రెండేళ్ల తర్వాత ఓటీటీలోకి వచ్చిన హారర్‌ థ్రిల్లర్‌! | Horror Thriller Daksha Movie Now Streaming On This OTT Platform | Sakshi
Sakshi News home page

రెండేళ్ల తర్వాత ఓటీటీలోకి వచ్చిన హారర్‌ థ్రిల్లర్‌!

Published Sat, Mar 15 2025 2:47 PM | Last Updated on Sat, Mar 15 2025 2:58 PM

Horror Thriller Daksha Movie Now Streaming On This OTT Platform

సీనియర్ నటుడు శరత్ బాబు తనయుడు ఆయుష్ తేజ్ హీరోగా నటించిన హారర్ థ్రిల్లర్ ‘దక్ష’(Daksha). శ్రీ అన్నపూర్ణ క్రియేషన్స్ బ్యానర్‌పై తల్లాడ శ్రీనివాస్ నిర్మించిన ఈ సినిమాకు వివేకానంద విక్రాంత్ దర్శకత్వం వహించారు. 2023లో థియేటర్లలో విడుదలై ఈ చిత్రానికి మంచి స్పందన వచ్చింది. దాదాపు రెండేళ్ల తర్వాత ఇప్పుడు  ఈ చిత్రం ఓటీటీలో స్ట్రీమింగ్‌ అవుతోంది. బిసినీట్‌ (Bcineet OTT)తో పాటు హంగామా(Hungama OTT)లో  ఈ చిత్రం స్ట్రీమింగ్‌ అవుతుంది. దీంతో పాటు యూట్యూబ్‌లోనూ ఈ చిత్రం అందుబాటులోకి వచ్చింది.

ఈ సందర్భంగా కో ప్రొడ్యూసర్ & యాక్టర్ తల్లాడ సాయి కృష్ణ మాట్లాడుతూ, ‘మాకు థియేటర్‌లో మంచి స్పందన లభించినట్లుగానే, ఇప్పుడు విడుదలైన ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌ల్లోనూ అదే స్థాయిలో ప్రేక్షకుల ఆదరణ లభిస్తుంది. హారర్ థ్రిల్లర్ సినిమాలు ఇష్టపడే ప్రేక్షకులకు 'దక్ష' తప్పకుండా నచ్చుతుంది. దయచేసి పైరసీకి దూరంగా ఉండి, అధికారిక వేదికల ద్వారా మా సినిమాను వీక్షించండి. నిర్మాతలకు సహాయపడేలా ప్రతి రూపాయి విలువైనదని భావిస్తున్నాము. పైరసీకి పాల్పడిన కొన్ని ప్లాట్‌ఫారమ్‌లపై ఇప్పటికే కంప్లయింట్ నమోదుచేశారు’ అని తెలిపారు.

దర్శకుడు వివేకానంద విక్రాంత్ మాట్లాడుతూ..‘మంచి కంటెంట్, అద్భుతమైన మ్యూజిక్, వండర్‌ఫుల్ విజువల్స్ మా సినిమాకి ప్రధాన బలాలు. ఈ చిత్రంలో నటించిన ప్రతి ఒక్కరికీ మంచి పేరు వస్తుంది’ అని తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement