కిరణ్ అబ్బవరం, నేహాశెట్టి హీరోహీరోయిన్లుగా నటించిన మూవీ 'రూల్స్ రంజన్'. అక్టోబరు 6న థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలో ప్రమోషన్స్ మంచిగా సాగుతున్నాయి. హీరోయిన్ నేహాశెట్టి.. హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాల్ని చెప్పింది. 'సమ్మోహనుడా' సాంగ్ గురించి ఎవరికీ తెలియని విషయాలు పంచుకుంది.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 29 సినిమాలు)
'రూల్స్ రంజన్'లో సన అనే అమ్మాయిగా నటించాను. ఇది పక్కంటి అమ్మాయి తరహా పాత్ర. 'డీజే టిల్లు' రాధిక పాత్రతో ఎలాంటి పోలిక ఉండదని నేహాశెట్టి చెప్పింది. గత రెండు చిత్రాల్లానే ఇది కూడా అభిమానులను అలరిస్తుందని ధీమా వ్యక్తం చేసింది. అలానే కిరణ్ అబ్బవరం సెట్స్‌లో చాలా కామ్, కూల్‌గా ఉంటారని చెప్పుకొచ్చింది.
వాన పాటల విషయానికి వస్తే.. నాకు అలనాటి తార శ్రీదేవి గుర్తొస్తారు. ఆమెకి నేను వీరాభిమానిని. చిన్న వయసులోనే సినీ జీవితాన్ని ప్రారంభించిన ఆమె.. చాలా తక్కువ సమయంలోనే ఉన్నత స్థాయికి చేరుకున్నారు. అలాంటి నటిగా పేరు తెచ్చుకోవాలని అనుకుంటున్నాను. నా మొదటి పాటలో రెయిన్ సీక్వెన్స్ ఉండడం, ఆ పాటకి ఈ స్థాయి స్పందన లభిస్తుండటం చాలా ఆనందంగా ఉంది.
(ఇదీ చదవండి: 'బిగ్‌బాస్' ఎలిమినేషన్ తర్వాత రతిక ఫస్ట్ రియాక్షన్)
Comments
Please login to add a commentAdd a comment