‘‘రూల్స్ రంజన్’ పూర్తి వినోదాత్మక చిత్రం. ట్రైలర్ చూసి నవ్వుకున్నట్లే సినిమా అంతా ప్రేక్షకులు నవ్వుతూనే ఉంటారని కచ్చితంగా చెప్పగలను’’ అని హీరో కిరణ్ అబ్బవరం అన్నారు. రత్నం కృష్ణ దర్శకత్వంలో కిరణ్ అబ్బవరం, నేహా శెట్టి జంటగా నటించిన చిత్రం ‘రూల్స్ రంజన్’. ఏఎం రత్నం సమర్పణలో దివ్యాంగ్ లవానియా, మురళీ కృష్ణ వేమూరి నిర్మించిన ఈ సినిమా రేపు రిలీజవుతోంది. ఈ సందర్భంగా కిరణ్ అబ్బవరం చెప్పిన విశేషాలు.
► ప్రతి సినిమాలో ఒకే తరహా పాత్ర కాకుండా వైవిధ్యంగా ఉండేలా కథలు ఎంచుకుంటున్నాను. రత్నం కృష్ణ చెప్పిన ‘రూల్స్ రంజన్’ కథ మంచి విజువల్ కామెడీ డ్రామాగా ఉంటుందని నమ్మి, చేశాను. రత్నం కృష్ణ బాగా తీశారు. సినిమా అంతా సరదాగా సాగుతుంది. ‘వెన్నెల’ కిశోర్, నాకు మధ్య వచ్చే సన్నివేశాలు, వైవా హర్ష, సుబ్బరాజు, ఆది ట్రాక్‌లు మంచి వినోదం పంచుతాయి.
► సినిమాల్లోకి రాకముందు చెన్నైలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా చేశాను. పల్లెటూరి నుంచి వెళ్లిన నాకు కెఫెటేరియా (క్యాంటీన్) అంటే ఎలా ఉంటుందో కూడా తెలియదు. ఆ వర్క్ కల్చర్, ఆఫీస్ పద్ధతులకు అలవాటు పడటం కష్టమైంది. ఈ చిత్రంలో మనోరంజన్ అనే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా చేశాను. షూటింగ్ చేస్తున్నప్పుడు నేను ఉద్యోగం చేసిన రోజులు గుర్తొచ్చాయి.
► నిర్మాతలు ఏఎం రత్నం, దివ్యాంగ్ లవానియా, మురళీ కృష్ణగార్లు ఎక్కడా రాజీ పడకుండా ఈ సినిమా తీశారు. ఈ చిత్రంలోని ‘సమ్మోహనుడా..’ పాట హైప్ తీసుకు వచ్చింది. ఇది రొమాంటిక్ సాంగ్. అందుకే సవాల్‌గా అనిపించింది. ప్రస్తుతం సీనియర్ డైరెక్టర్స్‌తో రెండు, కొత్త దర్శకులతో రెండు సినిమాలు చేస్తున్నాను.
ఆ రోజులు గుర్తొచ్చాయి
Published Thu, Oct 5 2023 5:55 AM | Last Updated on Thu, Oct 5 2023 5:55 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment