Kartikeya Gummakonda
-
'నేను ఇప్పటికీ బాధపడుతున్నా.. ఆ పనికిమాలిన చెత్తను ఎంకరేజ్ చేయొద్దు'
సినిమా షూటింగ్ ఇలా అయిపోగానే అలా ప్రమోషన్లు మొదలుపెట్టేస్తున్నారు. ఎప్పుడైతే సోషల్ మీడియా వాడకం పెరగపోయిందో, ఇబ్బడిముబ్బడిగా యూట్యూబ్ ఛానల్స్ వచ్చిపడ్డాయో అందరికీ ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఫాలోవర్లు ఎక్కువగా ఉన్న ఛానల్ యజమానులతో కలిసి రీల్స్ అని, ఇంటర్వ్యూలని ప్లాన్ చేస్తున్నారు. దానివల్ల ఎక్కువమంది జనాలకు తమ సినిమా గురించి తెలిసే ఆస్కారం ఉంటుందని వారి ఆశ.తప్పు చేశా: కార్తికేయకానీ ఈ పిచ్చిలో పడి ఓ పనికిమాలిన వ్యక్తికి ఇంటర్వ్యూ ఇచ్చి తప్పు చేశానంటున్నాడు హీరో కార్తికేయ. యూట్యూబర్ హనుమంతుకు ఇంటర్వ్యూ ఇవ్వడం ముమ్మాటికీ తప్పేనని అభిప్రాపయపడ్డాడు. కాగా హనుమంతు.. వల్గర్ కామెడీ చేస్తూ, ట్రోల్ స్టఫ్‌తో యూట్యూబ్ ఛానల్ నడుపుతున్నాడు. ఇటీవల ఓ తండ్రీకూతుర్ల సరదా వీడియో గురించి అత్యంత దారుణంగా మాట్లాడాడు. వారి బంధాన్ని కించపరుస్తూ చిన్నారి గురించి అసభ్యంగా మాట్లాడాడు. పిచ్చి కామెంట్లుఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవడంతో హీరో సాయిధరమ్ తేజ్ సోషల్ మీడియాలో మండిపడ్డాడు. అతడితో పాటు ఆ వీడియోలో ఇలాంటి పిచ్చి కామెంట్లు చేసిన మరో ముగ్గురిపై చర్యలు తీసుకోవాలని కోరాడు. తాజాగా ఈ విషయంపై హీరో కార్తికేయ స్పందించాడు. ఈ మధ్యకాలంలో కుళ్లు జోకులు వేస్తూ అవతలివారి గురించి దిగజార్చేలా మాట్లాడటం ప్యాషన్ అయిపోయింది.ఎంకరేజ్ చేయొద్దువాటిని ఎంకరేజ్ చేస్తున్నాం కనకే ఇప్పుడది ఈ స్థాయికి చేరింది. కాబట్టి ద్వంద్వార్థాలు వచ్చేలా పిచ్చి జోకులు వేసేవారిని ఎంకరేజ్ చేయొద్దు. ఒకర్ని కిందకు లాగాలని చూసేబదులు సొంతంగా ఎదుగుతూ, ఇతరుల ఎదుగుదలకు సాయపడటం మేలు అని ట్వీట్ చేశాడు. ఇది చూసిన ఓ నెటిజన్ తమరు అతడికి ఇంటర్వ్యూ ఇచ్చి ఎంకరేజ్ చేసినప్పుడు తెలియలేదా? అని ప్రశ్నించాడు. ఇందుకు హీరో మరో ట్వీట్లో వివరణ ఇచ్చాడు. షాకయ్యా'నా సినిమా ప్రమోషన్ కోసం నేను అతడికి ఇంటర్వ్యూ ఇచ్చాను. అన్ని ఛానల్స్‌కు ఇచ్చినట్లుగానే తనకూ ఇచ్చాను. కానీ ఆయన అడిగే ప్రశ్నలకు షాకయ్యాను. దాన్ని గొడవ చేయకుండా వదిలేశాను. ఇప్పుడు పరిస్థితి వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నాను. నిజంగానే తనకు ఇంటర్వ్యూ ఇవ్వకుండా ఉండాల్సింది. ఒక హీరోగా నా సినిమా జనాల్లోకి వెళ్లాలనే ఆలోచించాను తప్ప తనను ఎంకరేజ్ చేయాలని కానే కాదు. జరిగినదానికి బాధపడుతున్నాను. ఇకమీదట ఇంటర్వ్యూలు ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉంటాను. ప్రతి ఒక్కరూ అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను' అని రాసుకొచ్చాడు. Based on the latest outrage on a youtuber who crossed all the limits cracking an insensitive joke i want to voice my opinion in this situation.Not just this one case but i feel cracking such demeaning jokes on others has become a trend these days claiming themselves to be…— Kartikeya (@ActorKartikeya) July 8, 2024Yes i have given the interview to them But it was part of my movie promotion.Like how i give interviews to all otherchannels before a movie release and frankly i was a bit shocked by the questions then but then I dint want to make a scene there so tried my best to be as…— Kartikeya (@ActorKartikeya) July 8, 2024 చదవండి: ఈవారం ఓటీటీలో 23 సినిమాలు/సిరీస్‌లు.. ఎక్కువగా ఆ రోజే! ఆవేదనతో మంచు విష్ణుకు నటి హేమ లేఖ -
రాజమౌళి పేరు చెప్పే అర్హత నాకిప్పుడు లేదు: డైరెక్టర్
‘మా ఊర్లో(మెదక్) రాజమౌళి దర్శకత్వం వహించిన ‘సై’ సినిమా షూటింగ్ జరిగింది. అది చూసిన తర్వాతే నాకు ఇండస్ట్రీలోకి రావాలనే కోరిక ఏర్పడింది. రాజమౌళి గారిని ఆదర్శంగా తీసుకొనే ఇండస్ట్రీలోకి వచ్చాను. ఈ విషయం చెప్పేందుకు ఇప్పుడు నాకున్న అర్హత సరిపోదు. నా సినిమా(భజే వాయు వేగం) విడుదలై అందరికి నచ్చితే.. అప్పుడు రాజమౌళి గారే నా ఇన్స్పిరేషన్ అని గర్వంగా చెబుతా’అని అన్నాడు యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ రెడ్డి. ఆయన దర్శకత్వం వహించిన తొలి సినిమా ‘భయే వాయు వేగం’. కార్తికేయ గుమ్మకొండ, ఐశ్వర్య మీనన్ హీరోహీరోయిన్లుగా నటించారు. మే 31న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా ప్రశాంత్ రెడ్డి మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..⇒ యూవీ క్రియేషన్స్‌తో నాకు చాలా అనుబంధం ఉంది. రన్ రాజా రన్ సినిమాకు డైరెక్షన్ డిపార్ట్ మెంట్ లో వర్క్ చేశాను. ఆ తర్వాత సాహోకు కంటిన్యూ అయ్యాను. కోవిడ్ కు ముందు భజే వాయు వేగం ఓకే అయ్యింది. కార్తికేయ అప్పడు చావు కబురు చల్లగా, రాజా విక్రమార్క చేస్తున్నాడు. కోవిడ్ వల్ల ఏడాదిన్నర టైమ్ వేస్టయింది. "భజే వాయు వేగం" సినిమా షూటింగ్ మొదలుపెట్టి 70 పర్సెంట్ కంప్లీట్ చేసిన తర్వాత కార్తికేయ బెదురులంక షూటింగ్ కు వెళ్లాడు. అది ఫినిష్ చేసి వచ్చాక మా "భజే వాయు వేగం" కంప్లీట్ చేశాం.⇒ ‘భజే వాయు వేగం’ కథ ప్రకారం ఫస్టాఫ్ కు ఒక పర్ ఫార్మర్ కావాలి. సెకండాఫ్ లో హీరోయిజం ఎలివేట్ కావాలి. అలా చూస్తే కార్తికేయ నాకు బెస్ట్ ఆప్షన్ అనిపించాడు. అతను పర్ ఫార్మెన్స్ చేస్తాడు, హీరో పర్సనాలిటీ ఉంటుంది. కార్తికేయను ఎంచుకోవడానికి కారణమిదే. అలాగే హీరోయిన్ ఒక మిడిల్ క్లాస్ లొకాలిటీలో పెరిగే సంప్రదాయబద్దమైన అమ్మాయి. ఐశ్వర్య మీనన్ ప్రొఫైల్ చూస్తుంటే మొత్తం హాఫ శారీ, చీరకట్టులో ఫొటోస్ తో కనిపించింది. ఆమె ఈ మూవీలో ఇందు క్యారెక్టర్ కు కరెక్ట్ ఆప్షన్ గా భావించా.⇒ ఈ సినిమా కొంత డిలే కావడానికి కారణాలు ఉన్నాయి. కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల ఎడిట్ చేసిన వెర్షన్ ఫుటేజ్ పోయింది. మళ్లీ ఆ ఎడిటింగ్ కోసం మూడు నెలల టైమ్ అదనంగా పట్టింది. పోస్ట్ ప్రొడక్షన్ లో క్వాలిటీ కోసం కొంత టైమ్ అదనంగా తీసుకున్నాం. ఫస్ట్ సినిమాకు ఇలా కొంత డిలే కావడం ప్రెజర్ గానే ఉండేది.⇒ ట్రైలర్ లో ఫాదర్ సెంటిమెంట్ అనేది రివీల్ చేశాం. అయితే ఫాదర్ సెంటిమెంట్ అనే కాన్సెప్ట్ ఎప్పుడూ ఓల్డ్ కాదు. ట్రైలర్ చివరలో మీ నాన్న కాదు మా నాన్న అని రాహుల్ కార్తికేయతో చెప్పడం కూడా కథ తెలిసిపోయిందని కొందరు కామెంట్ చేశారు. కానీ మీకు ట్రైలర్ చూపించింది రేపు థియేటర్ లో చూడబోయే కథకు చాలా వేరియేషన్స్ ఉంటాయి. కథను రివీల్ చేయకూడదనే ట్రైలర్ లో ఎలాంటి ట్విస్ట్ లు చూపించలేదు. ⇒ ఊరి నుంచి పట్టణానికి మనమంతా ఏదో ఒకటి సాధించాలని వస్తాం. అలా వచ్చిన క్రమంలో ఇక్కడ కొన్ని పోగొట్టుకుంటాం. కొన్ని సంపాదిస్తాం. చివరకు మన గోల్ రీచ్ అయ్యామా లేదా అనేది చూసుకుంటాం. అనుకున్నది సాధించని వాళ్లూ ఉంటారు. హీరో అలా ఒక గోల్ మీద సిటీకి వస్తాడు. అతను తన గోల్ గురించి ప్రయత్నిస్తున్న టైమ్ లో వేరే సమస్యలు చుట్టుముడతాయి. తన లక్ష్యం వదిలేసి వీటిని సాల్వ్ చేసేందుకు వెళ్తుంటాడు. ప్రేక్షకులకు మాత్రం అతని గోల్ వేరు కదా అనిపిస్తుంటుంది.⇒ సినిమా సెకండాఫ్ లో ఛేజింగ్ లా స్క్రీన్ ప్లే ఉంటుంది. సెకండాఫ్ లో మీరు ఫోన్ వైపు చూడరనే నమ్మకం ఉంది. అంత గ్రిప్పింగ్ గా ఉంటుంది. స్పీడ్ లాంటి టైటిల్ మా మూవీకి పెట్టుకోవచ్చు. అయితే ఇంగ్లీష్ టైటిల్ ఎందుకని భజే వాయు వేగం అని పెట్టాం. మా యూవీ వారికి కూడా బాగా నచ్చింది. వెంటనే రిజిస్టర్ చేయించాం. అఖిల్ తో యూవీలో సినిమా చేయబోతున్న డైరెక్టర్ అనిల్ ఈ సినిమా చూసి టైటిల్ సజెస్ట్ చేశాడు.⇒ ఈ సినిమా బీజీఎం కోసం స్పెషల్ కేర్ తీసుకున్నా. దాదాపు మూడు నెలలు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కోసమే టైమ్ కేటాయించా. కపిల్ అని కొత్త అతను బీజీఎం ఇచ్చాడు. రాధన్ సాంగ్ చేశాడు. అతను చెన్నైలో ఉంటే నేను అక్కడికి ఇక్కడికి తిరగడానికి టైమ్ ఉండదని రాధన్ తో బీజీఎం చేయించలేదు. సెకండాఫ్ లో ఒక్క సాంగ్ ఉండదు. స్క్రీన్ ప్లే రేసీగా వెళ్తుంటుంది. కథ స్పీడ్ గా వెళ్తే ఆడియెన్స్ ఎవరూ అక్కడ పాట ఉండాలని కోరుకోరు. పైగా దాన్నో స్పీడ్ బ్రేకర్ లా భావిస్తారు.⇒ ఆడియెన్స్ రీల్స్ చూసే ట్రెండ్ లోకి వచ్చారు. ఒక్క క్షణం బోర్ కొట్టినా రీల్ మార్చేస్తారు. ఇలాంటి టైమ్ లో సినిమా చిన్న గ్యాప్ ఇవ్వకుండా ఆడియెన్ ను ఎంగేజ్ చేయాలనేది నా ఆలోచన. "భజే వాయు వేగం" సినిమాకు అదే ఫాలో అయ్యి రూపొందించాం. మనం అతన్ని హీరో అని పిలుస్తున్నాం కాబట్టి హీరో ఒక పెద్ద లక్ష్యంతో ఉండాలని నేను అనుకుంటా. ప్రేక్షకులకు హీరోకు కనెక్ట్ అవుతారు. వాళ్లకు స్ఫూర్తినిచ్చేలా హీరో క్యారెక్టర్ ఉండాలి.⇒ అసిస్టెంట్ డైరెక్టర్ గా నేర్చుకున్న దానికంటే ఓ సినిమాకు డైరెక్షన్ చేస్తే వెయ్యింతలు పని నేర్చుకోవచ్చు. సినిమాను అనేక దశల్లో బెటర్ మెంట్ చేసుకోవచ్చు. మిగతా ఏ క్రియేటివ్ జాబ్ లోనూ ఇలాంటి అవకాశం ఉండకపోవచ్చు.⇒ ప్రస్తుతం కొన్ని స్క్రిప్ట్స్ నా దగ్గర ఉన్నాయి. భజే వాయు వేగం సినిమా రిలీజ్ అయ్యాక నా కొత్త మూవీ అనౌన్స్ చేస్తా. -
రివ్యూ రైటర్లపై శ్రీకాంత్ అయ్యంగార్ ఆగ్రహం
సినిమా రివ్యూ రైటర్లపై నటుడు శ్రీకాంత్ అయ్యంగార్ ఫైర్ అయ్యారు. ఎవరైనా ఏదైనా సాధించి ఇంకొకడి గురించి రాస్తే బాగుంటుందని వ్యాఖ్యానించాడు. యంగ్ హీరో కార్తికేయ నటించిన తాజా చిత్రం బెదురులంక 2012. క్లాక్స్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆగస్ట్ 25న ప్రేక్షకుల ముందుకు వచ్చి, పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తుంది. ఈ నేపథ్యంలో తాజాగా చిత్రబృందం సక్సెస్ మీట్ నిర్వహించింది. హీరో కార్తికేయతో పాటు సినిమా టీమ్ అంతా ఈ ప్రోగ్రామ్‌కి హాజరైంది. ఈ సందర్భంగా శ్రీకాంత్ అయ్యంగార్ మాట్లాడుతూ.. ‘చావు కబురు చల్లగా చిత్రంలో కార్తికేయతో నటించే అవకాశం లభించింది. సూపర్ స్టార్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే చూడడానికి చాలా బాగుంటాడు. క్రమశిక్షణతో పనిచేస్తాడు. వీటన్నింటినీ మించి ఒక మంచి నటుడు. బెదురులంక 2012లో అద్భుతంగా నటించాడు. ఇక మా అన్నయ్య అజయ్ ఘోష్ ఫెర్ఫార్మెన్స్‌కి వచ్చేసరికి ఆయన తిమింగల స్వరూపం. ఆయన దగ్గరు నేర్చుకొని, ఆయనతో నటించే అవకాశం నాకు దక్కింది. తెర వెనుక ఎంత కష్టపడ్డాం అనేది జనాలకు తెలియదు, తెరపై ఆడేదే జనాలకు తెలుసు. రివ్యూస్, గివ్యూస్ రాస్తారులెండి.. మనమేదైనా పీకుడు పనిచేసి, సాధించి ఇంకొకడు గురించి రాస్తే ఫర్వాలేదు. కెమేరా వర్క్ రాదని ఎవడో రాస్తే మనం ఇక్కడ ఎందుకుంటాం? కాంతార అనే సినిమాకు ఒక్క రివ్యూ లేదు. జనాలు దాన్ని హిట్టు చేయలేదా? ప్రేక్షకులకు చెప్పనవసరం లేదు.. వాళ్లకు ఒక విషయం నచ్చితే వాళ్లే థియేటర్లకు వచ్చి ఆదరిస్తారు. వాళ్లకు నచ్చకపోతే పట్టించుకోరు’ అని శ్రీకాంత్ అయ్యంగార్ చెప్పుకొచ్చారు. -
రిప్లై ఇవ్వకపోతే చేయి చేసుకుంటా..హీరో కార్తికేయకు యువతి బెదిరింపు!
టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ ఖాతాలోకి ఎట్టకేలకు ఓ హిట్ పడింది. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం బెదురులంక 2012 ఈ శుక్రవారం విడుదలై మంచి టాక్‌తో దూసుకెళ్తుంది. ముందు నుంచి ఈ చిత్రంపై గట్టి నమ్మకంతో ఉన్నాడు కార్తికేయ. ప్రమోషన్స్‌లో కూడా చురుగ్గా పాల్గొన్నాడు. మీడియా ఇంటర్వ్యూలతో పాటు సోషల్ మీడియా ద్వారా కూడా తన సినిమాను ప్రమోట్ చేసుకున్నాడు. (చదవండి: బెదురులంక 2012’మూవీ రివ్యూ) ఎట్టకేలకు ఆగస్ట్ 25న విడుదలైన ఈ చిత్రానికి బాక్సాఫీస్ వద్ద మంచి రెస్పాన్స్ లభించింది. ఈ నేపథ్యంలో ట్విటర్ వేదికగా అభిమానులతో ముచ్చటించాడు కార్తికేయ. నెటిజన్స్ అడిగిన పలు ప్రశ్నలకు బదులు ఇచ్చాడు. రామ్ చరణ్ గురించి చెప్పమని ఓ నెటిజన్ అడగ్గా.. లక్కీ ఛార్మ్ బదులిచ్చాడు. చరణ్ సినిమాలో విలన్‌గా నటించే అవకాశం వస్తే.. చేస్తారా? అని మరో నెటిజన్ ప్రశ్నించగా.. మంచి స్కోప్ ఉన్న పాత్ర అయితే కచ్చితంగా చేస్తానన్నాడు. ఈ క్రమంలోనే ఓ యువతి ట్విటర్ వేదికగా కార్తికేయను బెదిరించింది. రిప్లై ఇవ్వకపోతే చేయి కోసుకుంటాను అంటూ బ్లాక్ మెయిల్ చేసింది. ఇది చూసి భయపడిన కార్తికేయ వెంటనే రిప్లై ఇచ్చాడు. అమ్మో వద్దు వద్దు అంటూ రిప్లై ఇవ్వగా.. థాంక్యూ అంటూ సదరు యువతి రిప్లై ఇచ్చింది. అయితే ఈ బ్లాక్ మెయిల్ అంతా సరదాగానే సాగినట్లు యువతి షేర్ చేసిన ఫోటో చూస్తే తెలుస్తుంది. ప్రస్తుతం ఈ కామెడీ బ్లాక్ మెయిల్ నెట్టింట వైరల్ అవుతోంది. Ammo odhu odhu https://t.co/umctBM3q0v — Kartikeya (@ActorKartikeya) August 25, 2023 -
కొత్త ప్రయత్నాన్ని ప్రేక్షకులు ఆదరించారు.. మెగా ఫ్యాన్స్‌కు థాంక్స్: కార్తికేయ
'బెదరులంక 2012' విజయం జీవితంలో నాకు కాన్ఫిడెన్స్ ఇచ్చింది. ఈ కథ విన్న తొలి రోజు నుంచి ఏది అయితే కథలో వర్కవుట్ అవుతుంది? ప్రేక్షకులకు నచ్చుతుంది? అనుకున్నానో... వాటికి మంచి పేరు వచ్చింది. సెకండాఫ్ అంతా నవ్వుతూ ఉన్నామని, చివరి 45 నిమిషాలు నవ్వుతూనే ఉన్నామని ముక్త కంఠంతో అందరూ చెబుతున్నారు. సీరియస్ విషయాన్ని వినోదంతో చెప్పడం ఇంతకు ముందు చూడలేదు. అటువంటి కొత్త ప్రయత్నాన్ని ప్రేక్షకులు ఆదరించినప్పుడు మనం తీసుకునే నిర్ణయాలపై మనకు కాన్ఫిడెన్స్ వస్తుంది’అని హీరో కార్తికేయ అన్నారు. (చదవండి: బెదురులంక 2012’మూవీ రివ్యూ) కార్తికేయ, నేహాశెట్టి జంటగా నటించిన తాజా చిత్రం ‘బెదురులంక 2012’.లౌక్య ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సి. యువరాజ్ సమర్పణలో రవీంద్ర బెనర్జీ (బెన్నీ) ముప్పానేని నిర్మించారు. క్లాక్స్ దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఆగస్ట్ 25న విడుదలైన ఈ చిత్రానికి తొలి రోజు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ఈ నేపథ్యంలో చిత్రబృందం తాజాగా సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా కార్తికేయ మాట్లాడుతూ.. ‘నేను థియేటర్లకు వెళ్లాను. హౌస్ ఫుల్ కావడం చూసి సంతోషం వేసింది. దర్శకుడు ఇతనే అని క్లాక్స్ ని పరిచయం చేయగా... అందరూ క్లాప్స్ కొట్టారు. ఇప్పుడు మేం హ్యాపీగా ఉన్నాం. మా సినిమా ట్రైలర్ విడుదల చేసిన రామ్ చరణ్ గారి, సపోర్ట్‌గా నిలిచిన మెగా ప్యాన్స్‌కి థ్యాంక్స్’ అని అన్నారు. ‘'బెదురులంక 2012'లో సెకండాఫ్ బావుందని, నవ్వుతున్నారని అంతా చెబుతున్నారు. ఈ విజయం వెనుక టెక్నీషియన్లు కూడా ఉన్నారు. వాళ్ళకు కూడా థాంక్స్. ఇప్పుడు స్క్రీన్స్ పెంచుతున్నారని చెబుతున్నారు. మా సినిమా ఇంకా పెద్ద హిట్ అవుతుందని ఆశిస్తున్నాను’అని దర్శకుడు క్లాక్స్ అన్నారు. మా సినిమాను ఇంత పెద్ద హిట్ చేసినందుకు తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు’అని నిర్మాత బెన్నీ ముప్పానేని అన్నారు. ఈ సక్సెస్ మీట్లో నటులు శ్రీకాంత్ అయ్యంగార్, రాజ్‌కుమార్ కసిరెడ్డి, ఆటో రామ్ ప్రసాద్‌తో పాటు చిత్రబృందంలోని కీలక సభ్యులు పాల్గొన్నారు. -
‘బెదురులంక 2012’మూవీ రివ్యూ
టైటిల్: బెదురులంక 2012 నటీనటులు: కార్తికేయ, నేహా శెట్టి, అజయ్ ఘోష్, రాజ్ కుమార్ కసిరెడ్డి, శ్రీకాంత్ అయ్యంగార్, గోపరాజు రమణ, ఎల్బీ శ్రీరామ్, సత్య తదితరులు నిర్మాణ సంస్థ: లౌక్య ఎంటర్టైన్మెంట్స్ నిర్మాత: రవీంద్ర బెనర్జీ (బెన్నీ) ముప్పానేని దర్శకత్వం: క్లాక్స్ సంగీతం: మణిశర్మ సినిమాటోగ్రఫీ: సాయి ప్రకాష్ ఉమ్మడిసింగు ఎడిటింగ్: విప్లవ్ న్యాసదం విడుదల తేది: ఆగస్ట్ 25, 2023 కథేంటంటే.. ఈ సినిమా కథంతా 2012 నాటి కాలంలో సాగుతుంది. బెదురులంక గ్రామానికి చెందిన శివ(కార్తికేయ) ఓ స్వేచ్ఛా జీవి. మనసుకు నచ్చినట్లు జీవిస్తాడు. హైదరాబాద్‌లో గ్రాఫిక్స్ డిజైనర్ జాబ్ మానేసి బెదురులంకకు వస్తాడు. అక్కడ అప్పటికే యుగాంతం రాబోతుందని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. టీవీలో యుగాంతంపై వస్తున్న వార్తలను చూసి భూషణం(అజయ్ ఘోష్) ఊరి జనాలను మోసం చేసేందుకు పెద్ద ప్లాన్ వేస్తాడు. ఆ ఊర్లో దొంగ జాతకాలు చెబుతూ బతికే బ్రాహ్మాణుడు బ్రహ్మాం(శ్రీకాంత్ అయ్యంగార్), చర్చి ఫాదర్ కొడుకు డేనియల్(ఆటో రాంప్రసాద్)తో కలిసి నిజంగానే యుగాంతం రాబోతుందని ఊరి ప్రజలను నమ్మిస్తాడు. యుగాంతాన్ని ఆపాలంటే అందరి ఇళ్లల్లో ఉన్న బంగారాన్ని తీసుకొచ్చి ఇవ్వాలని, దానితో శివలింగాన్ని, శిలువను తయారు చేసి గంగలో వదిలేస్తే యుగాంతం ఆగిపోతుందని చెబుతారు. ప్రెసిడెంట్‌గారు(గోపరాజు రమణ)ఆదేశంతో ఊరి ప్రజలంతా తమ వద్ద ఉన్న బంగారాన్ని ఇచ్చేస్తారు. కానీ శివ మాత్రం ఇవ్వడు. పైగా అదొక మూఢనమ్మకం అంటూ కొట్టిపారేస్తాడు. దీంతో శివని ఊరి నుంచి వెలేస్తాడు ప్రెసిడెంట్. ఆ తర్వాత ఏం జరిగింది? ఊరి ప్రజల్లో ఉన్న మూడనమ్మకాన్ని పోగొట్టేందుకు శివ ఏం చేశాడు? భూషణం ప్లాన్‌ని ఎలా బయటపెట్టాడు? ప్రెసిడెంట్‌గారి అమ్మాయి చిత్ర(నేహాశెట్టి)తో ప్రేమలో ఉన్న శివ.. చివరకు ఆమెను పెళ్లి చేసుకున్నాడా? లేదా? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. 2012లో యుగాంతం రాబోతుందని, భూమి నాశనమైపోతుందని వార్తలు రావడంతో అసలేం జరగబోతుందోనని అందరూ ఎదురుచూశారు. ఆ సమయంలో బెదురులంక అనే గ్రామంలో ఎలాంటి పరిణామాలు చేసుకున్నాయి?, మూఢవిశ్వాల కారణంగా జనాలు ఎలా మోసపోతున్నారనేది ఈ చిత్రం ద్వారా వినోదాత్మకంగా చూపించాడు దర్శకుడు క్లాక్స్. ప్రజల అమాయకత్వానికి, భయానికి మతం రంగు పులిమి కొందరు లబ్దిపొందే ప్రయత్నం చేస్తున్నారని, అలాంటివి పట్టించుకోవద్దనే సందేశాన్ని ఇచ్చాడు. తొలిసారే ఇలాంటి సరికొత్త సబ్జెక్ట్‌ను ఎంచుకున్న