రెండు నెలల తర్వాత ఓటీటీలోకి ఆ తెలుగు సినిమా! | Kiran Abbavaram's Rules Ranjann Movie OTT Release Date | Sakshi
Sakshi News home page

OTT Movie: కిరణ్ అబ్బవరం మూవీ.. ఓటీటీలో ఇన్నాళ్లకు రిలీజ్!

Published Mon, Nov 20 2023 4:33 PM | Last Updated on Mon, Nov 20 2023 4:51 PM

Kiran Abbavaram Rules Ranjann Movie OTT Release Date - Sakshi

ఇప్పుడంతా ఓటీటీ జమానా నడుస్తోంది. థియేటర్లలో సినిమా రిలీజ్ కావడం లేట్.. డిజిటల్ స్ట్రీమింగ్‌లోకి ఎప్పుడొచ్చేస్తుందా? అని ప్రేక్షకుల వెయిట్ చేస్తుంటారు. అలాంటిది ఈ తెలుగు మూవీ థియేటర్లలోకి వచ్చి చాలా వారాలపోయింది. అందరూ దీని గురించి మర్చిపోయారు. ఇలాంటి టైంలో ఓటీటీలో తీసుకొస్తున్నారనే న్యూస్ కాస్త విచిత్రంగా అనిపించింది. ఇంతకీ ఏంటి సంగతి?

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో రిలీజ్ కానున్న 24 సినిమాలు)

ఇంతకీ ఏ సినిమా?
తెలుగు హీరోల్లో కిరణ్ అబ్బవరం ఓ యంగ్ హీరో. 'రాజావారు రాణిగారు', 'ఎస్ఆర్ కళ్యాణ మండపం' పర్లేదులే బాగానే చేస్తున్నాడని అందరూ అనుకున్నారు. ఆ తర్వాత పలు అగ్ర నిర్మాణ సంస్థలతో పనిచేశాడు. కానీ నో యూజ్. అన్ని సినిమాలు బిగ్ స్క్రీన్‌పై వరసపెట్టి ఫెయిలయ్యాయి. ఈ ఏడాది అక్టోబరు 6న 'రూల్స్ రంజన్' చిత్రంతో కిరణ్.. ప్రేక్షకుల్ని పలకరించాడు. ఏ విషయంలో ఈ సినిమా అలరించలేకపోయింది.

ఓటీటీలోకి ఎప్పుడు?
'సమ్మోహనుడా' పాటతో పాటు ఒకటో రెండో కామెడీ సీన్స్ మాత్రమే బాగా తీసిన ఈ సినిమాని.. రిలీజ్ అయిన కొన్నిరోజులకే ఓటీటీలోకి తెచ్చేసి ఉంటే బాగుండేది. కానీ దాదాపు రెండు నెలల తర్వాత అంటే డిసెంబరు 1న అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ చేయాలని అనుకుంటున్నారట. ఈ తేదీ కంటే ముందు కూడా రిలీజ్ చేసే ఛాన్స్ ఉన్నట్లు కనిపిస్తుంది. ఏదేమైనా ఓ ఫ్లాప్ సినిమాని ఇన్నిరోజులు దాచిపెట్టడం విచిత్రంగా అనిపించింది.

(ఇదీ చదవండి: Bigg Boss 7: డబుల్ ఎలిమినేషన్‌పై ట్విస్ట్.. అశ్విని, రతిక చివరకు అలా!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement