
బెల్లంకొండ సాయిశ్రీనివాస్
‘ఆర్‌ఎక్స్ 100’ సూపర్‌హిట్ సాధించడంతో అజయ్ భూపతి క్రేజీ దర్శకుడిగా మారిపోయారు. అతను చేయబోయే తదుపరి ప్రాజెక్ట్‌పై ఆసక్తి నెలకొంది. మల్టీస్టారర్ చిత్రంగా అజయ్ తన రెండో ప్రాజెక్ట్‌ను ఎంచుకున్న సంగతి తెలిసిందే. ఇందులో ఓ హీరోగా బెల్లంకొండ సాయిశ్రీనివాస్ నటించనున్నారు. మరో హీరో ఎవరన్నది ఇంకా ఫిక్స్ కాలేదు. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ మే నెలలో ప్రారంభం కానుందని సమాచారం. మొదటి చిత్రం ‘ఆర్‌ఎక్స్ 100’ వంటి రా సబ్జెక్ట్‌నే అజయ్ తయారు చేశారని సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment