క్లాక్స్
కార్తికేయ గుమ్మకొండ, నేహా శెట్టి జంటగా నటించిన చిత్రం ‘బెదురులంక 2012’. క్లాక్స్‌ని దర్శకుడిగా పరిచయం చేస్తూ, రవీంద్ర బెనర్జీ ము΄్పానేని (బెన్నీ) నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 25న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా జరిగిన విలేకర్ల సమావేశంలో క్లాక్స్ మాట్లాడుతూ– ‘‘భీమవరం దగ్గర భీమడోలు నా స్వస్థలం. నా అసలు పేరు ఉద్దరాజు వెంకట కృష్ణ పాండురంగ రాజు.
వివిధ రంగాల్లో ఉద్యోగాలు చేసి, ఆ తర్వాత సినిమాలపై ఆసక్తితో ఇండస్ట్రీలోకి వచ్చాను. రామ్‌గోపాల్ వర్మ, సుధీర్ వర్మ, దేవ కట్టా గార్ల దగ్గర దర్శకత్వ శాఖలో పని చేశాను. రామ్‌గోపాల్ వర్మగారు నా బ్రెయిన్‌ను మార్చేశారు. అప్పటివరకూ సినిమా అంటే సైన్స్ అని భావించిన నేను మూవీ అంటే ఓ ఆర్ట్ ఫార్మ్ అని అర్థం చేసుకున్నాను. రేపనేది లేదని తెలిస్తే మన గురించి సమాజం ఏమనుకుంటుందో అని మనం పట్టించుకోం.
ఇలా చెప్పేలా హాలీవుడ్ ఫిల్మ్ ‘సెవెన్ సమురాయ్’లో ఓ డైలాగ్ ఉంది. అదే సమయంలో ‘యుగాంతం 2012’ సినిమా వచ్చింది. ఈ రెండు అంశాల ప్రేరణతో ‘బెదురులంక 2012’ కథ రాశాను. కార్తికేయకి కథ చెప్పగా ఓకే అన్నారు. అలాగే కథను సరిగ్గా అర్థం చేసుకున్న బెన్నీగారు కూడా స΄ోర్ట్ చేశారు. ఈ కథలో డ్రామా, హాస్యం, అంతర్లీనంగా సందేశం ఉన్నాయి. మణిశర్మగారితో వర్క్ చేయడం ఓ మంచి అనుభూతి’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment