Neha Shetty: టాలీవుడ్‌ని షేక్‌ చేస్తున్న ‘రాధిక’ | Neha Shetty New and Upcoming Movies; Check Details - Sakshi
Sakshi News home page

Neha Shetty: టాలీవుడ్‌ని షేక్‌ చేస్తున్న ‘రాధిక’

Published Sat, Aug 26 2023 2:34 PM | Last Updated on Sat, Aug 26 2023 2:53 PM

Neha Shetty Upcoming Movies Details - Sakshi

కొన్ని సినిమాల్లోని పాత్రలు ఎప్పటి గుర్తుండిపోతాయి. ఇంకా చెప్పాలంటే.. ఆ పాత్రలో నటించిన నటీనటులు అసలు పేర్లు అందరికి తెలియకపోవచ్చు కానీ.. క్యారెక్టర్‌ నేమ్‌ మాత్రం ప్రతి ఒక్కరికి గుర్తుంటుంది. అంతేకాదు ఇండస్ట్రీలో అదే పేరుతో ఫేమస్‌ అవుతారు. అలాంటి వారిలో నేహా శెట్టి ఒకరు. ఈ పేరు చాలా మందికి తెలియకపోచ్చు కానీ.. డీజే టిల్లు రాధిక అంటే మాత్రం ఇట్టే గుర్తుపట్టేస్తారు.

(చదవండి: ఒక్కరోజుకు పూజా హెగ్డే రెమ్యునరేషన్‌ ఎంతో తెలుసా..?)

సిద్దు జొన్నల గడ్డ హీరోగా నటించిన డీజే టిల్లు సినిమాల్లో   నేహా శెట్టి హీరోయిన్‌. అంతకు ముందు మెహబూబా సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. అయితే ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద బోల్తాపడడంతో నేహా శెట్టికి తగిన గుర్తుంపు రాలేదు. కానీ డీజే టిల్లుతో అందరికి రాధికగా దగ్గరైంది. ఆ ఒక్క సినిమాతో నేహాశెట్టికి ఎనలేని గుర్తింపు వచ్చింది.

అయితే తనకొచ్చిన క్రేజ్‌ని మాత్రం నేహాశెట్టి సరిగా వాడుకోలేకపోయింది. డీజే టిల్లు తర్వాత సిద్దూలాగే నేహా కూడా తర్వాత సినిమాకు చాలా గ్యాప్‌ తీసుకుంది. ఇప్పుడు ఆ గ్యాప్‌ని పూడ్చుకునే పనిలో పడింది మన రాధిక. వరుస సినిమాలతో దూసుకెళ్తోంది. ఇప్పటికీ ఈ బ్యూటీ నటించిన ‘బెదురులంక 2012’చిత్రం థియేటర్స్‌లో నవ్వులు పూయిస్తోంది. ఆగస్ట్‌ 25న విడుదలైన ఈ చిత్రంలో నేహాకి మంచి పాత్ర లభించింది. తన అందచందాలతో మరోసారి యువతను ఉర్రూతలు ఊగిస్తోంది.

త్వరలోనే మరో రెండు సినిమాలతో తెలుగు ప్రేక్షకులను పలకరించేందుకు రెడీ అవుతోంది. అందులో కిరణ్‌ అబ్బవరం హీరోగా నటిస్తున్న ‘రూల్స్‌ రంజన్‌’మూవీ ఒకటి. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ‘సమ్మోహనుడా’ సాంగ్‌ సోషల్‌ మీడియాలో సెన్సేషన్‌ క్రియేట్‌ చేస్తోంది. వచ్చే నెలలో ఈ చిత్రం విడుదల కాబోతుంది. ఇక ఈ ఏడాది నేహా నటించిన మూడో చిత్రం ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’. యంగ్‌ హీరో విశ్వక్‌సేన్‌ నటించిన ఈ చిత్రంలో కూడా నేహాకు మంచి పాత్ర లభించిందట. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పాట నెట్టింట వైరల్‌గా మారింది. ఇలా వరుస సినిమాలతో రాధిక టాలీవుడ్‌ని షేక్‌ చేస్తుంది .

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement