
‘‘నేను నటించిన గత సినిమాల్లో జరిగిన తప్పులు ‘బెదురులంక 2012’లో జరగకుండా చూసుకున్నా. ఈ సినిమాను సపో ర్ట్ చేసి, నాకు ఒక్క బ్లాక్ బస్టర్ ఇవ్వండి.. థ్యాంక్యూ’’ అని హీరో కార్తికేయ అన్నారు. క్లాక్స్ దర్శకత్వంలో కార్తికేయ, నేహా శెట్టి జంటగా నటించిన చిత్రం ‘బెదురులంక 2012’. సి. యువరాజ్ సమర్పణలో రవీంద్ర బెనర్జీ (బెన్నీ) ముప్పనేని నిర్మించారు. ఈ చిత్రం టీజర్‌ని హీరో విజయ్ దేవరకొండ సోషల్ మీడియాలో విడుదల చేశారు.
ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో కార్తికేయ మాట్లాడుతూ–‘‘ప్రేక్షకులను థియేటర్లకు రప్పించే సినిమా అవుతుందనే నమ్మకంతో ఈ మూవీ చేశా.. బ్లాక్ బస్టర్ అవుతుంది’’ అన్నారు. ‘‘త్వరలో విడుదల తేదీ ప్రకటిస్తాం’’ అన్నారు బెన్నీ ముప్పనేని. ‘‘నాకు తొలి చాన్స్ ఇచ్చిన నిర్మాతలకు థ్యాంక్స్’’ అన్నారు క్లాక్స్.
Comments
Please login to add a commentAdd a comment