క్లాక్స్, కార్తికేయ, రామ్‌చరణ్, నేహాశెట్టి, రవీంద్ర బెనర్జీ
‘‘2012 డిసెంబరు 21.. ప్రపంచం అంతా యుగాంతం వస్తుందని భయపడిన రోజు. కానీ ఎక్కడా ఏం జరగలా.. ఒక్క మా ఊర్లో తప్ప... (అజయ్ ఘోష్)’ అనే డైలాగ్‌తో మొదలవుతుంది ‘బెదురులంక 2012’ ట్రైలర్. కార్తికేయ గుమ్మకొండ, నేహా శెట్టి జంటగా రూపొందిన చిత్రం ’బెదురులంక 2012’. క్లాక్స్ దర్శకత్వంలో సి. యువరాజ్ సమర్పణలో రవీంద్ర బెనర్జీ (బెన్నీ) ముప్పానేని నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 25న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా ట్రైలర్‌ను హీరో రామ్‌చరణ్ విడుదల చేసి, మాట్లాడుతూ – ‘‘కొత్త కాన్సెప్ట్‌లను సెలక్ట్ చేసుకుని సినిమాలు చేస్తుంటారు కార్తికేయ.
‘బెదురులంక 2012’ ట్రైలర్, ఇందులో చెప్పిన కథ బాగుంది. ఈ సినిమా పెద్ద విజయం సాధించాలి’’ అన్నారు. ‘నేను నమ్మనిది నేను చేయను.. అది నా సెల్ఫ్ రెస్పెక్ట్.. ఈగో కాదు’ (ఆత్మాభిమానం.. అహంభావం కాదు) అంటూ కార్తికేయ చెప్పిన డైలాగ్స్ కూడా ట్రైలర్‌లో ఉన్నాయి ‘‘చిరంజీవిగారికి వీరాభిమాని అయిన కార్తికేయ ఈ సినిమాలో తన అభిమాన హీరో అసలు పేరు.. శివశంకర వరప్రసాద్ పాత్రలో నటించారు. యుగాంతం వస్తుందని ఆంధ్రప్రదేశ్‌లోని బెదురులంక గ్రామంలో కొందరు కేటుగాళ్లు ప్రజల్లో ఉన్న భక్తిని ఆసరాగా చేసుకుని దేవుడి పేరుతో ఎలా దోపిడీ చేశారు? వారికి శివశంకర వరప్రసాద్ ఏ విధంగా బుద్ధి చెప్పాడు? అన్నదే ఈ సినిమా కథ’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ.
Comments
Please login to add a commentAdd a comment