Bedurulanka 2012 Movie
-
సైలెంట్‌గా ఓటీటీకి వచ్చేసిన టాలీవుడ్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ కార్తికేయ గుమ్మకొండ హీరోగా నటించిన ‘బెదురులంక 2012’. ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం మిక్స్డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ మూవీలో ‘డీజే టిల్లు’ ఫేమ్ నేహా శెట్టి కథానాయికగా నటించారు. గ్రామీణ వాతావరణం నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రానినికి క్లాక్స్ దర్శకత్వం వహించారు. ఈ మూవీని రవీంద్ర బెనర్జీ ముప్పనేని నిర్మించారు. (ఇది చదవండి: పెళ్లి వార్తలపై త్రిష బోల్డ్ ట్వీట్) అయితే తాజాగా ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. ఈ రోజు నుంచే అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. 2012లో యుగాంతం నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఓ పల్లెటూరులో జరిగిన సంఘటనలే కథాంశంగా చూపించారు. 2012లో యుగాంతం అయిపోతుందని అప్పట్లో ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో అజయ్ ఘోష్, రాజ్ కుమార్ కసిరెడ్డి, శ్రీకాంత్ అయ్యంగార్, గోపరాజు రమణ, ఎల్బీ శ్రీరామ్, సత్య తదితరులు నటించారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతమందించారు. -
సక్సెస్ మీట్లో మాట్లాడి ఐదేళ్లయింది
‘‘క్లాక్స్ నాకు 2009 నుంచి పరిచయం. అప్పట్నుంచి నాకు కథలు చెబుతుంటాడు. డిఫరెంట్ కాన్సెప్టుల్లో నటించడం, చేయడం కాస్త కష్టం.. నిర్మాతలు ముందుకు రారు, కమర్షియల్ ఫార్మాట్లో సినిమా చేయమని తనతో చెప్పాను. కానీ బెన్నీలాంటి నిర్మాతలు ఇప్పుడు కొత్త కథలను ప్రోత్సహిస్తున్నారు. ఇక కొత్త కొత్త పాత్రలు చేస్తున్న కార్తికేయకు పెద్ద హిట్ పడాలని అనుకున్నాను. ఇప్పుడు ‘బెదురులంక’తో హిట్ కొట్టేశాడు’’ అని హీరో శ్రీ విష్ణు అన్నారు. కార్తికేయ, నేహా శెట్టి జంటగా నటించిన చిత్రం ’బెదురులంక 2012’. క్లాక్స్ దర్శకత్వంలో రవీంద్ర బెనర్జీ (బెన్నీ) ముప్పానేని నిర్మించిన ఈ చిత్రం గత వారం విడుదలైంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ నిర్వహించిన విజయోత్సవంలో హీరో శ్రీ విష్ణు, దర్శకుడు అజయ్ భూపతి తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ‘‘కార్తికేయకు హిట్ వస్తే నాకూ హిట్ వచ్చినట్టే’’ అని అజయ్ భూపతి అన్నారు. కార్తికేయ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా ప్రయాణంలో ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నాం. ఫస్ట్ డే ఫస్ట్ షో చూసి బాగుందని అందరూ చెప్పిన తర్వాత పెద్ద రిలీఫ్ అనిపించింది. ఇలా సక్సెస్ మీట్లో మాట్లాడి ఐదేళ్లయింది. ‘ఆర్ఎక్స్ 100’ తర్వాత నేను చేసిన సినిమాలు అనుకున్న రేంజ్‌కు వెళ్లలేదు. ఒక్క హిట్ వస్తే చాలనుకున్న టైమ్‌లోనే ‘బెదురులంక’ వచ్చింది’’ అన్నారు. ‘‘సినిమాను ఇంత పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులకు థ్యాంక్స్’’ అన్నారు రవీంద్ర బెనర్జీ (బెన్నీ) ముప్పానేని. ఇంకా బీవీఎస్ రవి, నేహా శెట్టి తదితరులు మాట్లాడారు. ∙బెన్నీ, శ్రీ విష్ణు, కార్తికేయ, నేహాశెట్టి -
బన్నీని కలిసిన కార్తికేయ.. అవార్డు గెలిచినందుకు విషెస్
కార్తికేయ, నేహా శెట్టి హీరోహీరోయిన్లుగా నటించిన 'బెదురులంక 2012' సినిమా తాజాగా థియేటర్లలోకి వచ్చింది. పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ ఆనందంలో ఉన్న కార్తికేయ.. నేషనల్ అవార్డు గెలుచుకున్న అల్లు అర్జున్ ని కలిశాడు. తన తరఫున విషెస్ చెప్పాడు. (ఇదీ చదవండి: తెలుగు సీరియల్ నటుడు ఎంగేజ్మెంట్.. డాక్టర్‌బాబు సందడి) ఈ సందర్భంగా హీరో కార్తికేయ బన్నీని కలవడానికి వెళ్లగా, బన్నీ- కార్తికేయ ఒకరికొకరు అభినందనలు చెప్పుకొన్నారు. 'బెదురులంక' సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ రావడం సంతోషంగా ఉందని, త్వరలో తన ఫ్యామిలీతో కలిసి మూవీ చూస్తానని బన్నీ చెప్పడం కార్తికేయ తెగ ఆనందపడుతున్నాడు. క్లాక్స్ దర్శకత్వంలో లౌక్య ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రవీంద్ర బెనర్జీ (బెన్నీ) ముప్పానేని ఈ చిత్రాన్ని నిర్మించారు. మణిశర్మ సంగీతం అందించారు. రొటీన్‌కి భిన్నంగా ఉండే కథ కథనాలు ఆద్యంతం అలరించడంతో పాటు కడుపుబ్బా నవ్విస్తున్నాయి. ముఖ్యంగా చిత్రంలోని చివరి 40 నిముషాలు థియేటర్లు నవ్వులతో నిండిపోతున్నాయని సినిమా చూసినవాళ్లు అంటున్నారు. (ఇదీ చదవండి: సారీ చెప్పిన హీరో లారెన్స్.. ఆ గొడవపై కామెంట్స్!) Congratulated our Icon Star @alluarjun garu for winning the Iconic National Award 😇 As always, he humbly congratulated me for the Blockbuster success of #Bedurulanka2012 😍 pic.twitter.com/nEEipuk9Na — Kartikeya (@ActorKartikeya) August 27, 2023 -
రివ్యూ రైటర్లపై శ్రీకాంత్ అయ్యంగార్ ఆగ్రహం
సినిమా రివ్యూ రైటర్లపై నటుడు శ్రీకాంత్ అయ్యంగార్ ఫైర్ అయ్యారు. ఎవరైనా ఏదైనా సాధించి ఇంకొకడి గురించి రాస్తే బాగుంటుందని వ్యాఖ్యానించాడు. యంగ్ హీరో కార్తికేయ నటించిన తాజా చిత్రం బెదురులంక 2012. క్లాక్స్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆగస్ట్ 25న ప్రేక్షకుల ముందుకు వచ్చి, పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తుంది. ఈ నేపథ్యంలో తాజాగా చిత్రబృందం సక్సెస్ మీట్ నిర్వహించింది. హీరో కార్తికేయతో పాటు సినిమా టీమ్ అంతా ఈ ప్రోగ్రామ్‌కి హాజరైంది. ఈ సందర్భంగా శ్రీకాంత్ అయ్యంగార్ మాట్లాడుతూ.. ‘చావు కబురు చల్లగా చిత్రంలో కార్తికేయతో నటించే అవకాశం లభించింది. సూపర్ స్టార్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే చూడడానికి చాలా బాగుంటాడు. క్రమశిక్షణతో పనిచేస్తాడు. వీటన్నింటినీ మించి ఒక మంచి నటుడు. బెదురులంక 2012లో అద్భుతంగా నటించాడు. ఇక మా అన్నయ్య అజయ్ ఘోష్ ఫెర్ఫార్మెన్స్‌కి వచ్చేసరికి ఆయన తిమింగల స్వరూపం. ఆయన దగ్గరు నేర్చుకొని, ఆయనతో నటించే అవకాశం నాకు దక్కింది. తెర వెనుక ఎంత కష్టపడ్డాం అనేది జనాలకు తెలియదు, తెరపై ఆడేదే జనాలకు తెలుసు. రివ్యూస్, గివ్యూస్ రాస్తారులెండి.. మనమేదైనా పీకుడు పనిచేసి, సాధించి ఇంకొకడు గురించి రాస్తే ఫర్వాలేదు. కెమేరా వర్క్ రాదని ఎవడో రాస్తే మనం ఇక్కడ ఎందుకుంటాం? కాంతార అనే సినిమాకు ఒక్క రివ్యూ లేదు. జనాలు దాన్ని హిట్టు చేయలేదా? ప్రేక్షకులకు చెప్పనవసరం లేదు.. వాళ్లకు ఒక విషయం నచ్చితే వాళ్లే థియేటర్లకు వచ్చి ఆదరిస్తారు. వాళ్లకు నచ్చకపోతే పట్టించుకోరు’ అని శ్రీకాంత్ అయ్యంగార్ చెప్పుకొచ్చారు. -
రిప్లై ఇవ్వకపోతే చేయి చేసుకుంటా..హీరో కార్తికేయకు యువతి బెదిరింపు!
టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ ఖాతాలోకి ఎట్టకేలకు ఓ హిట్ పడింది. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం బెదురులంక 2012 ఈ శుక్రవారం విడుదలై మంచి టాక్‌తో దూసుకెళ్తుంది. ముందు నుంచి ఈ చిత్రంపై గట్టి నమ్మకంతో ఉన్నాడు కార్తికేయ. ప్రమోషన్స్‌లో కూడా చురుగ్గా పాల్గొన్నాడు. మీడియా ఇంటర్వ్యూలతో పాటు సోషల్ మీడియా ద్వారా కూడా తన సినిమాను ప్రమోట్ చేసుకున్నాడు. (చదవండి: బెదురులంక 2012’మూవీ రివ్యూ) ఎట్టకేలకు ఆగస్ట్ 25న విడుదలైన ఈ చిత్రానికి బాక్సాఫీస్ వద్ద మంచి రెస్పాన్స్ లభించింది. ఈ నేపథ్యంలో ట్విటర్ వేదికగా అభిమానులతో ముచ్చటించాడు కార్తికేయ. నెటిజన్స్ అడిగిన పలు ప్రశ్నలకు బదులు ఇచ్చాడు. రామ్ చరణ్ గురించి చెప్పమని ఓ నెటిజన్ అడగ్గా.. లక్కీ ఛార్మ్ బదులిచ్చాడు. చరణ్ సినిమాలో విలన్‌గా నటించే అవకాశం వస్తే.. చేస్తారా? అని మరో నెటిజన్ ప్రశ్నించగా.. మంచి స్కోప్ ఉన్న పాత్ర అయితే కచ్చితంగా చేస్తానన్నాడు. ఈ క్రమంలోనే ఓ యువతి ట్విటర్ వేదికగా కార్తికేయను బెదిరించింది. రిప్లై ఇవ్వకపోతే చేయి కోసుకుంటాను అంటూ బ్లాక్ మెయిల్ చేసింది. ఇది చూసి భయపడిన కార్తికేయ వెంటనే రిప్లై ఇచ్చాడు. అమ్మో వద్దు వద్దు అంటూ రిప్లై ఇవ్వగా.. థాంక్యూ అంటూ సదరు యువతి రిప్లై ఇచ్చింది. అయితే ఈ బ్లాక్ మెయిల్ అంతా సరదాగానే సాగినట్లు యువతి షేర్ చేసిన ఫోటో చూస్తే తెలుస్తుంది. ప్రస్తుతం ఈ కామెడీ బ్లాక్ మెయిల్ నెట్టింట వైరల్ అవుతోంది. Ammo odhu odhu https://t.co/umctBM3q0v — Kartikeya (@ActorKartikeya) August 25, 2023 -
కొత్త ప్రయత్నాన్ని ప్రేక్షకులు ఆదరించారు.. మెగా ఫ్యాన్స్‌కు థాంక్స్: కార్తికేయ
'బెదరులంక 2012' విజయం జీవితంలో నాకు కాన్ఫిడెన్స్ ఇచ్చింది. ఈ కథ విన్న తొలి రోజు నుంచి ఏది అయితే కథలో వర్కవుట్ అవుతుంది? ప్రేక్షకులకు నచ్చుతుంది? అనుకున్నానో... వాటికి మంచి పేరు వచ్చింది. సెకండాఫ్ అంతా నవ్వుతూ ఉన్నామని, చివరి 45 నిమిషాలు నవ్వుతూనే ఉన్నామని ముక్త కంఠంతో అందరూ చెబుతున్నారు. సీరియస్ విషయాన్ని వినోదంతో చెప్పడం ఇంతకు ముందు చూడలేదు. అటువంటి కొత్త ప్రయత్నాన్ని ప్రేక్షకులు ఆదరించినప్పుడు మనం తీసుకునే నిర్ణయాలపై మనకు కాన్ఫిడెన్స్ వస్తుంది’అని హీరో కార్తికేయ అన్నారు. (చదవండి: బెదురులంక 2012’మూవీ రివ్యూ) కార్తికేయ, నేహాశెట్టి జంటగా నటించిన తాజా చిత్రం ‘బెదురులంక 2012’.లౌక్య ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సి. యువరాజ్ సమర్పణలో రవీంద్ర బెనర్జీ (బెన్నీ) ముప్పానేని నిర్మించారు. క్లాక్స్ దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఆగస్ట్ 25న విడుదలైన ఈ చిత్రానికి తొలి రోజు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ఈ నేపథ్యంలో చిత్రబృందం తాజాగా సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా కార్తికేయ మాట్లాడుతూ.. ‘నేను థియేటర్లకు వెళ్లాను. హౌస్ ఫుల్ కావడం చూసి సంతోషం వేసింది. దర్శకుడు ఇతనే అని క్లాక్స్ ని పరిచయం చేయగా... అందరూ క్లాప్స్ కొట్టారు. ఇప్పుడు మేం హ్యాపీగా ఉన్నాం. మా సినిమా ట్రైలర్ విడుదల చేసిన రామ్ చరణ్ గారి, సపోర్ట్‌గా నిలిచిన మెగా ప్యాన్స్‌కి థ్యాంక్స్’ అని అన్నారు. ‘'బెదురులంక 2012'లో సెకండాఫ్ బావుందని, నవ్వుతున్నారని అంతా చెబుతున్నారు. ఈ విజయం వెనుక టెక్నీషియన్లు కూడా ఉన్నారు. వాళ్ళకు కూడా థాంక్స్. ఇప్పుడు స్క్రీన్స్ పెంచుతున్నారని చెబుతున్నారు. మా సినిమా ఇంకా పెద్ద హిట్ అవుతుందని ఆశిస్తున్నాను’అని దర్శకుడు క్లాక్స్ అన్నారు. మా సినిమాను ఇంత పెద్ద హిట్ చేసినందుకు తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు’అని నిర్మాత బెన్నీ ముప్పానేని అన్నారు. ఈ సక్సెస్ మీట్లో నటులు శ్రీకాంత్ అయ్యంగార్, రాజ్‌కుమార్ కసిరెడ్డి, ఆటో రామ్ ప్రసాద్‌తో పాటు చిత్రబృందంలోని కీలక సభ్యులు పాల్గొన్నారు. -
Neha Shetty: టాలీవుడ్‌ని షేక్ చేస్తున్న ‘రాధిక’
కొన్ని సినిమాల్లోని పాత్రలు ఎప్పటి గుర్తుండిపోతాయి. ఇంకా చెప్పాలంటే.. ఆ పాత్రలో నటించిన నటీనటులు అసలు పేర్లు అందరికి తెలియకపోవచ్చు కానీ.. క్యారెక్టర్ నేమ్ మాత్రం ప్రతి ఒక్కరికి గుర్తుంటుంది. అంతేకాదు ఇండస్ట్రీలో అదే పేరుతో ఫేమస్ అవుతారు. అలాంటి వారిలో నేహా శెట్టి ఒకరు. ఈ పేరు చాలా మందికి తెలియకపోచ్చు కానీ.. డీజే టిల్లు రాధిక అంటే మాత్రం ఇట్టే గుర్తుపట్టేస్తారు. (చదవండి: ఒక్కరోజుకు పూజా హెగ్డే రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..?) సిద్దు జొన్నల గడ్డ హీరోగా నటించిన డీజే టిల్లు సినిమాల్లో నేహా శెట్టి హీరోయిన్. అంతకు ముందు మెహబూబా సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. అయితే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తాపడడంతో నేహా శెట్టికి తగిన గుర్తుంపు రాలేదు. కానీ డీజే టిల్లుతో అందరికి రాధికగా దగ్గరైంది. ఆ ఒక్క సినిమాతో నేహాశెట్టికి ఎనలేని గుర్తింపు వచ్చింది. అయితే తనకొచ్చిన క్రేజ్‌ని మాత్రం నేహాశెట్టి సరిగా వాడుకోలేకపోయింది. డీజే టిల్లు తర్వాత సిద్దూలాగే నేహా కూడా తర్వాత సినిమాకు చాలా గ్యాప్ తీసుకుంది. ఇప్పుడు ఆ గ్యాప్‌ని పూడ్చుకునే పనిలో పడింది మన రాధిక. వరుస సినిమాలతో దూసుకెళ్తోంది. ఇప్పటికీ ఈ బ్యూటీ నటించిన ‘బెదురులంక 2012’చిత్రం థియేటర్స్‌లో నవ్వులు పూయిస్తోంది. ఆగస్ట్ 25న విడుదలైన ఈ చిత్రంలో నేహాకి మంచి పాత్ర లభించింది. తన అందచందాలతో మరోసారి యువతను ఉర్రూతలు ఊగిస్తోంది. త్వరలోనే మరో రెండు సినిమాలతో తెలుగు ప్రేక్షకులను పలకరించేందుకు రెడీ అవుతోంది. అందులో కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తున్న ‘రూల్స్ రంజన్’మూవీ ఒకటి. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ‘సమ్మోహనుడా’ సాంగ్ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. వచ్చే నెలలో ఈ చిత్రం విడుదల కాబోతుంది. ఇక ఈ ఏడాది నేహా నటించిన మూడో చిత్రం ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’. యంగ్ హీరో విశ్వక్సేన్ నటించిన ఈ చిత్రంలో కూడా నేహాకు మంచి పాత్ర లభించిందట. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పాట నెట్టింట వైరల్‌గా మారింది. ఇలా వరుస సినిమాలతో రాధిక టాలీవుడ్‌ని షేక్ చేస్తుంది . -
‘బెదురులంక 2012’మూవీ రివ్యూ
టైటిల్: బెదురులంక 2012 నటీనటులు: కార్తికేయ, నేహా శెట్టి, అజయ్ ఘోష్, రాజ్ కుమార్ కసిరెడ్డి, శ్రీకాంత్ అయ్యంగార్, గోపరాజు రమణ, ఎల్బీ శ్రీరామ్, సత్య తదితరులు నిర్మాణ సంస్థ: లౌక్య ఎంటర్టైన్మెంట్స్ నిర్మాత: రవీంద్ర బెనర్జీ (బెన్నీ) ముప్పానేని దర్శకత్వం: క్లాక్స్ సంగీతం: మణిశర్మ సినిమాటోగ్రఫీ: సాయి ప్రకాష్ ఉమ్మడిసింగు ఎడిటింగ్: విప్లవ్ న్యాసదం విడుదల తేది: ఆగస్ట్ 25, 2023 కథేంటంటే.. ఈ సినిమా కథంతా 2012 నాటి కాలంలో సాగుతుంది. బెదురులంక గ్రామానికి చెందిన శివ(కార్తికేయ) ఓ స్వేచ్ఛా జీవి. మనసుకు నచ్చినట్లు జీవిస్తాడు. హైదరాబాద్‌లో గ్రాఫిక్స్ డిజైనర్ జాబ్ మానేసి బెదురులంకకు వస్తాడు. అక్కడ అప్పటికే యుగాంతం రాబోతుందని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. టీవీలో యుగాంతంపై వస్తున్న వార్తలను చూసి భూషణం(అజయ్ ఘోష్) ఊరి జనాలను మోసం చేసేందుకు పెద్ద ప్లాన్ వేస్తాడు. ఆ ఊర్లో దొంగ జాతకాలు చెబుతూ బతికే బ్రాహ్మాణుడు బ్రహ్మాం(శ్రీకాంత్ అయ్యంగార్), చర్చి ఫాదర్ కొడుకు డేనియల్(ఆటో రాంప్రసాద్)తో కలిసి నిజంగానే యుగాంతం రాబోతుందని ఊరి ప్రజలను నమ్మిస్తాడు. యుగాంతాన్ని ఆపాలంటే అందరి ఇళ్లల్లో ఉన్న బంగారాన్ని తీసుకొచ్చి ఇవ్వాలని, దానితో శివలింగాన్ని, శిలువను తయారు చేసి గంగలో వదిలేస్తే యుగాంతం ఆగిపోతుందని చెబుతారు. ప్రెసిడెంట్‌గారు(గోపరాజు రమణ)ఆదేశంతో ఊరి ప్రజలంతా తమ వద్ద ఉన్న బంగారాన్ని ఇచ్చేస్తారు. కానీ శివ మాత్రం ఇవ్వడు. పైగా అదొక మూఢనమ్మకం అంటూ కొట్టిపారేస్తాడు. దీంతో శివని ఊరి నుంచి వెలేస్తాడు ప్రెసిడెంట్. ఆ తర్వాత ఏం జరిగింది? ఊరి ప్రజల్లో ఉన్న మూడనమ్మకాన్ని పోగొట్టేందుకు శివ ఏం చేశాడు? భూషణం ప్లాన్‌ని ఎలా బయటపెట్టాడు? ప్రెసిడెంట్‌గారి అమ్మాయి చిత్ర(నేహాశెట్టి)తో ప్రేమలో ఉన్న శివ.. చివరకు ఆమెను పెళ్లి చేసుకున్నాడా? లేదా? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. 2012లో యుగాంతం రాబోతుందని, భూమి నాశనమైపోతుందని వార్తలు రావడంతో అసలేం జరగబోతుందోనని అందరూ ఎదురుచూశారు. ఆ సమయంలో బెదురులంక అనే గ్రామంలో ఎలాంటి పరిణామాలు చేసుకున్నాయి?, మూఢవిశ్వాల కారణంగా జనాలు ఎలా మోసపోతున్నారనేది ఈ చిత్రం ద్వారా వినోదాత్మకంగా చూపించాడు దర్శకుడు క్లాక్స్. ప్రజల అమాయకత్వానికి, భయానికి మతం రంగు పులిమి కొందరు లబ్దిపొందే ప్రయత్నం చేస్తున్నారని, అలాంటివి పట్టించుకోవద్దనే సందేశాన్ని ఇచ్చాడు. తొలిసారే ఇలాంటి సరికొత్త సబ్జెక్ట్‌ను ఎంచుకున్న దర్శకుడి ప్రయత్నాన్ని ప్రశంసించాల్సిందే. యుగాంతం కాన్సెప్ట్‌తో గతంలో హాలీవుడ్‌తో పాటు పలు భాషల్లోనూ సినిమాలు వచ్చాయి. కానీ బెదురలంక పాయింట్ చాలా కొత్తగా ఉంది. యుగాంతం రాబోతుందనే టీవీ వార్తతో సినిమా ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత తొలి సన్నివేశంలోనే శివ క్యారెక్టర్ ఎలా ఉండబోతుందో చూపించారు. ఆ తర్వాత కథంతా బెదురులంక గ్రామం చుట్టే తిరుగుతుంది. ఊరి ప్రెసిడెంట్, భూషణం, బ్రహ్మా, డేనియల్ పాత్రల పరిచయం తర్వాత కథలో వేగం పుంజుకుంటుంది. ప్రెసిడెంట్‌గారి అమాయకత్వాన్ని వాడుకొని భూషణం చేయించే మోసాలు నవ్వులు పూయిస్తాయి. మధ్యలో హీరో హీరోయిన్ల లవ్ ట్రాక్ నడుస్తుంది. అయితే అది అంతగా ఆకట్టుకోదు. అసలు కథ ప్రారంభించడానికి కాస్త సమయం తీసుకున్న దర్శకుడు.. ఫస్టాఫ్ మొత్తం సోసోగానే నడిపించాడు. అసలు కథ సెకండాఫ్‌లో ప్రారంభమవుతుంది. ఊరి ప్రజలల్లో ఉన్న మూఢనమ్మకాన్ని పోగొట్టేందుకు శివ చేసే పనులు థియేటర్లలో నవ్వులు పూయిస్తాయి. ముఖ్యంగా సత్య, వెన్నెల కిశోర్ పాత్రల ఎంట్రీ తర్వాత కథ ఆసక్తికరంగా, మరింత ఎంటర్టైనింగ్ సాగుతుంది. క్లైమాక్స్ సీన్‌ని పగలబడి నవ్వుతారు. కొన్నిచోట్ల డబుల్ మీనింగ్ డైలాగులు ఫ్యామిలీ ఆడియన్స్‌కి కాస్త ఇబ్బందిగా అనిపిస్తాయి. ఓవరాల్‌గా నవ్విస్తూనే ఓ మంచి సందేశం ఇచ్చిన సినిమా ‘బెదురులంక 2012’. ఎవరెలా చేశారంటే... ఎలాంటి పాత్రలో అయినా జీవించేస్తాడు కార్తికేయ.తెరపై చాలా ఎనర్జిటిక్‌గా కనిపిస్తాడు. ఈ చిత్రంలో కూడా అలానే కనిపించాడు. తనకు నచ్చినట్లుగా జీవించే యువకుడు శివ పాత్రకు కార్తికేయ న్యాయం చేశాడు. కామెడీతో పాటు యాక్షన్ సీన్లలో కూడా అదరగొట్టేశాడు. ఇక చిత్రగా నేహాశెట్టి పాత్ర నిడివి తక్కువే అయినా తనదైన అందచందాలతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసింది. జనాలను మోసం చేసి డబ్బులు సంపాదించాలనే ఆశ ఉన్న భూషణం పాత్రలో అజయ్ ఘోష్ ఒదిగిపోయాడు. కొన్ని చోట్ల అజయ్ నటన.. కోటా శ్రీనివాసరావు చేసిన కొన్ని పాత్రలను గుర్తుకు చేస్తుంది. బ్రహ్మాగా శ్రీకాంత్ అయ్యంగార్, డేనియల్‌గా రాంప్రసాద్, కసిరాజుగా రాజ్ కుమార్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక విషయాలకొస్తే.. మణిశర్మ సంగీతం పర్వాలేదు. పాటలు అంతగా ఆకట్టుకోలేవు కానీ.. నేపథ్య సంగీతం బాగుంది. సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. ఎడిటర్ పనితీరు బాగుంది. సినిమాను చాలా షార్ప్‌గా కట్ చేశాడు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
Bedurulanka 2012 Pre Release Photos: ‘బెదురులంక 2012’ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
అందుకే తమిళ్లో సినిమాలు చేయట్లేదు: కార్తికేయ
'వలిమై'(అజిత్ హీరోగా నటించిన ఈ చిత్రంలో కార్తికేయ విలన్‌గా నటించాడు) తర్వాత తమిళ ప్రేక్షకుల్లో నాకు గుర్తింపు వచ్చిన మాట వాస్తవమే. అలా అని నా తదుపరి చిత్రాలన్నీ తమిళ భాషలో కూడా విడుదల చేయాలనుకోవడం సరికాదు. తెలుగు, తమిళ ప్రేక్షకులకు నచ్చే కథ వచ్చినప్పుడు బైలింగ్వల్ చేస్తా. వలిమై తర్వాత నాకు తమిళ నుంచి రెండు, మూడు ఆఫర్లు వచ్చాయి కానీ.. ఏదీ నచ్చలేదు. అందుకు ఆ సినిమాలు చేయలేదు’అని యంగ్ హీరో కార్తికేయ గుమ్మకొండ అన్నాడు. ఆయన హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘బెదురులంక 2012’. లౌక్య ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సి. యువరాజ్ సమర్పణలో రవీంద్ర బెనర్జీ (బెన్నీ) ముప్పానేని నిర్మించారు. క్లాక్స్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఆగస్ట్ 15న ఈ చిత్రం విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా కార్తీకేయ మీడియాతో ముచ్చటించాడు. ఆ విశేషాలు.. ► కరోనా సమయంలో నాకు క్లాక్స్ కథ చెప్పాడు. ఆ సమయంలో ప్రపంచం అంత అయిపోతుందని అన్నట్లు ప్రచారం జరిగింది కదా! కథకు బాగా కనెక్ట్ అయ్యాను. ప్రేక్షకుల్లో మార్పు వచ్చింది. కథలో కొత్తదనం, వినోదం ఉండటంతో ఓకే చేశా. ► 'బెదురులంక 2012' కథకు రిఫరెన్స్ ఏమీ లేదు. అంత కొత్తగా ఉంటుంది. సినిమా కంప్లీట్ అయ్యాక చూసుకున్నా. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. బాగా వచ్చింది. ఫన్, మెసేజ్ రెండూ ఉన్నాయి. ఆ సినిమాకు వచ్చిన ప్రేక్షకులు ఆలోచించేలా సన్నివేశాలు, డైలాగులు ఉంటాయి. వారిలో చిన్న మార్పు వస్తుందని నమ్ముతున్నాను. ► ఈ సినిమాలో నా క్యారెక్టర్ పేరు శివ. ఓ సన్నివేశం దగ్గర 'శివ షో బిగిన్స్, శివ ఆట మొదలు' అన్నట్లు చెప్పాలి. ఇంపాక్ట్ సరిపోవడం లేదని, శివ పేరు చిన్నగా ఉందని అనిపించింది. సెట్లో ఎవరో శివ శంకర్ అయితే బావుంటుందేమో అన్నారు. అప్పుడు శివ శంకర వరప్రసాద్ పేరు స్ట్రైక్ అయ్యింది. అప్పటికప్పుడు వచ్చిన ఐడియాకు ఆ షాట్లో అలా చెప్పాం. ► శివ క్యారెక్టర్ విషయానికొస్తే.. అతనో స్వేచ్ఛా జీవి. తనకు నచ్చినట్లు జీవిస్తాడు. సిటీలో గ్రాఫిక్ డిజైనర్ జాబ్ మానేసి ఊరు వెళతాడు. ఎవరైనా నన్ను జడ్జ్ చేస్తున్నారా? ఎవరైనా నేను చేసిన పని గురించి ఆలోచిస్తున్నారా? అని అసలు పట్టించుకోడు. అలాగని, ఎవరినీ ఇబ్బంది పెట్టడు. వాడి పని వాడు చేసుకుంటాడు. నచ్చని విషయం చేయమంటే అసలు చేయడు. ► ఈ సినిమా ట్రైలర్ రామ్ చరణ్‌కు బాగా నచ్చింది. మ్యూజిక్ బావుందని చెప్పారు. షాట్స్ మేకింగ్, నేహా శెట్టితో నా జోడీ బావుందని చెప్పారు. శివ శంకర్ వరప్రసాద్ డైలాగ్ గురించి సరదాగా మాట్లాడుకున్నాం. ► నేహా శెట్టి మంచి నటి. 'డీజే టిల్లు'లో ఆమె బాగా చేసింది. వేరే పాత్రలో అంత బాగా చేస్తుందా? అని డౌట్ ఉంది. 'ఆర్ఎక్స్ 100' తర్వాత ఈ అబ్బాయి రగ్గడ్ లుక్ మైంటైన్ చేస్తూ ఆ రోల్ బాగా చేశాడని, వేరే క్యారెక్టర్ చేస్తాడా? లేదా? అని నా గురించి ఎలా అయితే అనుకున్నారో... సేమ్ ఆ అమ్మాయికి కూడా అలా ఉంది. ఒకటి రెండు రోజుల తర్వాత నేహా శెట్టి వైవిధ్యంగా చేస్తుందని అర్థమైంది. ఆ అమ్మాయి కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంది. రాధికా పాత్ర ఎక్కడా కనిపించకూడదని కష్టపడింది. మేం కూడా జాగ్రత్తలు తీసుకున్నాం. ► మణిశర్మ గారి నేపథ్య సంగీతం సినిమాకు ఎంతో బలాన్ని ఇచ్చింది. అఫ్కోర్స్... సాంగ్స్ అన్నీ సూపర్ హిట్ అయ్యాయి. అయితే... ఇదొక కొత్త జానర్ సినిమా. చాలా లేయర్స్, థీమ్ మ్యూజిక్స్ ఉంటాయి. ఆయన వాటిని బాగా క్యారీ చేశారు. ఫెంటాస్టిక్ రీ రికార్డింగ్ చేశారు ► 'ఆర్ఎక్స్ 100'లో నా క్యారెక్టర్ పేరు శివ. ఇందులోనూ అదే పేరు. రెండు చిత్రాలు గోదావరి నేపథ్యంలో సాగుతాయి. అయితే ఇదంతా యాదృశ్చికంగా జరిగింది. డైరెక్టర్ క్లాక్స్‌కి ఆర్ఎక్స్ 100లో నా పాత్ర పేరు శివ అని గుర్తు లేదు. షూటింగ్ ప్రారంభమైన చాలా రోజుల తర్వాత అతనికి గుర్తు చేశా. తనకు ఆ సినిమాలో క్యారెక్టర్ పేరు గుర్తు లేదన్నాడు. ఆ క్యారెక్టర్, మైండ్ సెట్ కు శివ పేరు సెట్ అవుతుందని పెట్టానని చెప్పాడు. ఆ సెంటిమెంట్ వర్కవుట్ అయ్యి ఈ సినిమా కూడా హిట్ అయితే హ్యాపీ. హిట్ అవుతుందని నమ్మకంగా ఉన్నాం. -
‘సిరివెన్నెల’ చివరి పాట మా సినిమాలో ఉండడం అదృష్టం: నిర్మాత
‘‘ప్రేక్షకుడిగా నేనో సినిమా చూసినప్పుడు కథలో కొత్తదనం ఉండాలని కోరుకుంటాను. ‘బెదురులంక 2012’ కథలో అలాంటి కొత్తదనాన్ని చూపించారు క్లాక్స్’’ అని నిర్మాత బెన్నీ ముప్పానేని అన్నారు. కార్తికేయ గుమ్మకొండ, నేహా శెట్టి జంటగా క్లాక్స్ దర్శకత్వం వహించిన చిత్రం ‘బెదురులంక 2012’. సి. యువరాజ్ సమర్పణలో రవీంద్ర బెనర్జీ (బెన్నీ) ముప్పానేని నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 25న విడుదలవుతోంది. ఈ సందర్భంగా బెన్నీ ముప్పానేని మాట్లాడుతూ– ‘‘సినిమాలపై ఉన్న ఆసక్తితో సాఫ్ట్వేర్ ఉద్యోగం వదిలి, నిర్మాతగా మారాను. ఓ ఊహాజనిత గ్రామంలో 2012లో 21 రోజులు ఏం జరిగింది? అనేది ‘బెదురులంక 2012’ చిత్రకథ. మనం చని΄ోతాం అని తెలిస్తే చివరి క్షణాల్లో ఎలా ఉంటాం? అనేది సినిమా కోర్ పాయింట్. కార్తికేయ చాలా ప్రొఫెషనల్. అతనితో మరో సినిమా చేద్దామనుకుంటున్నాం. నేహా శెట్టి పల్లెటూరి అమ్మాయి పాత్రలో ఒదిగి΄ోయారు. మణిశర్మగారు అద్భుతమైన సంగీతం ఇచ్చారు. ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రిగారు రాసిన చివరి పాట మా సినిమాలో ఉండటం మా అదృష్టం. మా సినిమా ట్రైలర్ రిలీజ్ చేసిన రామ్‌చరణ్‌గారు కథని అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం మా బ్యానర్లో మూడు ్రపాజెక్ట్స్ ఓకే చేశాం’’ అన్నారు. -
ఆయన నా బ్రెయిన్‌ని మార్చేశారు
కార్తికేయ గుమ్మకొండ, నేహా శెట్టి జంటగా నటించిన చిత్రం ‘బెదురులంక 2012’. క్లాక్స్ని దర్శకుడిగా పరిచయం చేస్తూ, రవీంద్ర బెనర్జీ ము΄్పానేని (బెన్నీ) నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 25న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా జరిగిన విలేకర్ల సమావేశంలో క్లాక్స్ మాట్లాడుతూ– ‘‘భీమవరం దగ్గర భీమడోలు నా స్వస్థలం. నా అసలు పేరు ఉద్దరాజు వెంకట కృష్ణ పాండురంగ రాజు. వివిధ రంగాల్లో ఉద్యోగాలు చేసి, ఆ తర్వాత సినిమాలపై ఆసక్తితో ఇండస్ట్రీలోకి వచ్చాను. రామ్‌గోపాల్ వర్మ, సుధీర్ వర్మ, దేవ కట్టా గార్ల దగ్గర దర్శకత్వ శాఖలో పని చేశాను. రామ్‌గోపాల్ వర్మగారు నా బ్రెయిన్‌ను మార్చేశారు. అప్పటివరకూ సినిమా అంటే సైన్స్ అని భావించిన నేను మూవీ అంటే ఓ ఆర్ట్ ఫార్మ్ అని అర్థం చేసుకున్నాను. రేపనేది లేదని తెలిస్తే మన గురించి సమాజం ఏమనుకుంటుందో అని మనం పట్టించుకోం. ఇలా చెప్పేలా హాలీవుడ్ ఫిల్మ్ ‘సెవెన్ సమురాయ్’లో ఓ డైలాగ్ ఉంది. అదే సమయంలో ‘యుగాంతం 2012’ సినిమా వచ్చింది. ఈ రెండు అంశాల ప్రేరణతో ‘బెదురులంక 2012’ కథ రాశాను. కార్తికేయకి కథ చెప్పగా ఓకే అన్నారు. అలాగే కథను సరిగ్గా అర్థం చేసుకున్న బెన్నీగారు కూడా స΄ోర్ట్ చేశారు. ఈ కథలో డ్రామా, హాస్యం, అంతర్లీనంగా సందేశం ఉన్నాయి. మణిశర్మగారితో వర్క్ చేయడం ఓ మంచి అనుభూతి’’ అన్నారు. -
చిరంజీవిని అలా అంటుంటే చాలా బాధగా ఉంది: ప్రముఖ హీరో
యువ కథానాయకుడు కార్తికేయ గుమ్మకొండకు జోడీగా 'డీజే టిల్లు' ఫేమ్ నేహా శెట్టి నటించిన సినిమా 'బెదురులంక 2012'. యుగాంతం నేపథ్యంలో తెరకెక్కించిన చిత్రమిది. ఈ సినిమా ట్రైలర్‌ను గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తాజాగ విడుదల చేశారు. ఆగష్టు 25న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. తన గత చిత్రం 'ఆర్ఎక్స్ 100' ట్రైలర్‌ని కూడా రామ్ చరణే రిలీజ్ చేశారు. ఈ రెండు సినిమాల్లో తన పాత్ర పేరు శివ అని, అది యాదృచ్ఛికంగా జరిగిందని కార్తికేయ తెలిపారు. ఈ సినిమాలో ఓ సన్నివేశం డిమాండ్ మేరకు శివ శంకర వరప్రసాద్ (చిరంజీవి అసలు పేరు)గా డైలాగ్ చెప్పానన్నారు. ట్రైలర్ విడుదల అయ్యాక ఓ ఇంటర్వ్యూలో చిరంజీవి గురించి కార్తికేయ పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. చిరంజీవిని చాలామంది పలు రకాలుగా విమర్శిస్తూ ఉంటారు. అలా ఆయన్ను ఎవరైనా విమర్శిస్తే చాలా బాధేస్తుందని కార్తికేయ అన్నారు. ఆయన నుంచి వచ్చిన ఏదైనా సినిమా నచ్చలేదు, బాగోలేదు అని అనడం వరకు ఓకేగానీ.. కొంతమంది పనికట్టుకుని వ్యక్తిగతంగా టార్గెట్ చేసి దూషిస్తున్నారు. అలాంటి వారిది చిన్న మనస్తత్వం అనిపిస్తుందని కార్తికేయ అన్నారు. (ఇదీ చదవండి: రెమ్యునరేషన్ తిరిగిచ్చేసిన చిరంజీవి.. అందుకే ఆయన మెగాస్టార్!) చిరంజీవినే కాదు అలా ఎవరినీ కూడా అనకూడదని ఆయన పేర్కొన్నారు. ఎవరమైనా కథ నచ్చే సినిమా తీస్తాం.. అనుకున్నంత స్థాయిలో అది ఆడకపోతే నేరమా అని ఆయన ప్రశ్నించారు. చిరంజీవి తన కెరీర్లో ఎన్నో కష్టాలు ఎదుర్కొని నిలబడ్డారు. జీవితంలో ఆయన చూసిన ఒడిదొడుకుల ముందు ఇది చిన్న విషయం మాత్రమే. ఇలాంటి వాటికి ఆయన ఏమాత్రం ఫీలవ్వకుండా తదుపరి సినిమాపై దృష్టిపెడతారని ఇదీ అందరికీ తెలుసని కార్తికేయ తన అభిప్రాయం తెలిపారు. -
కార్తికేయ, నేహా శెట్టి బెదురులంక 2012 మూవీ ఇంటర్వ్యూ
-
ఆత్మాభిమానం.. అహంభావం కాదు
‘‘2012 డిసెంబరు 21.. ప్రపంచం అంతా యుగాంతం వస్తుందని భయపడిన రోజు. కానీ ఎక్కడా ఏం జరగలా.. ఒక్క మా ఊర్లో తప్ప... (అజయ్ ఘోష్)’ అనే డైలాగ్‌తో మొదలవుతుంది ‘బెదురులంక 2012’ ట్రైలర్. కార్తికేయ గుమ్మకొండ, నేహా శెట్టి జంటగా రూపొందిన చిత్రం ’బెదురులంక 2012’. క్లాక్స్ దర్శకత్వంలో సి. యువరాజ్ సమర్పణలో రవీంద్ర బెనర్జీ (బెన్నీ) ముప్పానేని నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 25న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా ట్రైలర్‌ను హీరో రామ్‌చరణ్ విడుదల చేసి, మాట్లాడుతూ – ‘‘కొత్త కాన్సెప్ట్‌లను సెలక్ట్ చేసుకుని సినిమాలు చేస్తుంటారు కార్తికేయ. ‘బెదురులంక 2012’ ట్రైలర్, ఇందులో చెప్పిన కథ బాగుంది. ఈ సినిమా పెద్ద విజయం సాధించాలి’’ అన్నారు. ‘నేను నమ్మనిది నేను చేయను.. అది నా సెల్ఫ్ రెస్పెక్ట్.. ఈగో కాదు’ (ఆత్మాభిమానం.. అహంభావం కాదు) అంటూ కార్తికేయ చెప్పిన డైలాగ్స్ కూడా ట్రైలర్లో ఉన్నాయి ‘‘చిరంజీవిగారికి వీరాభిమాని అయిన కార్తికేయ ఈ సినిమాలో తన అభిమాన హీరో అసలు పేరు.. శివశంకర వరప్రసాద్ పాత్రలో నటించారు. యుగాంతం వస్తుందని ఆంధ్రప్రదేశ్‌లోని బెదురులంక గ్రామంలో కొందరు కేటుగాళ్లు ప్రజల్లో ఉన్న భక్తిని ఆసరాగా చేసుకుని దేవుడి పేరుతో ఎలా దోపిడీ చేశారు? వారికి శివశంకర వరప్రసాద్ ఏ విధంగా బుద్ధి చెప్పాడు? అన్నదే ఈ సినిమా కథ’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ. -
Bedurulanka Team In Vijayawada Photos: విజయవాడలో ‘బెదురులంక 2012’ మూవీ టీమ్ సందడి (ఫోటోలు)
-
అందరొక్కటే..
‘లోకం లోన ఏ చోటైనా అందరొక్కటే.. ఎవడుకాడూ ఎర్రి బాగులోడూ.. నిజమిదే..’ అంటూ మొదలవుతుంది ‘బెదురులంక 2012’ చిత్రంలోని ‘దొంగోడే దొరగాడు’ పాట. కార్తికేయ గుమ్మకొండ, నేహా శెట్టి హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ఇది. క్లాక్స్ దర్శకత్వంలో ముప్పానేని రవీంద్ర బెనర్జీ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 25న విడుదల కానుంది. ఈ చిత్రంలోని ‘దొంగోడే దొరగాడు..’ పాట లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు. సంగీత దర్శకుడు మణిశర్మ స్వరకల్పనలో కిట్టూ విస్సాప్రగడ రాసిన ఈ పాటను సాహితి చాగంటి ఆలపించారు. ‘‘ఓ ఊరి ప్రజలకు దేవుని మీద ఉన్న భక్తిని గమనించిన కొందరు మోసగాళ్లు ఎలా దోచుకుంటారనేది ఈ పాటలో చూపించాం’’ అన్నారు క్లాక్స్. -
చెప్పరా శివా...
కార్తికేయ గుమ్మకొండ హీరోగా నటించిన చిత్రం ‘బెదురులంక 2012’. క్లాక్స్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నేహా శెట్టి హీరోయిన్. సి. యువరాజ్ సమర్పణలో రవీంద్ర బెనర్జీ (బెన్నీ) ముప్పానేని నిర్మించిన ఈ సినిమా ఆగస్టు 25న రిలీజ్ కానుంది. మణిశర్మ సంగీతం అందించిన ఈ చిత్రంలోని ‘భోగమంత యిడువనే యిడువవు వింతగుంది రా, నువెవడివి సొల్లుడా శివా (చెప్పరా శివా)...’ అంటూ సాగే రెండో పాటను రిలీజ్ చేశారు. కృష్ణ చైతన్య సాహిత్యం సమకూర్చిన ఈ పా టని అనురాగ్ కులకర్ణి, రోల్ రైడ, పృథ్వీ చంద్ర పా డారు. -
గోదావరి నేపథ్యంలో 'బెదురులంక'.. రిలీజ్ డేట్ ఫిక్స్
‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ కార్తికేయ గుమ్మకొండ హీరోగా నటించిన ‘బెదురులంక 2012’ సినిమా విడుదల తేదీ ఫిక్స్ అయింది. ఈ చిత్రాన్ని ఆగస్టు 25న విడుదల చేస్తున్నట్లు మూవీ మేకర్స్ ప్రకటించారు. క్లాక్స్ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ మూవీలో ‘డీజే టిల్లు’ ఫేమ్ నేహా శెట్టి కథానాయికగా నటించారు. రవీంద్ర బెనర్జీ (బెన్నీ) ముప్పానేని నిర్మించారు. ‘‘హిలేరియస్ ఎంటర్టైనర్గా రూపొందిన చిత్రం ‘బెదురులంక 2012’. ఇప్పటివరకు గోదావరి నేపథ్యంలో వచ్చిన రూరల్ డ్రామాలకు భిన్నంగా మా సినిమా ఉంటుంది’’ అన్నారు బెన్నీ ముప్పానేని. ‘‘మా సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరి దశలో ఉన్నాయి. మణిశర్మగారు అద్భుతమైన బాణీలు అందించారు. కార్తికేయ, నేహా జోడీ ఆకట్టుకుంటుంది’’ అన్నారు క్లాక్స్. ఈ చిత్రానికి కెమెరా: సాయి ప్రకాష్ ఉమ్మడిసింగు, సన్నీ కూరపాటి, సమర్పణ: సి. యువరాజ్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: దుర్గారావు గుండా, సహనిర్మాతలు: అవనీంద్ర ఉపద్రష్ట, వికాస్ గున్నల. -
కార్తికేయ, నేహాశెట్టిల రొమాంటిక్ 'వెన్నెల్లో ఆడపిల్ల' సాంగ్ రిలీజ్
టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ, నేహాశెట్టి జంటగా నటిస్తున్న చిత్రం "బెదురులంక 2012". క్లాక్స్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను రవీంద్ర బెనర్జీ ముప్పనేని (బెన్నీ) నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్, గ్లింప్స్ ఆడియోన్స్‌ను బాగా ఆకట్టుకుంటుంది. టీజర్ సినిమాపై మరిన్ని అంచనాలను పెంచేస్తుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రం నుంచి ఫస్ట్ సింగిల్‌ను విడుదల చేశారు. వెన్నెల్లో ఆడపిల్ల.. కవ్వించే కన్నెపిల్ల అంటూ ఓ బ్యూటిఫుల్ రొమాంటిక్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. మణిశర్మ స్వరపరిచిన ఈ పాటను హారిక నారాయణ్, సుధాన్షు జేవీ ఆలపించారు. -
ఒక్క బ్లాక్ బస్టర్ ఇవ్వండి – కార్తికేయ
‘‘నేను నటించిన గత సినిమాల్లో జరిగిన తప్పులు ‘బెదురులంక 2012’లో జరగకుండా చూసుకున్నా. ఈ సినిమాను సపో ర్ట్ చేసి, నాకు ఒక్క బ్లాక్ బస్టర్ ఇవ్వండి.. థ్యాంక్యూ’’ అని హీరో కార్తికేయ అన్నారు. క్లాక్స్ దర్శకత్వంలో కార్తికేయ, నేహా శెట్టి జంటగా నటించిన చిత్రం ‘బెదురులంక 2012’. సి. యువరాజ్ సమర్పణలో రవీంద్ర బెనర్జీ (బెన్నీ) ముప్పనేని నిర్మించారు. ఈ చిత్రం టీజర్‌ని హీరో విజయ్ దేవరకొండ సోషల్ మీడియాలో విడుదల చేశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో కార్తికేయ మాట్లాడుతూ–‘‘ప్రేక్షకులను థియేటర్లకు రప్పించే సినిమా అవుతుందనే నమ్మకంతో ఈ మూవీ చేశా.. బ్లాక్ బస్టర్ అవుతుంది’’ అన్నారు. ‘‘త్వరలో విడుదల తేదీ ప్రకటిస్తాం’’ అన్నారు బెన్నీ ముప్పనేని. ‘‘నాకు తొలి చాన్స్ ఇచ్చిన నిర్మాతలకు థ్యాంక్స్’’ అన్నారు క్లాక్స్. -
బెదుర్లంక-2012 టీజర్ లాంఛ్ (ఫొటోలు)
-
పల్లెటూరి అమ్మాయిగా నేహాశెట్టి.. ఫస్ట్‌లుక్ పోస్టర్ రిలీజ్
వరుస సినిమాలతో దూసుకుపోతున్న కార్తికేయ నటిస్తున్న తాజాచిత్రం బెదురులంక. క్లాక్స్ దర్శకత్వం రవీంద్ర బెనర్జీ ముప్పానేని ఈ సినిమాను నిర్మిస్తున్నారు. గోదావరి బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కార్తికేయకు జోడీగా డీజే టిల్లు భామ నేహాశెట్టి నటిస్తుంది. బెదురులంక అనే ఊరిలో 2012లో యుగాంతం వస్తుందన్న పుకార్లు ఎలాంటి పరిణామాలు తీసుకొచ్చాయి అన్న నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించనున్నట్లు టాక్ వినిపిస్తుంది. ఈ సినిమాలో నేహాశెట్టి పల్లెటూరి అమ్మాయిగా కనిపించనుంది. సోమవారం(నేడు)ఆమె బర్త్‌డే సందర్భంగా మేకర్స్ నేహాశెట్టి ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. వచ్చే ఏడాదిలో ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు. Wishing beautiful & talented @iamnehashetty a very happy birthday ✨ Introducing "Chitra" from the world of #Bedurulanka2012 🌊 #Clax #ManiSharma @Benny_Muppaneni @Loukyaoffl @SonyMusicSouth #HBDNehaSshetty pic.twitter.com/SWaoElGgFS — Kartikeya (@ActorKartikeya) December 5, 2022 -
‘బెదురులంక’లో ‘డీజే టిల్లు’ బ్యూటీ.. కార్తికేయ కొత్త మూవీ టైటిల్
యంగ్ హీరో కార్తికేయ, ‘డీజే టిల్లు’ ఫేమ్ నేహా శెట్టి జంటగా ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. క్లాక్స్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని లౌక్య ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ప్రొడక్షన్ నంబర్ 3గా బెన్నీ నిర్మిస్తున్నారు. నేడు(సెప్టెంబర్ 21) కార్తికేయ పుట్టిన రోజు. ఈ సందర్భంగా టైటిల్ వెల్లడించారు. ఈ చిత్రానికి 'బెదురులంక 2012' టైటిల్ ఖరారు చేశారు. ఈ సందర్భంగా చిత్రనిర్మాత బెన్నీ ముప్పానేని మాట్లాడుతూ.. ‘కామెడీ డ్రామాగా, గోదావరి నేపథ్యంలో సాగే కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. ఇటీవల మూడో షెడ్యూల్ ముగిసింది. యానాం, కాకినాడ, గోదావరి పరిసర ప్రాంతాల్లో అందమైన లొకేషన్లలో చిత్రీకరణ చేశాం. ఆఖరి షెడ్యూల్ త్వరలో ఉంటుంది. దాంతో సినిమా మొత్తం పూర్తవుతుంది. మెలోడీ బ్రహ్మ మణిశర్మ ఐదు అద్భుతమైన బాణీలను అందించారు. 'స్వర్గీయ' సిరివెన్నెల గారు మా చిత్రంలో ఒక పాట రాశారు" అన్నారు. దర్శకుడు క్లాక్స్ మాట్లాడుతూ ..‘డ్రామెడీ (డ్రామా ప్లస్ కామెడీ) జానర్ చిత్రమిది. ఈ సినిమాలో కొత్త కార్తికేయ కనిపిస్తారు. ఒక ఊరు నేపథ్యంలో వినోదం, మానవ భావోద్వేగాలతో కూడిన కథతో సినిమా రూపొందిస్తున్నాం. ఇందులో స్ట్రాంగ్ కంటెంట్ ఉంది. అలాగే, కడుపుబ్బా నవ్వించే వినోదం ఉంది. మనసుకు నచ్చినట్టు జీవించే పాత్రలో హీరో కార్తికేయ కనిపిస్తారు. సొసైటీకి నచ్చినట్లు బతకడం రైటా? మనసుకు నచ్చినట్టు బతకడం రైటా? అనేది సినిమాలో చూడాలి’అని చెప్పారు.