వరుస సినిమాలతో దూసుకుపోతున్న కార్తికేయ నటిస్తున్న తాజాచిత్రం బెదురులంక. క్లాక్స్ దర్శకత్వం రవీంద్ర బెనర్జీ ముప్పానేని ఈ సినిమాను నిర్మిస్తున్నారు. గోదావరి బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కార్తికేయకు జోడీగా డీజే టిల్లు భామ నేహాశెట్టి నటిస్తుంది. బెదురులంక అనే ఊరిలో 2012లో యుగాంతం వస్తుందన్న పుకార్లు ఎలాంటి పరిణామాలు తీసుకొచ్చాయి అన్న నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించనున్నట్లు టాక్ వినిపిస్తుంది.
ఈ సినిమాలో నేహాశెట్టి పల్లెటూరి అమ్మాయిగా కనిపించనుంది. సోమవారం(నేడు)ఆమె బర్త్‌డే సందర్భంగా మేకర్స్ నేహాశెట్టి ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. వచ్చే ఏడాదిలో ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు.
Wishing beautiful & talented @iamnehashetty a very happy birthday ✨
— Kartikeya (@ActorKartikeya) December 5, 2022
Introducing "Chitra" from the world of #Bedurulanka2012 🌊 #Clax #ManiSharma @Benny_Muppaneni @Loukyaoffl @SonyMusicSouth #HBDNehaSshetty pic.twitter.com/SWaoElGgFS
Comments
Please login to add a commentAdd a comment