కాస్త ఆలస్యంగా రూల్స్‌ రంజన్‌  | kiran abbavaram movie rules ranjan has been postponed to october 6 | Sakshi
Sakshi News home page

కాస్త ఆలస్యంగా రూల్స్‌ రంజన్‌ 

Published Wed, Sep 13 2023 12:12 AM | Last Updated on Wed, Sep 13 2023 12:12 AM

kiran abbavaram movie rules ranjan has been postponed to october 6 - Sakshi

నేహా శెట్టి,కిరణ్‌ అబ్బవరం

కిరణ్‌ అబ్బవరం, నేహా శెట్టి జంటగా నటించిన చిత్రం ‘రూల్స్‌ రంజన్‌’. రత్నం కృష్ణ దర్శకత్వంలో ఏఎం. రత్నం సమర్పణలో దివ్యాంగ్‌ లవానియా, మురళీ కృష్ణ వేమూరి నిర్మించిన చిత్రం ఇది.

కాగా ఈ సినిమాను ఇటీవల ఈ నెల 28న విడుదల చేస్తున్నట్లుగా చిత్ర యూనిట్‌ ప్రకటించింది. అయితే అక్టోబరు 6న రిలీజ్‌ చేయనున్నట్లు మంగళవారం ప్రకటించారు మేకర్స్‌. మెహర్‌ చాహల్, ‘వెన్నెల’ కిషోర్, సుబ్బరాజు, హైపర్‌ ఆది,‘వైవా’ హర్ష కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి సంగీతం: అమ్రిష్‌ గణేష్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement