raja gautam
-
అదే నా ప్లస్ పాయింట్
‘‘మను’ చిత్రంతో నాకు బ్రేక్ వస్తుందా? రాదా? అనేది ఆడియన్స్ జడ్జ్‌మెంట్‌పై, దేవుడి దయపై ఆధారపడి ఉంటుంది. ఈ సినిమాకు నేను ప్రాణం పెట్టి చేశాను. తెలుగు అమ్మాయిని అవ్వడం నాకు ప్లస్ పాయింట్. ఎందుకంటే భాషతో సమస్య ఉండదు’’ అని చాందినీ చౌదరి అన్నారు. రాజా గౌతమ్, చాందినీ చౌదరి జంటగా ఫణీంద్ర నర్సెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మను’. నిర్మాణ సినిమాస్ సమర్పణలో క్రౌడ్ ఫండ్‌తో నిర్మించిన ఈ సినిమా ఈ శుక్రవారం విడుదలవుతోంది. ఈ సందర్భంగా చాందినీ చౌదరి చెప్పిన విశేషాలు... ఫణీంద్రగారి ‘మధురం’ అనే షార్ట్ ఫిల్మ్ చేశా. ఆ పరిచయంతో ‘మను’ సినిమాలో అవకాశం వచ్చింది. ఇందులో నీల పాత్ర చేశా. ఈ పాత్ర కోసం దాదాపు ఐదు నెలలు హోం వర్క్ చేశాను. నాకు తెలిసి ఇలాంటి పాత్ర ఇంత వరకూ ఏ సినిమాలో రాలేదు. బడ్జెట్ కంట్రోలింగ్ ఉండటం వల్ల సినిమా కాస్త లేట్ అయ్యింది. అవకాశాలు నా చేతిలో లేవు. నా వరకు నేను పాత్ర కోసం ఎంతైనా కష్టపడతాను. ప్రస్తుతానికి హీరోయిన్‌గానే చేయాలనుకుంటున్నా. ఒక మంచి నటిగా ఇండస్ట్రీలో పేరొస్తే చాలు. ∙హీరో గౌతమ్ ‘మను’ అనే లోకల్ ఆర్టిస్టు క్యారెక్టర్లో నటించారు. నీల పాత్రలో బాగా డెప్త్ ఉంటుంది. ఈ సినిమాలో చాలా సీన్స్‌ను నేచురల్‌గా తీశాం. కొన్ని సీన్స్‌కు గ్లిజరిన్ కూడా వాడలేదు. ప్రతిదీ ఫర్ఫెక్ట్గా ఉండాలని ఫణీంద్రగారు కోరుకుంటారు. అందుకే టైమ్ గురించి ఆలోచించలేదు. ∙ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ లేదని చెప్పలేను. ఎందుకంటే చాలా వార్తలు వస్తున్నాయి. నా వరకు అలాంటివి ఎదురవలేదు. మా సినిమాతో పాటు ‘కేరాఫ్ కంచరపాలెం’ సినిమా రిలీజ్ అవుతోంది. రెండు సినిమాలు హిట్ కావాలని కోరుకుంటున్నా. నెక్ట్స్ సినిమా గురించి ఇంకా కమిట్ కాలేదు. ఈ సినిమా రిజల్ట్ బట్టి ఉంటుంది. మంచి కథ ఉంటే ఇతర భాషల్లో నటించడానికి సిద్ధమే. -
‘మను’ ట్రైలర్ విడుదల
-
ఆసక్తి రేకెత్తించేలా ‘మను’ ట్రైలర్
చిన్న సినిమాను, ప్రచారం అంతగా లేని సినిమాను అందరూ చిన్న చూపు చూస్తారు. కానీ ఒక్కసారి ఆ సినిమా తన స్టామినాను చూపిస్తే.. అందరూ దానిగురించే మాట్లాడుకుంటారు. ‘మను’ చిత్రం కూడా అలాంటిదే. ట్రైలర్ వచ్చే వరకు కూడా ఈ సినిమాను ఎవరూ పట్టించుకోలేదు. వినూత్న ప్రచారాలు చేసినా సినిమాకు హైప్ రాలేదు. తాజాగా విడుదల చేసిన ట్రైలర్ ఈ మూవీ గురించి మాట్లాడేలా చేస్తోంది. చాలా రోజుల తరువాత గౌతమ్ మళ్లీ హీరోగా చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని సస్పెన్స్ థ్రిల్లర్, లవ్ ఎంటర్టైనర్గా తెరకెక్కించారు. ఎక్కువ క్యారెక్టర్స్ లేకుండా పరిమిత పాత్రలతోనే సినిమాను నడిపించినట్లు కనిపిస్తోంది. షార్ట్ ఫిలిమ్స్ ద్వారా ఫేమస్ అయిన చాందిని చౌదరి ఈ సినిమాలో హీరోయిన్గా చేస్తోంది. గతంలోకూడా హీరోయిన్గా చేసినా.. అంతగా గుర్తింపు రాలేదు. నిర్వాణ సినిమాస్‌పై తెరకెక్కిన ఈ సినిమాకు ఫణీంద్ర నర్శెట్టి దర్శకత్వం వహించాడు. ఈ చిత్రం సెప్టెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
అంతా వైవిధ్యమే!
‘‘చాలా ఆసక్తికరమైన చిత్రమిది. నా పాత్ర తీరుతెన్నులు కూడా చాలా కొత్తగా ఉంటాయి. ఈ సినిమాకు సంబంధించిన ప్రతి అంశమూ వైవిధ్యమే. నా కెరీర్‌కి ఇదొక గొప్ప మలుపు అవుతుంది’’ అని రాజా గౌతమ్ చెప్పారు. స్టార్ట్ కెమెరా పిక్చర్స్ పతాకంపై చైతన్య దంతులూరి స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘బసంతి’. రాజా గౌతమ్, అలీషా బేగ్ ఇందులో హీరో హీరోయిన్లు. మహా శివరాత్రి కానుకగా ఈ నెల 27న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా చైతన్య దంతులూరి మాట్లాడుతూ -‘‘దర్శకునిగా నా తొలి సినిమా ‘బాణం’ విమర్శకుల ప్రశంసలు పొందింది. ఈ ‘బసంతి’ కచ్చితంగా క్లాస్‌నీ, మాస్‌నీ ఆకట్టుకుంటుంది. కథా కథనాలు, సంగీతం ప్రేక్షకులకు బాగా నచ్చుతాయి’ అని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ, సహ నిర్మాత: వివేక్ కూచిభొట్ల.