
తొలి చిత్రం ఆర్‌ఎక్స్ 100తోనే ఘన విజయం సాధించిన యంగ్ డైరెక్టర్ అజయ్ భూపతి. ఈ సినిమా సక్సెస్‌తో అజయ్ భూపతికి వరుస అవకాశాలు క్యూ కట్టాయి. నితిన్ లాంటి యంగ్ హీరోస్ అజయ్‌తో సినిమా చేసేందుకు ఇంట్రస్ట్ చూపించారు. తాజాగా అజయ్ భూపతి తన నెక్ట్స్ ప్రాజెక్ట్ ను ఫైనల్ చేసే పనిలో ఉన్నాడు. యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా సినిమా చేయనున్నాడు అజయ్.
ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాకు మహా సముద్రం అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది. మాఫియా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సాయి శ్రీనివాస్‌కు జోడిగా ఓ స్టార్ హీరోయిన్‌ను తీసుకునే ఆలోచనలో ఉన్నారు చిత్రయూనిట్. త్వరలోనే సినిమాకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment