్ థ్రిల్లర్ మూవీ అంతుకు మించి. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాను ఆగస్టు 24న రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. రిలీజ్ డేట్‌ను ప్రకటించిన ఆర్ ఎక్స్100 చిత్ర దర్శకుడు అజయ్ భూపతి మాట్లాడుతూ.. ‘అన్ని జోనర్ ల కంటే హర్రర్, థ్రిల్లర్ తీయడం చాలా కష్టం. సౌండ్ ఎఫెక్ట్స్ ముఖ్య పాత్ర పోషిస్తాయి. అలా ఉంటేనే సినిమాకి ప్లస్ అవుతుంది. అదే అంతకుమించి సినిమాలో కనపడుతోంది. ట్రైలర్ చాలా బాగుంది, రొమాంటిక్ సీన్స్ బాగున్నాయి. ఇక ఈ చిత్ర హీరో కమ్ నిర్మాత జై నాకు మంచి మిత్రుడు. మొదటిసారిగా తను చేస్తున్న ఈ ప్రయత్నం సక్సెస్ అవ్వాలని ఆశిస్తున్నా. ఈ చిత్రం ఆగస్టు 24న విడుదలవుతోంది తప్పకుండా అందరూ చూసి ఆదరించాలని కోరుతున్నాను’ అన్నారు. దర్శకుడు జానీ మాట్లాడుతూ.. ‘మా సినిమా ట్రైలర్ ను సుకుమార్ గారు విడుదల చేశారు.. మంచి రెస్పాన్స్ వచ్చింది. రష్మీ గారు చాలా బాగా నటించారు. తనే ఈ సినిమాకు హైలెట్ అని చెప్పొచ్చు. హీరో జై కొత్తవాడు అయినా ఎక్కడా ఆ ఫీల్ కలగదు. అనుభవం ఉన్న నటుడిలా నటించాడు. ఇది నా డెబ్యూ. ఈ సినిమాని ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశిస్తున్నాను’ అన్నారు. హీరో జై మాట్లాడుతూ.. ‘సినిమా లాస్ట్ టూ రీల్స్ లో ఆడియన్స్ కచ్చితంగా భయపడతారు. ఇంటర్వెల్ బ్యాంగ్ లో టైటిల్ పడుతుంది. అంతకు మించి అని అప్పుడు అర్థం అవుతుంది ఈ సినిమాకు ఈ టైటిల్ ఎందుకు పెట్టారు అని. రష్మీ గారు అల్టిమేట్ పెర్ఫామెన్స్ తో సినిమాకు ప్రాణం పోశారు. మా సహ నిర్మాతలు భాను, కన్నాలు నాకు ఎంతగానో సహకరించారు. అందుకే ఈ సినిమా ఇంతబాగా వచ్చింది. ఖచ్చితంగా అందరికీ నచ్చి తీరుతుంది’ అని అన్నారు. హీరోయిన్ రష్మీ మాట్లాడుతూ.. ‘అందరి ఎఫర్ట్ ఈ అంతకు మించి సినిమా. చాలా ఎంజాయ్ చేసి కష్టపడి పని చేసాము. నిర్మాతల ముఖాల్లో స్మైల్ కనపడితే తృప్తిగా ఉంటుంది. అదే ఈ చిత్ర నిర్మాతల్లో నేను చూశాను. హీరో కమ్ ప్రొడ్యూసర్ జై మంచి నటుడే కాదు మంచి టెక్నికల్ నాలెడ్జ్ కూడా ఉంది. ఈ చిత్రం ఎక్కువగా నైట్ షూట్స్ చేశాము. ఇందులో నేను డూప్ లేకుండా స్టంట్స్ కూడా చేశాను. సినిమా హారర్ థ్రిల్లర్ గనుక అందరికీ నచ్చి తీరుతుందని భావిస్తున్నా’ అన్నారు. -
‘కబాలి’ నిర్మాతతో ‘ఆర్ఎక్స్ 100’ హీరో..!
ఇటీవల సంచలన విజయం సాధించిన చిన్న సినిమా ఆర్ఎక్స్ 100. రామ్ గోపాల్ వర్మ శిష్యుడు అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో కార్తికేయ, పాయల్ రాజ్‌పుత్‌లు హీరోహీరోయిన్లుగా నటించారు. బోల్డ్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ సినిమా యూత్‌ను ఆకట్టుకోవటంతో వసూళ్ల పంట పండింది. అంతేకాదు ఈ సినిమా దర్శకుడు అజయ్ భూపతితో పాటు హీరోగా నటించిన కార్తికేయకు పెద్ద బ్యానర్ల నుంచి ఆఫర్లు అందుతున్నాయి. తాజాగా హీరో కార్తికేయ ఓ తమిళ నిర్మాణ సంస్థ నిర్మించబోయే సినిమాకు ఓకె చెప్పినట్టుగా తెలుస్తోంది. కోలీవుడ్‌లో కబాలి లాంటి భారీ బడ్జెట్ చిత్రాలను అందించిన కలైపులి ఎస్ థాను నిర్మించబోయే సినిమాలో కార్తికేయ హీరోగా నటించనున్నాడట. ఈ సినిమాకు ఎన్ కృష్ణ దర్శకత్వం వహించనున్నారన్న ప్రచారం జరుగుతోంది. అయితే ఈ సినిమా తమిళ్లోనే తెరకెక్కిస్తారా.. లేక బైలింగ్యువల్‌గా తెరకెక్కిస్తారా అన్న విషయం తెలియాల్సి ఉంది. -
యమా స్పీడ్...
గతంలో జుయ్‌మంటూ మన పక్కనుంచి ఒక బైక్ వెళితే అది ‘ఆర్ఎక్స్100’ సౌండ్ అనుకునేంత గొప్పగా చెప్పుకునేవారు ఆ బైక్ గురించి. దాని స్పీడు అలా ఉండేది మరి. ఆ బైక్ పేరునే సినిమాకు టైటిల్‌గా పెట్టారు దర్శకుడు అజయ్ భూపతి. ఇప్పుడు ఆ బైక్ స్పీడ్ కంటే మనోడు సాధించిన హిట్ తెలుగు సినీ ఇండస్ట్రీకి ఇంకా పెద్ద సౌండ్‌తో వినిపించింది. ఆ మాత్రం సౌండ్ చేస్తే చాలు చాన్సులు డోర్ దగ్గరికి వచ్చేస్తాయ్. ఇప్పటికి అజయ్‌కి వచ్చిన అవకాశాల లెక్క దాదాపు 15. మంచి మంచి ప్రొడక్షన్ హౌస్‌ల నుంచి అజయ్ డైరెక్షన్లో సినిమా చేయడానికి నిర్మాతలు సంప్రదించారు. విశేషం ఏంటంటే... తెలుగులో సాధించిన హిట్ సౌండ్ పరభాషల వారికీ వినిపించింది. బాలీవుడ్ నుంచి ఫాంథమ్ ఫిల్మ్స్ నిర్మాతలు అనురాగ్ కశ్యప్, మధు మంతెనలతో ఓ సినిమా గురించి మంతనాలు జరుగుతున్నాయి. అలాగే కోలీవుడ్ నుంచి కూడా అజయ్‌కి ఖబర్ వచ్చింది. ప్రముఖ తమిళ హీరో ధనుష్‌తో ఓ సినిమా చేసే అవకాశం వచ్చిందని టాక్. త్వరలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. స్పీడు స్పీడులే అంటూ వరుస సినిమాలతో అజయ్ రయ్‌మని దూసుకెళ్లే చాన్స్ కనిపిస్తోంది. -
RX 100.. ఆత్రేయపురం టూ ముంబై
మౌత్ పబ్లిసిటీతో టాలీవుడ్లో సెన్సేషన్‌గా మారింది ఆర్ఎక్స్ 100 చిత్రం. ఈ మధ్య రిలీజ్ అయిన చిత్రాల్లో క్రౌడ్‌పుల్లర్‌గా నిలిచిన ఈ చిత్రం.. త్వరలో బాలీవుడ్‌లోకి వెళ్లబోతోంది. ఈ విషయాన్ని విలక్షణ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ తన ట్విటర్లో తెలియజేశారు. (`ఆర్ఎక్స్ 100` మూవీ రివ్యూ) ‘కంగ్రాచ్యూలేషన్ అజయ్ భూపతి.. నీ సూపర్ బ్లాక్ బస్టర్ ఆర్ఎక్స్ 100 ఆత్రేయపురం నుంచి ముంబైకి చేరుకుంది. హిందీలో ఫాంటోమ్ ప్రొడక్షన్లో మధు మంతెన ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు(అమీర్ ఖాన్ గజిని నిర్మాతల్లో ఒకరు)’ అని వర్మ తెలియజేశారు. అయితే పాత్రధారులు తదితర వివరాలు తెలియాల్సి ఉంది. అన్నట్లు డైరెక్టర్ అజయ్ భూపతి వర్మ శిష్యుల్లో ఒకరు అన్న విషయం తెలిసిందే. కార్తికేయ, పాయల్ రాజ్‌పుత్ జంటగా రావు రమేశ్, ‘సింధూర పువ్వు’ రాంకీ ముఖ్య పాత్రల్లో అజయ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఆర్ఎక్స్ 100’. బోల్డ్ కంటెంట్‌గా తెరకెక్కిన ఈ చిత్రం దాదాపుగా రూ. 12 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి సెన్సేషన్‌గా నిలిచింది. -
RX100 రైడెర్స్