
మొదటి సినిమాతోనే అజయ్ భూపతికి ప్రత్యేక గుర్తింపు వచ్చేలా చేసిన సినిమా ‘ఆర్‌ఎక్స్ 100’. కార్తికేయు, పాయల్ రాజ్‌పుత్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం టాలీవుడ్‌లో ఎలాంటి సంచనాలకు దారితీసిందో తెలిసిందే. ఈ చిత్రం ఇప్పుడు బాలీవుడ్‌లో ‘తడప్’గా రీమేక్ అవుతోంది. స్టార్ యాక్టర్ సునీల్ శెట్టి తనయుడు అహాన్ శెట్టి, తారా సుతారియా జంటగా వస్తున్న ఈ మూవీ ట్రైలర్‌ని తాజాగా విడుదలైంది.
మెగాస్టార్ చిరంజీవి లాంచ్ చేసిన ఈ ట్రైలర్ ఆకట్టుకునేలా ఉంది. అయితే అక్కడి ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లు ‘ఆర్‌ఎక్స్ 100’ కథకి కొన్ని మార్పులు చేసినట్లు అర్థమవుతోంది. అయితే హీరో, హీరోయిన్ల నటన మాత్రం అదిరిపోయింది. రఫ్, సాఫ్ట్ వంటి రెండు డిఫరెంట్ లుక్స్‌తో అహాన్ ఆకట్టుకుంటున్నాడు. ఈ ఏడాది డిసెంబర్ 3న విడుదల కానున్న ఈ చిత్రాన్ని సాజిద్ నడియడ్‌వాలా నిర్మిస్తుండగా.. మిలాన్ లుథ్రియా దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే ఇంతకుముందు కూడా కొత్త డైరెక్టర్‌గా సందీప్ రెడ్డి వంగా చేసిన ‘అర్జున్ రెడ్డి’ హిందీలో రీమేక్ అయ్యి సంచలన విజయం సాధించింది. కాగా టాలీవుడ్‌లో మరో కొత్త డైరెక్టర్ చేసిన ఈ సినిమా రీమేక్ ఎలాంటి సంచనాలకు దారి తీస్తుందో చూడాలి.
చదవండి: ‘మహాసముద్రం’లోని ట్విస్ట్‌లు అంచనాలకు అందవు: మ్యూజిక్ డైరెక్టర్
Comments
Please login to add a commentAdd a comment