టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ ఖాతాలోకి ఎట్టకేలకు ఓ హిట్ పడింది. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం బెదురులంక 2012 ఈ శుక్రవారం విడుదలై మంచి టాక్‌తో దూసుకెళ్తుంది. ముందు నుంచి ఈ చిత్రంపై గట్టి నమ్మకంతో ఉన్నాడు కార్తికేయ. ప్రమోషన్స్‌లో కూడా చురుగ్గా పాల్గొన్నాడు. మీడియా ఇంటర్వ్యూలతో పాటు సోషల్ మీడియా ద్వారా కూడా తన సినిమాను ప్రమోట్ చేసుకున్నాడు.
(చదవండి: బెదురులంక 2012’మూవీ రివ్యూ)
ఎట్టకేలకు ఆగస్ట్ 25న విడుదలైన ఈ చిత్రానికి బాక్సాఫీస్ వద్ద మంచి రెస్పాన్స్ లభించింది. ఈ నేపథ్యంలో ట్విటర్ వేదికగా అభిమానులతో ముచ్చటించాడు కార్తికేయ. నెటిజన్స్ అడిగిన పలు ప్రశ్నలకు బదులు ఇచ్చాడు. రామ్ చరణ్ గురించి చెప్పమని ఓ నెటిజన్ అడగ్గా.. లక్కీ ఛార్మ్ బదులిచ్చాడు. చరణ్ సినిమాలో విలన్‌గా నటించే అవకాశం వస్తే.. చేస్తారా? అని మరో నెటిజన్ ప్రశ్నించగా.. మంచి స్కోప్ ఉన్న పాత్ర అయితే కచ్చితంగా చేస్తానన్నాడు.
ఈ క్రమంలోనే ఓ యువతి ట్విటర్ వేదికగా కార్తికేయను బెదిరించింది. రిప్లై ఇవ్వకపోతే చేయి కోసుకుంటాను అంటూ బ్లాక్ మెయిల్ చేసింది. ఇది చూసి భయపడిన కార్తికేయ వెంటనే రిప్లై ఇచ్చాడు. అమ్మో వద్దు వద్దు అంటూ రిప్లై ఇవ్వగా.. థాంక్యూ అంటూ సదరు యువతి రిప్లై ఇచ్చింది. అయితే ఈ బ్లాక్ మెయిల్ అంతా సరదాగానే సాగినట్లు యువతి షేర్ చేసిన ఫోటో చూస్తే తెలుస్తుంది. ప్రస్తుతం ఈ కామెడీ బ్లాక్ మెయిల్ నెట్టింట వైరల్ అవుతోంది.
Ammo odhu odhu https://t.co/umctBM3q0v
— Kartikeya (@ActorKartikeya) August 25, 2023
Comments
Please login to add a commentAdd a comment