
‘లోకం లోన ఏ చోటైనా అందరొక్కటే.. ఎవడుకాడూ ఎర్రి బాగులోడూ.. నిజమిదే..’ అంటూ మొదలవుతుంది ‘బెదురులంక 2012’ చిత్రంలోని ‘దొంగోడే దొరగాడు’ పాట. కార్తికేయ గుమ్మకొండ, నేహా శెట్టి హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ఇది. క్లాక్స్ దర్శకత్వంలో ముప్పానేని రవీంద్ర బెనర్జీ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 25న విడుదల కానుంది. ఈ చిత్రంలోని ‘దొంగోడే దొరగాడు..’ పాట లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు. సంగీత దర్శకుడు మణిశర్మ స్వరకల్పనలో కిట్టూ విస్సాప్రగడ రాసిన ఈ పాటను సాహితి చాగంటి ఆలపించారు. ‘‘ఓ ఊరి ప్రజలకు దేవుని మీద ఉన్న భక్తిని గమనించిన కొందరు మోసగాళ్లు ఎలా దోచుకుంటారనేది ఈ పాటలో చూపించాం’’ అన్నారు క్లాక్స్.
Comments
Please login to add a commentAdd a comment