సైలెంట్‌గా ఓటీటీకి వచ్చేసిన టాలీవుడ్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే? | 'Bedurulanka 2012' Movie Released In OTT On 22nd September | Sakshi
Sakshi News home page

Bedurulanka 2012 Movie: సైలెంట్‌గా ఓటీటీకి వచ్చేసిన బెదురులంక-2012.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Published Fri, Sep 22 2023 7:09 AM | Last Updated on Fri, Sep 22 2023 8:29 AM

Bedurulanka 2012 Movie Released In Amazon Prime From September 22nd - Sakshi

‘ఆర్‌ఎక్స్‌ 100’ ఫేమ్‌ కార్తికేయ గుమ్మకొండ హీరోగా నటించిన ‘బెదురులంక 2012’.  ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం మిక్స్‌డ్‌ టాక్‌ను సొంతం చేసుకుంది.  ఈ మూవీలో ‘డీజే టిల్లు’ ఫేమ్‌ నేహా శెట్టి కథానాయికగా నటించారు. గ్రామీణ వాతావరణం నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రానినికి క్లాక్స్‌ దర్శకత్వం వహించారు. ఈ మూవీని రవీంద్ర బెనర్జీ ముప్పనేని నిర్మించారు. 

(ఇది చదవండి: పెళ్లి వార్తలపై త్రిష బోల్డ్ ట్వీట్)

అయితే తాజాగా ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. ఈ రోజు నుంచే అమెజాన్‌ ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌ అవుతోంది. 2012లో యుగాంతం నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఓ పల్లెటూరులో జరిగిన సంఘటనలే కథాంశంగా చూపించారు. 2012లో యుగాంతం అయిపోతుందని అప్పట్లో ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో అజయ్‌ ఘోష్‌, రాజ్‌ కుమార్‌ కసిరెడ్డి, శ్రీకాంత్‌ అయ్యంగార్‌, గోపరాజు రమణ, ఎల్బీ శ్రీరామ్‌, సత్య తదితరులు నటించారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతమందించారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement