‘‘క్లాక్స్ నాకు 2009 నుంచి పరిచయం. అప్పట్నుంచి నాకు కథలు చెబుతుంటాడు. డిఫరెంట్ కాన్సెప్టుల్లో నటించడం, చేయడం కాస్త కష్టం.. నిర్మాతలు ముందుకు రారు, కమర్షియల్ ఫార్మాట్లో సినిమా చేయమని తనతో చెప్పాను. కానీ బెన్నీలాంటి నిర్మాతలు ఇప్పుడు కొత్త కథలను ప్రోత్సహిస్తున్నారు. ఇక కొత్త కొత్త పాత్రలు చేస్తున్న కార్తికేయకు పెద్ద హిట్ పడాలని అనుకున్నాను. ఇప్పుడు ‘బెదురులంక’తో హిట్ కొట్టేశాడు’’ అని హీరో శ్రీ విష్ణు అన్నారు.
కార్తికేయ, నేహా శెట్టి జంటగా నటించిన చిత్రం ’బెదురులంక 2012’. క్లాక్స్ దర్శకత్వంలో రవీంద్ర బెనర్జీ (బెన్నీ) ముప్పానేని నిర్మించిన ఈ చిత్రం గత వారం విడుదలైంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ నిర్వహించిన విజయోత్సవంలో హీరో శ్రీ విష్ణు, దర్శకుడు అజయ్ భూపతి తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
‘‘కార్తికేయకు హిట్ వస్తే నాకూ హిట్ వచ్చినట్టే’’ అని అజయ్ భూపతి అన్నారు. కార్తికేయ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా ప్రయాణంలో ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నాం. ఫస్ట్ డే ఫస్ట్ షో చూసి బాగుందని అందరూ చెప్పిన తర్వాత పెద్ద రిలీఫ్ అనిపించింది. ఇలా సక్సెస్ మీట్‌లో మాట్లాడి ఐదేళ్లయింది. ‘ఆర్‌ఎక్స్ 100’ తర్వాత నేను చేసిన సినిమాలు అనుకున్న రేంజ్‌కు వెళ్లలేదు. ఒక్క హిట్ వస్తే చాలనుకున్న టైమ్‌లోనే ‘బెదురులంక’ వచ్చింది’’ అన్నారు. ‘‘సినిమాను ఇంత పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులకు థ్యాంక్స్’’ అన్నారు రవీంద్ర బెనర్జీ (బెన్నీ) ముప్పానేని. ఇంకా బీవీఎస్ రవి, నేహా శెట్టి తదితరులు మాట్లాడారు.
∙బెన్నీ, శ్రీ విష్ణు, కార్తికేయ, నేహాశెట్టి
సక్సెస్ మీట్‌లో మాట్లాడి ఐదేళ్లయింది
Published Fri, Sep 1 2023 4:14 AM | Last Updated on Fri, Sep 1 2023 7:06 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment