Rules Ranjann Movie
-
రెండు నెలల తర్వాత ఓటీటీలోకి ఆ తెలుగు సినిమా!
ఇప్పుడంతా ఓటీటీ జమానా నడుస్తోంది. థియేటర్లలో సినిమా రిలీజ్ కావడం లేట్.. డిజిటల్ స్ట్రీమింగ్‌లోకి ఎప్పుడొచ్చేస్తుందా? అని ప్రేక్షకుల వెయిట్ చేస్తుంటారు. అలాంటిది ఈ తెలుగు మూవీ థియేటర్లలోకి వచ్చి చాలా వారాలపోయింది. అందరూ దీని గురించి మర్చిపోయారు. ఇలాంటి టైంలో ఓటీటీలో తీసుకొస్తున్నారనే న్యూస్ కాస్త విచిత్రంగా అనిపించింది. ఇంతకీ ఏంటి సంగతి? (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో రిలీజ్ కానున్న 24 సినిమాలు) ఇంతకీ ఏ సినిమా? తెలుగు హీరోల్లో కిరణ్ అబ్బవరం ఓ యంగ్ హీరో. 'రాజావారు రాణిగారు', 'ఎస్ఆర్ కళ్యాణ మండపం' పర్లేదులే బాగానే చేస్తున్నాడని అందరూ అనుకున్నారు. ఆ తర్వాత పలు అగ్ర నిర్మాణ సంస్థలతో పనిచేశాడు. కానీ నో యూజ్. అన్ని సినిమాలు బిగ్ స్క్రీన్‌పై వరసపెట్టి ఫెయిలయ్యాయి. ఈ ఏడాది అక్టోబరు 6న 'రూల్స్ రంజన్' చిత్రంతో కిరణ్.. ప్రేక్షకుల్ని పలకరించాడు. ఏ విషయంలో ఈ సినిమా అలరించలేకపోయింది. ఓటీటీలోకి ఎప్పుడు? 'సమ్మోహనుడా' పాటతో పాటు ఒకటో రెండో కామెడీ సీన్స్ మాత్రమే బాగా తీసిన ఈ సినిమాని.. రిలీజ్ అయిన కొన్నిరోజులకే ఓటీటీలోకి తెచ్చేసి ఉంటే బాగుండేది. కానీ దాదాపు రెండు నెలల తర్వాత అంటే డిసెంబరు 1న అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ చేయాలని అనుకుంటున్నారట. ఈ తేదీ కంటే ముందు కూడా రిలీజ్ చేసే ఛాన్స్ ఉన్నట్లు కనిపిస్తుంది. ఏదేమైనా ఓ ఫ్లాప్ సినిమాని ఇన్నిరోజులు దాచిపెట్టడం విచిత్రంగా అనిపించింది. (ఇదీ చదవండి: Bigg Boss 7: డబుల్ ఎలిమినేషన్‌పై ట్విస్ట్.. అశ్విని, రతిక చివరకు అలా!) -
‘రూల్స్ రంజన్’ మూవీ రివ్యూ
టైటిల్: రూల్స్ రంజన్ నటీనటులు: కిరణ్ అబ్బవరం, నేహా శెట్టి, మెహర్ చాహల్, వెన్నెల కిషోర్, గోపరాజు రమణ, వైవా హర్ష తదితరులు నిర్మాణ సంస్థ : స్టార్‌లైట్ ఎంటర్టైన్మెంట్ నిర్మాతలు : దివ్యాంగ్ లావనియా, మురళీ కృష్ణ వేమూరి దర్శకత్వం: రత్నం కృష్ణ సమర్పణ : ఏఎం రత్నం సంగీతం: అమ్రీష్ విడుదల తేది: అక్టోబర్ 06, 2023 ఫలితంతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు యంగ్ హీరో కిరణ్ అబ్బవరం. పెద్ద పెద్ద నిర్మాణ సంస్థలతో కలిసి సినిమాలు చేస్తున్నాడు కానీ, సరైన హిట్ పడడం లేదు. ఈ సారి ఎలాగైన హిట్ కొట్టాలనే కసితో ‘రూల్స్ రంజన్’ చేశాడు. నేహా శెట్టి హీరోయిన్. ‘సమ్మోహణుడా’ అనే ఒకే ఒక పాట..ఈ సినిమాపై హైప్‌ని క్రియేట్ చేసింది. మంచి అంచనాలతో నేడు (అక్టోబర్ 06) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రంతో కిరణ్ అబ్బవరం హిట్ కొట్టాడా? లేదా? రివ్యూలో చూద్దాం. కథేంటంటే.. తిరుపతికి చెందిన మనో రంజన్ (కిరణ్ అబ్బవరం) ఇంజనీరింగ్ పూర్తి చేసి ముంబైలో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా చేరతాడు. హిందీ రాకపోవడంతో మొదట్లో తన సహోద్యోగులంతా అతనితో ఆడుకుంటారు. దీంతో మనో రంజన్ అలెక్సా సహాయంతో హిందీ నేర్చుకుంటారు. ఓ సారి కంపెనీని పెద్ద ప్రమాదం నుంచి కాపాడడంతో మేనేజర్‌తో సహా అంతా మనో రంజన్‌పై ప్రశంసలు కురిపిస్తారు. అంతేకాదు అప్పటి నుంచి మనోరంజన్ ఏం చెప్పినా మేనేజర్‌తో సహా మిగతా ఉద్యోగులంతా చేస్తారు. తను పెట్టిన రూల్స్ అందరూ ఫాలో కావాల్సిందే. అలా నాలుగేళ్లు గడిచిన తర్వాత.. తనకు సన(నేహా శెట్టి) పరిచయం అవుతుంది. ఆమె తన కాలేజ్ క్రష్. జాబ్ ఇంటర్వ్యూ కోసం ముంబై వస్తుంది. ఆమెతో ఒక రోజంతా సరదాగా గడుపుతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? రూల్స్ రంజన్ కాస్త పబ్ రంజన్‌గా ఎందుకు మారాడు? సన కోసం విలేజ్‌కి వచ్చిన తర్వాత ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? చివరకు సన, రంజన్ ఎలా కలిశారనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. పూర్తి వినోదాత్మకంగా సాగే కథ ఇది. ఈ తరహా కథలు టాలీవుడ్లో ఇప్పటికే చాలా వచ్చాయి. ప్రేమించిన అమ్మాయిని దక్కించుకోవడం కోసం హీరో చేసే సరదా ప్రయత్నాల నేపథ్యంలో కథ సాగుతుంది. దీని కంటే ముందు హీరో క్యారెక్టర్ ఇలా ఉంటుంది అని చెప్పడానికి కథను ముంబైకి తీసుకెళ్లారు. అక్కడికి వెళ్లాక మనో రంజన్ కాస్త రూల్స్ రంజన్‌గా ఎలా మారాడు అనేదే కాస్త వినోదాత్మకంగా చూపించారు. అయితే ఆఫీస్ నేపథ్యంలో సాగే సన్నివేశాలు రియాల్టీకీ చాలా దూరంగా ఉంటాయి. ఫస్టాఫ్ అంతా ముంబైలో సాగితే.. సెకండాఫ్ విలేజ్‌కి షిఫ్ట్ అవుతుంది. అక్కడ హైపర్ ఆది, సుదర్శన్, హర్షలతో వచ్చే కామెడీ సీన్స్ కాస్త వినోదాన్ని పంచుతాయి. కానీ ఆ తర్వాత వచ్చే కొన్ని సన్నివేశాలు సాగదీతగా అనిపిస్తాయి. అలా నిట్టూర్పుగా ఉన్న ప్రేక్షకులకు ‘సమ్మోహనుడా’ సాంగ్ ఎనర్జీని ఇస్తుంది. ఈ సినిమాకు ఈ పాట చాలా ప్లస్ అయిందని చెప్పాలి. క్లైమాక్స్ రొటీన్‌గా ఉంటుంది. దర్శకుడు కథలను మరింత బలంగా రాసుకొని ఉంటే.. సినిమా ఫలితం మరోలా ఉండేది. ఎవరెలా చేశారంటే.. మనోరంజన్ పాత్రకి కిరణ్ అబ్బవరం న్యాయం చేశాడు. అయితే ఈ తరహా పాత్రలు అతనికి కొత్తేమి కాదు. గత సినిమాల మాదిరే అమాయకపు మాటలతో కామెడీ పండించే ప్రయత్నం చేశాడు. కిరణ్ పాత్ర తీరు.. డైలాగ్స్.. అన్నీ గత సినిమాలను గుర్తు చేస్తాయి. సనగా నటించిన నేహాశెట్టి తెరపై చాలా అందంగా కనిపించింది. బి గ్రేడ్ సినిమాల కో-డైరెక్టర్‌గా వెన్నెల కిషోర్ కామెడీ వర్కౌట్ కాలేదు. హీరో చిన్ననాటి స్నేహితులుగా హైపర్ ఆది, హర్ష, సుదర్శన్‌లతో పాటు మిగిలిన నటీనటులు తమ తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతిక పరంగా ఈ సినిమా పర్వాలేదు. అమ్రీష్ సమకూర్చిన పాటల్లో ‘సమ్మోహనుడా’ ఒక్కటే బాగుంది. మిగతావి అంతగా ఆకట్టుకోలేదు. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువసు సినిమా స్థాయికి తగ్గట్లుగా ఉన్నాయి. - రేటింగ్: 2.25/5 -
రూల్స్ రంజన్ ట్విటర్ రివ్యూ.. కిరణ్ సినిమాకు అలాంటి టాక్!
హీరో కిరణ్ అబ్బవరం, డీజే టిల్లు బ్యూటీ నేహా శెట్టి జంటగా నటించిన చిత్రం రూల్స్ రంజన్. ఏఎం రత్నం కృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రం నేడు (అక్టోబర్ 6) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఏఎం రత్నం సమర్పణలో దివ్యాంగ్ లవానియా, మురళీ కృష్ణ వేమూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ మూవీలోని సమ్మోహనుడా పాట రూల్స్ రంజన్‌కు బాగా హైప్ తీసుకువచ్చింది. మరి రూల్స్ రంజన్ బాక్సాఫీస్‌ను రూల్ చేసేలా ఉందా? సినిమాకు ఎలాంటి టాక్ వస్తుందనేది సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు. ఇప్పటికే పలుచోట్ల ప్రివ్యూలు పడిపోవడంతో జనాలు సినిమా ఎలా ఉందనేది ఎక్స్ (ట్విటర్) వేదికగా చెప్పుకొస్తున్నారు. ఫస్టాఫ్ అస్సలు బాగోలేదని, కామెడీ కూడా పెద్దగా వర్కవుట్ కాదని అంటున్నారు. పర్లేదు, ఒకసారి చూడవచ్చని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. కిరణ్ ఫ్యాన్స్ మాత్రం హిట్టు కొట్టేశామని కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి రూల్స్ రంజన్‌కు మిక్స్డ్ టాక్ వస్తోంది. పూర్తి రివ్యూ వస్తే కానీ సినిమా ఎలా ఉందో చెప్పలేం.. oreyyyy apaaandroiiiiiii, entha sepu ra babu avvatle ee movie #RulesRanjann pic.twitter.com/Szuz8JLjCn — Jayyyyy (@movieloverrrr_) October 6, 2023 #RulesRanjann hilarious first half 😅 #KiranAbbavaram Vennela Kishore episodes bestttt confirm hit 😎 — Shiva Shankar (@Shivananda08) October 6, 2023 1st Half Report : Alaa amayakudi laa start ayyi.. 👨💼 mumbai.. 😁 Alexaaaa 😛 Cringee comedy.. 👎👎 Ruless... 🤷♂️Songs 👎🏃🏻Kishore kaka.. 👍Ala.. ala.. Okayish interval 🚶🏻♂️Overall a below par first half 🤷♂️ @tollymasti #tollymasti#RulesRanjann #KiranAbbavaram #RulesRanjan — Tollymasti (@tollymasti) October 6, 2023 Asalu baley movie cringe comedy #RulesRanjann — MB Ka HUKKUM 🦁 (@Radobom9) October 6, 2023 Done with my show...Entertaining comedy with family drama episodes. Simple storyline with ample fun lines by Kiran Abbavaram and Vennela Kishore goes well. Stimulating looks by Kiran and Neha Shetty in Sammohanuda song is one of the strength. 2.5/5 #RulesRanjann — Peter Reviews (@urstrulyPeter) October 6, 2023 Utter flop #RulesRanjann 🙏🏻🙏🏻🙏🏻 https://t.co/rQOnzMbTvg — rajesh! (@rajeshs0905) October 6, 2023 -
మాకు మంచి సింక్ కుదిరింది
కిరణ్ అబ్బవరం, నేహా శెట్టి జంటగా రత్నం కృష్ణ దర్శకత్వంలో రూ΄÷ందిన సినిమా ‘రూల్స్ రంజన్’. మురళీ కృష్ణ వేమూరి, దివ్యాంగ్ లవానియా నిర్మించిన ఈ చిత్రం నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా ఈ చిత్రదర్శకుడు రత్నం కృష్ణ మాట్లాడుతూ– ‘‘రూల్స్ రంజన్’ కథను నవీన్ ΄÷లిశెట్టికి చె΄్పాలనుకున్నాను. కుదరక΄ోవడంతో కిరణ్ అబ్బవరంకు వినిపించాను. కిరణ్‌కు కథ నచ్చడంతో ఈ సినిమాను ఆరంభించాం. కథా చర్చల్లో భాగంగా కిరణ్ మంచి క్రియేటర్ అని అర్థం అయ్యింది. మా ఇద్దరికీ మంచి సింక్ కుదిరింది. ఈ చిత్రం ఫస్టాఫ్ క్లాస్‌గా, సెకండాఫ్ మాస్‌గా ఉంటుంది. యూత్‌ఫుల్‌గా మొదలై, సెకండాఫ్‌లో ఫ్యామిలీ టర్న్ తీసుకుంటుంది. ఈ సినిమా రషెస్‌ను నాన్నగారి (ప్రముఖ నిర్మాత ఏయం రత్నం)తో ΄ాటు, నా శ్రేయోభిలాషులు, కిరణ్ సన్నిహితులు చూసి, హాయిగా నవ్వుకున్నారు. ప్రేక్షకులను కూడా మెప్పిస్తుందనే నమ్మకం ఉంది. దర్శకత్వం అంటే నాకు ఆసక్తి. అయితే నాన్నగారి ్ర΄÷డక్షన్ వ్యవహారాలు చూస్తుంటాను కాబట్టి డైరెక్షన్‌కి గ్యాప్ వచ్చింది. ఇక నా తమ్ముడు రవికృష్ణ నటించిన ‘7/జీ బృందావన కాలనీ’ సినిమా రీ రిలీజ్‌కు మంచి స్పందన వచ్చింది. వచ్చే నెలలో ఈ సినిమా సెకండ్ ΄ార్ట్ షూటింగ్ ఆరంభిస్తాం’’ అని అన్నారు. -
ఆ రోజులు గుర్తొచ్చాయి
‘‘రూల్స్ రంజన్’ పూర్తి వినోదాత్మక చిత్రం. ట్రైలర్ చూసి నవ్వుకున్నట్లే సినిమా అంతా ప్రేక్షకులు నవ్వుతూనే ఉంటారని కచ్చితంగా చెప్పగలను’’ అని హీరో కిరణ్ అబ్బవరం అన్నారు. రత్నం కృష్ణ దర్శకత్వంలో కిరణ్ అబ్బవరం, నేహా శెట్టి జంటగా నటించిన చిత్రం ‘రూల్స్ రంజన్’. ఏఎం రత్నం సమర్పణలో దివ్యాంగ్ లవానియా, మురళీ కృష్ణ వేమూరి నిర్మించిన ఈ సినిమా రేపు రిలీజవుతోంది. ఈ సందర్భంగా కిరణ్ అబ్బవరం చెప్పిన విశేషాలు. ► ప్రతి సినిమాలో ఒకే తరహా పాత్ర కాకుండా వైవిధ్యంగా ఉండేలా కథలు ఎంచుకుంటున్నాను. రత్నం కృష్ణ చెప్పిన ‘రూల్స్ రంజన్’ కథ మంచి విజువల్ కామెడీ డ్రామాగా ఉంటుందని నమ్మి, చేశాను. రత్నం కృష్ణ బాగా తీశారు. సినిమా అంతా సరదాగా సాగుతుంది. ‘వెన్నెల’ కిశోర్, నాకు మధ్య వచ్చే సన్నివేశాలు, వైవా హర్ష, సుబ్బరాజు, ఆది ట్రాక్‌లు మంచి వినోదం పంచుతాయి. ► సినిమాల్లోకి రాకముందు చెన్నైలో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా చేశాను. పల్లెటూరి నుంచి వెళ్లిన నాకు కెఫెటేరియా (క్యాంటీన్) అంటే ఎలా ఉంటుందో కూడా తెలియదు. ఆ వర్క్ కల్చర్, ఆఫీస్ పద్ధతులకు అలవాటు పడటం కష్టమైంది. ఈ చిత్రంలో మనోరంజన్ అనే సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా చేశాను. షూటింగ్ చేస్తున్నప్పుడు నేను ఉద్యోగం చేసిన రోజులు గుర్తొచ్చాయి. ► నిర్మాతలు ఏఎం రత్నం, దివ్యాంగ్ లవానియా, మురళీ కృష్ణగార్లు ఎక్కడా రాజీ పడకుండా ఈ సినిమా తీశారు. ఈ చిత్రంలోని ‘సమ్మోహనుడా..’ పాట హైప్ తీసుకు వచ్చింది. ఇది రొమాంటిక్ సాంగ్. అందుకే సవాల్‌గా అనిపించింది. ప్రస్తుతం సీనియర్ డైరెక్టర్స్‌తో రెండు, కొత్త దర్శకులతో రెండు సినిమాలు చేస్తున్నాను. -
థియేటర్లలోకి ఒకేరోజు 10 సినిమాలు.. మీరేం చూస్తారు?
ఎలా చూసుకున్నా సరే థియేటర్లలో ప్రతి శుక్రవారం ఒకటి రెండు అదీ కాదంటే ఓ మూడు సినిమాల వరకు రిలీజ్ అవుతుంటాయి. అంతకు మించి వస్తే మాత్రం థియేటర్ల దగ్గర నుంచి ప్రేక్షకుల వరకు ప్రతిదీ సమస్య అవుతుంది. కానీ అలాంటి వాటిని అస్సలు పట్టించుకోకుండా ఈ శుక్రవారం ఏకంగా 10 సినిమాలు థియేటర్లలోకి వచ్చేస్తున్నాయి. ఇంతకీ వాటి సంగతేంటి? (ఇదీ చదవండి: కన్నీళ్లు పెట్టుకున్న స్టార్ హీరో సిద్ధార్థ్.. తనని అవమానించారని!) ప్రతివారం ఓటీటీల్లో పదుల సంఖ్యలో సినిమాలు-వెబ్ సిరీసులు రిలీజ్ అవుతుంటాయి. ఇప్పుడు వీటికి పోటీ ఇచ్చేలా థియేటర్లలో ఈ శుక్రవారం దాదాపు 10 వరకు కొత్త మూవీస్ విడుదల కాబోతున్నాయి. వీటిలో 'మ్యాడ్', 'రూల్స్ రంజన్', 'మామా మశ్చీంద్ర', 'మంత్ ఆఫ్ మధు', 'ఏందిరా ఈ పంచాయతీ', 'అభిరామచంద్ర', 'గన్స్ ట్రాన్స్ యాక్షన్' లాంటి స్ట్రెయిట్ సినిమాలు ఉన్నాయి. పైన చెప్పిన చిత్రాలకే థియేటర్లు దొరకడం కష్టమనుకుంటే 800, చిన్నా, ఎక్సార్సిస్ట్ అనే డబ్బింగ్ మూవీస్ కూడా ఇదే తేదీకి బిగ్ స్క్రీన్‌పైకి వచ్చేందుకు రెడీ అయిపోయాయి. ఈ మొత్తం లిస్టులో కాలేజీ కామెడీ ఎంటర్టైనర్ స్టోరీతో తీసిన 'మ్యాడ్' కాస్త ఆసక్తి కలిగిస్తుంది. మిగతా వాటిపై పెద్దగా బజ్ లేదు. అయితే వీటిలో ఏది హిట్ అవుతుందో ఏంటనేది తెలియాలంటే మరో మూడు రోజులు ఆగితే సరిపోతుంది. ఇంతకీ వీటిలో మీ ఛాయిస్ ఏంటి? (ఇదీ చదవండి: సల్మాన్‌ఖాన్ బండారం బయటపెట్టిన మాజీ ప్రేయసి) -
ఆ పాట నాకో సవాల్
‘‘రూల్స్ రంజన్’ రొటీన్ అబ్బాయి–అమ్మాయిల కథ కాదు. విభిన్నమైన చిత్రం’’ అని నేహా శెట్టి అన్నారు. కిరణ్ అబ్బవరం, నేహా శెట్టి జంటగా రత్నం కృష్ణ దర్శకత్వం వహించిన చిత్రం ‘రూల్స్ రంజన్’. ఏఎం రత్నం సమర్పణలో దివ్యాంగ్ లవానియా, మురళీ కృష్ణ వేమూరి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 6న విడుదలవుతోంది. ఈ సందర్భంగా నేహా శెట్టి మాట్లాడుతూ– ‘‘నా ఫస్ట్ సినిమా ‘మెహబూబా’ సక్సెస్ కాలేదు. ఆ తర్వాత నేను యాక్టింగ్ కోర్స్ కోసం న్యూయార్క్ వెళ్లాను. తిరిగొచ్చాక ‘డీజే టిల్లు’కి చాన్స్ వచ్చింది.. ఆ తర్వాత ‘బెదురులంక 2012’ చేశాను. రెండూ విజయం సాధించాయి. ‘రూల్స్ రంజన్’లో సన పాత్ర ΄ోషించాను. ఇందులో ‘సమ్మోహనుడా..’ పాటకి డ్యాన్స్ చేయడం సవాల్‌గా అనిపించింది. ఈ పాట వాన బ్యాక్‌డ్రాప్‌లోనూ సాగుతుంది. వాన పాటల విషయానికొస్తే.. నాకు శ్రీదేవిగారు గుర్తుకు వస్తారు. చిన్న వయసులో సినీ జీవితాన్ని ్రపారంభించి ఉన్నత స్థాయికి చేరారామె. నటిగా ఆమెలా పేరు తెచ్చుకోవాలనుకుంటున్నాను’’ అన్నారు. -
'రూల్స్ రంజన్' అలాంటి సినిమా: నేహాశెట్టి
కిరణ్ అబ్బవరం, నేహాశెట్టి హీరోహీరోయిన్లుగా నటించిన మూవీ 'రూల్స్ రంజన్'. అక్టోబరు 6న థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలో ప్రమోషన్స్ మంచిగా సాగుతున్నాయి. హీరోయిన్ నేహాశెట్టి.. హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాల్ని చెప్పింది. 'సమ్మోహనుడా' సాంగ్ గురించి ఎవరికీ తెలియని విషయాలు పంచుకుంది. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 29 సినిమాలు) 'రూల్స్ రంజన్'లో సన అనే అమ్మాయిగా నటించాను. ఇది పక్కంటి అమ్మాయి తరహా పాత్ర. 'డీజే టిల్లు' రాధిక పాత్రతో ఎలాంటి పోలిక ఉండదని నేహాశెట్టి చెప్పింది. గత రెండు చిత్రాల్లానే ఇది కూడా అభిమానులను అలరిస్తుందని ధీమా వ్యక్తం చేసింది. అలానే కిరణ్ అబ్బవరం సెట్స్‌లో చాలా కామ్, కూల్‌గా ఉంటారని చెప్పుకొచ్చింది. వాన పాటల విషయానికి వస్తే.. నాకు అలనాటి తార శ్రీదేవి గుర్తొస్తారు. ఆమెకి నేను వీరాభిమానిని. చిన్న వయసులోనే సినీ జీవితాన్ని ప్రారంభించిన ఆమె.. చాలా తక్కువ సమయంలోనే ఉన్నత స్థాయికి చేరుకున్నారు. అలాంటి నటిగా పేరు తెచ్చుకోవాలని అనుకుంటున్నాను. నా మొదటి పాటలో రెయిన్ సీక్వెన్స్ ఉండడం, ఆ పాటకి ఈ స్థాయి స్పందన లభిస్తుండటం చాలా ఆనందంగా ఉంది. (ఇదీ చదవండి: 'బిగ్‌బాస్' ఎలిమినేషన్ తర్వాత రతిక ఫస్ట్ రియాక్షన్) -
సినిమా అంటే సులభం కాదు – నిర్మాత ఏఎం రత్నం
‘‘రాజకీయం, వ్యాపారం.. ఇలా అన్నిరంగాలపై అవగాహన ఉన్నవాళ్లే మూవీస్ చేయగలరు. సినిమా అంత సులభం కాదు.. ఖర్చు, రిస్క్‌తో కూడిన పని. అయినా నేను ఇండస్ట్రీలో ఉన్నందుకు గర్విస్తున్నాను. కిరణ్‌తో మరో సినిమా చేస్తా.. ఆ చిత్రానికి నేనే దర్శకత్వం చేస్తాను’’ అని నిర్మాత ఏఎం రత్నం అన్నారు. కిరణ్ అబ్బవరం, నేహా శెట్టి జంటగా రత్నం కృష్ణ దర్శకత్వం వహించిన చిత్రం ‘రూల్స్ రంజన్’. ఏఎం రత్నం సమర్పణలో దివ్యాంగ్ లవానియా, మురళీ కృష్ణ వేమూరి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 6న విడుదలకానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకకి నిర్మాతలు ఏఎం రత్నం, అంబికా కృష్ణ, దర్శకుడు అనుదీప్ కేవీ ప్రత్యేక అతిథులుగా హాజరయ్యారు. ‘‘పక్కా యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ చిత్రం ‘రూల్స్ రంజన్’. నేను సిక్స్ కొట్టడానికి దొరికిన లాస్ట్ బాల్ ఇది.. తప్పకుండా సిక్సర్ కొడతా’’ అన్నారు రత్నం కృష్ణ. ‘‘నిర్మాణ రంగంలో ఏఎం రత్నంగారు మాకు అండగా ఉన్నారు’’ అన్నారు మురళీకృష్ణ వేమూరి. ‘‘నేను నటించిన పూర్తి స్థాయి వినోదాత్మక సినిమా ఇది’’ అన్నారు కిరణ్ అబ్బవరం. -
'రూల్స్ రంజన్' ప్రీ-రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
ట్రోల్స్ పట్టించుకోను.. సంవత్సరం టైమ్ ఇవ్వండి: కిరణ్ అబ్బవరం
ఎలాంటి సినిమా బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కిరణ్ అబ్బవరం మొదటి చిత్రం ‘రాజావారు రాణిగారు’తో ప్రేక్షకులను మెప్పించారు. ఆ సినిమా విజయంతో వరుస ప్రాజెక్ట్‌లలో అవకాశాలు వచ్చాయి. అలా ఆయన ఎస్. ఆర్. కల్యాణ మండపం, సమ్మతమే, నేను మీకు బాగా కావాల్సిన వాడిని, వినరో భాగ్యము విష్ణు కథ, మీటర్ వంటి చిత్రాలతో టాలీవుడ్లో మినిమమ్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. మొదటి సినిమా తర్వాత ఆయనకు అనుకున్నంత హిట్ ఇప్పటి వరకు రాలేదు. దీంతో కిరణ్‌పై పలు ట్రోల్స్ వచ్చాయి. తాజాగా కిరణ్ నటించిన ‘రూల్స్ రంజన్’ అక్టోబర్ 6న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ కార్యక్రమంలో తన కెరీర్, ఆన్లైన్ ట్రోలింగ్‌పై మాట్లాడారు. 'చాలా మంది నాపై ట్రోల్స్ చేశారు. గత మూడు సంవత్సరాలుగా నా జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాను. అలాంటి సమయంలో నా ఫ్యాన్స్ ఎంతో అండగా నిలబడ్డారు. గొప్ప సినిమాలు తీయాలని నాకు ఉంది. కొన్ని కారణాల వల్ల అది జరగలేదు. ఈ మధ్య కాలంలో అంత మంచి సినిమాలను అందించలేకపోయాను. ఒక సంవత్సరం సమయం ఇవ్వండి మిమ్మల్ని (ఫ్యాన్స్) గొప్ప స్థానంలో నిలబెడుతాను. సరైన విజయం సాధించి అందరినీ గర్వపడేలా చేస్తాను. సినిమాపై ట్రోల్స్,రివ్యూలు రావడం సహజం. (ఇదీ చదవండి: శివాజీ తిక్క కుదిర్చిన బిగ్‌బాస్.. ఇచ్చింది లాగేసుకున్నాడు!) ఒక్కోసారి అది సినిమాపై ప్రభావం కూడా చూపుతుంది. వ్యక్తిగతంగా పట్టించుకోకపోయినా సినిమాపై ప్రభావండ పడకూడదని నేనే కోరుకుంటాను. ఇకపై ట్రోల్స్ గురించి పట్టించుకోను. ప్రశంసలు, విమర్శలు అనేది చలనచిత్ర సెలబ్రిటీ జీవితంలో ఒక భాగం.' అని ఆయన అన్నారు. రత్నం కృష్ణ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో డీజే టిల్లు ఫేం నేహాశెట్టి కిరణ్ అబ్బవరం సరసన హీరోయిన్గా నటిస్తోంది. ఏఎం. రత్నం సమర్పణలో దివ్యాంగ్ లవానియా, మురళీ కృష్ణ వేమూరి నిర్మించిన చిత్రం ఇది. -
ఆ డైరెక్టర్ చేసిన పనికి రాత్రంతా ఏడ్చినా DJ టిల్లు హీరోయిన్
-
సమ్మోహనుడా పాట షూటింగ్లో దర్శకుడితో గొడవ, ఏడ్చేసిన హీరోయిన్!
ఎన్ని సినిమాలు చేసినా రాని గుర్తింపు ఒక్క చిత్రంతో వస్తుంది. ఇది ఇప్పటికే ఎన్నోసార్లు రుజువైంది. అదే జాబితాలోకి వస్తుంది నేహా శెట్టి. ఈ కన్నడ బ్యూటీ ముంగరు మేల్ 2 అనే కన్నడ చిత్రంతో వెండితెరపై అడుగుపెట్టింది. కానీ ఈ మూవీ పేరు, అవకాశాలు తెచ్చిపెట్టలేదు. రెండేళ్ల తర్వాత 2018లో మెహబూబా సినిమాతో తెలుగులో అడుగుపెట్టింది. కానీ ఇక్కడా అదే పరిస్థితి! మళ్లీ మూడేళ్ల వరకు అవకాశాలే రాలేదు. అయితే డీజే టిల్లు సినిమా ఆమె కెరీర్‌నే మార్చేసింది. తను చేసిన రాధిక పాత్ర ఒక్కసారిగా స్టార్డమ్, అవకాశాలు తెచ్చిపెట్టింది. తర్వాత తను చేసిన 'బెదురులంక 2012' మూవీ కూడా హిట్.. ప్రస్తుతం ఈ రాధిక రూల్స్ రంజన్, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలు చేస్తోంది. సమ్మోహనుడా సాంగ్ కోసం కష్టాలు.. ఇకపోతే కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన రూల్స్ రంజన్ అక్టోబర్ 6న విడుదల కానుంది. ఇందులోని సమ్మోహనుడా సాంగ్ ఇప్పటికే తెగ వైరలవుతోంది. అయితే ఈ పాట చిత్రీకరణ సమయంలో హీరోయిన్‌తో గొడవైందంటున్నాడు దర్శకుడు రత్నం కృష్ణ. తాజాగా అతడు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'సమ్మోహనుడా సినిమా షూటింగ్ దాదాపు పూర్తయిపోయింది. సమ్మోహనుడా పాటలో స్విమ్మింగ్ పూల్ షాట్ ఒక్కటే మిగిలి ఉంది. ఆ నీళ్లలో ఉష్ణోగ్రత 5 డిగ్రీలు ఉంది. నేను షాట్‌కు అంతా సిద్ధం చేసుకున్నాను. ఆ నీళ్లలోకి వెళ్లి యాక్ట్ చేయమని చెప్తే.. నేహా రేపు పొద్దున నీవల్లే ఈ సమస్య వచ్చింది, నువ్వే చేయమన్నావ్ అంటుంది. అందుకని.. రివర్స్‌లో నువ్వు చేయొద్దులే అని చెప్పాను. మోకాలికి గాయం.. అయినా వదిలేయని డైరెక్టర్ నిజానికి అంత చల్లని నీళ్లలోకి తనను పంపించి షూట్ చేయడం అసలు కరెక్ట్ కాదు. షాట్ క్యాన్సల్ చేస్తానన్నాను. లేదు, నేను ట్రై చేస్తానంటూ తను నీళ్లలోకి దిగింది. చాలాసేపు పూల్‌లో ఉండటంతో క్లోరిన్ వాటర్ వల్ల తన మోకాలికి కొద్దిగా గాయమైంది. అప్పటికే అరగంటపైనే అయింది. నాకింకా రెండు,మూడు షాట్స్ తీయాల్సి ఉంది. తను త్వరగా తీయ్, త్వరగా తీయ్ అని అంటుంటే ఇంకో 5-10 నిమిషాలు ఓర్చుకో అని చెప్పాను. తను నా మాట వినకుండా ఆ నీళ్లలో నుంచి బయటకు వచ్చేసింది. మూడు నెలల వరకు మాట్లాడుకోలేదు ఇంకాసేపు ఉండుంటే ఆ రెండు షాట్స్ తీసేవాడిని కదా అని గొడవపడ్డాను. అలా మా ఇద్దరి మధ్య గొడవ జరిగింది. మూడు నెలల వరకు మాట్లాడుకోలేదు. తర్వాత సినిమా ఎడిటింగ్ చేసేటప్పుడు వాటర్ సీన్ చూసి చాలా బాధపడ్డాను. అరె.. ఎవరూ ఇలాంటి షాట్ తీయలేరు, ఇలా చేయలేరు అనుకున్నాను. నేహాకు ఫోన్ చేసి మాట్లాడాను' అని చెప్పుకొచ్చాడు. నేహా సైతం ఈ షాట్ తర్వాత చాలా ఏడ్చాను అని తెలిపింది. ఓపక్క తను పడ్డ కష్టం, మరోపక్క షాట్ బాగా వచ్చిందన్న సంతోషంతో ఎమోషనలయ్యానంది. చదవండి: గౌతమ్‌కు అన్యాయం? అప్పటిదాకా కన్నీళ్లు.. ఆ తర్వాత మాత్రం.. అబ్బో మహానటి! -
సినిమా పోస్ట్ పోన్ అవ్వడానికి కారణం ఇదే..!
-
కాస్త ఆలస్యంగా రూల్స్ రంజన్
కిరణ్ అబ్బవరం, నేహా శెట్టి జంటగా నటించిన చిత్రం ‘రూల్స్ రంజన్’. రత్నం కృష్ణ దర్శకత్వంలో ఏఎం. రత్నం సమర్పణలో దివ్యాంగ్ లవానియా, మురళీ కృష్ణ వేమూరి నిర్మించిన చిత్రం ఇది. కాగా ఈ సినిమాను ఇటీవల ఈ నెల 28న విడుదల చేస్తున్నట్లుగా చిత్ర యూనిట్ ప్రకటించింది. అయితే అక్టోబరు 6న రిలీజ్ చేయనున్నట్లు మంగళవారం ప్రకటించారు మేకర్స్. మెహర్ చాహల్, ‘వెన్నెల’ కిషోర్, సుబ్బరాజు, హైపర్ ఆది,‘వైవా’ హర్ష కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి సంగీతం: అమ్రిష్ గణేష్ -
మనోరంజన్ కాదు.. పబ్ రంజన్..ట్రైలర్ చూస్తే నవ్వులే నవ్వులు
‘ప్రతి తండ్రి నన్ను చూసి నేర్చుకోవాల. అమ్మ పాలిచ్చి పెంచుద్ది, అయ్య మందిచ్చి ఓదార్చాల. చెప్పు నాన్న ఏం తాగుతావు?’ (గోపరాజు రమణ). ‘బీర్ ఓకే’ (కిరణ్ అబ్బవరం) అనే సంభాషణలతో మొదలవుతుంది ‘రూల్స్ రంజన్’ ట్రైలర్. కిరణ్ అబ్బవరం, నేహా శెట్టి జంటగా రత్నం కృష్ణ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘రూల్స్ రంజన్’. నిర్మాత ఏ.ఎం. రత్నం సమర్పణలో దివ్యాంగ్ లవానియా, మురళీకృష్ణ వేమూరి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 28న విడుదల కానుంది. ఈ సందర్భంగా శుక్రవారం ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. ‘మా ఆఫీస్‌లో వీకెండ్స్ వస్తే నన్ను ఏమంటారో తెలుసా.. మనోరంజన్ కాదు.. పబ్ రంజన్ అంటారు (కిరణ్ అబ్బవరం), ‘ఈ రూల్స్ రంజన్ పంబ్ రంజన్‌గా ఎందుకు మారాడు? (మరో పాత్రధారి) అనే డైలాగ్స్ ట్రైలర్లో ఉన్నాయి. మెహర్ చాహల్, వెన్నెల కిశోర్, సుబ్బరాజు, హైపర్ ఆది, వైవా హర్ష, అన్నూ కపూర్ కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రానికి సంగీతం: అమ్రిష్ గణేష్, సహనిర్మాత: రింకు కుక్రెజ. -
‘రూల్స్ రంజన్’గా వచ్చేస్తున్న కిరణ్ అబ్బవరం
‘‘రూల్స్ రంజన్’ కథ వింటున్నప్పుడు రెండు గంటల పాటు నవ్వుతూనే ఉన్నాను. ప్రేక్షకులు అలాగే నవ్వుకుంటారనే నమ్మకం ఉంది’’ అని కిరణ్ అబ్బవరం అన్నారు. రత్నం కృష్ణ దర్శకత్వంలో కిరణ్ అబ్బవరం, నేహా శెట్టి జంటగా నటించిన చిత్రం ‘రూల్స్ రంజన్’. ఏఎం రత్నం సమర్పణలో దివ్యాంగ్ లవానియా, మురళీ కృష్ణ వేమూరి నిర్మించారు. ఈ సినిమాని ఈ నెల 28న విడుదల చేస్తున్నట్లు ఏఎం రత్నం వెల్లడించి, మాట్లాడుతూ– ‘‘నా అనుభవం ప్రకారం ఆడియో హిట్ అయితే సినిమా సగం హిట్ అయినట్లే. మా ‘రూల్స్ రంజన్’కి అమ్రిష్ అద్భుతమైన సంగీతం అందించారు’’ అన్నారు. ‘‘స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి ఆనందించదగ్గ చిత్రమిది’’ అన్నారు రత్నం కృష్ణ. ‘‘ఏఎం రత్నంగారి ఆశీస్సులతో ముందడుగు వేశాం’’ అన్నారు దివ్యాంగ్, మురళీ కృష్ణ. -
Neha Shetty: టాలీవుడ్‌ని షేక్ చేస్తున్న ‘రాధిక’
కొన్ని సినిమాల్లోని పాత్రలు ఎప్పటి గుర్తుండిపోతాయి. ఇంకా చెప్పాలంటే.. ఆ పాత్రలో నటించిన నటీనటులు అసలు పేర్లు అందరికి తెలియకపోవచ్చు కానీ.. క్యారెక్టర్ నేమ్ మాత్రం ప్రతి ఒక్కరికి గుర్తుంటుంది. అంతేకాదు ఇండస్ట్రీలో అదే పేరుతో ఫేమస్ అవుతారు. అలాంటి వారిలో నేహా శెట్టి ఒకరు. ఈ పేరు చాలా మందికి తెలియకపోచ్చు కానీ.. డీజే టిల్లు రాధిక అంటే మాత్రం ఇట్టే గుర్తుపట్టేస్తారు. (చదవండి: ఒక్కరోజుకు పూజా హెగ్డే రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..?) సిద్దు జొన్నల గడ్డ హీరోగా నటించిన డీజే టిల్లు సినిమాల్లో నేహా శెట్టి హీరోయిన్. అంతకు ముందు మెహబూబా సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. అయితే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తాపడడంతో నేహా శెట్టికి తగిన గుర్తుంపు రాలేదు. కానీ డీజే టిల్లుతో అందరికి రాధికగా దగ్గరైంది. ఆ ఒక్క సినిమాతో నేహాశెట్టికి ఎనలేని గుర్తింపు వచ్చింది. అయితే తనకొచ్చిన క్రేజ్‌ని మాత్రం నేహాశెట్టి సరిగా వాడుకోలేకపోయింది. డీజే టిల్లు తర్వాత సిద్దూలాగే నేహా కూడా తర్వాత సినిమాకు చాలా గ్యాప్ తీసుకుంది. ఇప్పుడు ఆ గ్యాప్‌ని పూడ్చుకునే పనిలో పడింది మన రాధిక. వరుస సినిమాలతో దూసుకెళ్తోంది. ఇప్పటికీ ఈ బ్యూటీ నటించిన ‘బెదురులంక 2012’చిత్రం థియేటర్స్‌లో నవ్వులు పూయిస్తోంది. ఆగస్ట్ 25న విడుదలైన ఈ చిత్రంలో నేహాకి మంచి పాత్ర లభించింది. తన అందచందాలతో మరోసారి యువతను ఉర్రూతలు ఊగిస్తోంది. త్వరలోనే మరో రెండు సినిమాలతో తెలుగు ప్రేక్షకులను పలకరించేందుకు రెడీ అవుతోంది. అందులో కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తున్న ‘రూల్స్ రంజన్’మూవీ ఒకటి. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ‘సమ్మోహనుడా’ సాంగ్ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. వచ్చే నెలలో ఈ చిత్రం విడుదల కాబోతుంది. ఇక ఈ ఏడాది నేహా నటించిన మూడో చిత్రం ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’. యంగ్ హీరో విశ్వక్సేన్ నటించిన ఈ చిత్రంలో కూడా నేహాకు మంచి పాత్ర లభించిందట. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పాట నెట్టింట వైరల్‌గా మారింది. ఇలా వరుస సినిమాలతో రాధిక టాలీవుడ్‌ని షేక్ చేస్తుంది . -
'రూల్స్ రంజన్' కొత్త పాట
కిరణ్ అబ్బవరం, నేహా శెట్టి జంటగా నటించిన చిత్రం ‘రూల్స్ రంజన్ ’. రత్నం కృష్ణ దర్శకత్వం వహించారు. ఏఎం రత్నం సమర్పణలో దివ్యాంగ్ లవానియా, మురళీ కృష్ణ వేమూరి నిర్మించారు. అమ్రిష్ గణేష్ స్వరాలు అందించిన ఈ చిత్రంలోని ‘ఎందుకురా బాబు.. కొంచెం ఆగరా బాబు..’ అనే లిరికల్ వీడియో సాంగ్‌ని చిత్రయూనిట్ విడుదల చేసింది. కాసర్ల శ్యామ్ లిరిక్స్ అందించిన ఈ పాటను రాహుల్ సిప్లిగంజ్, రేవంత్ ఆలపించగా, శిరీష్ నృత్యరీతులు సమకూర్చారు. ‘‘మా సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. సెప్టెంబరు మొదటి వారంలో చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. -
Rules Ranjann: ఆకట్టుకుంటున్న ‘'ఎందుకురా బాబు' పాట
హిట్, ప్లాప్‌లతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు యంగ్ హీరో కిరణ్ అబ్బవరం. ఆయన తాజాగా నటించిన చిత్రం 'రూల్స్ రంజన్'. నేహా శెట్టి హీరోయిన్. రత్నం కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఏ.ఎం. రత్నం సమర్పణలో స్టార్ లైట్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై దివ్యాంగ్ లవానియా, మురళి కృష్ణ వేమూరి నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ కి, 'నాలో నేనే లేను', 'సమ్మోహనుడా' పాటలకి ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. తాజాగా ఈ చిత్రం నుంచి మూడో పాట విడుదలైంది. 'ఎందుకురా బాబు' అంటూ సాగే ఈ పాటకి కాస్లర్ల శ్యామ్ లిరిక్స్ అందించగా.. ప్రముఖ గాయకులు రాహుల్ సిప్లిగంజ్, రేవంత్ అద్భుతంగా ఆలపించారు. 'నాలో నేనే లేను', 'సమ్మోహనుడా' పాటల మాదిరిగానే అమ్రిష్ గణేష్ మరోసారి తన మ్యూజిక్ తో మ్యాజిక్ చేశారు. వినోదనమే ప్రధానంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు నిర్మాతలు తెలిపారు. ప్రస్తుతం చిత్రం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. సెప్టెంబర్ నెల ప్రథమార్థంలో చిత్రం విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు.