‘‘ప్రేక్షకుడిగా నేనో సినిమా చూసినప్పుడు కథలో కొత్తదనం ఉండాలని కోరుకుంటాను. ‘బెదురులంక 2012’ కథలో అలాంటి కొత్తదనాన్ని చూపించారు క్లాక్స్’’ అని నిర్మాత బెన్నీ ముప్పానేని అన్నారు. కార్తికేయ గుమ్మకొండ, నేహా శెట్టి జంటగా క్లాక్స్ దర్శకత్వం వహించిన చిత్రం ‘బెదురులంక 2012’. సి. యువరాజ్ సమర్పణలో రవీంద్ర బెనర్జీ (బెన్నీ) ముప్పానేని నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 25న విడుదలవుతోంది.
ఈ సందర్భంగా బెన్నీ ముప్పానేని మాట్లాడుతూ– ‘‘సినిమాలపై ఉన్న ఆసక్తితో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం వదిలి, నిర్మాతగా మారాను. ఓ ఊహాజనిత గ్రామంలో 2012లో 21 రోజులు ఏం జరిగింది? అనేది ‘బెదురులంక 2012’ చిత్రకథ. మనం చని΄ోతాం అని తెలిస్తే చివరి క్షణాల్లో ఎలా ఉంటాం? అనేది సినిమా కోర్ పాయింట్. కార్తికేయ చాలా ప్రొఫెషనల్. అతనితో మరో సినిమా చేద్దామనుకుంటున్నాం. నేహా శెట్టి పల్లెటూరి అమ్మాయి పాత్రలో ఒదిగి΄ోయారు. మణిశర్మగారు అద్భుతమైన సంగీతం ఇచ్చారు. ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రిగారు రాసిన చివరి పాట మా సినిమాలో ఉండటం మా అదృష్టం. మా సినిమా ట్రైలర్ రిలీజ్ చేసిన రామ్‌చరణ్‌గారు కథని అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం మా బ్యానర్‌లో మూడు ్రపాజెక్ట్స్ ఓకే చేశాం’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment