
స్టార్ కమెడియన్ బ్రహ్మానందం ప్రస్తుతం ఒకటిఅరా అంటూ సినిమాలు చేస్తున్నారు. ఈ మధ్యే తన పేరు మీదే తీసిన 'బ్రహ్మానందం' (Brahmanandam OTT) సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించారు. ప్రమోషన్స్ బాగానే చేశారు కంటెంట్ ఓ మాదిరిగా ఉండటంతో జనాల దృష్టిలో పడలేదు.
(ఇదీ చదవండి: థియేటర్లలో రిలీజైన వారానికే ఓటీటీలోకి హిట్ సినిమా)
ఇకపోతే బ్రహ్మానందం సినిమా వచ్చి నెలరోజులైపోతోంది. ఫిబ్రవరి 14న థియేటర్లలో రిలీజ్ కాగా.. మార్చి 14న అంటే ఈ శుక్రవారమే వస్తుందనే హింట్ ఇచ్చారు. కానీ ఏమైందో ఏమో ఓటీటీలోకి రాలేదు. దీంతో ఏంటి విషయం అని ఆరా తీస్తే ఐదారు రోజులు ఆలస్యంగా డిజిటల్ స్ట్రీమింగ్ చేయాలని అనుకున్నట్లు తెలిసింది.
అలా మార్చి 20 నుంచి ఆహా ఓటీటీలోకి 'బ్రహ్మానందం' మూవీ రానుందని క్లారిటీ ఇచ్చారు. ఇందులో బ్రహ్మానందంతో పాటు ఆయన కొడుకు రాజా గౌతమ్(Raja Gautham).. తాత-మనవడి పాత్రల్లో నటించడం విశేషం. ఫ్యామిలీ మూవీ కాబట్టి థియేటర్లలో పెద్దగా పట్టించుకోనప్పటికీ ఓటీటీలో క్లిక్ అయ్యే ఛాన్స్ ఉంది.
(ఇదీ చదవండి: 'కోర్ట్' మూవీ హీరోయిన్.. ఎవరీ 'జాబిలి'?)
