
రామ్ గోపాల్ వర్మ గత కొంతకాలం పాటు తన స్థాయి హిట్ సినిమాలు తీయలేక వెనకబడ్డారు. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ‘ఆఫీసర్’ సినిమా దారుణంగా బెడిసికొట్టింది. అయితే వర్మ పరిస్థితి ఇలా ఉంటే వర్మ శిష్యులు మాత్రం సక్సెస్ సాధిస్తున్నారు.
తాజాగా వర్మ శిష్యుడు అజయ్ భూపతి దర్శకత్వంలో వచ్చిన ‘ఆర్‌ఎక్స్ 100’ మూవీ మంచి కలెక్షన్స్‌తో దూసుకెళ్తోంది. ఈ మూవీ సక్సెస్ సాధించినందుకు ఆర్జీవీ ఈ సినిమాపై ట్వీట్స్ చేస్తున్నారు. ‘నన్ను అసిస్టెంట్‌గా తీసుకోవాలని నా మాజీ అసిస్టెంట్ అజయ్ భూపతిని కోరుతున్నా’నని ట్వీట్ చేశారు.
RX100 is a roaring MEGA force which defeated VICTORY and I request my ex assistant @DirAjayBhupathi to make me his next assistant 🙏
— Ram Gopal Varma (@RGVzoomin) July 12, 2018