దర్శకుడి ప్రయత్నాన్ని ప్రశంసించాల్సిందే. యుగాంతం కాన్సెప్ట్‌తో గతంలో హాలీవుడ్‌తో పాటు పలు భాషల్లోనూ సినిమాలు వచ్చాయి. కానీ బెదురలంక పాయింట్ చాలా కొత్తగా ఉంది. యుగాంతం రాబోతుందనే టీవీ వార్తతో సినిమా ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత తొలి సన్నివేశంలోనే శివ క్యారెక్టర్ ఎలా ఉండబోతుందో చూపించారు. ఆ తర్వాత కథంతా బెదురులంక గ్రామం చుట్టే తిరుగుతుంది. ఊరి ప్రెసిడెంట్, భూషణం, బ్రహ్మా, డేనియల్ పాత్రల పరిచయం తర్వాత కథలో వేగం పుంజుకుంటుంది. ప్రెసిడెంట్‌గారి అమాయకత్వాన్ని వాడుకొని భూషణం చేయించే మోసాలు నవ్వులు పూయిస్తాయి. మధ్యలో హీరో హీరోయిన్ల లవ్ ట్రాక్ నడుస్తుంది. అయితే అది అంతగా ఆకట్టుకోదు. అసలు కథ ప్రారంభించడానికి కాస్త సమయం తీసుకున్న దర్శకుడు.. ఫస్టాఫ్ మొత్తం సోసోగానే నడిపించాడు. అసలు కథ సెకండాఫ్‌లో ప్రారంభమవుతుంది. ఊరి ప్రజలల్లో ఉన్న మూఢనమ్మకాన్ని పోగొట్టేందుకు శివ చేసే పనులు థియేటర్లలో నవ్వులు పూయిస్తాయి. ముఖ్యంగా సత్య, వెన్నెల కిశోర్ పాత్రల ఎంట్రీ తర్వాత కథ ఆసక్తికరంగా, మరింత ఎంటర్టైనింగ్ సాగుతుంది. క్లైమాక్స్ సీన్‌ని పగలబడి నవ్వుతారు. కొన్నిచోట్ల డబుల్ మీనింగ్ డైలాగులు ఫ్యామిలీ ఆడియన్స్‌కి కాస్త ఇబ్బందిగా అనిపిస్తాయి. ఓవరాల్‌గా నవ్విస్తూనే ఓ మంచి సందేశం ఇచ్చిన సినిమా ‘బెదురులంక 2012’. ఎవరెలా చేశారంటే... ఎలాంటి పాత్రలో అయినా జీవించేస్తాడు కార్తికేయ.తెరపై చాలా ఎనర్జిటిక్‌గా కనిపిస్తాడు. ఈ చిత్రంలో కూడా అలానే కనిపించాడు. తనకు నచ్చినట్లుగా జీవించే యువకుడు శివ పాత్రకు కార్తికేయ న్యాయం చేశాడు. కామెడీతో పాటు యాక్షన్ సీన్లలో కూడా అదరగొట్టేశాడు. ఇక చిత్రగా నేహాశెట్టి పాత్ర నిడివి తక్కువే అయినా తనదైన అందచందాలతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసింది. జనాలను మోసం చేసి డబ్బులు సంపాదించాలనే ఆశ ఉన్న భూషణం పాత్రలో అజయ్ ఘోష్ ఒదిగిపోయాడు. కొన్ని చోట్ల అజయ్ నటన.. కోటా శ్రీనివాసరావు చేసిన కొన్ని పాత్రలను గుర్తుకు చేస్తుంది. బ్రహ్మాగా శ్రీకాంత్ అయ్యంగార్, డేనియల్‌గా రాంప్రసాద్, కసిరాజుగా రాజ్ కుమార్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక విషయాలకొస్తే.. మణిశర్మ సంగీతం పర్వాలేదు. పాటలు అంతగా ఆకట్టుకోలేవు కానీ.. నేపథ్య సంగీతం బాగుంది. సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. ఎడిటర్ పనితీరు బాగుంది. సినిమాను చాలా షార్ప్‌గా కట్ చేశాడు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
అందుకే తమిళ్లో సినిమాలు చేయట్లేదు: కార్తికేయ
'వలిమై'(అజిత్ హీరోగా నటించిన ఈ చిత్రంలో కార్తికేయ విలన్‌గా నటించాడు) తర్వాత తమిళ ప్రేక్షకుల్లో నాకు గుర్తింపు వచ్చిన మాట వాస్తవమే. అలా అని నా తదుపరి చిత్రాలన్నీ తమిళ భాషలో కూడా విడుదల చేయాలనుకోవడం సరికాదు. తెలుగు, తమిళ ప్రేక్షకులకు నచ్చే కథ వచ్చినప్పుడు బైలింగ్వల్ చేస్తా. వలిమై తర్వాత నాకు తమిళ నుంచి రెండు, మూడు ఆఫర్లు వచ్చాయి కానీ.. ఏదీ నచ్చలేదు. అందుకు ఆ సినిమాలు చేయలేదు’అని యంగ్ హీరో కార్తికేయ గుమ్మకొండ అన్నాడు. ఆయన హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘బెదురులంక 2012’. లౌక్య ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సి. యువరాజ్ సమర్పణలో రవీంద్ర బెనర్జీ (బెన్నీ) ముప్పానేని నిర్మించారు. క్లాక్స్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఆగస్ట్ 15న ఈ చిత్రం విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా కార్తీకేయ మీడియాతో ముచ్చటించాడు. ఆ విశేషాలు.. ► కరోనా సమయంలో నాకు క్లాక్స్ కథ చెప్పాడు. ఆ సమయంలో ప్రపంచం అంత అయిపోతుందని అన్నట్లు ప్రచారం జరిగింది కదా! కథకు బాగా కనెక్ట్ అయ్యాను. ప్రేక్షకుల్లో మార్పు వచ్చింది. కథలో కొత్తదనం, వినోదం ఉండటంతో ఓకే చేశా. ► 'బెదురులంక 2012' కథకు రిఫరెన్స్ ఏమీ లేదు. అంత కొత్తగా ఉంటుంది. సినిమా కంప్లీట్ అయ్యాక చూసుకున్నా. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. బాగా వచ్చింది. ఫన్, మెసేజ్ రెండూ ఉన్నాయి. ఆ సినిమాకు వచ్చిన ప్రేక్షకులు ఆలోచించేలా సన్నివేశాలు, డైలాగులు ఉంటాయి. వారిలో చిన్న మార్పు వస్తుందని నమ్ముతున్నాను. ► ఈ సినిమాలో నా క్యారెక్టర్ పేరు శివ. ఓ సన్నివేశం దగ్గర 'శివ షో బిగిన్స్, శివ ఆట మొదలు' అన్నట్లు చెప్పాలి. ఇంపాక్ట్ సరిపోవడం లేదని, శివ పేరు చిన్నగా ఉందని అనిపించింది. సెట్లో ఎవరో శివ శంకర్ అయితే బావుంటుందేమో అన్నారు. అప్పుడు శివ శంకర వరప్రసాద్ పేరు స్ట్రైక్ అయ్యింది. అప్పటికప్పుడు వచ్చిన ఐడియాకు ఆ షాట్లో అలా చెప్పాం. ► శివ క్యారెక్టర్ విషయానికొస్తే.. అతనో స్వేచ్ఛా జీవి. తనకు నచ్చినట్లు జీవిస్తాడు. సిటీలో గ్రాఫిక్ డిజైనర్ జాబ్ మానేసి ఊరు వెళతాడు. ఎవరైనా నన్ను జడ్జ్ చేస్తున్నారా? ఎవరైనా నేను చేసిన పని గురించి ఆలోచిస్తున్నారా? అని అసలు పట్టించుకోడు. అలాగని, ఎవరినీ ఇబ్బంది పెట్టడు. వాడి పని వాడు చేసుకుంటాడు. నచ్చని విషయం చేయమంటే అసలు చేయడు. ► ఈ సినిమా ట్రైలర్ రామ్ చరణ్‌కు బాగా నచ్చింది. మ్యూజిక్ బావుందని చెప్పారు. షాట్స్ మేకింగ్, నేహా శెట్టితో నా జోడీ బావుందని చెప్పారు. శివ శంకర్ వరప్రసాద్ డైలాగ్ గురించి సరదాగా మాట్లాడుకున్నాం. ► నేహా శెట్టి మంచి నటి. 'డీజే టిల్లు'లో ఆమె బాగా చేసింది. వేరే పాత్రలో అంత బాగా చేస్తుందా? అని డౌట్ ఉంది. 'ఆర్ఎక్స్ 100' తర్వాత ఈ అబ్బాయి రగ్గడ్ లుక్ మైంటైన్ చేస్తూ ఆ రోల్ బాగా చేశాడని, వేరే క్యారెక్టర్ చేస్తాడా? లేదా? అని నా గురించి ఎలా అయితే అనుకున్నారో... సేమ్ ఆ అమ్మాయికి కూడా అలా ఉంది. ఒకటి రెండు రోజుల తర్వాత నేహా శెట్టి వైవిధ్యంగా చేస్తుందని అర్థమైంది. ఆ అమ్మాయి కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంది. రాధికా పాత్ర ఎక్కడా కనిపించకూడదని కష్టపడింది. మేం కూడా జాగ్రత్తలు తీసుకున్నాం. ► మణిశర్మ గారి నేపథ్య సంగీతం సినిమాకు ఎంతో బలాన్ని ఇచ్చింది. అఫ్కోర్స్... సాంగ్స్ అన్నీ సూపర్ హిట్ అయ్యాయి. అయితే... ఇదొక కొత్త జానర్ సినిమా. చాలా లేయర్స్, థీమ్ మ్యూజిక్స్ ఉంటాయి. ఆయన వాటిని బాగా క్యారీ చేశారు. ఫెంటాస్టిక్ రీ రికార్డింగ్ చేశారు ► 'ఆర్ఎక్స్ 100'లో నా క్యారెక్టర్ పేరు శివ. ఇందులోనూ అదే పేరు. రెండు చిత్రాలు గోదావరి నేపథ్యంలో సాగుతాయి. అయితే ఇదంతా యాదృశ్చికంగా జరిగింది. డైరెక్టర్ క్లాక్స్‌కి ఆర్ఎక్స్ 100లో నా పాత్ర పేరు శివ అని గుర్తు లేదు. షూటింగ్ ప్రారంభమైన చాలా రోజుల తర్వాత అతనికి గుర్తు చేశా. తనకు ఆ సినిమాలో క్యారెక్టర్ పేరు గుర్తు లేదన్నాడు. ఆ క్యారెక్టర్, మైండ్ సెట్ కు శివ పేరు సెట్ అవుతుందని పెట్టానని చెప్పాడు. ఆ సెంటిమెంట్ వర్కవుట్ అయ్యి ఈ సినిమా కూడా హిట్ అయితే హ్యాపీ. హిట్ అవుతుందని నమ్మకంగా ఉన్నాం. -
పల్లెటూరి అమ్మాయిగా నేహాశెట్టి.. ఫస్ట్‌లుక్ పోస్టర్ రిలీజ్
వరుస సినిమాలతో దూసుకుపోతున్న కార్తికేయ నటిస్తున్న తాజాచిత్రం బెదురులంక. క్లాక్స్ దర్శకత్వం రవీంద్ర బెనర్జీ ముప్పానేని ఈ సినిమాను నిర్మిస్తున్నారు. గోదావరి బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కార్తికేయకు జోడీగా డీజే టిల్లు భామ నేహాశెట్టి నటిస్తుంది. బెదురులంక అనే ఊరిలో 2012లో యుగాంతం వస్తుందన్న పుకార్లు ఎలాంటి పరిణామాలు తీసుకొచ్చాయి అన్న నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించనున్నట్లు టాక్ వినిపిస్తుంది. ఈ సినిమాలో నేహాశెట్టి పల్లెటూరి అమ్మాయిగా కనిపించనుంది. సోమవారం(నేడు)ఆమె బర్త్‌డే సందర్భంగా మేకర్స్ నేహాశెట్టి ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. వచ్చే ఏడాదిలో ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు. Wishing beautiful & talented @iamnehashetty a very happy birthday ✨ Introducing "Chitra" from the world of #Bedurulanka2012 🌊 #Clax #ManiSharma @Benny_Muppaneni @Loukyaoffl @SonyMusicSouth #HBDNehaSshetty pic.twitter.com/SWaoElGgFS — Kartikeya (@ActorKartikeya) December 5, 2022 -
‘బెదురులంక’లో ‘డీజే టిల్లు’ బ్యూటీ.. కార్తికేయ కొత్త మూవీ టైటిల్
యంగ్ హీరో కార్తికేయ, ‘డీజే టిల్లు’ ఫేమ్ నేహా శెట్టి జంటగా ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. క్లాక్స్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని లౌక్య ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ప్రొడక్షన్ నంబర్ 3గా బెన్నీ నిర్మిస్తున్నారు. నేడు(సెప్టెంబర్ 21) కార్తికేయ పుట్టిన రోజు. ఈ సందర్భంగా టైటిల్ వెల్లడించారు. ఈ చిత్రానికి 'బెదురులంక 2012' టైటిల్ ఖరారు చేశారు. ఈ సందర్భంగా చిత్రనిర్మాత బెన్నీ ముప్పానేని మాట్లాడుతూ.. ‘కామెడీ డ్రామాగా, గోదావరి నేపథ్యంలో సాగే కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. ఇటీవల మూడో షెడ్యూల్ ముగిసింది. యానాం, కాకినాడ, గోదావరి పరిసర ప్రాంతాల్లో అందమైన లొకేషన్లలో చిత్రీకరణ చేశాం. ఆఖరి షెడ్యూల్ త్వరలో ఉంటుంది. దాంతో సినిమా మొత్తం పూర్తవుతుంది. మెలోడీ బ్రహ్మ మణిశర్మ ఐదు అద్భుతమైన బాణీలను అందించారు. 'స్వర్గీయ' సిరివెన్నెల గారు మా చిత్రంలో ఒక పాట రాశారు" అన్నారు. దర్శకుడు క్లాక్స్ మాట్లాడుతూ ..‘డ్రామెడీ (డ్రామా ప్లస్ కామెడీ) జానర్ చిత్రమిది. ఈ సినిమాలో కొత్త కార్తికేయ కనిపిస్తారు. ఒక ఊరు నేపథ్యంలో వినోదం, మానవ భావోద్వేగాలతో కూడిన కథతో సినిమా రూపొందిస్తున్నాం. ఇందులో స్ట్రాంగ్ కంటెంట్ ఉంది. అలాగే, కడుపుబ్బా నవ్వించే వినోదం ఉంది. మనసుకు నచ్చినట్టు జీవించే పాత్రలో హీరో కార్తికేయ కనిపిస్తారు. సొసైటీకి నచ్చినట్లు బతకడం రైటా? మనసుకు నచ్చినట్టు బతకడం రైటా? అనేది సినిమాలో చూడాలి’అని చెప్పారు.